Home Blog Page 8602

Asalu Emjarigindhi Movie Pressmeet Photos

కరోనా వ్యాక్సిన్‌ కనుగొన్న ఆ దేశాలు!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో మూడు నెలలో కనుకొంటామని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటికే ఆ వ్యాక్సిన్‌ ని కనుగొని పక్షులపై ప్రయోగించడంతో వారు విజయం సాధించారు. అయితే మనుషులపై ప్రయోగాలకు ఆ దేశ సైంటిస్టులు సిద్ధమయ్యారు. ఒకవేళ మనుషులపై కూడా వారి ప్రయోగాలు ఫలిస్తే మరో 90 రోజులలో కరోనాను నియంత్రించే వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

గతంలో కరోనా తొలి వ్యాక్సిన్‌ ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా కూడా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ ను మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశామని తెలిపింది .ఈ ట్రయల్స్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, తొలి దశ ప్రయోగం విజయవంతమైతే.. అది అందుబాటులోకి రావడానికి ఏడాది సమయం పడుతుందని అమెరికా సైంటిస్టులు అంటున్నారు.

2002లో సార్స్ విజృంభించినప్పుడు దాని వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్‌ కు సిద్ధమయ్యే సరికి 20 నెలలు పట్టగా తాజాగా కరోనా వైరస్‌ జన్యు సమాచారం తెలుసుకున్న ఆరు వారాల్లోనే వ్యాక్సిన్‌ ను రూపొందించి, మనషులపై ప్రయోగాలకు రెడీ చేయడం విశేషం.

స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఆరేళ్లు ప్రణాళికబద్దంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్‌ దేశం అబ్బురపడుతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌ కొనియాడారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటైన కొత్తలో విద్యుత్‌ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. ఇప్పుడు విద్యుత్‌ కోతలను అధిగమించి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమాతో భరోసా కల్పించామని తమిళిసై తెలిపారు.

కేసీఆర్‌ పక్కా ప్రణాళికలతో సమస్యలను అధిగమించి రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని గవర్నర్‌ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద రూ. 1,00,116 ఇస్తున్నాం. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితి పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు గవర్నర్‌ ప్రకటించారు. రైతు సమన్వయ సమితి ఇక నుంచి రైతు బంధు సమితిగా మారనుంది అని గవర్నర్‌ తెలిపారు. రైతులను సంఘటితం చేయడమే రైతు బంధు సమితి ఉద్దేశమని చెప్పారు.

విత్తనాలు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతు బంధు సమితి కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేస్తుందని అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తున్నది అని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్దరించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది అని గవర్నర్ పేర్కొన్నారు.

ప్రపంచంలోకెల్లా అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు దశల వారీగా పూర్తవుతున్నది. శరవేగంగా నడుస్తున్న పనులు తెలంగాణ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తవుతుందని గవర్నర్ ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం నుంచి గోదావరి నది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు 365 రోజులవేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే ఈ బ్యారేజి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుత దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేవిధంగా ప్రభుత్వం సుమారు 40 టిఎంసిల సామర్థ్య్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజిని మంజూరు చేసిందని ఆమె వివరించారు.

విద్యుత్త్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విజయం సాధించిందని గవర్నర్‌ కొనియాడారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి విద్యుత్‌ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా నిలబడి ఉందని చెప్పారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రంలో అంతకుమించి, 13,168 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ వచ్చిందని వెల్లడించారు.

కిశోర్ తిరుమ‌ల దర్శకత్వంలో శర్వానంద్

శ‌ర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై  ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సుధాక‌ర్ చెరుకూరి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు శ‌ర్వానంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

భిన్న క‌థ‌ల‌తో సినిమాలు చేస్తూ చిత్ర‌సీమ‌లో త‌న‌దైన ముద్ర వేసిన శ‌ర్వానంద్ ఇప్పుడు కిశోర్ తిరుమ‌ల‌తో ఒక పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైన‌ర్ చేసేందుకు అంగీక‌రించారు.శ‌ర్వానంద్‌తో తొలిసారిగా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ప్ర‌స్తుతం ఆయ‌న రానా హీరోగా విరాట‌ప‌ర్వం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎప్పుడు ఈ సినిమా మొద‌ల‌య్యేదీ, తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

రైతు బంధు పధకం కూడా నీరు కారిపోతుందా!

