అదరగొడుతున్న రామ్ ‘రెడ్’ బిజినెస్
పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో రామ్ మార్కెట్ అగ్రహీరోల రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ ‘రెడ్’ మూవీ చేస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘రెడ్’ వస్తుండటంతో ఈ మూవీ విడుదలకు ముందే అదిరిపోయే బిజినెస్ చేస్తుంది.
ఆంధ్రలో ‘రెడ్’ మూవీ థియేటర్ రైట్స్ రూ.11 కోట్లకు అమ్ముడుపోగా, సీడెడ్‌లో రూ.4 కోట్లకు కొన్నారని సమాచారం. దర్శకుడు కిశోర్‌తో రామ్ చేసిన ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలతోపాటు ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్లు ‘రెడ్’ బిజినెస్ కు దోహదపడ్డాయి. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్లో ‘స్రవంతి’ రవికిషోర్ ‘రెడ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. హెబ్బా పటేల్ ఓ ఐటమ్ సాంగ్లో నటిస్తుంది. ఇటీవలే ఇటలీలోని అందమైన లోకేషన్లలో పాటలను చిత్రీకరించారు. మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు. ఏప్రిల్ 9న సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. రిలీజ్ కు ముందే అదిరిపోయే బిజినెస్ చేసిన ‘రెడ్’ రిలీజ్ అయ్యాక ఈమేరకు కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాల్సిందే.
రజనీకాంత్ పార్టీపై వీడిన ఉత్కంఠ!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీని గూర్చి క్లారిటీ ఇచ్చారు. ప్రజా సంఘం రాష్ట్రవ్యాప్త కార్యదర్శులతో భేటీ అయిన తర్వాత రజనీ రాజకీయ జీవితం గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే తాను ఓ రాజకీయ పార్టీని ప్రకటిస్తానన్నారు. అయితే తన పార్టీలో మాత్రం యువతకే ప్రాధాన్యత ఇస్తూ.. అన్ని పార్టీలకంటే కొంచం భిన్నంగా తన పార్టీ ఉంటుందని రజిని అన్నారు. తాను కేవలం పార్టీ అధినేతగా మాత్రమే ఉంటానని, చదువు, విజ్ఞానవంతుడైన వ్యక్తినే సీఎంను చేస్తానన్నారు. తనపై వచ్చిన ఊహాగానాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
జయలలిత, కరుణానిధి మరణాల తర్వాత తమిళ రాజకీయాల్లో అస్థిరత ఏర్పడిందని రజనీ అన్నారు. రాజకీయాల్లోకి యువరక్తం రావాలన్నారు. పార్టీ, ప్రభుత్వంపై ఒకే వ్యక్తి పెత్తనం ఉండకూడదన్నారు సూపర్ స్టార్. ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండకూడదన్నారు. రాష్ట్రానికి సీఎం కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, సీఎం పదవిపై తనకు వ్యామోహం కూడా లేదన్నారు. ప్రజల్లో మార్పు రానప్పుడు తాను వచ్చి కూడా ఏం చేయలేనన్నారు.
ఈయన రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా చెప్పి రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయన అభిమానుల హడావుడి మినహా రాజకీయ పార్టీని ప్రకటించిందిలేదు. రజనీకాంత్ కంటే కాస్త వెనుక తానూ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన కమలహాసన్ పార్టీని నెలకొల్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేయించారు. ఆశాజనకమైన ఓట్లను సంపాదించుకున్నారు. నటుడు రజనీకాంత్ మాత్రం ఇప్పటికీ పార్టీని ప్రకటించలేదు. అయితే తాజాగా ఆయన రాజకీయపరంగా వేగాన్ని పెంచారని చెప్పాలి. దీంతో రాజకీయ వర్గాల్లోనూ కదలిక వచ్చింది. త్వరలోనే రజనీకాంత్ చేసే ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూశారు.
సీక్వెల్ అయినా గట్టెక్కిస్తుందా
1999 లో రవితేజ నటించిన నీ కోసం చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన శ్రీను వైట్ల తన కెరీర్ లో ఇప్పటివరకు 17 సినిమాలు తీస్తే వాటిలో ఏడు సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయినప్పటికీ శ్రీను వైట్ల టాప్ హీరోల ఛాయిస్ గా ఉండే వాడు. ఐతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విజయాల పరంగా ఆయన కొంచెం వెనుకబడ్డాడు. .దీనితో ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి.సినిమాలు ఇచ్చేవాళ్లే కరువయ్యారు.దీనిక్కారణం మహేష్ తో ఆగడు సినిమా తో పాటు ఆ తరవాత చేసిన మరో మూడు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు. దాంతో పడిపోయిన తన కెరీర్ గ్రాఫ్ సరిదిద్దుకోవడానికి తన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ తో ఫామ్ లోకి రావాలని అనుకొంటున్నాడు.
మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా, శ్రీహరి ప్రధాన పాత్రలో శ్రీను వైట్ల దర్శకత్వంలో 2007లో వచ్చిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఢీ’ చిత్రం అప్పట్లో మంచి విజయాన్నిసాధించింది. బ్రహ్మానందం తో కలిసి మంచు విష్ణు చేసిన కామెడీ “డీ” సినిమాలో హైలెట్ గా నిలిచింది. దాంతో స్పీనేమాకి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలో రానుంది. శ్రీను వైట్ల ఢీ 2 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఇప్పటికే బిజీగా ఉన్నాడు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు సైతం ధృవీకరించారు.
Sequels are safe bets
‘వి’వాదాల మధ్య నాని సినిమా..
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఊహించని సంక్షోభంలో ఉంది. దాంతో విడుదల కాబోయే సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇపుడు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘వి’. కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది .హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ “వి” చిత్రంలో మహేష్ బాబు బావ సుధీర్ బాబు మెయిన్ హీరోకాగా… ప్రతినాయకుడి పాత్ర లో నాని కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమా పై అంచనాల్ని బాగానే పెంచేసాయి. ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కూడా ఉందని వార్తలొస్తున్నాయి..
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఇప్పుడు సినిమాలకు అన్ సీజన్.దానికి తోడు 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయి. అంతేకాకుండా స్థానిక ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి.. ఇవి సరిపోవు అన్నట్టు… కరోనా వైరస్ భయం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. దరిమిలా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత దిల్ రాజుకి ఫోన్ చేసి ‘వి’ చిత్రన్ని వాయిదా వేయమని కోరారట..ఒక పక్క సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి.అందువల్ల ఈ చిత్ర వాయిదాకు పలు ఇబ్బందులున్నాయి. అదలావుంటే ఈ చిత్రం కంటెంట్ పై నాకు బలమైన నమ్మకం.. కచ్చితంగా ప్రేక్షకుల్ని థియేటర్ కు రప్పిస్తుంది’ అంటూ నాని ధీమాగా చెబుతున్నాడట. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు.. నాని మాటలతో ఏకీభవించలేకపోతున్నాడని తెలుస్తోంది..
Sometimes fate decides things
అడుగంటుతున్న ఆయిల్ ధర..!

మునుపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి తగ్గుతున్నాయి. అందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీ స్థాయిలో తగ్గడమే. రానున్న వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 నుంచి రూ.6 వరకూ తగ్గొచ్చు. వీటికంటే.. ఇంకా తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదని కొంతమంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
అయితే ఈ విషయంలో భారత్ లో ఆయిల్ ధరలు తగ్గాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి, ఎందుకంటే.. డిమాండ్ కు తగ్గట్లు పెట్రోల్.. ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ దేశాల చర్చలు ఫలించలేదు. దీంతో సౌదీ ఆరామ్ కో మార్కెట్లకు భారీగా చమురును విడుదల చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు 30 శాతానికిపైగా తగ్గాయి. దీంతో.. బ్యారెల్ ముడిచమురు ధర 35 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. అయితే మన దేశానికి వచ్చేసరికి.. చమురు ఉత్పత్తుల ధరలు 15 రోజల తర్వాత సవరిస్తారు. అందుకే.. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గిన వెంటనే.. ఆ ప్రభావం ఉండటం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఎక్సైజ్ సుంకాలు పెంచి తమ ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించొచ్చు. ఒకవేళ సుంకాలు పెంచితే మాత్రం పెట్రోలియం ఉత్పత్తులపై వినియోగదారులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హమ్మయ్య… చికెన్ ప్లేస్ లో ఇది తింటే మంచిదా..!

