
ప్రస్తుతం “ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న పరిస్థుతులన్నిటికి కారణం ఎవరు?” అనే ప్రశ్నకు ఒక్కసారి జవాబును వెతికినట్లైతే.. కొన్ని ఆసక్తిర విషయాలు బయటకు వస్తాయి.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఏపీకి రాజధాని లేదు. అసలు భారతదేశ చరిత్రలో ఇలాంటి అన్యాయం ఏ రాష్ట్రానికి జరగలేదంటే.. అతిశయోక్తి కాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నది తెలంగాణ వాసులు, కానీ అన్యాయం జరిగింది మాత్రం ఏపీ ప్రజలకు..! ఎవరు అంగీకరించినా.. అంగీకరించక పోయినా.. ఇదే నిజం. రాజధానిలేని రాష్ట్రాన్ని తీసుకోవడమే ఒక తప్పైతే.. రాజధాని నిర్మించుకోవడంలో సొంత పెత్తనాలకుపోయి.. ప్రతిపక్షాల మాటలు, కమిటీల నివేదికల పట్టికుంచుకోకుండా అమరావతిలో రాజధాని నిర్మించటం చంద్రబాబు చేసిన మరో తప్పు. ఆయనేదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా “అమరావతి చంద్రబాబు మానస పుత్రిక” అని, “చంద్రబాబు సీఎం కాకపోతే ఏపీకి రాజధానే లేదన్నట్లుగా..” సొంత డబ్బాలు కొట్టుకున్నారు టీడీపీ నేతలు.
సరే.. టీడీపీ నేతలు చెప్పిందే కొద్దిసేపు నిజం అనుకుంద్దాం.. 10 ఏళ్ళు సీఎం చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తర్వాత కూడా ప్రజలు ఆయనను నమ్మి మళ్ళీ సీఎం పీఠం ఎక్కించారు. ఆ విధంగా రాష్ట్రాన్ని మరో 5 ఏళ్ళు పాలించారు. మరి 5 ఏళ్లలో ఆయన చేసింది ఏమిటంటే.. ఏపీ రాజధానిని సింగపూరు చేస్తా.. టోటల్ గా రాష్ట్రాన్నిజపాన్ చేస్తా.. అని రంగు రంగుల డిజైన్ లతో , ఉహకందని గ్రాఫిక్స్ తో తనకు అనుకూలమైన మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తూ… 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. దాదాపు 5600 కోట్లు పెట్టి అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టారు. ఇదే రాజధాని అని చెప్పి పెద్ద పెద్ద గ్రాఫిక్స్ పెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసాడు. అసలు అంత ఖర్చుపెట్టి తాత్కాలిక భవనాలు కట్టకపోతే.. అదేపెట్టుబడితో శాశ్వత భవనం (అసెంబ్లీ లాంటి) ఒక్కటి కట్టినా.. రాజధానికి ఒక రూపు వచ్చేదిగా..అని .. అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం.
అంతేకాకుండా.. ఈ మధ్య ఒక ప్రముఖ జాతీయ మీడియాలో వచ్చిన కధనం ప్రకారం.. అమరావతి రాజధాని ప్రక్రియ ఇప్పటిదాకా కొలిక్కి రాకపోవటం జగన్ కి అనుకూలంగా మారిందని విశ్లేషించింది. అమరావతి రాజధాని గా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపలే ప్రకటించి అసెంబ్లీ లో తీర్మానం చేయించగలిగినా కేంద్ర స్థాయిలో పార్లమెంటు ఆమోదం తీసుకొని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చివుంటే తిరిగి దాన్ని తిరగదోడే అవకాశం ఉండేది కాదని ఆ పత్రిక తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మూడు సంవత్సరాల్లోపు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చివుండాల్సిందని కూడా తెలిపింది. హైద్రాబాదులోని వుమ్మడి ఆస్తుల విషయం ఎటూతేలకపోవటంతో పునర్విభజన చట్టం ప్రకారం హైద్రాబాదు పది సంవత్సరాలవరకు వుమ్మడి రాజధాని గా హక్కులువుండటంతో చంద్రబాబు నాయుడు సందిగ్ధంలో పడ్డట్టు అదే ఇప్పుడు తనకు గుదిబండలాగా మారిందని వ్యాఖ్యానించింది.
చివరిగా చెప్పేది ఏమిటంటే.. ఆనాడు చంద్రబాబు చేసిన తప్పులే నేడు 3 రాజధానులు చెయ్యడానికి ఇప్పటి ప్రభుత్వానికి దొరికిన అవకాశం.