మందగమనంలో సాగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ వైపు కరోనా భయాలు వెంటాడుతుండగా మొత్తం ప్రపంచం ఖంగారు పడుతుంటే, ఇదే సమయంలో చమురు ఉత్పత్తి దేశాల మధ్య నెలకొన్న తీవ్రరూపం దాల్చడంతో ఆయిల్ ధరలు బాగా తగ్గుముఖం పట్టి, వీటిని అత్యధికంగా దిగుమతి చేసుకొంటూ ఉంటె భారత్, చైనా లకు మాత్రం భారీగా ఆయిల్ బోనాజా లభించినట్లు యింది.
వచ్చే నెల నుంచి 10 మిలియన్ బ్యారల్‌కు పైగా ముడిచమురును ఉత్పత్తి చేయాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇది ఈ రెండు దేశాలకు ఎంతో ఉపయోగకరం కానున్నది. ఈ ధరల పోటీలో భారత్ సహా పలు దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సోమవారం స్టాక్ మార్కెట్ల పతనంతో ఆరున్నర లక్షల కోట్ల సంపద హరించుకపోయింది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి.
సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే పతనం దిశగా కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతానికి పైగా చమురు ధరలు పడిపోయాయి. 1990లో గల్ఫ్ యుద్ధం తర్వాత ఒకరోజులో ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం ఇదే తొలిసారి.
తమ దేశంలో చమురు ఉత్పత్తి పెంచి.. తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించాలని రియాద్ తీవ్ర ధరల పోరుకు సిద్ధమవడంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ముడి చమురు అత్యల్పంగా 31.02డాలర్ల స్థాయికి పడిపోయింది. ఓపెక్ దేశాలకు నేతృత్వం వహిస్తున్న సౌదీ అరేబియా, రష్యా దేశాలు చమురు ఉత్పత్తిపై ఒక అవగాహనకు రాలేకపోయాయి.
దీంతో ఆగ్రహించిన సౌదీ ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచి..మంచి డిస్కౌంట్లతో తక్కువ ధరకే ముడిచమురును విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిలో కోత విధించే ముందు చమురు డిమాండ్‌పై కరోనా వైరస్ పూర్తి ప్రభావాన్ని అంచనా వేయాలని తాము భావిస్తున్నట్లు రష్యా పేర్కొంది. చమురు ధర బ్యారల్‌కు 43 డాలర్ల కన్నా తగ్గితే రష్యా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


ప్రముఖ నటుడు, హీరో జగపతిరావు బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జెమినీ టీవీ నిర్వహించే ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్యహరించనున్నారు. ఈ గేమ్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోగా, విలన్ గా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన జగ్గుబాయ్ తాజాగా హోస్ట్ గా మారడం ఆసక్తికరంగా మారింది.
సాధారణం గా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో సినిమాలకు గడ్డు కాలమే అనాలి. ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సినిమాలకు వసూళ్లు తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో పిల్లలంతా పరీక్షల హడావుడిలో ఉంటారు. పెద్దలు వాళ్లను విడిచి థియేటర్లకు రారు. పైగా ఈసారి కరోనా వైరస్ ప్రభావంతో మరింతగా ఆక్యుపెన్సీ తగ్గి పోయింది. దరిమిలా ప్రేక్షకులు థియేటర్ లకు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. దాంతో థియేటర్ల మెయింటైనెన్స్‌కు సరిపడా ఖర్చులు కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలుగులో కొత్త సినిమాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దక్షిణాదిన ఇతర భాషా చిత్రాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కానీ ఇలాంటి అన్ సీజన్లో కూడా ఓ హిందీ సినిమా వసూళ్ల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. బాధితులను వేరుగా ఉంచడానికి తగిన స్థలాన్ని గుర్తించాలని, మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలుప్రాంతాలలోని ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా వున్నారు. అయితే ముంబైలో హోలిక దహన్ సందర్భంగా కరోనాసురుని దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు.హోలిక దహన్ సందర్భంగా ఈ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు.
ఆకర్షణీయమైన, మనోహరమైన రూపానికి అద్భుతమైన అభినయం తోడైతే లావణ్యా త్రిపాఠి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అందాల రాక్షసి ఆమె. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభినయానికి మంచి మంచి పాత్రలు, చిత్రాల్లో నటిస్తున్నారు. అసంబద్ధమైన చిత్రాల్లో నటించడం కంటే నిశ్శబ్దంగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడే లావణ్యా త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన పాత్రలు చేస్తున్నారు. ఆమెకు స్క్రిప్ట్ నచ్చితే… ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. వంద శాతం బెస్ట్ అవుట్ పుట్ ఇస్తారు. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా పడతారు. ఇటీవల దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక, కొన్ని బాలీవుడ్ సినిమాలను ఆమె నో చెప్పిందంట.

