సుమారు 11 ఏళ్ళ తర్వాత వామపక్షాలతో పొత్తుకు సిద్దపడుతున్నది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వామపక్షాలతో కలసి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నది. 2009 ఎన్నికలలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న టిడిపి ఆ తర్వాత దూరంగా జరుగుతూ వచ్చింది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకోగా, 2014లో సొంతంగానే పోటీ చేసింది.
వామపక్షాలతో సిపిఐ పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే సిపిఏం వైఖరి ఇంకా స్పష్టం కావడం లేదు. 2019 ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలు, ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తుకు సిద్ద పడడంతో ఒంటరిగా మిగిలాయి.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేతలు కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరనాథరెడ్డి భేటీ అయి పొత్తుల గురించి సమాలోచనలు జరిపారు. కలిసి పోటీచేసే అంశంపై వారి మధ్య కొంత చర్చ జరిగింది.
ఈ నెల 8న ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమావేశం జరుగుతుందని, ఉభయులం కలిసి ఒకే వైఖరితో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని, తర్వాత మరోసారి కలుస్తామని సీపీఐ నేతలు చంద్రబాబుకు తెలిపిన్నట్లు తెలుస్తున్నది.
తొమ్మిది నెలల్లో రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు వెనక్కి నెట్టారని, ఇంత జీవన విధ్వంసం కనీవినీ ఎరుగమని ఇరు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కూల్చివేతలు, విధ్వంసాలు, కోతలు, రద్దులు, బెదిరింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు ఈ స్థాయులో ఎన్నడూ లేవని, అమరావతిని చంపేశారని.. అన్ని ప్రాజెక్టుల పనులను నిలిపివేశారని నాయకులు చెప్పారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు సంఘటితమై వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వారు పిలుపిచ్చారు.