Home Blog Page 8601

Pallavi Dora Photoshoot Stills

‘మరక్కార్’ ట్రైలర్‌పై సూపర్ స్టార్ ట్వీట్

16వ శతాబ్దం నాటి కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘మరక్కార్’ మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ ను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుంది. ట్రెండింగ్లోకి దూసుకెళ్తున్న ఈ ట్రైలర్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విటర్లో అభినందలు తెలిపారు.

‘మరక్కార్’ మూవీకి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 16వ శతాబ్దం నాటి చరిత్రను ఈ మూవీలో అద్భుతంగా చూపించబోతున్నారు. కుంజాలి మరక్కార్ అనే నావికుడి పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నారు. మోహన్ లాల్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్, అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 3నిమిషాల నిడివి ఉన్న ‘మరక్కార్’ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మోహన్ లాల్, కీర్తీ సురేష్ నటన ఈ మూవీకి హైలెట్ గా నిలువనుంది.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ విడుదల చేసిన ‘మరక్కార్’ మూవీ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ‘కలలు నిజమయ్యాయి.. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరక్కార్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ సూపర్ స్టార్ ట్వీట్ చేశాడు. నటుడు మోహన్ లాల్, కెమెరామెన్ తిరుతోపాటు యూనిట్ సభ్యులకు గుడ్‌లక్ అంటూ కామెంట్ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మరక్కార్’ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

‘కోహినూర్’ కోసం పవర్ స్టార్ ఫైట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. పవన్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీతోపాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోహినూర్ వజ్రం కోసం జరిగే పోరాట సన్నివేశాలు సినిమాకే హెలైట్ గా నిలిచే స్టంట్ మాస్టర్లు సన్నివేశాలను రూపొందించినట్లు సమాచారం.

మొగల్ సామ్రాజ్యం కాలంనాటి చరిత్రను ఈ మూవీలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ బందీపోటుగా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ మూవీలో రంగమ్మత్త(అనసూయ) ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. 30నిమిషాల పాటు ఆమె పాత్ర ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’, ‘శాతకర్ణి’ వంటి పిరియాడికల్ మూవీలు తెరకెక్కాయి. ఈ మూవీలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి.

పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పిరియాడికల్ మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబిన్ హుడ్ తరహాలో పవన్ పాత్రను ఉండనుందట. ఈ మూవీ కోసం భారీ కోటలకు సంబంధించిన సెట్లను కూడా వేశారు. కోటలపై యుద్ధాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీనిలో భాగంగా కోహినూర్ వజ్రం కోసం జరిగే ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలువనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పవన్ సరసన ప్రజ్ఞ జైస్వాల్, పూజా హెగ్డే ఎంపికైనట్లు సమాచారం. వీరిపేర్లను చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కరోనా దెబ్బకి భయపడ్డ రజినీకాంత్


రజినీకాంత్ ‘అణ్ణాత్త‌’ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మిగ‌తా షెడ్యూల్స్‌ని కోల్‌క‌త్తా, పూణేలో ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ దెబ్బతో ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ప్రజలను కూడా భయపెడుతున్న విషయం తెలిసిందే.. అయితే కొంత కాలం జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిదనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఈ కారణంగానే సినిమాకి సంబంధించిన మిగిలిన షెడ్యూల్స్ ని కరోనా భయం తగ్గిన తర్వాత హైదరాబాద్ లోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాలో న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించగా, విల‌న్‌గా గోపిచంద్ న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇమాన్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.

ఓ పిట్ట కథ రివ్యూ: గూటికి చేరని పక్షి

విడుదల తేదీ: మార్చ్ 6, 2020
నటీనటులు: సంజయ్ రావ్, నిత్య శెట్టి, విశ్వంత్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: చందు ముద్దు
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

భారీ బడ్జట్ సినిమాకైనా, చిన్న సినిమాకైనా స్క్రీన్ ప్లే చాలా చాలా ముఖ్యం. అది లోపిస్తే సినిమా విజయానికి ఆమడ దూరం లోనే ఆగిపోతుంది. యెంత మంచి కథ ఉన్నాగాని ఆ సినిమాన్ని కాపాడలేదు. ఓ పిట్టకథ సినిమా విషయంలోనూ అదే జరిగింది. బలహీనమైన స్క్రీన్ ప్లే చిత్ర విజయానికి అడ్డుగోడలా నిలబడింది.విడుదలకు ముందు మంచి హైప్ తెచ్చుకొన్న ఓ పిట్ట కథ సినిమా థియేటర్ల వద్దకు రాగానే చతికిల బడింది.

