Homeఎంటర్టైన్మెంట్కెజిఎఫ్-2 మూవీ బిగ్ అప్డేట్

కెజిఎఫ్-2 మూవీ బిగ్ అప్డేట్

 

కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజిఎఫ్-1’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియన్ మూవీగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

సైకిల్ మెకానిక్ ను వరించిన పద్మశ్రీ.. కారణం ఇదే..!

 

సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘కెజిఎఫ్’ చాప్టర్ 2 సినిమా విడుదల తేదీని మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ ఆలస్యం కావడం వల్ల ఈ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుంది. రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, అనంత్ నాగ్, మాళవిక అవినాష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

 

ప్ర‌కాష్ రాజ్ కు డెత్ వార్నింగ్!

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular