Home Blog Page 8603

Crrush Movie Posters

పోర్న్ సినిమాలతో కరోనా వైరస్ నివారణ

కరోనా వైరస్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 97,719 మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 3381 మంది మరణించారు. ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు కుదేలవడం లేదా మూతబడటం జరిగింది. అయితే పోర్న్ చిత్రాల మార్కెట్ ఈ వ్యాధిని క్యాష్ చేసుకుంటోంది. పోర్న్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు మరింత విశృంఖల చిత్రాలను రూపొందించడం మొదలుపెట్టింది. ఈ చిత్రాలలోని నటులు సూట్లు, తొడుగులు, మాస్కులు, మెడికల్ గ్లోవ్స్‌ ధరించి శృంగార దృశ్యాలలో నటిస్తున్నారు.అడల్ట్ ఫిల్మ్స్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ పేర్కొన్నదాని ప్రకారం కరోనా వైరస్ సోకకుండా అవగాహనతో నిర్మించిన 100 కి పైగా పోర్న్ వీడియోలు ఉన్నాయి.

ఇటువంటి వీడియోలలో చైనాలోని వుహాన్ నగరంలో ప్రజలు శారీరక సంబంధాలు ఎలా చేసుకుంటున్నారన్నది చూపించారు. కరోనా వైరస్ గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి. కరోనావైరస్ తో కూడిన వాతావరణంలో కూడా పోర్న్ చిత్రాల పరిశ్రమ వృద్ధి చెందుతోంది. ఇదే అవకాశంగా డబ్బు కూడా సంపాదించవచ్చని పోర్న్ చిత్రాల నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇక్కడ మంచి విషయం ఏమిటంటే ఈ చిత్రాలలో కరోనా వైరస్ ను నివారించే మార్గాలు కూడా చెబుతున్నారు.. కరోనా వైరస్ సోకకుండా లైంగిక చర్యలో పాల్గొనాలంటే ఎటువంటి పద్ధతులను అవలంబించాలి? అనే దానిని ఈ చిత్రాలలో చూపిస్తున్నారు.

Aham Brahmasmi Movie Opening Photos

కేంద్రం చెల్లించని రూ.4,724 కోట్ల ధాన్యం సబ్సిడీ

రైతుల నురచి సేకరిరచే ధాన్యానికి కనీస మద్దతు ధర, పేదలకు ఇస్తున్న సబ్సిడీ బియ్యం పంపిణీకి కేంద్రం గత ఆరేళ్లుగా భారీగా కోతలు విధిస్తూ పూర్తి మొత్తాలు చెల్లించడం లేదు. దానితో ఏపీ ప్రభుత్వం, పౌరసరఫరాల సంస్థ తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఎన్నిసార్లు కేంద్రానికి లేఖలు రాసినా పట్టిరచుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే పాత బకాయిలు ఇప్పటికైనా విడుదల చేయాలంటూ తాజాగా కేంద్రానికి మరో లేఖను రాశారు.కేంద్రానికి రాసిన తాజా లేఖలో తక్షణమే బకాయిలుగా ఉన్న రూ.4724 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ఆర్ధికశాఖ విజ్ఞప్తి చేసింది.

ప్రధానంగా రైతుల నుంచిసేకరిరచే ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్రంతోపాటు కేంద్రం కూడా కొన్ని నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఈ నిధులు రావడంలో జాప్యం జరిగితే రాష్ట్రమే ముందుగా రైతులకు చెల్లిరచడం, తరువాత కేంద్రం నుంచి నిధులు వచ్చాక రుణాలను తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే గత ఆరేళ్ల కాలంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగ్గా రాకపోవడంతో రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తాజా గణారకాల మేరకు 2010-14లో రావాల్సిన నిధుల్లో రూ 269 కోట్లను కేంద్రం నిలిపి వేసింది. తరువాత దీనికి సంబంధించిన అకౌంట్లను కాగ్‌ కూడా ధృవీకరించడంతో గత ఏడాది మళ్లీ కేంద్రానికి పంపించారు.

అలాగే 2014-15 సంవత్సరానికి సంబందించి ఉమ్మడి రాష్ట్ర వ్యయంగా ఉన్న రూ 963 కోట్ల బిల్లులు కూడా ఇప్పటికీ కేంద్రం వద్ద పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి. ఈ మొత్తానికి కూడా కాగ్‌ ధృవీకరించింది. ఇక 2015-16లో రూ.159 కోట్లు, 2016-17లో రూ.206 కోట్లను కూడా కేంద్రం విత్‌హెల్డ్‌లో పెట్టింది. ఈ వ్యయం సక్రమమేనంటూ కాగ్‌ కూడా కేంద్రానికి లేఖ రాసింది. అయినప్పటికీ ఇరకా విడుదలకావడం లేదు.

ఇలా ఉండాగా, 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి అన్న వితరణ్‌ పోర్టల్‌లో నమోదుచేసిన వివరాల్లో కొంత తేడా నెలకొనడం వల్ల రూ.785 కోట్ల వరకు నిధులను కేంద్రం నిలిపివేవేసింది. 2019-20లో కూడా రెండో త్రైమాసికానికి సంబంధిరచిన రూ.357 కోట్లు ఇంకా కేంద్రం వద్ద పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి.

కాగా, రాష్ట్రంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లించాల్సిన నిధులను పౌర సరఫరాల సంస్థ అప్పులు చేసి చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో ఈ రుణాలను తీసుకొంటుంది. అయితే తాజాగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో కొత్త అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేకుండా పోతుంది.

ఏపీ పోలీసులను దోషులుగా నిలబెడుతున్న సెక్షన్ 151

గత వారం విశాఖ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలీసులు సెక్షన్ 151 సి ఆర్ పీ కింద అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపింది. ఇప్పుడు ప్రశ్న అంతా అరెస్ట్ గురించి కాకూండా సెక్షన్ 151 నుండి చెలరేగుతుంది.

సరిగ్గా మూడేళ్ళ క్రితం నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిను కూడా అదే విధంగా అరెస్ట్ చేసినా ఈ ప్రశ్న తలెత్తలేదు. పోలీసులు తరచూ ప్రతిపక్ష నేతలను ప్రభుత్వ విధానాలపై నిరసనలకు దిగినప్పుడు ఈ విధంగా కట్టడి చేయడం జరుగుతున్నప్పటికీ ఇటువంటి ప్రశ్నలు తలెత్తలేదు.

ఇప్పుడు స్వయంగా హై కోర్ట్ ఈ ప్రశ్న వేసి, డిజిపిని వచ్చి సంజాయతి చెప్పమని ఆదేశించడంతో ఈ ప్రశ్న మరింత కీలకంగా మారింది. అసలు ఈ సెక్షన్ ఏమిటి?

ఈ చట్టం ప్రకారం చెప్పుకోదగిన నేరం చేయకుండా నిరోధించడం కోసం అరెస్ట్ చేయవచ్చు:

1. ఒక వ్యక్తి చెప్పుకోదగిన నేరం చేస్తున్నట్లు భావిస్తే మెజిస్ట్రేట్ ఉత్తరువు, అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక పోలీస్ అధికారి ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. మరో విధంగా నేరం చేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదనిపించినప్పుడు ఆ విధంగా చేయవచ్చు.

2. ఈ చట్టంలోని సబ్ సెక్షన్ (1) ప్రకారం ఆ విధంగా నిర్బంధంలోకి తీసుకున్న వారెవ్వరిని మరింకా నిర్బంధంలో ఉంచడం అవసరమైన పక్షంలో లేదా ఈ చట్టంలోని మరే నిబంధన ప్రకారం అయినా అధికారం పొందిన పక్షంలో లేదా అప్పుడు అమలులో ఉన్న మరే చట్ట ప్రకారం కాకూండా
24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచరాదు.