కథ:

ఒక అందమైన వెంకట లక్ష్మి అలియాస్ వెంకీ, తండ్రి పెంపకంలో గారాబంగా పెరుగుతుంది. తన తండ్రి ఫ్రెండ్ కొడుకు అయిన ప్రభు ని గాఢంగా ప్రేమిస్తుంది. ప్రభు, వెంకీ తండ్రి నడిపే సినిమా థియేటర్ లోనే మేనేజర్ గా పని చేస్తూ ఉండటంతో తరచూ వెంకీని కలుస్తుంటాడు. ఈ క్రమంలో వాళ్ళ ప్రేమ, పెళ్లి దగ్గరకి చెరబోతున్న సమయంలో మేనత్త కొడుకు నంటూ క్రిష్, వెంకీ వాళ్ళ ఇంటికి వస్తాడు. వెంకీ తండ్రి వీర్రాజు అతన్ని నమ్మి తన కూతురితో పెళ్లి జరపాలని ఫిక్స్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో వెంకీ అరకు వ్యాలీ కి వెళ్లి తిరిగిరాదు. వీర్రాజు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఎంక్వయిరీ లో వెంకీ అరకులో జరిగిన ఆక్సిడెంట్ లో మరణించి నట్టు తెలుస్తోంది. దానికి తోడు క్రిష్ ఆమె మరణానికి కారణం ప్రభుయే అని పోలీస్ లను నమ్మిస్తాడు. కానీ పోలీస్ విచారణలో ప్రభు నిర్దోషి అని తేలుతుంది. దాంతో వెంకట లక్ష్మి ని ఎవరు మాయం చేశారు అన్న అంశం చుట్టూ సినిమా నడుస్తుంది.

దర్శకత్వం :

నూతన దర్శకుడు చెందు ముద్దు రాసుకున్న కథ బాగానే ఉంది. కానీ దానికి తగ్గ పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే తయారు చేసుకోక పోవడం వలన సినిమా సక్సెస్ తీరం చేర లేదు. జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయింది. ఇక దర్శకుడు రాసుకున్న కథ కి మంచి డైలాగ్లు అమర లేదు. సరైన స్క్రీన్ ప్లే లేక పోవడం తో చిత్రం ఆసాంతం టీవీ సీరియల్ లా సాగి ఒకింత విసుగు పుట్టించింది.

నటీనటులు :

తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న బ్రహ్మాజీ ఈ చిత్రం ద్వారా తన కొడుకు సంజయ్ రావు ని తెలుగు తెరకు హీరోగా పరిచయం చేయడం జరిగింది. ఇక నటుడిగా సంజయ్ తగినంతలో బానే నటించాడు. కానీ నటనని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోక తప్పదు. ఇక సినిమాలో రెండో హీరోగా నటించిన విశ్వాంత్ తన కున్న సినీ అనుభవం తో తన పాత్రకు న్యాయం చేసాడు. ఇక ఈ సినిమాకి హైలెట్ గా హీరోయిన్ నిత్యా శెట్టి నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. ప్రముఖ టీవీ నటుడు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయిన భోగిరెడ్డి శ్రీనివాస్ ఈ సినిమా లో హీరోయిన్ తండ్రి వీర్రాజు గా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. బ్రహ్మాజీ సహా ఇతర నటులు తమ తమ పాత్రలకు తగురీతిలో న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :

కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం శాఖల్ని నిర్వహించిన చెందు ముద్దు కథకుడిగా, దర్శకుడిగా మాత్రం సక్సెస్ అయ్యాడు. మాటలు, స్క్రీన్ ప్లే విషయం లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. తన తదుపరి చిత్రంలో అయినా వాటిని సరిదిద్దుకొంటే మంచి దర్శకుడిగా మిగులుతాడు. ఇక ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఏమంత ఆకట్టు కోలేదు. అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనపడింది.చివరగా సునీల్ కుమార్ కెమెరా పనితనం మాత్రం సినిమాని ఆసక్తిగా నడిపించింది.

