
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మిక సినిమా ఆర్ ఆర్ ఆర్ వస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. రాజమౌళి ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. ప్రస్తుతం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబందించిన ఓ పిక్‌ను చిత్రబృందం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. మరో ముఖ్య పాత్రలో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని నటిస్తున్నాడు.
Read More: టీవీ9లో లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని..
అది అలా ఉంటే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు లీకేజ్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇది వరకే ఈ సినిమా షూటింగ్ సంబందించి లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అవడంతో ఆ మధ్య ఎన్టీఆర్ లుక్ రివీల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ షూటింగ్ లొకేషన్ పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంది. అయినా లీక్ సమస్య తగ్గలేదు. అందులో భాగంగా తాజాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్‌కు సంబందించిన ఓ విజువల్ బయటికొచ్చింది. ఈ ఫైట్ ఓ పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన హోరా హోరిగా జరిగేది. అంతేకాదు ఈ పోరాట సన్నివేశం సినిమాలోని కీలకమైన అంశం అట. దీంతో ఎంతో ప్రయాసతో దీన్ని తెరకెక్కించింది చిత్రబృందం. ఈ విషయం తెలుసుకున్న టీమ్, తారక్ లుక్ బయటికి లీక్ కావడంతో వెంటనే అప్రమత్తమై.. కాపీ రైట్ ఇష్యూ కింద ఆ వీడియోను ఆన్ లైన్ నుండి తొలగించారు.
Read More: పవన్ కల్యాణ్-క్రిష్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్!