చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా 3వేలకుపైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా దేశాల ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బ్రిటన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహాపై ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ ఒక ప్రకటన విడుదల చేశారు.
యూకేలో 380కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి ఆరుగురు చనిపోయినట్లు సమాచారం. కరోనా సోకిన మంత్రి డోరీస్ గతంలో స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్ పార్లమెంటరీ అండర్ సెక్రటరీగాను పనిచేశారు. అయితే యూకేలో కరోనా సోకిన తొలి ప్రజాప్రతినిధిగా డోరీస్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా డోరిస్ మాట్లాడుతూ కరోనాపై తాను చేయించుకున్న పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని చెప్పింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే స్వయం ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తాజాగా ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. కేరళలోలో 30కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం ఇప్పటికే ప్రత్యేకంగా 100కోట్లు కేటాయించింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో రవాణా వ్యవస్థ పూర్తి స్తంభించిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.