మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ త్వరలో తెలుగు తెరఫై అరంగేట్రం చేయబోతున్నాడు.ఉప్పెన పేరుకి తగ్గట్టు ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ అచ్చ తెలుగు చిత్రానికి సాన బుచ్చిబాబు దర్శకుడు. అతనికిది దర్శకుడిగా తొలి చిత్రం. అయినప్పటికీ ఇంకా తొలి సినిమా విడుదల కాక ముందే సాన బుచ్చిబాబు పేరు టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది. అగ్ర దర్శకుడు సుకుమార్ దగ్గర చాలా ఏళ్ల పాటు శిష్యరికం చేసిన బుచ్చిబాబు..ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు..
వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఈ చిత్రం లో నిత్యా శెట్టి అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది..ఈ సినిమా మొదలైనపుడు ఎవరికీ పెద్ద అంచనాలు లేవు. కానీ.. ఇప్పుడు మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఇందుక్కారణం మొదట్నుంచి చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్న ప్రోమోలే. ఉప్పెన అనే టైటిల్ పెట్టి దాన్ని డిజైన్ చేసిన తీరుతోనే బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు.ఆ .తర్వాత హీరో హీరోయిన్ల ప్రి లుక్ పోస్టర్లతో అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
ఈ చిత్రం యొక్క ప్రతి పోస్టర్ ప్రేక్షకులకు పాజిటివ్ ఫీల్ ఇస్తోంది. ఇక నీ కన్ను నీలి సముద్రం అంటూ తొలి పాట వచ్చాక ఉప్పెనపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ పాట ఇన్‌స్టంట్ హిట్టయింది. అందులో విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి. తాజాగా రిలీజ్ చేసిన ధక్ ధక్ ధక్ పాటలో ప్రతి షాట్, ప్రతి విజువల్ దర్శకుడి అభిరుచిని చాటుతోంది.సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ తన మొనాటనస్ ట్యూన్స్ అన్నీ పక్కన పెట్టి సహజ శబ్దాల్ని ఉపయోగించుకుంటూ ఈ పాటను ట్యూన్ చేసాడు. దానికి తోడు చక్కటి లిరిక్స్, విజువల్స్ అన్నీ తోడై ఈ పాటని ఇన్ స్టాన్ట్ హిట్ చేశాయి.
మొత్తం మీద సాన బుచ్చిబాబు ఒక ప్రేమ కావ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడని పిస్తోంది ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోల్ని చూస్తే. హీరో, హీరోయిన్ లపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం కానీ..దర్శకుడిగా తన అభిరుచిని చాటు కున్నాడు సాన బుచ్చిబాబు. ఈ ఊహాగానాలన్నిటికి తెర పడాలంటే ఏప్రిల్ 2 వ తారీకు దాకా మనం ఆగాలి.
First impression is best impression




యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈమూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ యూరప్‌లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ ఓ ఛేజింగ్ సీన్ చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశంలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉండబోతుందని సమాచారం. ఈ మూవీకి ‘రాధే’ అని టైటిల్ పరిశీలనలో ఉంది.
‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కొత్త జర్నీ ప్రారంభించింది. సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ‘పెర్ సే’ పేరుతో ఒక ఫుడ్ సెంటర్ ను ప్రారంభించింది. చెన్నైలో తన స్నేహితులతో కలిసి సలాడ్, కేఫ్ అన్నీ కలిసిన ఓ మాల్‌ను లాంచ్ చేసింది. శ్రద్ధాదాస్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.


పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించి, మొత్తం ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ఇక్కడకు తీసుకు రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల అభిమానం చూరగొనాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో మునిసిపల్ ఎన్నికలు జరపడం పట్ల వెనుకడుగు వేయడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.

