
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు బయటకు రావడం తగ్గించారు. వాహన దారులు వారి వారి ఇండ్లకే పరిమితం కావడంతో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గిపోయింది. దీంతో చమురు డిమాండ్ మరియు ఆర్థిక వృద్ధి మందగించింది. తత్ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు రేట్లు తగ్గాయి.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు, డీజిల్ 13 పైసలు తగ్గించారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి, పెట్రోల్ ధర రూ.4 మరియు డీజిల్ ధర రూ.4.15 ఒక లీటరుకు తగ్గించబడింది.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర 75.62, డీజిల్ ధర 69.47 గా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 71.14 కాగా డీజిల్ ధర రూ.63.81. ముంబైలో లీటరు పెట్రోల్ 76.83, డీజిల్ లీటరుకు. 66.82 వద్ద విక్రయిస్తోంది. చెన్నైలో, పెట్రోల్ ధర లీటరుకు. 73.91 కాగా, డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు. 67.34 గా ఉంది. బెంగళూరులో ఇప్పుడు పెట్రోల్ రూ.73.58, డీజిల్ రూ.65.99 వద్ద అమ్ముడవుతోంది.
అయితే ఏప్రిల్ 1 నుండి ఇంధన రిటైలర్లు బిఎస్-VI ఇంధనానికి గ్రాడ్యుయేట్ అవుతున్నందు వల్ల వచ్చే నెల నుండి దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.