గత కొంతకాలంగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వైరస్ ఏ జీవి నుండి ఉద్భవించిందో శాస్త్రవేత్తలుస్పష్టంగా చెప్పకపోవడంతో ప్రజలలో అనేక వదంతలు పుట్టుకొచ్చాయి. అందులో ముఖ్యంగా నాన్ వెజ్ తింటే కరోనా రావొచ్చు అనే వార్త వల్ల భారత్ లో పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. హైదరాబాద్ లో కేజీ చికెన్ ధర రూ.25 పలికిందంటే.. ప్రజలలో ఆ చికెన్, మటన్ భయం ఎంత మోతాదులో ఉందో అర్థంచేసుకోవచ్చు.
కరోనా దెబ్బతో చికెన్, మటన్ అమ్మకాలు చాలా వరకు తగ్గాయి. అయితే చికెన్, మటన్ బదులు ఏంతినాలి అని ప్రజలు వాటికి ప్రత్యామ్యాయాన్ని వెతుకుతున్నారు. అందులో భాగంగా చాలామంది చికెన్, మటన్ లకు బదులు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని చెబుతున్నారు. దాంతో ఒక్కసారిగా పనస పండుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా పనస పండుకు కిలో రూ.50 ఉండేది, కానీ ఇప్పడు ఒక్కసారిగా అమాంతం కిలో రూ. 120కి చేరింది. అదే చికెన్ ధర కిలో రూ. 50 లోపే ఉంది.
పనస పండు తినడం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. చర్మాన్ని ముడతలు పడుకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును పెంచడంతోపాటు.. మంచి జుట్టును కూడా ఇస్తుంది. అంతేకాకుండా.. జీర్ణశక్తిని పెంచడానికి కూడా పనస బాగా పనిచేస్తుంది.
కరోనా వైరస్ చికెన్, మటన్ లేదా చేపల వినియోగం వల్ల వ్యాప్తి చెందదని వైద్యులు, పోషకాహార నిపుణులు పదేపదే చెప్తున్నా కూడా ప్రజలు తమ అనుమానాన్ని వదలడం లేదు. త్వరలోనే ప్రజలలో ఈ విషయంపై అవగాహన వస్తుందని డాక్టర్లు అభిప్రాయపడతున్నారు.
బండి సంజయ్ ఎంపికలో కిషన్ రెడ్డి ఎత్తుగడ!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక అంశాన్ని రెండు నెలలకు పైగా తేల్చకుండా చివరకు కరీంగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను ఎంపిక చేశారు. కేవలం కరీంగర్ నగరంకే పరిమితంగా రాజకీయ కార్యకలాపాలకు పరిమితమైన సంజయ్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ చతికల పడడంతో, కేసీఆర్ కు బంధువైన అప్పటి ఎంపీ వినోద్ కుమార్ ను ఓడించడం కోసం టి ఆర్ ఎస్ వ్యతిరేకులు అందరు ఒక్కటి కావడంతో అనూహ్యంగా ఎంపీగా ఎన్నిక కాగలిగారు.
ఎంపీగా ఉండి ఆ జిల్లాల్లో ఒక మునిసిపాలిటీల్లో గాని, మండలంలో గాని పార్టీని గెలుపించలేక పోయారు. మొన్నటి మునిసిపల్ ఎన్నికలలో కరీంగర్ లో గట్టి పోటీ ఇచ్చినా తగిన ఆర్ధిక వనరులను సమీకరించడంలో వెనుకబడ్డారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, నిజాయతీగా వ్యవహరించే పేరున్నప్పటికీ ఒక విధంగా `బలహీన’మైన నేతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎత్తుగడ ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
బలమైన రాజకీయ వారసత్వం గల డీకే అరుణ, పుష్కలంగా వనరులు గల జితేందర్‌రెడ్డి వంటి వారు ఈ పదవికి పోటీ పడినా వారిని కాదని బండి సంజయ్ ను ఎంపిక చేయడం భవిష్యత్ లో రాజకీయంగా తనకు పోటీగా మారే వారెవ్వరూ రాకుండా కిషన్ రెడ్డి జాగ్రత్త పడటమే కారణం అని తెలుస్తున్నది. ముఖ్యంగా తన సామాజిక వర్గంలో మరొకరు బలమైన నాయకుడిగా ఎదగడాన్ని ఆయన సహించలేరు.
కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా `సహాయ నిరాకరణ’ ధోరణి అవలంభించడం, చివరకు ప్రెస్ మీట్ లు పెట్టుకోవడానికి కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అనుమతులు ఇవ్వక పోవడంతో మాజీ టిడిపి మంత్రి నాగం జనార్ధనరెడ్డి అవమాన భారంతో పార్టీ నుండి వైదొలిగి, తర్వాత కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే.
తెలంగాణలో బిజెపి రాజకీయాలు ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నాయకుల చేతులలోనే నలుగుతూ వస్తున్నాయి. వారంతా ఎక్కువగా మీడియా ముందుకు రావడానికి తప్పా ప్రజలలోకి వెళ్లడం పట్ల ఆసక్తి చూపేవారు కాదు. జిల్లాల్లో మొక్కుబడిగా మాత్రమే పర్యటనలు జరుపుతూ వచ్చారు. గాలిలో గెలుస్తూ రావడం మినహా సొంత బలంపై ఎన్నికలలో గెలుపొందే సమర్ధం వారెవ్వరికి లేదు.
పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి సొంతంగా రెండు సార్లు గెలుస్తూ వస్తున్న ఏకైక ఎమ్యెల్యే రాజా సింగ్ ను ఒక విధంగా మిగిలిన నాయకులు అందరు `ఏకాకి’గా చేస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికలలో ఆయనకు సీట్ ఇవ్వరాదని పట్టుబడితే, స్వయంగా అమిత్ షా జోక్యం చేసుకొని ఇచ్చారు. సీట్ ఇచ్చినా ఆయన నియోజకవర్గంలో ఎవ్వరు ప్రచారంకు వెళ్లకుండా కట్టడి చేశారు.
జితేందర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఆయన పార్టీ పార్లమెంటు పక్షనేతగా పని చేసినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర మంత్రులు, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి పార్టీ నాయకులతో ఆయన పరిచయాలు మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. వాజపేయి హయాంలో బిజెపి ఎంపీగా ఉన్నారు. అందుకనే అటువంటి నేతకు పార్టీ నాయకత్వం అప్పజెబితే తనకు ప్రాధాన్యత తగ్గుతుందని కిషన్ రెడ్డి అడ్డు పడిన్నట్లు చెబుతున్నారు.
అదే విధంగా సుదీర్ఘ రాజకీయ నేపధ్యం గల డీకే అరుణకు తెలంగాణ అంతటా పరిచయాలు ఉన్నాయి. ఆమెకు నాయకత్వం అప్పచెప్పినా తానెక్కడ `జీరో’ అవుననే భావనతో `ఇద్దరం ఒకే సామజిక వర్గం’కు చెందిన వారం అవుతామంటూ అడ్డుపుల్ల వేశారని తెలుస్తున్నది.
వాస్తవానికి ప్రస్తుత అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ నే కొనసాగించాలని కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే ఆయన సారధ్యంలో తిరోగమనంలో పడటం, ఆయన పనితీరుపై అనేక విమర్శలు రావడంతో పార్టీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయక పోవడంతో, గత్యంతరం లేక ఆర్ ఎస్ ఎస్ సూచించిన సంజయ్ వైపు కిషన్ రెడ్డి మొగ్గిన్నట్లు కనిపిస్తున్నది.