ముడి చమురు ఇకపై నీటి కంటే చౌకగా లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అకస్మాత్తుగా 30 శాతానికి పడిపోయింది. దింతో ముడి చమురు భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బారెల్ కు 2,200 రూపాయలకు పడిపోయింది. 1991 గల్ఫ్ యుద్ధం తరువాత ముడి చమురు ధరలో ఇది అతిపెద్ద క్షీణత. ఇది ప్రధానంగా సౌదీ అరేబియా చమురు ధరలను తగ్గించడం వలన జరిగింది. ఒక బ్యారెల్‌లో 159 లీటర్ల ముడి చమురు ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఒక లీటరు ముడి చమురు ధర సుమారు 13-14 రూపాయలుగా వుంది. ఒక లీటరు నీటి బాటిల్ కోసం కనీసం రూ .20 చెల్లించాలనేది అందరికి తెలిసిందే. కాగా కరోనా వైరస్, ఎస్ బ్యాంక్ సంక్షోభం కారణంగా, భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.
స్థానిక సంస్థల ఎన్నికల ముందు టిడిపి కి భారీ షాక్ తగిలింది. టిడిపి కి ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. టిడిపి అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మాణిక్యవరప్రసాద్ లేఖలో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో `పోలీస్ రాజ్’ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టులో చివాట్లు ఎదురయ్యాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ప్రమేయమున్న వ్యక్తుల పేర్లు, వివరాలతో కూడిన హోర్డింగ్‌లను జిల్లా అధికారులు లక్నోలోని కూడళ్లలో ఏర్పాటు చేయడంపై అలహాబాద్ హైకోర్టు మండిపడింది.


కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది . చైనా తరువాత ఇటలీలో ఈ వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. కరోనా కారణంగా భారతదేశంలో 40 మందికి పైగా రోగులు అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి ‘కరోనా కమాండో’ను సిద్ధం చేస్తోంది. వారు ఎక్కడికైనా వెళ్లి కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగికి చికిత్స అందిస్తారు. ఈ కరోనా కమాండోలకు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆసుపత్రిలో శిక్షణ ఇస్తున్నారు కరోనా వైరస్ పై పోరాటానికి కెజిఎంసి ఈ ప్రయత్నం చేసింది. కరోనా కమాండోలకు కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ పల్మనరీ విభాగంలో శిక్షణను ప్రారంభించారు.


ఎన్నడు లేని విధంగా 2020 సంక్రాంతి తెలుగు సినీ పరిశ్రమలో ఆనంద సంబరాలు తీసుకొచ్చింది . ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను సినీ పరిశ్రమ చవి చూసింది. అందులో మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకంగా, గుర్తుండి పోయేలా ఆనందానుభూతి మిగిల్చింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో తెలుగునాట బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసింది. ఏకంగా 162 కోట్లకు ఫైగా వసూళ్లను రాబడుతోంది. ఇంకా రాబడుతూనే ఉంది. అమెరికాలో అయితే 3 .65 మిలియన్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డుగా మిగిలింది. రికార్డు పరంగా యు ఎస్ ఏ లో తెలుగు చిత్రాల వసూళ్ల పరంపరలో మూడో స్థానం లో నిలిచింది. అంతటి ఆనందం మిగిల్చిన చిత్రం తరవాతి మూవీ కూడా ప్రత్యేకం గా నిలవాలని బన్నీ ప్లాన్ వేస్తున్నాడు.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రాబల్యం ఉన్న పాత నల్గొండ జిల్లాలో బలమైన పట్టు గల కోమటిరెడ్డి సోదరులు ఆ పార్టీలో కొనసాగే విషయమై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి వరకు పిసిసి అధ్యక్షుడిగా ఎవ్వరిని నీయయించినా కలసి పనిచేస్తామని చెప్పుకొంటూ వస్తున్న ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలం రెడ్డి నోటా ఇప్పుడు పార్టీ మార్పు గురించి మాట్లాడు వెలువడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవ్వరు? పలు కీలకమైన నిర్ణయాలు మంత్రులతో సంబంధం లేకుండానే అమలుకు నోచుకొంటూ ఉండడంతో ఇటువంటి అనుమానం కలుగుతున్నది. ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా వ్యవహరించే సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంత్రిత్వ శాఖలో జరిగిన తాజా నిర్ణయం ఈ సందర్భంగా వివాదాస్పదంగా మారుతున్నది.
ఆడవాళ్లు ఇంకెంతో కాలం వంటింటికి పరిమితం కావడం లేదు. ఇప్పుడు మొత్తం ఇంటి బాధ్యతల్నే తలకెత్తుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో ఇల్లాలిదే పైచేయిగా నిలుస్తున్నది. పొదుపు, కష్టార్జితాలపై వారిలో పెరిగిన అవగాహన.. ఇంటికి ఆర్థిక మంత్రులుగా చేసేసింది. పురుషులతో ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించుకుంటున్న మగువలు.. అటు సంపాదన, ఇటు పెట్టుబడుల్లోనూ దూసుకుపోతున్నారు.
