దర్శకుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ‘బహుబలి’ సిరీస్ లతో రాజమౌళి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ నెలకొంది. భారీ తారాగాణంతో, భారీ బడ్జెట్ తో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ తోనే రానా త్వరలో మనముందుకు రాబోతున్నారు. తేజ దర్శకత్వంలో రానా ‘ఆర్ఆర్ఆర్’(రాక్షస రాజ్యంలో రావణసూరుడు’ మూవీలో నటించనున్నాడు. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’లో రానా పాత్ర నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముగ్గురు భామలతో రానా రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానాకు జోడీగా నటించిన కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ ఒక హీరోయిన్ కాగా, మరో ఇద్దరు హీరోయిన్స్ ఎవరనేది తెలియాల్సి ఉందని అంటున్నారు.
‘ప్రస్తుతం రానా ప్రస్తుతం ‘అరణ్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్, పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘అరణ్య’లో రానా మావాటివాడిగా నటుస్తున్నాడు. ఈ మూవీతోపాటు ‘విరాటపర్వం’ మూవీ చేస్తున్నారు. కాగా ‘అరణ్య’ మూవీ వచ్చే నెలలో విడుదల చేసేందుకు చిత్రబృందం రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తుంది.