స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పక్షపు హింసాయుత దాడులు మితిమీరిపోతున్నాయి. బుధవారం ఇద్దరు టిడిపి నేతలపై మాచర్లలో వైసిపి కార్యకర్తలు దారుణంగా దాడి చేశారు. తమపై హత్యాయత్నం జరిపారని టిడిపి నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలు ఆరోపించారు.
వారు ప్రయాణం చేస్తున్న కార్లపై మారణాయుధాలతో దాడి జరిపి, అద్దాలు పగులగొట్టి, వారిని బైటకు లాగి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక్క చోటనే కాకుండా వారు ఎక్కడికి వెడితే అక్కడకు వెంటాడి దాడి జరిపారు. కనీసం నాలుగు చోట్ల దాడులు జరిపారు. ఇంతలో మాచర్ల డిఎస్పీ వారిని ఇతర మార్గాల ద్వారా ఆ ప్రాంతం నుండి పంపివేశారు. డ్రైవర్ అప్రమత్తంగా ఉంటూ, జనం నుండి తప్పించుకొంటూ తమను తీసుకు వెళ్లడం వల్లననే తామిద్దరం బతికి బైట పడ్డామని బోండా ఉమా చెప్పారు.
మంగళవారం టిడిపి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా దాడులు జరపడంతో, ఫిర్యాదు చేయడానికి ముందు రోజు రాత్రి మాచర్ల పోలీసులకు ఫోన్ చేసి వెడితే, పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే తమను కారంపూడి నుండి వెంటాడుతూ దాడికి పాల్పడరని బోండా ఉమా విమర్శించారు. తమను ముక్కలు, ముక్కలుగా నరకడం కోసం విఫలయత్నం చేసారని ఆరోపించారు. తాము వస్తున్నట్లు పోలీసులకు తప్ప మరెవ్వరికీ తెలియదని, అలాంటప్పుడు ఏ విధంగా పధకం ప్రకారం తమను వెంబడించి, దాడులు జరిపారని ప్రశ్నించారు.
వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మాచర్లలో బోండా ఉమ కారుపై దాడులకు తెగబడ్డారనిమండిపడ్డారు. మనుషులు ఉన్నా కారుపై దాడి చేశారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాచర్లలో బోండా ఉమ కారుపై దాడులకు తెగబడ్డారన్నారు. మనుషులు ఉన్నా కారుపై దాడి చేశారని పేర్కొన్నారు.
మాచర్ల ఘటనపై డీజీపీ, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు. శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల్లో ఓ వర్గం అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తోందని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది బలవంతుడిదే రాజ్యం అన్న చందాలు అయింది ప్రతిపక్ష నేతల పై అధికార పార్టీకి చెందిన వారు దాడులకు తెగబడుతున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్షాలకు చెందిన వారు నామినేషన్లు వేయడానికి భయపడుతున్నారు నామినేషన్లు వేసే వారిపై కూడా దాడులు చేస్తున్నట్లు ప్రసారమాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ బీహార్ రాష్ట్రాన్ని మించిపోయిందని ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాగా, అనంతపూర్ జిల్లా బత్తులపల్లి మండలం ఓబులాపురంలో వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డాయి. టీడీపీ అభ్యర్థి చెన్నకేశవులుపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. చిన్నమండెంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని వైసీపీ అడ్డుకుంది. టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను వైసీపీ వర్గీయులు చించివేశారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు మండలం పడకండ్లలో టీడీపీ అభ్యర్థిని వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేశారు. టీడీపీ అభ్యర్థి రాజేశ్వరిని నామినేషన్ వేయనీకుండా ప్రయత్నాలు చేశారు. గుట్కా అమ్ముతున్నారన్న అనుమానంతో రాజేశ్వరి కుమారుడిని అరెస్ట్ చేశారు.


