
తెలంగాణలో ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే ఒక రకమైన అభద్రతా భావం కలుగుతుంది. వరంగల్ లో 9నెలల చిన్నారి శ్రీహితపై అత్యాాచారం చేసి ప్రాణాలు తీసిన ప్రవీణ్. హైదరాబాద్ శాలిబండలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 62 ఏళ్ల కార్మికుడు. హన్మకొండలో పుట్టినరోజు నాడు గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. హాస్పిటల్ కి వెళ్లి చూపించుకొని వస్తానని చెప్పి వెళ్ళిన ప్రియాంకరెడ్డిని అతిదారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన. ఇలా చెప్పుకుంటూ.. పోతే తెలంగాణలో అనేకచోట్ల ఎన్నెనో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి.
ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. ప్రభుత్వం నుండి కఠినమైన చట్టాలేవీ లేకపోవడం గమనార్హం. కేసులని, విచారణ అని, కోర్టులని నిందితులను తిప్పి తిప్పి చివరికి తూతూ మంత్రంగా కేసులు మూసివేయడంమో లేదా ఏదో ఒక కేసుపెట్టి కొంతకాలం శిక్ష అనుభవించడమే చేస్తున్నారు. ఖఛ్చితమైన చట్టం తీసుకొస్తే తప్పా ఈ నేరాలు ఘోరాలు తగ్గేలాలేవు. మంత్రులు, మేధావులు, జ్ఞానవంతులు ఒక్కసారి ఆలోచించండి.
— p̳r̳a̳k̳a̳s̳h̳ (@prakash1148) November 29, 2019