వైసీపీ వైపు కరణం బలరాం!
తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా భావించే పార్టీ శాసనసభ్యులు కారణం బలరామకృష్ణ మూర్తి సహితం అధికార పక్షం వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గత కొద్దీ రోజులుగా వరుసగా పలువురు టిడిపి ప్రముఖ నాయకులు వైసిపిలో చేరుతూ ఉండడం తెలిసిందే.
అయితే ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడిగా పేరొందిన బలరాం అధికార పక్షంలో చేరే ఆలోచనలలో ఉండటం ప్రధాన ప్రతిపక్షంలో లజడి రేపుతున్నది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను టిడిపిలో చేర్చుకున్నప్పటి నుండి బలరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అద్దంకి నుండి కాకుండా చీరాల నుండి పోటీ చేయవలసి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
చీరాల నుండి గెలుపొందినప్పటికీ అంత సంతోషంగా ఉన్నట్లు కనబడటం లేదు. పార్టీ కార్యకలాపాలలో సహితం ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ఆయన లోని అసంతృప్తిని గ్రహించిన ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైసిపి నేతలైన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారు.
దానితో ఒకటి, రెండు రోజులల్లో వారిద్దాము ముఖ్యమంత్రి జగన్‌తో ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సహితం వైసిపిలో చేరడం గమనార్హం.
నాలుగు సార్లు ఎమ్యెల్యేగా, ఒక సారి లోక్‌సభకు బలరాం ఎన్నికయ్యారు. చీరాల నుండి టిడిపికి చెందిన ఎమ్మెల్సీ ఉన్న పోతుల సునీత ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జగన్ కు సవాల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు!
అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక విధంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు సవాల్ గా మారే అవకాశం ఉంది. గత ఏడాది అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఆయన పట్ల ప్రజలలో వచ్చిన మార్పుకు ఈ ఎన్నికలు సంకేతం కాగలవు. ముఖ్యంగా ఆయన పరిపాలనకు ఒక పరీక్షగా మారనున్నాయి.
అయన ప్రభుత్వం తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటు పడటం, పోలవరం వంటి ప్రాజెక్ట్ లు ఆగిపోవడం వంటి అంశాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయని ఆసక్తి నెలకొంటుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ ఒక విధంగా నిస్సహాయ స్థితిలో, ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించక పోయినా అధికార పక్షం వైఫల్యాలే తమకు వరంగా మారగలవాని ఆశతో ఉన్నారు.
పలు జిల్లాల్లో ప్రతిపక్షాలకు చెందిన వారు నామినేషన్లు కూడా వేయడకుండా అడ్డుకొంటు అధికార పక్షానికి చెందిన వారు దౌర్జన్యాలకు దిగడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం గమనిస్తే అధికార పక్ష నేతలలో అసహనం వెల్లడి అవుతున్నది. ఫలితాలు సానుకూలంగా లేని పక్షంలో తామే బాధ్యత వహింపవలసి ఉంటుందని మంత్రులు, ఎమ్యెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది.
ముఖ్యంగా జిల్లాల్లో ఎమ్యెల్యేలు, మంత్రులు, పార్టీలో తొలి నుండి ఉన్న నాయకులు, అధికారమలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన నాయకుల మధ్య సయోధ్య లోపించడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నది. అందుకనే ఎన్నికల ఫలితాలకు మంత్రులే బాధ్యులని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫలితాలు నిరాశాజనకంగా ఉంటె ఆయా మంత్రులు నేరుగా రాజీనామా చేయాలని జగన్ స్పష్టం చేశారు. ఆయన మాటలలోనే పార్టీలో నెలకొన్న పరిస్థితులు వెల్లడి అవుతున్నాయి.
స్థానిక సంస్థలలో స్థానికంగా గల వర్గ రాజకీయాలు ప్రాబల్యం వహించే అవకాశం ఉన్నందున అధికార పక్షంలో నెలకొన్న వర్గాల ప్రభావం ఫలితాలపై ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉంటె వాటి ఫలితం జగన్ నాయకత్వం పైననే పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా కేంద్రంతో సంబంధాల విషయంలో, స్వయంగా సిబిఐ కోర్ట్ లో ఎదుర్కొంటున్న అవినీతి కేసులకు సంబంధించి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ ఎన్నికలు ప్రభుత్వ సుస్థిరతకు కీలకంగా మారే అవకాశం ఉంది.
