https://www.instagram.com/p/B9imwRwDYEI/
కరోనా భయం వలన హోలీ హంగామా కాస్త తగ్గినప్పటికీ, కొన్ని చోట్ల మాత్రం ఈ వేడుకలు ఘనంగానే జరుగుతున్నాయి. కొందరు నిన్న హోలీని జరుపుకోగా, మరి కొందరు నేడు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు… హోలీ శుభాకాంక్షలు చెబుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హోలీ వేడుక జరుపుకున్నాడు. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అందరికీ హోలీ విషెస్ తెలిపారు తారక్. ఫ్యామిలీ సభ్యులు అందరు ఇలా ఒకే ఫ్రేములో కనిపించడం చూసిన ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.