విశ్లేషణ :

ఎటువంటి సినిమా అయినా స్క్రీన్ ప్లే మీద ఆధారపడి సక్సెస్ సాధిస్తుంది. అందుకే హాలీవుడ్ లో స్క్రీన్ ప్లే రచయితలకు అగ్ర తాంబూలం ఇస్తారు. అక్కడే కాదు ఏ దేశమైనా, ఏ భాష అయినా స్క్రీన్ ప్లే నే సినిమాకి మూలాధారం అది ఓ పిట్టా కదా సినిమాలో బాగా లోపించింది. మంచి కాదని అనవసర సాగతీత దృశ్యాలతో విజయానికి దూరం చేసుకొన్నారు.

ఏపీలో స్థానిక సమరంకు రంగం సిద్ధం!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైనది. ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. ఎంపిటిసి, జడ్‌పిటిసిలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దీని ప్రకారం నేటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమై నెలాఖరుకు పూర్తి అవుతుంది.

ఎంపిటిసి. జడ్‌పిటిసిలకు రెండు దశల్లో ఈ నెల 21, 24 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. తొలివిడత ఎన్నికలు జరగనున్న ఎంపిటిసి, జడ్‌పిటిసిలకు నేడు (ఏడవ తేది) రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. 9న రిటర్నింగ్‌ ఆఫీసర్‌ స్థానికంగా నోటీసు జారీ చేస్తారు. ఆ రోజు నుండే నామినేషన్లు ప్రారంభమవుతాయి.

మలివిడత ఎన్నికలకు 10వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుండగా, ఆర్‌ఓ 12వ తేది నోటీసు జారీచేస్తారు. ఆ స్థానాలకు ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.

మున్సిపల్‌ ఎన్నికలకు ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుండగా, స్థానికంగా 15వ తేది జారీ అవుతుంది. ఆ తేది నుండి మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 27వ తేది మున్సిపల్‌ పోలింగ్‌ జరుగుతుంది.
ఎంపిటిసి, జడ్‌పిటిసిలతో పాటు మున్సిపాల్టీల ఎన్నికల ఫలితాలను ఈ నెల 29న ప్రకటించనున్నారు.

మరోవైపు జిల్లాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషనను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయతీ రాజ్‌శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం 13 జిల్లా పరిషత్‌లలో ఎస్‌టి మహిళకు 1, ఎస్‌సి మహిళకు 1, బిసి మహిళకు 2, ఎస్సీలకు 1, బిసిలకు 1 జిల్లా పరిషత్‌ స్థానాలను రిజర్వు చేశారు. జనరల్‌ సీట్లలో మూడింటిని మహిళలకు కేటాయించారు. ఇవి పోను నాలుగు స్థానాలను జనరల్‌గా గుర్తించారు.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలోనే జరగనుండటంతో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. శుక్రవారం జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఈ విషయం తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలిపిందని, దానికి తాము అంగీకరించామని ఆయన చెప్పారు.

‘ఫోన్‌పే’ యూజర్ల తప్పని పాట్లు

ప్రస్తుత కాలంలో ప్రతీఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిందో ఇట్టే తెలుసుకునే సదుపాయం కలిగింది. అరచేతిలో పట్టే స్మార్ట్ ఫోన్ తో కూర్చొన్న చోటు నుంచే ఎన్నోరకాల పనులను చేసుకోవచ్చు. బ్యాంకు లావాదేవీలు కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. బ్యాంకులకు వెళ్లకుండానే పనులు జరిగిపోతుండటంతో ఖాతాదారులు, యూజర్లు వీటిని బాగా వినియోగిస్తున్నారు. అయితే తాత్కలికంగా ఫోన్‌పే..సర్వీస్‌కు బ్రేక్‌ పడింది. దీంతో ఫోన్‌పే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా ‘యస్ బ్యాంక్’పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో బ్యాంకు లావాదేవీలు పరిమితంగా జరుగుతున్నాయి. ఈ ప్రభావం ‘ఫోన్‌పే’పై పడింది. ఎందుకంటే ‘ఫోన్‌పే’కు అతిపెద్ద పేమెంట్‌ భాగస్వామిగా ‘యస్‌ బ్యాంక్‌’ కొనసాగుతోంది.గత రెండురోజులుగా ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యస్‌ బ్యాంక్‌ నోడల్‌ అకౌంట్స్‌ పని చేయకపోవడంతో లావాదేవీలు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో యస్ బ్యాంక్ ఖాతాదారులతోపాటు ‘ఫోన్‌పే’ యూజర్లు లావాదేవీలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