మంత్రులలో ఐదారుమంది తప్ప తమ తమ జిల్లాల్లోని రాజకీయాలపై అదుపు ఉన్న వారు కాకపోవడం ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పక్షంకే పరిష్టితులు సానుకూలంగా ఉంటూ ఉంటాయి. అటువంటి సానుకూలతను ఏ మేరకు రాజకీయంగా ప్రయోజనకరంగా మార్చుకుంటారో అని చూడవలసి ఉంది.
తొలి షెడ్యూల్ పూర్తి చేసిన వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’గా నటించి బాక్సాఫీస్ విజయాన్ని దక్కించుకున్నాడు. అదేవిధంగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్-2’లో విక్టరీ వెంకటేష్ తో మల్టిస్టారర్ మూవీలో వరుణ్ తేజ్ నటించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తాజాగా కొర్రపాటి కిరణ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు.
ఈ మూవీలో బాక్సర్ కనిపించేందుకు వరుణ్ తేజ్ యు.ఎస్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. అలాగే ముంబాయిలో ప్రత్యేక ట్రైనర్ సహాయంతో ప్రొఫెషినల్ బాక్సర్ గా కనిపించేందుకు ఫోకస్ పెట్టిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తుంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీని సమర్పిస్తున్నాడు. రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
దర్శకుడు కొర్రపాటి కిరణ్ ఈ మూవీని ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశాడు. గతంలోనూ పవర్ స్టార్(బాబాయ్) ‘తమ్ముడు’ మూవీలో బాక్సర్ గా కనిపించి బాక్సాఫీస్ రికార్డు సృష్టించాడు. ఇక వరుణ్ తేజ్(అబ్బాయ్) ఆ తరహాలోనే బాక్సర్ పాత్ర పోషిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. జూలై 30న సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.
బండికి బీజేపీ పగ్గాలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ప్రకటించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ కొనసాగిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం మాజీ మంత్రి డి.కె. అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆశావహులు పోటీ పడ్డారు. చివరికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఖరారు చేశారు.
కాంగ్రెస్ భవిష్యత్తుపై నీలినీడలు
కాంగ్రెస్ పార్టీ కి కష్టాలు వదల్లేదు. జ్యోతిరాదిత్య సింధియా పేరుతో పెద్ద ప్రకంపనకు గురయ్యింది. 2014 లో అధికారం కోల్పోయిన తర్వాత అధికారపార్టీ పై వుండే సహజవ్యతిరేకతతో 2019 కల్లా పుంజుకుంటుందని చాలామంది ఊహించారు. కానీ అది జరగలేదు. కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడలాగానే వుంది. కనీసం గుర్తింపు పొందిన ప్రతిపక్ష స్థాయి కి కూడా ఎదగలేకపోయింది. అదేసమయంలో రాష్ట్రాల్లో అక్కడ స్థానిక నాయకుల పలుకుబడితో అధికారంలో వున్న ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం కొంతవరకు గుడ్డిలోమెల్ల అనిచెప్పొచ్చు.