సెక్షన్ 151 సీఆర్పీసీ అనేది పోలీసుల ముందస్తు నివారణ చర్యలకు సంబంధించింది. ఒక వ్యక్తి ఒక నేరం చేయడానికి ముందే దీనిని ఉపయోగించవచ్చు. సాధారణంగా, ఒక వ్యక్తి చెప్పుకోదగిన నేరం చేసిన్నట్లయితే, అందుకు ఏడేళ్లకు పైగా శిక్షార్హత ఉండినట్లయితే సెక్షన్ 41ఎ సీఆర్పీసీ ప్రకారం అరెస్ట్ చేస్తారు.

సెక్షన్ 151 సి ఆర్ పిసి క్రింద ఉండే అధికారం రాష్ట్రంలోని ముందస్తు నిర్బంధ చట్టాల వంటివి. ఈ నిబంధనలను చదివితే ఆ వ్యక్తి ఒక నేరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, నిర్బంధంలోకి తీసుకోకుండా ఆ నేరాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని పోలీస్ అధికారి ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి.

జనవరి, 2017లో జగన్ ప్రతిపక్ష నేతగా “వై” కేటగిరి భద్రతలో, ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా “జెడ్ ప్లస్” కేటగిరి భద్రతలో, ఒక విధంగా పోలీసుల వలయంలో, వారి నిరంతర నిఘాలో ఉన్నారు. అటువంటి నేతలను “నేరం చేయవచ్చనే అనుమానం”తో సెక్షన్ 151 సి ఆర్ పిసి క్రింద అరెస్ట్ చేయడం పూర్తిగా అధికార దుర్వినియోగం క్రితమే వస్తుంది.

సెక్షన్ 151 సీఆర్పీసీ క్రింద చర్య తీసుకొనే ముందు పోలీస్ అధికారి తప్పనిసరిగా ఆ వ్యక్తి ఎటువంటి చెప్పుకోదగిన నేరం చేసే ఆవకాశం ఉన్నదో అంటూ నమోదు చేయాలి. ముఖ్యంగా “వై”, “జెడ్” క్యాటగిరీ లలో భద్రత కల్పించిన నాయకుల విషయంలో ఈ విషయమై తగు కారణాలు చూపవలసిన భారం పోలీస్ అధికారులపై మరింత ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయకుండా,కేవలం అధికారంలో ఉన్న నేతల “ఆదేశాలకు” లోబడి పోలీసులు నవ్వులపాలు అయ్యారని చెప్పవలసి ఉంటుంది.

బిసి రేజర్వేషన్లపై జగన్ మౌనం, బాబు దూకుడు!

బిసిలకు పెంచిన రేజర్వేషన్లను హై కోర్ట్ కొట్టి వేయడంతో, మొత్తం రేజర్వేషన్లను 50 శాతంకు మించకుండా చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయమై బీసీలలో రాగాల స్పందనపై జాగురతతో అడుగులు వేస్తున్నది.

బిసిలు మొత్తం మీద టిడిపి మద్దతుదారులుగా ఉన్నప్పటికీ, గత ఎన్నికలలో చెప్పుకోదగినంతమంది వైసీపీకి ఓట్ వేయడంతో వారిని కాపాడుకోవడం ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అందుకనే బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బిసి రేజర్వేషన్ల అంశంపై ఎవ్వరు నోరు విప్పవద్దని జగన్ ఆదేశించారు. బిసిల రిజర్వేషన్లు తగ్గుతుండటం వల్ల సుమారుగా 1600 మంది బిసి ప్రతినిధులు అన్ని స్థాయిల్లోనూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.

దీనిమీద ఎంత ఎక్కువ చర్చ జరిగితే వైసిపికి అంత ఎక్కువగా నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాన్ని మంత్రులు అందరు వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని బిసిల సానుభూతి కోసం టిడిపి వ్యూహరచన చేస్తున్నది. హై కోర్ట్ తీర్పును సుప్రీం కోర్ట్ లో సవాల్ చేయనున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవంక, టిడిపి ప్రతినిధి వర్గం గవర్నర్ హరిచందన్‌ను కలిపి ఈ విషయమై వినతి పత్రం ఇచ్చింది.

‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం వల్ల 140 వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోంది. జగన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 16 వేల పదవులను బీసీలు కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలను అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. బీసీలు టీడీపీకి అండగా ఉంటున్నారన్న అక్కసుతోనే జగన్‌ ఈ విధంగా చేస్తున్నారు’’ అని టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు గవర్నర్ కు వివరించారు.

బీసీలకు 1987వ సంవత్సరం నుంచి 34 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు 24 శాతానికి పరిమితం అయ్యాయని అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలకు నాడు తండ్రి, నేడు కొడుకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.

బీసీలకు రేజర్వేషన్లను 24 శాతంకు కుదిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకు రాదలచిన ఆర్టినెన్స్‌ ముందుగా గవర్నరు వద్దకు వస్తుంది కాబట్టి దాన్ని తిరస్కరించాలని వారు కోరారు.

అసెంబ్లీ సమావేశాలలో రెండు కీలక అంశాలు


తెలంగాణ 15వ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో రెండు కీలక అంశాల పై చర్చ జరుగనుంది అందులో ఒకటి రాష్ట్ర బడ్జెట్ కాగా రెండోవది పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ తీర్మానం. ఆర్థిక మంత్రి హరీష్ రావు 8వ రాష్ట్ర బడ్జెట్ 2020-21ను ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను వ్యతిరేకిస్తూ ఈ సమావేశాలలో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం చేసే అవకాశం ఉంది.

ఈ రోజు ఉదయం 11 గం.కు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రసంగం అనంతరం ఈ సమావేశాలు జరుగనున్నాయి. రాష్ట్ర గరవ్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమిళిసై తొలిసారిగా శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 22 వరకు ఈ శాసనసభ సమావేశాలు జరుగున్నాయి. 10-12 రోజులు శాసనసభ, 5-6 రోజులు శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి.

రేవంత్ రెడ్డి రాహుకాలంలోకి ప్రవేశించాడా ?

రేవంత్ రెడ్డి ఈపేరు తెలుగు ప్రజలకు సుపరిచితం. మొదట్నుంచీ ఎప్పుడూ ఏదోఒక కారణంతో వార్తల్లో వుండే వ్యక్తి. తెలుగు ప్రజలు హీరోయిజాన్ని ఎప్పుడూ ఆరాధిస్తారు. ఆకోణంలోనే రేవంత రెడ్డి ని చూడాల్సివుంటుంది. తన రాజకీయ జీవితం తెరాస తో మొదలైనా ఎక్కువకాలం తెలుగుదేశం లో చంద్రబాబు నాయుడుకి అభిమానిగానే వున్నాడు. చివరకి కాంగ్రెస్ లో చేరేముందుకూడా చంద్రబాబుకి చెప్పే చేరాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్నాడు.

రేవంత్ రెడ్డి మొదట్నుంచీ ‘హైలీ యాంబిషస్’ వ్యక్తి. ఎక్కడవున్నా తనకి ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకొనే వ్యక్తి. దానివలన వున్న పార్టీలోనే ఎక్కువమంది శత్రువుల్నితయారుచేసుకుంటుంటాడు. తెలుగుదేశం లో తన సహచర నాయకుల్లో చాలామందికి తనపెరుగుదల నచ్చేదికాదు. అయితే తనకి చంద్రబాబు నాయుడి మద్దత్తు వుంది కాబట్టి ఏమీ మాట్లాడలేకపోయేవాళ్లు. అయితే తనకున్న చురుకుదనం, వాగ్ధాటి తో ప్రజల్లో ఒక సెక్షన్ తనంటే పిచ్చగా అభిమానానించే టట్లు చేసుకోగలిగాడు. రెండోది, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడగలగటం. రెడ్డి కుల సంఘం మీటింగు పెడితే చాలా మంది నాయకులు వెళ్ళటానికి మొహమాటపడితే రేవంత్ రెడ్డి ఎటువంటీ బెరుకు లేకుండా చాలా చురుకుగా పాల్గొనటం అతని మనస్తత్వాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అయితే అతి ఆశయం వలన వచ్చిన అవకాశాల్ని పోగుట్టుకుంటుండాడు . ఉదాహరణకు బీజేపీ లో చేరతాడని అందరూ అనుకున్నప్పుడు తనకి అధ్యక్షపదవి ఇస్తేనే చేరతానని పట్టుబట్టినట్లు తెలిసింది. చివరకు కాంగ్రెస్ లో చేరటానికి కూడా పదవి కోసం బేరాలాడే చేరినట్లు తెలుస్తుంది. అందుకే ఎంతోమంది సీనియర్లు వున్నా తనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది.