దీనిపై స్పందించిన ‘ఫోన్‌పే’ యూజర్లకు క్షమాపణలను చెప్పింది. తమ సేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యస్ బ్యాంక్ పై ఆర్బీఐ మాటిరిటోరియం విధించడం వల్ల బ్యాంక్ షేర్లు ఇప్పటికే 85శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యస్ బ్యాంక్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

‘మగువ’లకు స్పెషల్ గిప్ట్ రెడీ చేసిన ‘వకీల్ సాబ్’

pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్టు లుక్ ఇటీవల విడుదలైన సంగతి తెల్సిందే. కొన్నేళ్లుగా పవర్ స్టార్ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ‘వకీల్ సాబ్’ పోస్టర్ రిలీజ్ కాగానే అభిమానులు లైక్ లు, షేర్లలో సోషల్ మీడియాను హడలెత్తించారు. దీంతో ‘వకీల్ సాబ్’ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది.

‘వకీల్ సాబ్’ మూవీ శరవేగంగా పూర్తి చేసుకుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ పై దృష్టిసారించింది. ఇప్పటికే టైటిల్ లాంచ్, ఫస్టు లుక్ తో చిత్రబృందం ఆకట్టుకుంది. మార్చి 8న జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఆకట్టుకునేలా ఒక స్పెషల్ సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ సాంగ్ టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు. 29సెకన్ల నిడివిగల ఈ పాట ప్రతీఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.

`మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా!` అంటూ చిన్నపాటి గ్లింప్స్ ని విడుదల చేశారు. పూర్తి సాంగ్ ను మార్చి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించారు. సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. దిల్ రాజు-బోనీకపూర్ నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీకి ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ బాణీలను సమకూరుస్తున్నాడు. పూర్తి సాంగ్ రిలీజైతే మాత్రం యూట్యూబ్లో సరికొత్త రికార్డులు తిరగరాయడం ఖాయంగా కన్పిస్తుంది. వేసవిలో మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు.

రూ 1.55 లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్!

ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా ఆదివారం ప్రవేశ పెట్టె బడ్జెట్ రూ 1.55 లక్షల కోట్ల మేరకు ఉండగలదని భావిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలకు శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఆమోదం తెలుపనుంది.

మాంద్యం వెంటాడుతున్నా గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కన్నా ఈసారి పది శాతం అదనంగా పద్దు ఉండగలదని చెబుతున్నారు. గత బడ్జెట్‌‌‌‌‌‌‌‌ల తరహాలోనే ఈ యేటి పద్దు కూడా రైతు పక్షపాతిగానే ఉండే అవకాశం ఉంది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు, రైతుబంధు, బీమా, అగ్రి సబ్సిడీలు, ఇతరత్రా అన్ని రకాల కేటాయింపులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో 20 శాతానికిపైగా ఉండనున్నట్టు తెలిసింది.

57 ఏళ్ల వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయింపులు చేసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పింఛన్లకు రూ.10 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నాయి. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ.7 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని సమాచారం. కరెంట్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీలు, ఇతర కేటాయింపులకు రూ.10 వేల కోట్ల వరకు ఇచ్చే అవకాశముంది.

రైతు రుణాలు త్వరలోనే మాఫీ చేయనున్నామని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెపుతున్న నేపథ్యంలో రుణమాఫీకి రూ.6 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నట్టు తెలుస్తోంది.

2019–20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,43,133 కోట్లతో బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ప్రవేశపెట్టింది. అంతకుముందు ఓట్‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను రూ.1,82,017 కోట్లతో పెట్టింది. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతను సాకుగా చూపి వాస్తవ బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు వచ్చే సరికి రూ.38,884 కోట్ల మేర కోత పెట్టింది.

రాష్ట్ర వృద్ధి రేటు 17% నుంచి ఆరు శాతానికి పడిపోయినా, ఈ ఏడాది రూ.70 వేల కోట్ల వరకు స్టేట్‌‌‌‌‌‌‌‌ ఓన్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ ఉండే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాల్లో ఒక శాతం మేర కోత పెడుతూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2020–21 కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రానికి రూ.29,030.58 కోట్లు కేటాయించారు.

సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జీఎస్టీ, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌కం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, కస్టమ్స్‌‌‌‌‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ, సర్వీస్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ రూపేణ ఈ ఆదాయం రాష్ట్రానికి సమకూరనుంది. పన్నుల్లో వాటా ఒక శాతం తగ్గినా 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.739 కోట్ల మేర పెరగడం గమనార్హం.

హ్యాకింగ్ లిస్ట్ లో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కోట్ల ఫోన్లుకు హ్యాకింగ్ రిస్క్ ఉన్నట్లు కన్జ్యూమర్ వాచ్ డాగ్ ‘విచ్’ హెచ్చరికలు జారీచేసింది. యూజర్లు వెంటనే తమ డివైస్​ ల సాఫ్ట్ ​వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

ప్రపంచ వ్యాప్తంగా 42.1 శాతం యూజర్లు ఆండ్రాయిడ్ 6, అంతకంటే కిందిస్థాయి ఓఎస్​ లను వినియోగిస్తున్నారని గూగుల్ డేటాలో తేలింది. ఓల్డ్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ను వినియోగించడం, ఆదే విధంగా ఓఎస్ ​లతో నడుస్తున్న డివైస్ ​లు సెక్యూరిటీ అప్ డేట్స్​ను సపోర్ట్ చేయకపోవడం వల్ల అవన్నీ హ్యాకింగ్​కు గురయ్యే ప్రమాదం ఉంది. హ్యాకర్లు వాటిలోని డేటా దొంగిలించడం, ర్యాన్సమ్ వేర్ (డేటాను దొంగిలించి డబ్బులు డిమాండ్ చేయడం), మాల్వేర్ ఎటాక్ లాంటి వాటికి పాల్పడే ప్రమాదం ఉంది.

హ్యాకింగ్ కి దొరకకుండా యూజర్లు ఏమిచేయాలంటే..

  • మీ ఫోన్ కొని రెండేళ్ల దాటితే.. ఓఎస్ పాతదా? కొత్తదా? చెక్ చేసుకోండి. ఓల్డ్ వెర్షన్ ఓఎస్ అయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి.
  • మీ ఫోన్ ఈ మధ్యే కొన్నారా.. అయితే కంగారేమి లేదు. అనుమానం ఉంటె ఓఎస్ ని చెక్ చేయించుకోండి.
  • ఫోన్ ఓఎస్ 7.0 కంటే ముందుది అయితే అప్ డేట్ చేసుకునేందుకు ప్రయత్నించండి.
  • ముఖ్యంగా ఆండ్రాయిడ్ 4, అంతకుముందు ఓఎస్ ఉన్న డివైస్​ లను వాడుతున్న యూజర్లు జాగ్రత్తగా ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తప్ప.. మరే ప్లాట్ ఫామ్ నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దు.
  • అనుమానాస్పద ఎస్సెమ్మెస్ లు, ఎంఎంఎస్ ల విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి.
  • యాప్ ద్వారా మొబైల్ యాంటీ వైరస్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. అయితే ఇది పూర్తిస్థాయి సెక్యూరిటీని ఇస్తుందని చెప్పలేం.

యస్‌ బ్యాంకులో ముందే టిటిడి రూ 1300 ఉపసంహరణ

యస్‌ బ్యాంకు షేర్లు 85 శాతం ప‌డిపోయాయి. యస్‌ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించ‌డం వ‌ల్ల ఆ బ్యాంకు ట్రేడింగ్‌లో బోరుమ‌న్న‌ది. కేవ‌లం 50 వేలు మాత్ర‌మే విత్‌డ్రా చేసుకోవాల‌ని ఆర్బీఐ ఆంక్ష‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. దానితో ఆ బ్యాంకు ఖాతాదారులు అందరూ ఆందోళన చెందుతున్నారు.

కానీ టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి యస్‌ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన్నట్లున్నారు. న్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్ల ఉపంసహరణ

టీడీపీ హయాంలో ఎస్‌ బ్యాంకు సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లోకి టీటీడీ డిపాజిట్లు వేశారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌ కాగానే… డిపాజిట్ల వ్యవహారంపై దృష్టి సారించారు.

ఆ నాలుగు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న టీటీడీ ఛైర్మన్‌ యస్‌ బ్యాంకు పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేసారు. వెంటనే ఆ బ్యాంకు లోని డిపాజిట్లను వెనుకకు తీసుకోవాలని ఆదేశాలలు జారీ చేశారు.

ఈ డిపాజిట్ లను ఆ బ్యాంకు నుండి ఉపసంహరించుకోవద్దని ఒత్తిళ్లు ఎన్ని వచ్చినా ఆయన ఖాతరు చేయలేదు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చే, మరెవ్వరు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా చేయగలిగారు.