ఈ రెండురోజుల్లో జరిగిన సంఘటన మొత్తం పార్టీని ఓ కుదుపు కుదిపింది. జ్యోతిరాదిత్య సింధియా రాహుల్ గాంధీ ఆంతరంగిక కూటమిలో సభ్యుడు. ఒకసందర్భంలో రాహుల్ గాంధీ అధ్యక్షపదవి కి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే పేర్లలో జ్యోతిరాదిత్య పేరుకూడా బయటకొచ్చింది. ఆ స్థాయిలో వున్న వ్యక్తి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీ లో చేరటం కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బే . ఎందుకిలా జరిగింది? ఆయన పదవీ దాహంతో వెళ్లిపోయాడని చెప్పి ఆత్మసంతృప్తి పొందొచ్చు. కానీ లోలోపల కాంగ్రెస్ నాయకుల్లో ఆత్మమధనం మొదలయ్యింది. ఇందులో మొత్తం జ్యోతిరాధిత్యదే తప్పేనా పార్టీ నాయకత్వం తప్పులేదా అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ పరిణామం తో నైనా కాంగ్రెస్ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకుంటుందా లేదా? అధికారంలో వున్నప్పుడు పార్టీ వ్యవహారాలు నడపటం వేరు కష్టకాలం లో నడపటం వేరు. కష్టకాలంలోనే నాయకత్వ లక్షణాలు పరీక్షకు నిలబడతాయి.
సోనియా గాంధీ కి పార్టీ నాయకత్వం వారసత్వంగా వచ్చింది. పార్టీ అధ్యక్షురాలైన దగ్గర్నుంచి పార్టీలో ఏరోజూ ఎన్నికలు జరిపిన పాపాన పోలేదు. కిందనుంచి పైదాకా అన్ని పదవులు నామినేషన్ తోనే నింపింది. అది రాను రాను పూర్తిగా అడుగులకు మడుగులొత్తే వాళ్ళ తోనే నిండిపోయింది. ప్రజాదరణ తో సంబంధం లేకుండా జీ హుజూర్ అనేవాళ్లే కేంద్రంలో , రాష్ట్రం లో నాయకులయ్యారు. 2014 లో ఓడిపోయిన తర్వాతన్నా ఈ సంస్కృతిని మార్చి పార్టీని బతికిస్తారని నిజమైన కాంగ్రెస్ అభిమానులు ఎదురుచూసారు. కొంతమేరకు అధ్యక్షహోదాలో రాహుల్ గాంధీ యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నించాడు. అయితే ఈ పాత నాయకత్వం సోనియా గాంధీ పంచన చేరి రాహుల్ గాంధీ ఆలోచనలను అమలుచేయకుండా అడ్డుకట్టవేయగలిగారు. ఇందుకు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల సెలక్షన్ ఉదాహరణ. రాహుల్ గాంధీ జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లను ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేస్తే బాగుంటుందని భావించాడు. కాకపోతే అప్పటికే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో సోనియా ప్రాపకంతో కమల్ నాధ్ , అశోక్ గెహ్లాట్ లు ముఖ్యమంత్రులయ్యారు. అదే పని హర్యాణాలోను జరిగింది. తిరిగి భూపేంద్ర హుడా ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటంతో ఒకవర్గం అసంతృప్తితో తప్పుకుంది. ముంబై లోను ఇదే పునరావృతమయ్యింది. మార్పుని అడ్డుకోవటంలో సోనియా గాంధీ చురుకైన పాత్ర పోషించింది. ఇదే రాహుల్ గాంధీ పార్టీలో అంటి ముట్టనట్లు ఉండటానికి కారణమని అర్ధమవుతుంది. రాహుల్ గాంధీ అంతరంగికుల్లో దీనితో అంతర్మధనం మొదలయ్యింది. ఇంతకుముందే సచిన్ పైలట్ అసంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. అయితే అది పార్టీనుంచి బయటకు వెళ్ళే అంతకాదు . జ్యోతిరాదిత్య సింధియా దాదాపు కమల్ నాథ్ ముఖ్యమంత్రి అయ్యినదగ్గర్నుంచి అసంతృప్తిగా వున్నాడు. ఆయనను బుజ్జగించటానికి ప్రయత్నించకపోగా కమల్ నాథ్- దిగ్విజయ్ సింగ్ కలిసి తన పలుకుబడిని తగ్గించటానికి చెయ్యని ప్రయత్నం లేదు. వాళ్ళు ఆ రాష్ట్రం లో వైరివర్గమని సర్దిపుచ్చుకున్నా సోనియా గాంధీ-రాహుల్ గాంధీ తనను దగ్గరికి తీయటానికి ప్రయత్నం చేయలేదు. సహజంగానే తన కుటుంబ నేపథ్యం దృష్టిలో వుంచుకున్నప్పుడు కొంత అతిశయం వుంది. దానికి తోడు తనను గుర్తించటంలేదనే దుగ్ధ తీవ్రంగా ఆలోచింపచేసింది. చివరకి సిద్ధాంతం కన్నా నా అహం దెబ్బతిన్నదనేదే డామినేట్ చేసింది. దాని పర్యవసానమే ఇది. ఓ విధంగా తను బయటికెళ్లే పరిస్థితులు సృష్టించారని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మోడీ- అమిత్ షా ద్వయం తెలివిగా ఉపయోగించుకున్నారు.
కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదా?
కాంగ్రెస్ కి భారత రాజకీయాల్లో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దానికి ఘనమైన వారసత్వం వుంది. రెండోది, బీజేపీ వ్యతిరేక ఓట్లు సంఘటితం అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే వుంది. ప్రజలు ఇప్పటికీ ఉదారవాద పార్టీగా కాంగ్రెస్ నే చూస్తారు. అయితే దానికి రెండు వారసత్వ గుదిబండలు కూడా వున్నాయి. అవి కుటుంబ పాలన, అవినీతి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వున్నప్పుడు ఆ కుటుంబ ఘన వారసత్వమే ఉపయోగపడింది. సోనియా గాంధీ హయాంలో అదే గుదిబండలాగా తయారయ్యింది. రాహుల్ గాంధీ ఇంతవరకు తన నాయకత్వ లక్షణాలను చూపించుకోలేకపోయాడు. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ భవిష్యత్తేమిటి?
ఇప్పటికైనా కాంగ్రెస్ కి అవకాశంలేకపోలేదు. జ్యోతిరాదిత్య ఘటనని మంచి అవకాశంగా మార్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టవచ్చు. కింది స్థాయినుంచి అన్ని పదవులను ఎన్నికద్వారానే నింపేటట్లయితే పార్టీ క్యాడర్లో నూతనోత్సాహాం వస్తుంది. గాంధీ కుటుంబం తప్పుకుంటే మంచిదని చాలామంది సలహాలిస్తున్నా కాంగ్రెస్ సంస్కృతిలో ఇప్పట్లో అంత తీవ్ర మార్పు తీసుకురావటం దుస్సాహసమే అవుతుంది. అసలు ఆ సమస్యను పక్కనపెట్టి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తే దానికి పరిష్కారం అప్పుడే దొరుకుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పూర్తిగా ఎన్నికద్వారా నిర్మించబడితే అది ఓ కొత్త అధ్యాయానికి తెరతీసినట్లవుతుంది. ఈ ప్రయోగం ఒక్కటే కాంగ్రెస్ ని ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయగలదు. శశి థరూర్ లాంటి వాళ్ళ ప్రకటనలు మధ్య నాయకత్వం అందరూ చేస్తే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆశిద్దాం.
















ప్రపంచ దేశాల్ని వణికించేస్తున్న కరోనా వైరస్.సినెమా రంగం ఫై కూడా తన ప్రభావాన్ని బాగా చూపుతోంది. రెండు మూడు వారాల ముందు వరకు కరోనా వైరస్ గురించి సీరియస్ గా తీసుకొని ఇండియన్స్.. ఇప్పుడు దేశంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో హడలి పోతున్నారు.ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 50 పాజిటివ్ కరోనా వైరస్ కేసులు ఉన్నాయని తెలుస్తోంది.
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బెల్లంకొండ శ్రీనుకి ఎట్టకేలకు ఒక హిట్ వచ్చింది. తమిళం లో రామ్ కుమార్ దర్శకత్వంలో విష్జు విశాల్ , అమల పాల్ హీరో , హీరోయిన్లుగా నిర్మించిన సూపర్ హిట్ మూవీ రాచ్చసన్ రీమేక్ రాక్షసుడు సినిమాతో తొలి విజయం అందుకొన్నాడు. బెల్లంకొండ శ్రీను…దాంతో తదుపరి చిత్రాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు.