‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కొత్త జర్నీ ప్రారంభించింది. సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ‘పెర్ సే’ పేరుతో ఒక ఫుడ్ సెంటర్ ను ప్రారంభించింది. చెన్నైలో తన స్నేహితులతో కలిసి సలాడ్, కేఫ్ అన్నీ కలిసిన ఓ మాల్‌ను లాంచ్ చేసింది. శ్రద్ధాదాస్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
‘పెర్ సె’ ఫుడ్ సెంటర్ గురించి శద్ధాదాస్ మాట్లాడుతూ ‘చెన్నైలో సలాడ్ బార్, కేఫ్‌ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. ‘పెర్ సె’ రెస్టారెంట్ కంటే చిన్నది.. కేఫ్ కంటే పెద్దదని.. అందులో మంచి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయని చెప్పింది. తన జర్నీలో ఫుడ్తో మంచి అనుబంధం ఉందని పేర్కొంది. తాను క్లీన్, హెల్దీ లైఫ్ స్టైల్‌ను గడపటానికి ఇష్టపడతానని, అందుకే పెర్ సె నా హృదయానికి చాలా దగ్గరైందని ‘జెర్సీ’ భామ పేర్కొంది.
‘జెర్సీ’లో సారా క్యారెక్టర్లో శ్రద్ధాదాస్ నటించి మెప్పించింది. నాని జోడీగా ఆకట్టుకుంది. సారా పాత్రలో శ్రద్ధాదాస్ నటనకు యువత ఫిదా అయ్యారు. కన్నడకు చెందిన ఈ బ్యూటీ కన్నడంతోపాటు తెలుగు, తమిళంలో బీజీగా స్టార్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, తమిళంలో విశాల్ ‘చక్ర’లోనూ నటిస్తుంది. కొత్త వ్యాపారం షూరు చేసిన శ్రద్ధాదాస్ కు అభిమానులు బెస్ట్ విషెష్ చెబుతున్నారు.