మధ్యప్రదేశ్‌లో నిమిషానిమిషానికి రాజకీయం మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న తాను ప్రస్తుతం పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ట్వీటర్లో పంపారు. ఆ తర్వాత నేరుగా ఆయన ప్రధాని నివాసానికి వెళ్లడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో భారతీయ రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది. యస్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకు బోర్డును ఆర్బీఐ 30రోజులపాటు సస్పెండ్ చేసింది. విత్ డ్రాలను 50వేలకు మించి చేయరాదని ఆంక్షలు ఉండటంతో ఈ బ్యాంకులు డబ్బులు దాచుకున్న ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రయివేట్ బ్యాంక్ కావడం, వడ్డీలు ఎక్కువగా ఇస్తుండటం, మనీ దాచుకున్న వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో యస్ బ్యాంకులో ఇబ్బడిముబ్బడిగా ఖతాదారులు పెరిగిపోయారు. ఇందులో ఎక్కవుగా సెలబ్రెటీలు, ధనవంతులకు చెందిన వారి ఖాతాలే ఎక్కువగా ఉండటం విశేషం.
పార్టీ నీయమవళిని కాలదన్ని కాంగ్రెస్ తో చేతులు కలిపి మరోసారి రాజ్యసభకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశలకు సొంత పార్టీయే కళ్లెం వేసింది. అందుకు పార్టీ రాజ్యాంగం ఒప్పుకోదని, అందుకు తాము సిద్ధంగా లేమని పార్టీ అత్యున్నత మండలి అయిన పొలిట్ బ్యూరో నిర్మొహమాటంగా తేల్చి చెప్పింది.


ఇప్పటి వరకు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యూహరచన విషయంలో అమిత్ షా, ఇతర నేతలు కీలకంగా వ్యవహరిస్తూ ఉండేవారు. కానీ వరుసగా ఒకొక్క రాష్ట్రంలో ఎదురవుతున్న పరాజయాల దృష్ట్యా పశ్చిమబెంగాల్‌లో ఈ ఏడాదిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప్రచార వ్యూహన్ని రూపొందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తున్నది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన యస్ బ్యాంక్ వ్యవహారం ఏపీలో ఆర్టీసీని సహితం చిక్కులలో పడవేసింది. అధిక వడ్డీలకు ఆశపడి ఆ బ్యాంకులో దాచుకున్న రూ 240 కోట్ల మేరకు ప్రస్తుతం బ్యాంకులో నెలకొన్న సంక్షోభం కారణంగా చిక్కుకు పోవడంతో రోజువారీ ఖర్చులకు సహితం ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది.
వైసిపి ప్రజాకంటక పరిపాలనను నిరసిస్తూ రెండు వామపక్షాలు టిడిపితో కలసి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని సిపిఐ చేస్తున్న ప్రయత్నాలకు సిపిఎం మోకాలడ్డుతున్నది. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడును ఇప్పటికే సిపిఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు కలిసి సమాలోచనలు జరిపారు.
ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఒకేసారి పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించటం ఎన్నికల కమిటీకి కత్తిమీదసాములాంటిదే. అలాగే రాజకీయపార్టీలకు కూడా. జగన్ ప్రభుత్వపు ఈ 9 నెలల పనితీరుపై దీన్ని ప్రజా తీర్పుగా చెప్పొచ్చు. అలాగే ఇది గత 9 నెలల చంద్రబాబు నాయుడి రాజకీయ కార్యకలాపాలపై కూడా తీర్పే. జగన్ అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టటం వ్యూహాత్మక తప్పిదం. ఏ ప్రభుత్వానికైనా కనీసం ఒక సంవత్సరం టైమివ్వాలి. ఆ తర్వాత మాట్లాడితే జనం వింటారు. అంతేగానీ ఓడిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం తప్పిదాలను వెతకటం మొదలుపెడితే జనం హర్షించరు. ఇది జనం తరఫున మాట్లాడినట్లు ఉండదు. అక్కసు పట్టలేక మాట్లాడినట్లు వుంటుంది. కాకపోతే మీడియా అండచూసుకొని ముందుగానే రోడ్డునపడటం తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇంత హైప్ కి తీసుకెళ్లి ఎన్నికల్లో చతికల పడితే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఏమి మాట్లాడినా ప్రజల్లో విశ్వసనీయత ఉండదు. చంద్రబాబునాయుడు రాజకీయ అనుభవం ఈ మాత్రం అర్ధంచేసుకోవటానికి ఉపయోగపడలేదంటే కెసిఆర్ చెప్పినట్లు ఎక్కడో నాయకత్వ లక్షణం కొరవడిందనిపిస్తుంది. నాయకుడికి కావాల్సింది అనుచరుల ఆవేశంతో తాను నడవటం కాదు తన దూరదృష్టితో పార్టీని నడపటం. మీడియా అండతో ప్రజల అభిప్రాయాల్ని మలచటం పాత పద్దతి. ప్రజలు చాలా ముందున్నారు. ఏది రైట్ ఏది రాంగ్ వాళ్లకు వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. 21వ శతాబ్దపు ఆలోచనలను ఆకళింపు చేసుకోకుండా పాత పద్దతిలోనే రాజకీయాలు నడపటం కష్టం. మొత్తమ్మీద చూస్తే చంద్రబాబు నాయుడు వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పాలి.