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ఘన విజయం సాధించడానికి కారణమైన రైతు పధకాన్ని ఎన్నికల అఞ్ఞతరం ప్రభుత్వం నీరు కారుస్తున్నదా? గత ఏడాదిగా ఈ పధకం నత్తనడక నడుస్తూ ఉండడంతో అటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. రాను రాను ఈ పధకాన్ని సహితం ప్రభుత్వం నీట ముంచుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతులకు ఇంత చేస్తున్నాం… అంత చేస్తున్నాం.. అంటూ పదేపదే చెప్పకునే రాష్ట్ర ప్రభుత్వం.. రైతులను నిర్లక్ష్యం చేస్తోందా….? అంటే అవుననే అంటున్నారు రైతు సంఘాల నేతలు. పాస్ పుస్తకాలు లేవని కొందరికి, ఉన్నా వివిధ రకాల సాకులతో మరికొందరికి రైతుబందు ఇవ్వడం లేదంటున్నారు.

ప్రభుత్వం వివిధ రకాల కారణాలతో రైతు బంధు సహాయానికి కోతలు పెడ్తుండడంతో ఈ పథకం కొనసాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నేతలు. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులుంటే, 41 లక్షల మందికే రైతుబంధు కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మొదట్లో పాస్ బుక్ లున్న 41 లక్షల మందికి ఖరీఫ్, రబీ సీజన్ లో డబ్బులు ఇచ్చారు.

ఆ తర్వాత ఖరీఫ్ లో కొంత ఆలస్యంగా ఖాతాల్లో నగదు వేశారు. రబీకి మరింత ఆలస్యం చేశారు. రైతుబంధు ఇస్తారో లేదోనని రైతులు అయోమయంలో ఉండగా రబీ సీజన్ ముగింపులో డబ్బులు వేశారు. అది కూడా కొంత మందికే వేశారు. పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులను హోల్డ్ లో పెట్టారు. వాళ్లకి ఇస్తారో ఇవ్వరో స్పష్టత లేదు.

గతంలో రైతు బంధు తీసుకున్న వారిలో మరణించిన వాళ్లను, భూములను ఇతరులకు అమ్మిన వాళ్లకు దాదాపు లక్షన్నర మంది రైతులకు రైతు బంధు కోత పడింది. వివిధ కారణాలతో ఆలస్యంగా పాస్ బుక్ లు ఇచ్చిన రైతులకు అసలు రైతుబంధు వర్తిస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు.

అధికారుల తప్పిదంతో పాస్ పుస్తకాలు ఆలస్యంగా వచ్చినా, నష్టం రైతులకే జరుగుతుందని వాపోతున్నారు రైతు సంఘాల నేతలు. లేటుగా పాస్ బుక్ లు వచ్చిన వారిలో చాలా మంది ఐదు ఎకరాల లోపేనని చెబుతున్నారు. ఇప్పటి వరకు రైతుబంధు సహాయం దక్కిన వారిలో ఎక్కువ మంది బడా రైతులే ఉండటం గమనార్హం. రైతు బంధుకు అర్హత ఉన్నా, సవాలక్ష రూల్స్ తో చాలా మందిని అనర్హులుగా చేస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ఎన్‌పిఆర్ డేటాతో జగన్ కు లింకు.. ఎందుకంటే..


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కసరత్తుపై తన వైఖరిని మార్చుకున్నారు. 2010 ఫార్మాట్‌లో జనాభా డేటాను సేకరించి ఎన్‌పిఆర్‌ను అప్‌డేట్ చేయాలని ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్నీ కోరుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఇలాంటి వాదననే వినిపిస్తున్నారు. .జగన్ మోహన్ రెడ్డి ఇంతకుముందు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్‌పిఆర్ ప్రక్రియకు మద్దతునిచ్చారు. అయితే ఈ విషయంలో ఒక వర్గంలో భయాలు నెలకొన్నాయని చెప్పడానికి జగన్ ట్విట్టర్లో తన వ్యక్తిగత హ్యాండిల్ ను ఆసరా చేసుకున్నారు.

