పార్టీ నీయమవళిని కాలదన్ని కాంగ్రెస్ తో చేతులు కలిపి మరోసారి రాజ్యసభకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశలకు సొంత పార్టీయే కళ్లెం వేసింది. అందుకు పార్టీ రాజ్యాంగం ఒప్పుకోదని, అందుకు తాము సిద్ధంగా లేమని పార్టీ అత్యున్నత మండలి అయిన పొలిట్ బ్యూరో నిర్మొహమాటంగా తేల్చి చెప్పింది.
సొంతంగా పార్టీకి బలం లేక పోయినా పశ్చిమ బెంగాల్ నుండి ఆయనను రాజ్యసభకు పంపాలని పార్టీలో ఒక వర్గం చేసిన ప్రయత్నాలకు ఫిబ్రవరి 6 న జరిగిన పార్టీ అత్యున్నత విధాయక నిర్ణయాత్మక మండలి అయిన పొలిట్ బ్యూరో తిప్పి కొట్టింది. కేరళ వర్గం నేతలు డామినేట్ చేస్తున్న పొలిట్ బ్యూరో ఏచూరికి నామినేట్‌ను ఒప్పుకోలేదు.
ఈ సందర్భంగా రెండు అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. మొదటగా ఇప్పటి వరకు పార్టీలో రెండు సార్లకు మించి ఎవ్వైర్ని రాజ్యసభకు పంపలేదు. ఇప్పటికే రెండు సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అదీ గాక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారెవ్వరు ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యత్వం పొందలేదు. ఈ నిబంధనలను తోసిరాజేసి రాజ్యసభకు వెళ్లాలన్న ఆయన ప్ప్రయత్నం సాగిన్నట్లు లేదు.
మరోవంక పార్టీకి సొంతంగా బలం లేని పశ్చిమ బెంగాల్ నుండి
కాంగ్రెస్ మద్దతుతో రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాన్ని పార్టీ తప్పుబట్టింది. విరుద్ధ భావజాలమున్న పార్టీల మద్దతును తీసుకోవడం ఏమాత్రం సరికాదని హెచ్చరించింది.
అటు తృణమూల్‌ను, బీజేపీని రాజ్యసభలో తట్టుకోవాలంటే ఏచూరీని మూడోసారి కూడా రాజ్యసభకు నామినేట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ లో ఒక వర్గం కూడా తీవ్రంగా ప్రయత్నం చేయడం గమనార్హం. గతంలో ఒక సారి కూడా కాంగ్రెస్ ఈ విషయమై తీవ్ర ప్రయత్నం చేసినా, పార్టీ నాయకత్వం ఒప్పుకోక పోవడం గమనార్హం.