రాజకీయ రంగం లో పూర్తి సమయం కేటాయించాలి అనుకొన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అనివార్య పరిస్థితుల్లో సినిమా రంగానికి వచ్చాడు. వచ్చిందే తడవుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్ వేగంతో సినిమాలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక సినిమా కోసం కనీసం ఆరేడు నెలలు వెచ్చించే పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మాత్రం చాలా తక్కువ సమయం లో కంప్లీట్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే 80 శాతం టాకీ పార్ట్, ఫైట్స్ పూర్తి చేయడం జరిగింది. ఇక మిగిలిందల్లా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఒక ఫైట్ మాత్రమే. ఈ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్లో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుందని వార్తలు వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ శృతి హాసన్ నటించడం కుదరక పొతే మరో హీరోయిన్ ఇలియానా ని ప్రత్యామ్నాయం గా అనుకొంటున్నారు.సినీ యూనిట్ ….
ఒకసారి హీరోయిన్ ఎవరనేది ఖరారైతే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు బాలన్స్ ఉన్న చివరి ఫైట్ ఒకే షెడ్యూల్లో ఫినిష్ చేస్తారని తెలుస్తోంది..ఏతా వాతా పవన్ కళ్యాణ్ రెండు నెలల్లోనే సినిమా కంప్లీట్ చేయనున్నాడు. ప్రస్తుతం క్రిష్ చిత్రం షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ చిత్రాన్ని కూడా ‘వకీల్ సాబ్’ తరహాలోనే వేగంగా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. .ఈ స్పీడ్ చూస్తే 2020 లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు గ్యారంటీగా విడుదలయ్యేలా ఉన్నాయి. ఆ లెక్కన వచ్చే ఎలక్షన్స్ లోపు పవన్ కళ్యాణ్ ఏడు లేదా ఎనిమిది సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నాడు.
Early bird catch the warms
https://www.youtube.com/watch?v=FShKzhs1NdI