దానిలో కొత్త ఫార్మాట్‌లో ఎన్‌పిఆర్‌ను వ్యతిరేకించటానికి కారణం తెలియజేశారు. ఈ నెల చివర్లో సమావేశమయ్యే శాసనసభ కూడా ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తుందని పేర్కొంటూ ఆయన తన వైఖరిలో మార్పును పునరుద్ఘాటించారు.”ఎన్‌పిఆర్‌లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు మా రాష్ట్రంలోని మైనారిటీల మనస్సులో అభద్రతాభావాలకు కారణమవుతున్నాయి. మా పార్టీలో సంప్రదింపులు జరిపిన అనంతరం 2010 లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్‌పిఆర్ డేటా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని మేము నిర్ణయించుకున్నామని ఆయన ట్వీట్ చేశారు. అయితే 2020 ఫార్మాట్‌పై ఆధారపడి ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో జగన్ స్పష్టం చేయలేదు. అయితే ఈ రెండు ఫార్మాట్ల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే… తల్లిదండ్రుల జన్మ స్థలం, పుట్టిన తేదీ డేటాను సేకరించడం… ఇది ముఖ్యంగా ముస్లింలలో ఆందోళనలను కలిగిస్తోంది. 2010 లో ప్రతి ఇంటిలోని సభ్యుల గుర్తింపునకు సంబంధించిన 15 వివరాలు సేకరించారు.

అయితే 2020 లో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో నివసించకపోయినా వారి వివరాలతో పాటు మాతృభాష, జన్మ స్థలం, పుట్టిన తేదీకి సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరించాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు ఇటీవలి ప్రభుత్వ ఉత్తర్వులో ఎన్‌పిఆర్ నవీకరణకు సంబంధించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు…. ప్రజలకు సమాధానం చెప్పే ఉద్దేశం లేకపోతే తిరిగి అడగవద్దని పేర్కొన్నారు. కాగా 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 45 రోజులు నిర్వహించే ఎన్‌పిఆర్ ప్రక్రియ కొనసాగనుంది. ఇదిలావుండగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయానికి పార్టీ వచ్చిన నేపధ్యలో జగన్ ఎన్‌పిఆర్ పై తన వైఖరిని మార్చారనే వాదన వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నిర్దేశించినట్లుగా, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు సీట్లు కల్పించడంతో పాటు 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణం లోనే జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

వామపక్షాలతో పొత్తుకు టీడీపీ సిద్ధం!

సుమారు 11 ఏళ్ళ తర్వాత వామపక్షాలతో పొత్తుకు సిద్దపడుతున్నది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వామపక్షాలతో కలసి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నది. 2009 ఎన్నికలలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న టిడిపి ఆ తర్వాత దూరంగా జరుగుతూ వచ్చింది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకోగా, 2014లో సొంతంగానే పోటీ చేసింది.

వామపక్షాలతో సిపిఐ పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే సిపిఏం వైఖరి ఇంకా స్పష్టం కావడం లేదు. 2019 ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలు, ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తుకు సిద్ద పడడంతో ఒంటరిగా మిగిలాయి.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేతలు కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరనాథరెడ్డి భేటీ అయి పొత్తుల గురించి సమాలోచనలు జరిపారు. కలిసి పోటీచేసే అంశంపై వారి మధ్య కొంత చర్చ జరిగింది.

ఈ నెల 8న ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమావేశం జరుగుతుందని, ఉభయులం కలిసి ఒకే వైఖరితో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని, తర్వాత మరోసారి కలుస్తామని సీపీఐ నేతలు చంద్రబాబుకు తెలిపిన్నట్లు తెలుస్తున్నది.

తొమ్మిది నెలల్లో రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు వెనక్కి నెట్టారని, ఇంత జీవన విధ్వంసం కనీవినీ ఎరుగమని ఇరు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కూల్చివేతలు, విధ్వంసాలు, కోతలు, రద్దులు, బెదిరింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు ఈ స్థాయులో ఎన్నడూ లేవని, అమరావతిని చంపేశారని.. అన్ని ప్రాజెక్టుల పనులను నిలిపివేశారని నాయకులు చెప్పారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు సంఘటితమై వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వారు పిలుపిచ్చారు.

Pooja Hegde Launches Samsung S20 Mobile

బస్సు బోల్తా..21మందికి తీవ్ర గాయాలు


కామారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుంది. ఈ ఘటన సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో మినీ బస్సు బోల్తా పడి 5 కుటుంబాలకు చెందిన 21 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు.