చివరకు యస్‌ బ్యాంకు నుంచి 1300 కోట్లు టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించడంతో ఇప్పుడు టిటిడి అధికారులు ఊపీరి పీల్చుకొంటున్నారు.

సింహాచలం ధర్మకర్త మార్పు వెనుక క్రైస్తవ కోణం

రాత్రికి రాత్రే సింహాచలం ధర్మకర్త అశోకగజపతి రాజు గారిని తొలగించి మాన్సాస్ ట్రస్టును ఆయన అన్న కూతురు సంచితకు కట్టబెట్టడం వెనుక కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు. మత కోణం, భూమాఫియా ప్రమేయం కూడా ఉంది. కాకపోతే ఈవిషయం ధైర్యంగా చెప్పడానికి తెలుగుదేశం నేతలు, అటు రాజకుటుంబీకులు కూడా జంకుతున్నారు.

అసలు విషయం ఏంటంటే ఆనందగజపతిరాజు గారు బతికి ఉన్నప్పుడే ఆయన తన భార్య ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారు. ఆయన మరణానంతరం తన తమ్ముడు అశోకగజపతి రాజుగారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ధర్మకర్త అయ్యారు. రాజవంశానికి ఎవరు పెద్దదిక్కు లేదా వారసుడో వారే ధర్మకర్తగా ప్రభుత్వం నియమించడం ఇప్పటివరకు వస్తున్న ఆచారం. దానిని తుంగలో తొక్కి ఆయన బతికుండగానే తొలగించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రహస్య జీవోలతో సంచైతను నియమించింది.

ఆనందగజపతిరాజు గారి నుంచి విడాకులుమ్ తీసుకున్న కేరళ రాజకుమారి ఉమాగజపతిరాజు తరువాత రమేష్ శర్మ అనే దర్శకుడిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. తన ఇద్దరు ఆడ పిల్లలతో సహా ఆయనతో ఉంటున్నారు. ఆయన క్రైస్తవుడు. వీరి పేజ్ 3కుటుంబం చాలా రిచ్, పోష్. రమేష్ శర్మ తను గాంధీ మీద, ఆయన అహింసా సిద్ధాంతం మీద సందేశాత్మక చిత్రానికి ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి పొందారు. తరచుగా విదేశాల్లో చర్చిలను, పాస్టర్లను దర్శించుకుంటారు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సంచైత ఇప్పుడు సింహాచలం ధర్మకర్త!

వీరి కుటుంబం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. ఇక సంచైత గజపతిరాజు సన అనే ఎన్జీవో నిర్వహిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేజ్రీవాల్, మేధాపాట్కర్ లాంటి వివిధ నేతలతో కలిసి బాలికలకు మరుగుదొడ్లు, తాగునీరు అనే అంశాల్లో పనిచేసి బాగా పేరుపొందారు. సన ఎన్జీవో సంస్థ కూడా ఆనంద్ శర్మ, ఉమాగజపతిరాజు, సంచైతా గజపతిరాజు అనే ముగ్గురి ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో ఎన్నికల ముందు భాజపాలో చేరారు తప్ప ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ చురుకుగా లేరు. సుజనాచౌదరి భాజపా పార్టీలో ఎందుకు చేరారో ఈమె కూడా అందుకే చేరినట్లు కనబడుతోంది. మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో సింహాచలంతో సహా 108 గుడులు, పధ్నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి. విశాఖపట్నం రాజధాని అని ప్రకటించిన నేపథ్యంలో దీని వెనుక ఉన్న కారణాలు మనం తేలిగ్గా ఊహించవచ్చు

Actress Karronya katrynn Photos

ప్రపంచానికి 20-20 గండం!


చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా రక్కసి 2020వ సంవత్సరంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగిచూస్తే ప్రపంచానికి “20-20 గండం” ఉందనిపిస్తోంది. ప్లేగు మహమ్మారి నుండి ఇప్పటి కరోనా రక్కసి వరకు గమనిస్తే కొన్ని ఆసక్తికర నిజాలు బయటపడతాయి. ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక వైర‌స్ విజృంభించి ప్రపంచ దేశాలను వణికించి, లక్షల మందిని బలి తీసుకుంటున్నాయి అనేది నమ్మలేని నిజం.

1720లో ఫ్రాన్స్ లోని మార్సెయిల్స్ లో ఎలుకల నుంచి పుట్టిన  ప్లేగ్ మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. యూరప్ ప్రజలను ఓ కుదుపు కుదుపేసి ఊర్లకు ఊర్లు ఊడ్చేసింది. లక్షల మంది చనిపోయారు. మరణించిన వారిని పూడ్చి పెట్టడం కష్టంగా మారి సామూహిక దహనాలు చేసారంటే పరిస్థితి ఎంత భయానకమో అర్థంచేసుకోవచ్చు.

యూరప్ ను అతలాకుతలం చేసిన ప్లేగుకు వందేళ్లు పూర్తవుతుండగానే ఆసియా దేశాలను 1820లో కలరా వ్యాధి కబళించింది. మన దేశంలోని కోల్ కతా నగరంలో బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. తొలిసారి ప్రబలి యూరప్ వరకు వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. లక్షమందికి పైనే చనిపోయారు.

ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచేయమైన పేరు స్పానిష్ ఫ్లూ. 1920లో స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. యావత్ ప్రపంచాన్ని నివ్వరపరిచే విధంగా అత్యంత పెను విషాదాన్ని మిగిల్చిన అతిభయంకర వ్యాధి స్పానిష్ ఫ్లూ. ప్రపంచాన్ని విలవిలలాడేలా చేస్తూ 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడి, కోటి మంది మరణించారు. అతి పెద్ద విషాదం మిగిల్చిన భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ చ‌రిత్ర‌కెక్కింది.

2020లో కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. ఇప్పటి వ‌ర‌కు 80కి పైగా దేశాలకు వ్యాపించింది. చనిపోయిన వారి సంఖ్యా 3 వేలే అయినా ఇది పుట్టిస్తున్న భయం అంతా ఇంతా కాదు. లక్షల‌ మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోట్ల మంది ప్రజలు ఈ వైరస్ చంపుతుందోనని వణికిపోతున్నారు.

ఈ విధంగా 1720 నుండి 2020 వరకు ప్రతి వంద ఏళ్ళకి ఒక వైరస్/వ్యాధి ప్రపంచ దేశాలకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే స్వార్థంతో లేదా మరేదైనా ఆశించో కావాలనే వీటిని సృష్టించి జనం పైకి వదులుతున్నారా? అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వైరస్ లు, వ్యాధులు వస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.

స్వీటెస్ట్ స్వీటీ ‘నిశ్శ‌బ్దం’ ట్రైల‌ర్‌..

అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదలవుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణతలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం నేచురల్ స్టార్ నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ‘‘ఇదుగో..మా స్వీటెస్ట్ స్వీటీ ‘నిశ్శ‌బ్దం’ ట్రైలర్. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అని చిత్ర యూనిట్‌కి నాని శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సినిమా లో అత్యధిక భాగం అమెరికాలో చిత్రీక‌రించారు.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. సినిమా అంతా క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఒక అమెరికన్ న్యూస్ రిపోర్టర్ “దెయ్యాల కొంప అనే పేరున్న వుడ్ సైడ్ విల్లా ఈరోజు మరోసారి వార్తల్లోకి వచ్చింది” అని చెప్తుంది.‘అక్క‌డ చీక‌ట్లో ఎవ‌రో ఎటాక్ చేశారంటా..కానీ ఎవ‌రో ఏంటో క‌నిపించ‌లేదంటున్నారు’ అనే డైలాగ్‌ లు వినిపిస్తాయి. అంజలి ఈ కేసును విచారణ చేస్తూ ఉంటుంది. “ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు” అని మరో సీన్ లో అంజలి అంటుంది. అనుష్క ను విచారిస్తూ “నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎందుకు రాలేదు?” అని ప్రశ్నిస్తుంది. “నిన్న ఆర్ఫనేజ్ కు వెళ్ళిన మాకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి” అంటుంది. అవసరాల శ్రీనివాస్ మరో సీన్ లో “ఇదంతా ఓ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?” అని అడిగితే “ఎవరో తనకి సహాయం చేస్తున్నారు” అంటూ బదులిస్తుంది.