ఈ పదవితోపాటు పార్టీలో సమస్యలుకూడా తోడుగా వచ్చాయి. కాంగ్రెస్ సంస్కృతి వేరు. మామూలుగానే ఒక నాయకుడు ముందుకెళ్తే రెండో నాయకుడు కాళ్ళు పట్టుకొని లాగుతాడు. ఆ పార్టీలో వున్నంతమంది నాయకులు ఏ పార్టీలో లేరు. అందరూ ఆరితేరినవాళ్ళే. ఓ కుర్రోడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సర్దుకుపోయే మనస్తత్వం అసలు ఉండదు. ఎలాగైనా రేవంత్ రెడ్డి ని దెబ్బతీయాలని ప్రయత్నించే వాళ్ళు తెరాస కన్నా కాంగ్రెస్ లోనే ఎక్కువమంది వున్నారు. రేవంత్ రెడ్డి భూ వ్యవహారాలు వీళ్ళే ప్రభుత్వానికి ఉప్పందించారని అనుకుంటున్నారు. అలా జరిగివుండటానికి అవకాశాలు ఎక్కువగానే వున్నాయి. ఇది కెసిఆర్ కి అందివచ్చిన అవకాశం. రేవంత్ రెడ్డి ని దెబ్బతీయటానికి ఏ అవకాశం దొరికినా వాడుకోవటానికి కెసిఆర్ రెడీగా ఉంటాడు. అది సహజం కూడా. కెసిఆర్ రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి కన్నా ఆరు రెట్లు ఎక్కువే. అవతలివాడిని ఎలా లొంగతీసుకోవాలో, అది కుదరకపోతే ఎలా దెబ్బతీయాలో తనకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు దొరికిన ఆర్ధిక లావాదేవీలు రేవంత్ రెడ్డి రాజకీయాన్ని దెబ్బతీయొచ్చని కెసిఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

రేవంత్ రెడ్డి కి రాను రాను పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయనిపిస్తుంది. తన అత్యాశ , చురుకుదనం అభిమానుల్ని తెచ్చిపెట్టినా ఆర్ధిక కుంభకోణాలు ఒకటిమీద ఒకటి బయటపడితే ప్రజలు హర్షించరు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు తరఫున డబ్బులు ఇవ్వచూపటం తన రాజకీయ జీవితం లో మాయని మచ్చ. అయినా జనంలో కెసిఆర్ కి ఎదురునిలబడగల మొనగాడు రేవంత్ రెడ్డేననే అనుకోవటంతో సర్దుకుపోయారు. పోయిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలవటం అందుకు ఉపయోగపడింది. ఓటుకు నోటు కేసు దుష్ప్రభావం పెద్దగా పడలేదు. కానీ ఇప్పుడు బయటపడ్డ భూ కుంభకోణం ప్రజల్లో మార్పుతెచ్చే అవకాశం వుంది. ఓటుకు నోటు కేసు చంద్రబాబు చెబితే చేశాడని అనుకున్నవాళ్ళే ఇప్పుడు బయటపడ్డ భూ కుంభకోణంతో తిరిగి ఆలోచించటం మొదలయ్యింది. ఒకనాడు అభిమానించినవాళ్ళే ఈరోజు భూ కుంభకోణం చూసిన తర్వాత సమర్ధించే పరిస్థితుల్లో లేరు. డ్రోన్లతో కెసిఆర్ కుటుంబం ప్రతిష్ట దెబ్బతీయాలనుకునేవాడు తనలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి కదా. నేను అవినీతి చేస్తాను అదే సమయంలో శక్తివంతమైన కెసిఆర్ ని ఎదుర్కుంటాను అంటే కుదరదు. అది చివరకు ఫ్యాక్షన్ రాజకీయమయ్యిద్ది తప్పితే సిద్ధాంత రాజకీయం కాదు. ఇక్కడే కెసిఆర్ చాణక్యం ఉపయోగించాడు. ఎవరైనా అధికారం లో వున్న కుటుంబానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడగలిగితే వాళ్లకు సహజంగా ప్రజల మద్దత్తు లభిస్తుంది. అందుకే ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి కి ఆ క్రేజ్ వుంది. అయితే ఎప్పుడయితే తను నిజాయితీగా లేడని ప్రజలు అనుకుంటారో అప్పుడు తన పోరాటం వ్యక్తిగతం అవుతుంది. అదే ఫ్యాక్షనిజం గా మారుతుంది. కానీ ఇక్కడొక మెలిక వుంది. ఫ్యాక్షనిజం హైదరాబాద్ లాంటి మహానగరంలో చెల్లదు. రాయలసీమలాంటి గ్రామీణ వాతావరణంలో నే వర్క్ అవుట్ అవుతుంది. అందుకనే ఇప్పుడు బయటపడ్డ భూ కుంభకోణంతో రేవంత్ రెడ్డి ప్రభ తగ్గుముఖం పడుతుందనేది ఖాయం. అందుకు సంతోషించేవాళ్లు తెరాస లో కన్నా కాంగ్రెస్ లోనే ఎక్కువమంది ఉండటం ఆశ్చర్యం. ఈ పరిణామాలు రేవంత్ రెడ్డి కి ఆరిపోయే దీపం కాకుండా చూసుకుంటే మంచిది.

Lavanya Tripathi Glamorous Pics

టాలీవుడ్ కి పాకిన సీక్వెల్ వైరస్

సూపర్ సక్సెస్ సాధించిన చిత్రాలకు సీక్వెల్ నిర్మిస్తే ఆర్ధికంగా నిర్మాతకు ఎంతో కొంత లాభముంటుంది. కనెక్ట్ అయిన పాత్రలకు కొనసాగింపు అవ్వడం వలన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఎక్కువ. ఈ రకమైన చిత్ర నిర్మాణం హాలీవుడ్ లో బాగా వేళ్ళూనుకొంది. అక్కడ లెక్కకు మిక్కిలిగా సీక్వెల్ చిత్రాలు వచ్చాయి. వాటిలో సూపర్ మాన్ సిరీస్ , రాంబో సిరీస్ , అవెంజర్స్ సిరీస్ లాంటి చిత్రాలు విశ్వ వ్యాప్తంగా బాగా వసూళ్లు సాధించాయి. ఇంకా ఎన్నో లెక్క లేనన్ని చిత్రాలు వచ్చాయి, రాబోతున్నాయి.

అలా ఆంగ్ల చిత్రాల స్ఫూర్తి తో హిందీలో కూడా సీక్వెల్ చిత్రాలు బాగానే వచ్చాయి. మనకు తెలిసినంత వరకూ హిందీ లో వచ్చిన మొదటి సీక్వెల్ చిత్రం అలనాటి హీరోయిన్ నాడియా నటించిన హంటర్ వాలి కి భేటీ యే. ఇది 1935 లో వచ్చిన హంటర్ వాలి చిత్రానికి సీక్వెల్. కాగా ఈ చిత్రం 1943 లో వచ్చింది. అలా మొదలైన సీక్వెల్ చిత్రాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలం లో వచ్చిన గోల్ మాల్, హౌస్ ఫుల్, డాన్, దబాంగ్ , ధూమ్, క్రిష్ , బాఘీ , మున్నా భాయ్ ,హేరా ఫేరీ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకొని మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.
ఈ సీక్వెళ్ల పరంపర ఇతర భాషల్లో కూడా కొనసాగుతోంది. రీసెంట్ గా తమిళం లో వచ్చిన బిల్లా, రోబో, పందెం కోడి, మారి, కాంచన , సింగం వంటి చిత్రాలు తమిళ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టు కొన్నాయి. ఇపుడు ఇదే వరుసలో భారతీయుడు, నాడోడిగళ్[ తెలుగులో శంభో శివ శంభో] వంటి చిత్రాలు వసున్నాయి. ఇంకా అనేక చిత్రాలు నిర్మాణ సన్నాహాలు చేసుకొంటున్నాయి.

ఇపుడు ఇక తెలుగు చిత్రాలు కూడా సీక్వెళ్ల వైపు అడుగు లేస్తున్నాయి. ఈ క్రమంలో 1978 లో వచ్చిన మొదటి సీక్వెల్ చిత్రం దేవదాస్ మళ్ళీ పుట్టాడు తరవాత తెలుగులో నిర్మాణం జరుపుకున్న చిత్రాలు చాలా తక్కువ అనే చెప్పాలి. మనీ , గాయం, అవును, గబ్బర్ సింగ్, కిక్ , ఆర్య, రక్త చరిత్ర, మంత్ర, శంకర్ దాదా వంటి చిత్రాలు సీక్వెల్స్ గా రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో తెలుగు నిర్మాతలకు సీక్వెల్ చిత్రాల ఫై నమ్మకం సన్న గిల్లింది. ఆ దిశగా ఆలోచించడం మానేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు సీక్వెల్సే బెటర్ అన్న నమ్మకం తో కొందరు నిర్మాతలు ముందుకొస్తున్నారు. వారిలో పెద్ద ,చిన్న నిర్మాతలు ఉన్నారు. ముందుగా చెప్పుకోవాల్సి వస్తే నాగార్జున గురించే చెప్పు కోవాలి. 2016 లో తాను హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ కి సీక్వెల్ రెడీ చేయించాడు. అది త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ కృష్ణే రెండో చిత్రానికి కూడా దర్శకత్వం వహించ బోతున్నాడు. ఇక ఈ చిత్రానికి బంగార్రాజు అని టైటిల్ పెట్ట బోతున్నారు. గతంలో రాజుగారి గది అనే సీక్వెల్ చిత్రంలో నాగార్జున నటించగా అది కాస్త ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ సబ్జెక్టు మీద నమ్మకం తో సోగ్గాడే సీక్వెల్ కి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇక నాగార్జున తనయుడు నాగ చైతన్య నటించిన హిట్ చిత్రం ఏ మాయ చేసావే చిత్రానికి కూడా సీక్వెల్ రూపొందుతున్నట్టు తెలుస్తోంది.తొలి చిత్ర దర్శకుడు అయిన గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి కూడా దర్శకుడిగా వ్యవహరించ బోతున్నాడు.

ఇక బయటి చిత్రాల విషయానికి వస్తే 2014 లో నిఖిల్ హీరోగా వచ్చిన సోషియో థ్రిల్లర్ కార్తికేయ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. యానిమల్ హిప్నటైజ్ కధాంశం తో వచ్చిన తొలి చిత్రం ఘన విజయం సాధించిన నేపధ్యం లో ఈ సీక్వెల్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. రీసెంట్ గా తిరుపతిలో షూటింగ్ కూడా మొదలెట్టారు. తొలి చిత్ర దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక చివరగా చెప్పుకోవాల్సింది తాజాగా విజయం సాధించిన చిన్న చిత్రం ” హిట్ ” గురించి ….విశేషం ఏమిటంటే ఈ సినిమా నిర్మాణ సమయం లోనే సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ చేశారు. నిర్మాత దర్శకులు ఊహించిన విధం గానే సినిమా సక్సెస్ అవ్వడం తో త్వరలోనే సీక్వెల్ నిర్మాణం చేయ బోతున్నారు.

18 Pages Movie Opening Photos

Sophie Choudry Latest Hot Photos

ఆ విషయంపై రేవంత్ రెడ్డి అరెస్ట్


మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.

కేటీఆర్ ఫాంహౌస్‌ పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి సహా మొత్తం 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న రేవంత్ రెడ్డి, కృష్టారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సూచించారు. అయితే వీటిని రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో… ఆయనను అరెస్ట్ చేశారు. ఆరు పేజీలతో కూడిన ఎఫ్ఐఆర్‌ ను కూడా ఫైల్ చేసినట్టు సమాచారం.

గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారని అన్నారు. రూ. 250 కోట్ల విలువైన ఈ భూమిలో రూ. 25 కోట్లు పెట్టి కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు.

కియారాని అచ్చుగుద్దిన టిక్ టాక్ స్టార్

తెలుగు లో భరత్ అను నేను చిత్రంలో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీకి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. 2019 బ్లాక్ బస్టర్ హిట్ కబీర్ సింగ్ లో కియారా… ప్రీతి పాత్రను పోషించింది, ఇది అభిమానులకు ఎంతగానో నచ్చింది. కియారా అద్వానీ బాలీవుడ్‌లో విజయాన్ని ఆస్వాదిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమెను పోలినవారు కనిపిస్తున్నారు. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కల్పన శర్మ హీరోయిన్ కియారా మాదిరి మేకప్ తో అదరగొడుతోంది. దింతో కియారా అభిమానులు కల్పన అభిమానులుగా మారిపోయారు. కల్పన.. కియారా పోషించిన పాత్ర ప్రీతిని అనుకరిస్తుంటుంది. ఇంతే కాదు కల్పన అచ్చం కియారా లా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. తెల్లని కుర్తా ధరించి జుట్టును పోనీటైల్ లా కట్టి, కబీర్ సింగ్ చిత్రంలో ప్రీతి మాదిరిగా కనిపిస్తుంది. కాగా కియారా అద్వానీ నటించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం గిల్టీ మార్చి 6 న విడుదల కానుంది.

https://www.instagram.com/p/BzR5OAynubz/

https://www.instagram.com/p/BzZoVzfHSIj/

https://www.instagram.com/p/BzrrWIAnGJM/

Actress Nikki Tamboli Hot Photos

కరోనా కేసులపై ఈటెల గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలు కరోనా వైరస్‌ పై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఈటెల తెలిపారు. వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఇద్దరి రిపోర్టులు కూడా నెగెటివ్‌ గా వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.కాబట్టి వదంతలు, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని మంత్రి తెలియజేసారు.

భారత్‌ లోనూ కరోనా ప్రభావం అంతగాలేదని చెప్పారు. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రజలు, అధికారులు ఎంతో సహకరించారని అన్నారు. రాబోయే రోజుల్లోనూ కరోనా వైరస్‌ ను తెలంగాణలోకి రాకుండా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందన్నారు. అయితే ప్రజలకు మరింత అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి’ అని ఈటెల తెలియజేశారు.

ఇకపై ఆఫీస్ లో పంచ్ కొట్టక్కర్లేదు

కరోనా వైరస్ కారణంగా పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది . ఇకపై ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు అవసరం లేదు. ఈ విధంగా ఈ వ్యాధిని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సతేంద్ర జైన్ తాజాగా లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిని సందర్శించారు.

కరోనా వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అలాగే ఆరోగ్య వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కరోనా నివారణకు సలహాలు అందించారు. కాగా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పటివరకు 30 కి చేరుకుంది. తాజాగా గురుగ్రామ్ నుండి కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇక్కడ పే టీఏం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయంపై పేటీఎం సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఈ ఉద్యోగి ఇటీవలే ఇటలీ నుండి వచ్చాడు. ఢిల్లీ -ఎన్‌సిఆర్‌లో కొన్ని కరోనా కేసులు నమోదైనప్పటి నుండి ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి . ఎయిమ్స్ తో పాటు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ లో మాస్కులు, శానిటైజర్ల కొరత ఉందని తెలుస్తోంది.