పిల్లలను తీసుకుని అక్షరాబ్యాసం చేయించడానికి 5 కుటుంబాలు ఓ మినీ బస్సు మాట్లాడుకుని బయలుదేరారు. అయితే బస్సు వెనక టైర్ పేలి బోల్తాపడి అందరూ గాయలపాలయ్యారు. డ్రైవర్ తో సహా బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలు, 9 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

ఆ మంత్రికి కరోనా భయం..!


పెద్దలు సాధారణంగా ఒక సామెత చెప్పేవాళ్ళు “ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే..చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు వచ్చాడట” ప్రస్తుతం తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ పరిస్థితి అలానే ఉంది. ప్రపంచమంతా కరోనా భయంతో వణికి పోతుంటే.. ఆయనకు మరో కష్టం వచ్చిందట. ఎన్నో ఏళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారంలో ఉన్న ఈటెలకు ఈ కరోనా దెబ్బతో రూ.8కోట్లు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.

చికెన్ తినడం వల్ల కరోనా రాదనే భయాన్ని ప్రజలలో నుంచి పోగొట్టేందుకు చికెన్ మేళాను కూడా నిర్వహించారట.. ఆ మేళా కి చీఫ్ గెస్ట్ గా మంత్రి కేటీఆర్ ని పిలిచారు. దీని వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందని అంచనా వేశారు. కానీ “మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు” అంతలోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో… ప్రజల్లో కరోనా వైరస్ పట్ల ఉన్న భయాందోళనలు మరింత పెరిగిపోయాయి. చికెన్ తింటేనే కాదు కోడి గుడ్డు తిన్నా కరోనా వస్తుందనే వదంతులు వ్యాపించడంతో ఏమి చేయాలో అర్థంకాక మంత్రి మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఏమి చేద్దాం “కాలం కలిసిరాక పోతే.. అరటిపండు తిన్నా..పన్ను ఇరిగిద్ది” మంత్రిగారు.

కరోనా దెబ్బకు వాయిదాపడిన అర్జున మూవీ

డాక్టర్‌ రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘అర్జున’. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. ముందుగా ఈ నెల 6న  రిలీజ్ చెయ్యాలని చిత్రబృందం నిర్ణయించారు. అయితే కరోనా ప్రభావం వల్ల చిత్రం విడుదలను ఈ నెల 13కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు.

నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ – ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్  అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన  రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ…  అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఓ హైలైట్‌. దాదాపు 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

అల్లర్లకు కారణం వాళ్ళే..!:దోవల్


ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్లపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు ప్రారంభమైనప్పుడు పోలీసులు సమయోచితంగా వ్యవహరించినట్లైతే ఆ అల్లర్లు హింసాత్మకంగా మారేవి కావని ఆయన అభిప్రాయ పడ్డారు.

అల్లర్లను అదుపుచేయడానికి పార్లమెంటులో ఆమోదించబడిన అనేక చట్టాలున్నాయని వాటిని సక్రమంగా ఉపయోగించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆయన తెలిపారు. దేశ పౌరుల క్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టాలను ఉపయోగించటంలో పోలీసులకు సర్వ హక్కులు ఇవ్వబడ్డాయని వాటిని సక్రమంగా అమలపర్చడంలో విఫలమైన పోలీసుల వల్ల 48 మంది బలి కావాల్సివచ్చిందని దోవల్ వ్యాఖ్యానించారు.

పౌరుల క్షేమం కోసం అమలు చేయబడిన చట్టాలను అమలు చేయలేకపోతే, ఆ చట్టాల సత్ఫలితాలను ప్రజలు ఎలా ఆస్వాధిస్తారని అజిత్ అన్నారు. ఢిల్లీ అల్లర్లు హింసాత్మకంగా మారి అనేకమందిని బలి తీసుకుంటుంటే.. పోలీసు బలగాలు ప్రేక్షక పాత్ర పోషించడం పై అజిత్ దోవల్ మండిపడ్డారు.

ఈ మందులతో కరోనాకు చెక్!