ఓ పాడుబ‌డిన ఇంట్లో ఉన్న అనుష్క‌, మాధ‌వ‌న్ కొన్ని భ‌యాన‌క‌మైన విష‌యాల‌ను చూస్తార‌ని.. అస‌లు ఆ ఇంట్లో ఏముందోన‌ని పోలీసులు అన్వేష‌ణ‌తోనే సినిమా ర‌న్ అవుతుంద‌ని తెలుస్తుంది. మరో హీరోయిన్ అంజ‌లి అమెరిక‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఆమె అనుష్క‌కి ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అనుష్క మాట‌లు మాట్లాడ‌లేని, చెవులు విన‌ప‌డ‌ని బ‌ధిర అమ్మాయి సాక్షిగా ఈ సినిమాలో న‌టించింది. ఆమె త‌న సైగ‌ల‌తో అంజ‌లికి ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటుంది. అస‌లు అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎవ‌రు? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

వారి గుండెలపై వేలాడే ఖరీదైన మంగళసూత్రాలు

బాలీవుడ్ తారలు ఖరీదైన పర్సులు, బూట్లు, దుస్తులు మొదలైనవి ధరిస్తూ ప్రదర్శిస్తుంటారు. వాటి ధరతో ఒక లగ్జరీ కారు, బంగ్లా కొనుగోలు చేయవచ్చు. మరి వివాహిత నటీమణుల మంగళసూత్రాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వాటి ధర వింటే కళ్ళు తిరగడం ఖాయం. దీపికా పదుకొనే నుండి అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ వరకు ఒక సామాన్యుడు కూడా కొనలేనంత ఖరీదైన మంగళసూత్రాలు ధరిస్తున్నారు.

దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లో 2018 లో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం నిండుగా ఉండేందుకు దీపిక, రణవీర్ ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేశారు. ఈ సందర్బంగా దీపికా నలుపు బంగారు ముత్యాలు, సింగిల్ డైమండ్‌తో కూడిన మంగళసూత్రం ధరించింది. దీని ధర 20 లక్షల రూపాయలు. దీపికకు ముందు, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇటలీలో డెస్టినేషన్ వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో, అనుష్క ధరించిన మంగళసూత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ మంగళసూత్రం విలువ రూ .52 లక్షలు.

ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అప్పట్లో ఐశ్వర్య ధరించిన కంజీవరం పసుపు చీర ధర సుమారు 75 లక్షల రూపాయలు. ఐశ్వర్య ధరించిన మంగళసూత్రం ధర రూ. 45 లక్షలు. మరో నటి శిల్పి శెట్టి తన పెళ్లికి ఎంచుకున్న రెడ్ కలర్ చీర విలువ రూ .50 లక్షలు. అదే సమయంలో రాజ్ కుంద్రా ఆమెకు ఇచ్చిన ఉంగరం సుమారు 3 కోట్లు. కాజోల్, అజయ్ దేవగన్ వివాహం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మహారాష్ట్ర సంప్రదాయంలో జరిగిన ఈ వివాహంలో అజోయ్‌ 21 లక్షల రూపాయల విలువైన మంగళసూత్రాన్ని కాజోల్ కు అందించాడు. కరిష్మా కపూర్ వివాహం అయినప్పుడు విపరీతమైన చర్చ జరిగింది. అప్పట్లో కరిష్మా తనకోసం పింక్ కలర్ దుస్తులు ఎంచుకుంది. దానిపై వెండి-బంగారు దారంతో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. అప్పుడు కరిష్మా ధరించిన మంగళసూత్రంలో వజ్రంతో కూడిన లాకెట్టు వుంది. దీని ఖరీదు సుమారు 17 లక్షల రూపాయలు.

హీరోయిన్ మాధురి దీక్షిత్ ఒక సామాన్యుడిని వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె అన్నింటినీ వదిలి, అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. మాధురి వివాహం చాలా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె భర్త శ్రీరామ్ నేనే.. మాధురి దీక్షిత్ కు సుమారు 8 లక్షల రూపాయల విలువైన మంగళసూత్రం బహుకరించారు. మరోనటి సోనమ్ కపూర్‌ను ట్రెండ్ సెట్టర్‌గా పరిగణిస్తారు. ఆమె తన పెళ్ళికి ఆభరణాలు, ఇతర వస్తువులను తానే డిజైన్ చేసుకుంది. ఆమె మంగళసూత్రంలో తన, భర్త ఆనంద్ అహుజాల రాశిచక్ర చిహ్నాన్ని ఉంచింది.ఈ మంగళసూత్రం ధర 50 వేల రూపాయలు మాత్రమేనట.

Mannara Chopra Latest Photos