మాజీ మంత్రి వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దానితో సిబిఐ దర్యాప్తు జరుగకుండా తీవ్రంగా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిన్నట్లు అయింది. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
కాంగ్రెస్ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం, వెంటనే ఆయనకు మధ్యప్రదేశ్ నుండి పార్టీ రాజ్యసభ సీట్ కేటాయించడం బుధవారం చకచకా జరిగిపోయాయి. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా సమక్షంలో సింధియా పార్టీలో చేరారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అలవైకుంఠపురములో’ బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డును ‘అలవైకుంఠపురములో’ నమోదు చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ వచ్చిన ‘అలవైకుంఠపురములో’ బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ హిట్టుతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ తో వరుస మూవీలను చేస్తున్నాడు. అల్లు అర్జున్ తాజా ‘ఆహా’ కోసం ఓ యాడ్ చేయబోతున్నాడు. ఇందులో బన్నీకి జోడీగా ‘రొమాంటిక్’ భామ కేతికాశర్మ నటిస్తోంది.

మాస్ మహారాజా రవితేజకి సినిమా రంగంలో ఆదరణ ఇంకా తగ్గలేదు. రవితేజ నటించిన సినిమాలకు ఇంకా మంచి మార్కెట్ వస్తూనే ఉంది. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే….ప్లాప్ సినిమాకి కూడా బయ్యర్స్ కొన్నదానికి 10 శాతం వరకూ లాభాలు వచ్చేవి. అదే హిట్ టాక్ వస్తే ఆ లాభం 25 శాతం పైనే ఉండేది. అందుకే రవితేజను మినిమం గ్యారంటీ హీరో అనే వారు అయితే ఆ తరువాత వరుస హిట్లు రావడం తో పాటు … మార్కెట్ కూడా పెరగడంతో రెమ్యూనరేషన్ పెంచేసాడు.
దర్శకుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ‘బహుబలి’ సిరీస్ లతో రాజమౌళి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ నెలకొంది. భారీ తారాగాణంతో, భారీ బడ్జెట్ తో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగు సినిమాల్లో ట్రైన్ ఫైట్ కి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాల వరకు ట్రైన్ ఫైట్ ఉన్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. 50 ఏళ్ళక్రితం వచ్చిన అదృష్టవంతులు సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం దాకా ట్రైన్ ఫైట్ ఉన్న సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఒక సినిమాలో ట్రైన్ ఫైట్ పెడుతున్నారు.
చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా 3వేలకుపైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా దేశాల ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బ్రిటన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహాపై ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాలో నటించిన వారందరికీ ఏదో రకమైన గుర్తింపు వస్తుంది. ఇతర చిత్రాల్లో అవకాశాలు బాగానే వస్తాయి. అలా ఒక తమిళ అమ్మాయికి తెలుగు సినిమాల్లో అవకాశాలు వెతుక్కొంటూ వస్తున్నాయి.
రాజకీయ రంగం లో పూర్తి సమయం కేటాయించాలి అనుకొన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అనివార్య పరిస్థితుల్లో సినిమా రంగానికి వచ్చాడు. వచ్చిందే తడవుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్ వేగంతో సినిమాలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక సినిమా కోసం కనీసం ఆరేడు నెలలు వెచ్చించే పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మాత్రం చాలా తక్కువ సమయం లో కంప్లీట్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే 80 శాతం టాకీ పార్ట్, ఫైట్స్ పూర్తి చేయడం జరిగింది. ఇక మిగిలిందల్లా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఒక ఫైట్ మాత్రమే. ఈ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్లో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుందని వార్తలు వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ శృతి హాసన్ నటించడం కుదరక పొతే మరో హీరోయిన్ ఇలియానా ని ప్రత్యామ్నాయం గా అనుకొంటున్నారు.సినీ యూనిట్ ….
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి పాకింది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది.

చైనాలో పుట్టిక కరోనా వైరస్ ప్రపంచంలోని 115 దేశాల్లో విస్తరించగా 4,300 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య లక్షా 18వేలకు చేరింది. ఈయూ దేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంపై ఇటలీలో జన సంచారంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటలీలో ఎవరైన ఆంక్షలను ఉల్లంఘిస్తే శిక్ష వేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో సమర్ధమైన పోలీసు యంత్రాంగం ఉందని.. ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించామని ఎన్నికల కమిషనర్ రమేశ్ వెల్లడించారు. ఎవరైనా నామినేషన్‌ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈమూవీలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ యూరప్‌లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ ఓ ఛేజింగ్ సీన్ చేసినట్లు సమాచారం. తాజా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.