కరోనా వైరస్ తో ఖంగారు పడవలసిన పని లేదని, దగ్గు, జ్వరం తగ్గడానికి పారాసెటమాల్‌ వంటి మందుల్ని వాళ్లు తీసుకుంటే సరిపోతుందని ప్రముఖ భారతీయ పరిశోధకురాలు గగన్‌దీప్ కాంగ్ భరోసా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, మిగిలిన ఒకరు మాత్రమే డాక్టర్ ను సంప్రదించాలను సూచించారు.

‘కరోనా గురించి ప్రతి ఒక్కరూ అంతగా భయపడాల్సిన అవసరంలేదు. రోజూ మనం ఎన్నో వైరస్‌లకు ప్రభావితం అవుతుంటాం. అయితే వాటి నుంచి కాపాడుకోవడానికి చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవడం, క్రిముల్ని చంపే ద్రవాలతో ఇంట్లో నేలను శుభ్రంగా తుడుచుకోవడం, ముఖాన్ని తరుచూ చేతులతో తడుముకోకుండా ఉంటే సరిపోతుంది’ అని గగన్‌దీప్‌ తెలిపారు.

‘ఫ్లూ’తో పోలిస్తే కరోనా కొంత తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ, ‘సార్స్‌’ అంతటి ప్రమాదకరమైనది కాదని ఆమె చెప్పారు. పెద్ద వయస్కులు, గుండెజబ్బులతో బాధపడేవారు, బీపీ, డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉందన్న గగన్‌దీప్‌.. శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం వీలైనంత తొందరగా వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.

నార్వే కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ కొలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నొవేషన్స్ (సిఇపిఐ) వైస్ చైర్‌పర్శన్‌గా ఆమె పనిచేస్తున్నారు. వైరస్ వ్యాక్సినేషన్లను వేగంగా అభివృద్ధి చేయడమే ఈ సంస్థ లక్షం.

కరోనా వైరస్ కన్నా అనేక రకాల ఫ్లూ వైరస్‌లు భారత్‌లో ఉన్నాయని, అయితే ఫ్లూ కన్నా కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. ఇది పిల్లల కన్నా పెద్దలకే ఎక్కువగా సోకుతుందని, గుండె నాళాల సమస్యలు, డయాబెటిస్, రక్తపోటు ఉన్న వారిలో ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పారు.

ఈ వైరస్‌కు వ్యతిరేకంగా అనేక జౌషధాలను పరీక్షించడమవుతుందని, వచ్చే ఏడాదికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఇవన్నీ అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. జ్వరం దగ్గు వస్తే ఇంటి వద్దనే ఉండడం, జ్వరం దగ్గు ఉన్న వారికి ఆరు అడుగులు దూరంగా ఉండడం మంచిదని ఆమె సూచించారు.

బీజేపీకి షాక్ ఇచ్చిన తమిళిసై..!

కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర గవర్నర్లు మాత్రం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పుచేతలలో వ్యవహరిస్తూ ఉండడం తెలంగాణ బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. గత గవర్నర్ నరసింహన్ కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరించడమే కాకుండా, పలు అంశాలలో తన పరిధి మించి వ్యవహరించడం తెలంగాణ బిజెపి నేతలకు ఆగ్రహం కలిగించింది.

ఈ విషయమై కేంద్రంలో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఢిల్లీలో కీలకమైన వ్యక్తికి సన్నిహితుడు కావడంతో దేశంలో ఇప్పటి వరకు మరే గవర్నర్ కు వీలు కానీ రీతిలో సుమారు పుష్కరకాలం పాటు రాజ్ భవన్ లో ఉండగలిగారు.

గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన వ్యక్తి కావడంతో, తమ మాట వినడం లేదని అనుకున్న బిజెపి నేతలు తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌ రాజన్‌ ని గవర్నర్ గా నియమించడంతో ఆనందపడి పోయారు.

కేసీఆర్ దుందుండుకు చర్యలకు ఇక ముక్కు తాడు వేయవచ్చని సంబరపడ్డారు. అయితే ఆమె వ్యవహార శైలి సహితం వారిని కలవరానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా మొదటిసారిగా శాసనసభలో ఆమె చేసిన ప్రసంగం వారిని షాక్ కు గురిచేసింది. కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఆమె మాట్లాడటం విస్మయానికి గురి చేసింది.

పశ్చిమ బెంగాల్, కేరళ వంటి బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలలోగవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉండగా, ఇక్కడ మాత్రం ఆమె కూడా కేసీఆర్ ప్రభావంలో వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి బిజెపి వర్గాలలో వ్యక్తం అవుతున్నది. మంచి చీరెలను బహుమానంగా ఇవ్వడంతో ఆమె పొంగిపోయిన్నట్లున్నారు అంటూ ఒక బిజెపి నేత ఎద్దేవా చేశారు.

రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసిన ప్రసంగం చదవవలసి ఉన్నప్పటికీ వ్యక్తిగత పొగడ్తలను నివారించడానికి ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ఈ సందర్భంగా బిజెపి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సిఏఏ పై కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అక్కడి గవర్నర్ తన తీర్మానంలో ప్రస్తావిస్తూ ఈ విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నట్లు ఈ సందర్భంగా గమనార్హం.

రాష్ట్రంలో టి ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని తాము ప్రయత్నం చేస్తుంటే, తమ గవర్నర్ మాత్రం అధికార పక్షంపై అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండటం ఏమిటని పలువురు బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై త్వరలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

కుప్ప కూలుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ

గడచినా రెండు దశాబ్ధాలకు పైగా కాలంలో ఎన్నడూ లేనంతగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నది. 1996 తర్వాత స్థూల దేశీయోత్పత్తి 4.5 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవస్థ పతనావస్థను సూచిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసేలా కేంద్రం వద్ద కనీసం ఒక్క విభిన్న పథకం కూడా కనిపించడం లేదు.

అంతర్జాతీయ మార్కెట్లో మందగమన పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్టంగా జీఎస్టీ అమలు, విదేశీ ఎగుమతుల్లో క్షీణత ప్రభావం వాహన, జౌళి రంగాలపై పడటం, నిర్మాణ, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోవడం వంటి అంశాల కారణంగా దేశ జీడీపీ క్రమక్రమంగా పతనమవుతూ వస్తున్నది. మన దేశంలో ఉత్పత్తి, నిర్మాణ, గనుల రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, వృత్తిపరమైన సేవలు, వ్యక్తిగత వినియోగం వంటివి గణనీయంగా తగ్గముఖం పట్టాయి.

భారత జీడీపీ వరుసగా ఆరు త్రైమాసికాల నుంచి, అంటే ఏడాదిన్నర నుంచి క్షీణిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులు కేవలం రెండు శాతం చొప్పున వృద్ధి చెందాయి. వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 1.9% నుంచి 7.4 శాతానికి పెరుగగా.. వ్యవసాయ రుణాలు 18.3 నుంచి 5.3 శాతానికి, చిన్న, మధ్యతరహా సంస్థలకిచ్చే రుణాలు 6.7 నుంచి 1.6 శాతానికి పడిపోయింది. పారిశ్రామిక సూచి వృద్ధి కూడా 0.6 శాతానికి పరిమితమైంది. దేశంలో దాదాపు ప్రతి భారీ పరిశ్రమ వృద్ధి సున్నా లేదా ప్రతికూలానికి జారుకున్నది.

కొత్త పెట్టుబడుల్ని ఆకర్షించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. 2019 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో కొత్తగా వచ్చిన పెట్టుబడుల వాటా 20.5 శాతం మాత్రమే. 2004 సెప్టెంబరు నుంచి దేశీయ ఆర్థిక స్థితిగతుల్ని క్షుణ్ణంగా గమనిస్తే.. పెట్టుబడుల ఆకర్షణలో ఇంతకంటే క్షీణత లేదనే చెప్పాలి. దీన్నిబట్టి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై విదేశీ సంస్థలకు పెద్దగా నమ్మకం లేకుండా పోయింది.

నిరర్థక ఆస్తుల (మొండి బకాయిలు) విలువ ఎంతలేదన్నా రూ.10 లక్షల కోట్ల దాకా ఉండడంతో బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకు పోతున్నది. దీంతో కొత్త రుణగ్రహీతలకు అప్పులిచ్చే పరిస్థితులు బ్యాంకులకు లేకుండా పోయాయి. పైగా ఇటీవల పలు బ్యాంకుల్ని విలీనం చేయడంతో పెట్టుబడిదారులు, డిపాజిటర్ల మనసులో వ్యతిరేక భావాలు నెలకొన్నాయి. ఒకరకమైన అరాచక వాతావరణం నెలకొన్నది.

మన దేశంలోని 55 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి ఈ రంగ మూ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నది. రైతు పండించిన పంటకు కనీస మద్ధతు ధర లభించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోతల రూపంలో సొమ్మంతా తీసుకెళ్లి రెండు వందల కార్పొరేట్‌ సంస్థల చేతిలో పోస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుందనే భ్రమల్లో కేంద్రం ఉన్నట్టుగా అనిపిస్తున్నది.

అమ్మని మరచిపోలేక పోతున్న జాన్వీ

బాలీవుడ్ నటి జాన్వి కపూర్ చాలా సినిమాలు చేయకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ రోజు (మార్చి 6) ఆమె పుట్టినరోజు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో దివంగత తల్లి శ్రీదేవితో తాను ఉన్న చిత్రాలను షేర్ చేశారు. శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె జాన్వి కపూర్ ‘ధడక్’ చిత్రంలో అడుగుపెట్టడానికి ముందే అభిమానులను సంపాదించుకున్నారు. దురదృష్టవశాత్తు శ్రీదేవి తన కుమార్తె జాన్వి మొదటి చిత్రం విడుదలకు ముందే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ… జాన్వి తనతో, చిన్న కుమార్తె ఖుషీ తండ్రి బోనీతో సన్నిహితంగా ఉంటారని చెప్పారు. శ్రీదేవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జాన్వి, ఖుషీ చిత్రాలను షేర్ చేస్తుండేవారు.

శ్రీదేవి రెండేళ్ల క్రితం 6 మార్చి 2017 న తన కుమార్తె జాన్వి పుట్టిన రోజును ఘనంగా చేసారు. ఈ సందర్భంగా శ్రీదేవి.. ‘నా దేవదూతకు పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆమె ఈ ప్రపంచంలో నాకు చాలా విలువైనదని పేర్కొన్నారు. జాన్వి కపూర్ కూడా ప్రతిరోజూ తన తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకుంటారు. జాన్వీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు, దానిలో ఆమె… నేను ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నాను అని రాశారు. కాగా తన తల్లి శ్రీదేవి, తండ్రి బోనీ తాను నటిని కావాలని కోరుకోవడం లేదని గతంలో జాన్వి కపూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం జాన్వి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రూహి అఫ్జా’, ‘గుంజన్ సక్సేనా’, ‘తఖ్త్’, ‘బాంబే గర్ల్’, ‘రణభూమి’, ‘దోస్తానా 2’ తదితర చిత్రాల్లో జాన్వీ నటిస్తోంది.

దిగొచ్చిన పెట్రోల్ ధరలు, కారణం ఇదే..


ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు బయటకు రావడం తగ్గించారు. వాహన దారులు వారి వారి ఇండ్లకే పరిమితం కావడంతో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గిపోయింది. దీంతో చమురు డిమాండ్ మరియు ఆర్థిక వృద్ధి మందగించింది. తత్ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు రేట్లు తగ్గాయి.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు, డీజిల్ 13 పైసలు తగ్గించారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి, పెట్రోల్ ధర రూ.4 మరియు డీజిల్ ధర రూ.4.15 ఒక లీటరుకు తగ్గించబడింది.

హైదరాబాద్‌ లో పెట్రోల్ ధర 75.62, డీజిల్‌ ధర 69.47 గా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 71.14 కాగా డీజిల్ ధర రూ.63.81. ముంబైలో లీటరు పెట్రోల్ 76.83, డీజిల్ లీటరుకు. 66.82 వద్ద విక్రయిస్తోంది. చెన్నైలో, పెట్రోల్ ధర లీటరుకు. 73.91 కాగా, డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు. 67.34 గా ఉంది. బెంగళూరులో ఇప్పుడు పెట్రోల్ రూ.73.58, డీజిల్ రూ.65.99 వద్ద అమ్ముడవుతోంది.

అయితే ఏప్రిల్ 1 నుండి ఇంధన రిటైలర్లు బిఎస్-VI ఇంధనానికి గ్రాడ్యుయేట్ అవుతున్నందు వల్ల వచ్చే నెల నుండి దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.