Home Blog Page 8589

Angulika Movie Trailer Launch Photos

కరోనా కట్టడికి కెసిఆర్ కీలక నిర్ణయం

భారత్‌ ను భయపెడుతున్న కరోనా ని నిలువరించడానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో తీవ్ర కలకలమే రేగింది, అయితే, కరోనా బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో.. తిరిగి ఇంటికి పంపించారు వైద్యులు. ఇక, తాజాగా రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది.. ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించారు, దింతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ ను నియంత్రించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. దీనిపై హైలెవల్ కమిటీని నియమించామని.. అలాగే ఈ సాయంత్రానికి కేబినెట్ సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రజలకు కీలక ప్రకటన చేస్తామని తెలిపారు.

వ్యాధి ప్రబలితే ప్రజలకు మాస్క్‌ లు అందుబాటులో ఉంచుతామన్నారు. సాయంత్రం 6గంటలకు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని… కేబినెట్‌ భేటీకి వైద్యాధికారులను పిలిచామని సీఎం తెలిపారు. అవసరమైతే రూ.5 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామని చెప్పారు.

మహారాష్ట్ర,కర్ణాటక,ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికె ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారని కేసీఆర్ గుర్తుచేశారు. ముంబై,భువనేశ్వర్,బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే షట్ డౌన్ ప్రకటించారని.. హైదరాబాద్ నగరం విషయంలోనూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైతే హైదరాబాద్‌ కు వచ్చిన ప్రమాదమేమీ లేదని.. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కన్నా భూమి కబ్జాకు విశాఖలో ప్రయత్నం!

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించగానే అక్కడ భూకబ్జాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నట్లు ఆరోపణలు వస్తూ ఉండడం తెలిసిందే. అధికార పార్టీకి సంబంధించిన వారు, పెద్ద పెద్ద నాయకుల సారధ్యంలో ఈ కబ్జాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతూ వస్తున్నాయనే ఆరోపణలు చెలరేగుతున్నాయి.

చివరకు సుదీర్ఘకాలం మంత్రిగా, శాసనసభ్యుడిగా పనిచేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భూమినే కబ్జా చేసిన్నట్లు ఇప్పుడు వెల్లడైనది. తమ భూమిని వేరే వారు ఆక్రమించుకున్నట్లు తనకు ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి చెప్పారుని, తన భూమితో పాటు ఆ పోలీస్ అధికారి భూమిని సహితం ఆక్రమించుకున్నారని స్వయంగా కన్నా వెల్లడించారు.

ఆ సంగతి తెలిసి వెళ్లి ఆ భూమిని తన మనుష్యులు విడిపించుకున్నారని చెప్పారు.

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్టణాన్ని ప్రకటించాక అక్కడ భూ కబ్జాలు పెరిగిపోయానని, సాక్షాత్తూ తన భూమినే కబ్జా చేయడానికి ప్రయత్నించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వాపోయారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పాడ్డాయని మీడియా సమావేశంలో కన్నా ఆరోపించారు.

‘‘భీమిలి సమీపంలో స్వయంగా నా స్థలానే కబ్జా చేసే ప్రయత్నం జరిగింది. 1993లో చేపలుప్పాడలో నేను స్థలం కొనుకున్నాను. పక్కనే ఉన్న పోలీసు అధికారి స్థలం కూడా కొట్టేసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసి ఆ పోలీసు అధికారి నాకు ఫోన్ చేసి అలెర్ట్ చేశారు. భూ మాఫియా గ్యాంగే నా స్థలం కబ్జాకు ప్రయత్నించింది” అని వెల్లడించారు.

వైజాగ్‌లో భూముల యజమానులు తీవ్రంగా భయపడుతున్నారని, బీజేపీ పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారని, తుపాకీ గురిపెట్టి సెటిల్‌మెంట్లు చేస్తున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.

“వైజాగ్‌లో భూ మాఫియాకు వందల మంది బాధితులయ్యారు. నా భూమికి కూడా కంచె వేశారు. అదేంటని అడిగితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అని అనుకోలేదని నిందితులు చెబుతున్నారు.’’ అంటూ జరిగిన విషయాన్ని మీడియాకు కన్నా వివరించారు.

విశాఖ ప్రజలు మూడు రాజధానులు అనగానే భయపడుతున్నారని కన్నా తెలిపారు. రాజధానిని మీరే కాపాడలని విజయనగం ప్రజలు తనతో అన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పిస్తామననే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తామని, కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు.

పెట్రోల్, డీజిల్ లపై పన్ను పోటు


ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతూ ఉంటె ఆ ప్రయోజనాలు భారత ప్రజలకు చేరకుండా కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుహ్యంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.

లీటర్ పెట్రోల్ పై 3రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గిన ఫలితం వినియోగదారులకు అందకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకం రూపంలో బ్యాలెన్స్ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తున్నాయి.

ఇక స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పై రూ.2నుంచి 8పెంచగా.. డీజిల్ పై రూ.4కు పెంచింది. అటు పెట్రోల్ పై రూపాయి, డీజిల్ పై రూ.10 వరకు రోడ్ సెస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల జేబుకు చిల్లులు పడనున్నాయి.

గత ఆరేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరుగుతూ రావడం తెలిసిందే.

కరోనా దెబ్బకు.. నాని విలవిల..

నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబులు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ మూవీకి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. నాని 25వ చిత్రం ‘వి’ మూవీ తెరకెక్కుతుంది. నాని ఇందులో ‘రాక్షసుడి’గా నెగిటివ్ షెడ్స్ లో కనిపించనున్నాడు. అలాగే సుధీర్ బాబు ‘రక్షకుడిగా’ అలరించేందుకు సిద్ధపడుతున్నాడు. ఈ మూవీని మార్చి 25న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. కరోనా మహమ్మారి తాజాగా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ అవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా చిత్రమండలి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ‘వి’ మూవీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

‘వి’లో నివేదా థామ‌స్‌, అదితిరావ్ హైద‌రి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈనెల 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేసింది. అయితే కరోనా ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు. ఈ ఎఫెక్ట్ తో బడా సినిమాలకు కూడా కలెక్షన్లు తగ్గాయి. దీంతో ఇప్పటికే రిలీజ్ చేయాలకున్న సినిమాలను పలువురు నిర్మాతలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘వి’ నిర్మాతలు కూడా తాజాగా చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ల్ లకు చిత్ర పరిశ్రమ దూరంగా ఉంటుంది. అలాగే థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుండటంతో నిర్మాతలు ఆలోచనలు పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూవీలను రిలీజ్ చేస్తే నష్టపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమాలను వాయిదాలు వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గాక సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్లో ‘వి’ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. చూడాలి మరీ అప్పటి వరకు కరోనా ప్రభావం తగ్గుతుందో లేదో మరీ..

ఏపీలో మినీ హెల్త్ ఎమెర్జెన్సీ

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం, ఏపీలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్‌ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

కరోనా ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని అన్ని స్కూళ్లకు ఈనెల 18 వరకు సెలవులు ప్రకటించారు. జనం గుమిగూడిన ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన 125 మంది ఆచూకీపై అధికారులు ట్రాక్‌ చేశారు.

నెల్లూరులోని ఓ హోటల్‌లో 30 మంది పోర్చుగల్‌ వాసులకు సంబంధించిన శాంపిల్స్‌ను అధికారులు పరీక్షలకు పంపించారు. కరోనాపై వదంతులు, నిరాధార వార్తలను ప్రజలు నమ్మొద్దని కోరారు.

ఈ చట్టానికి ‘ఆంధ్రప్రదేశ్‌ అంటువ్యాధి కొవిడ్‌-19 రెగ్యులేషన్‌ 2020’గా నామకరణం చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం శుక్రవారం నుంచే ఈ చట్టం రాష్ట్ర మొత్తం అమలులోకి వచ్చింది. ఇది ఏడాదిపాటు అమల్లో ఉంటుంది.

ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఆరోగ్యశాఖ డైరెక్టర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌ కమిషనర్‌కు మరిన్ని అధికారాలు అప్పగించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్‌, వైద్యాధికారి, బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించింది.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థలు పూర్తిగా కరోనా నియంత్రణ కోసం పని చేయాలి. అవసరమైన చోట ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసుకుని అనుమానితులను చికిత్స అందించాలి.

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు దగ్గు, జలుబు, శ్వాససంబంధింత వ్యాధులు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉండాలి. అనుమానుతులను 14 రోజులు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంచాలి. వైద్య సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, అధికారులు కానీ ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా మీడియాకు సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అందిస్తే దీన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

కరోనా లక్షణాలున్న వారిని సెక్షన్‌-6 ప్రకారం సంబంధింత అధికారాలున్న వారు మాత్రమే చేర్చుకోవాలి. అనుమానితులు ఎవరైనా చికిత్సకు నిరాకరిస్తే అధికారులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించొచ్చు.

ఒక ప్రదేశంలో కరోనా కేసు నమోదైతే ఆ ప్రాంతంపై జిల్లా కలెక్టర్‌కు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ప్రవేశాల నిషేధం, పాఠశాలలు, సినిమా హాళ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, బహిరంగ సమావేశాలను నియంత్రించవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులు.

కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి లక్షణాలతో వచ్చే వారి కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఓపీ నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ఏపీలోని ప్రముఖ దేవాలయాల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.

తగిన సూచనలు, జాగ్రత్తలు వివరిస్తూ సైన్ బోర్డులు పెట్టారు. భక్తులు కూడా సహకరించాలని దేవాదాయశాఖ కోరుతోంది. రాష్ట్రంలో తిరుపతి తర్వాత విజయవాడలో కరోనా టెస్ట్ ల్యాబ్ అందుబాటులోకి రానుందని కేఎస్ చౌహర్ రెడ్డి తెలిపారు. వైరస్ వ్యాపించకుండా పలు చర్యలు తీసుకున్నామన్నారు.

అభిమానులకు మహేష్ ఉగాది కానుక?

సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘సరిలేరునికెవ్వరు’ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై సాలీడ్ హిట్టందుకుంది. ‘సరిలేరునికెవ్వరు’ భారీ కలెక్షన్లు రాబట్టడంతో ఇండస్ట్రీ రికార్డులను తిరగారాసింది. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరునికెవ్వరు’ మూవీలతో మహేష్ బాబు హ్యట్రిక్ విజయాలను అందుకున్నాడు. ‘సరిలేరునికెవ్వరు’ విజయాన్నిఆస్వాదిస్తూ సూపర్ స్టార్ ఇటీవలే ఫ్యామిలితో కలిసి విహారయాత్రకు వెళ్లిన సంగతి తెల్సిందే. ఆయన తిరిగొచ్చాక కొత్త మూవీ ప్రారంభం అవుతుందని భావించారు. అయితే మహేష్ కొత్త మూవీపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

తాజాగా మహేష్ బాబు కొత్త మూవీ ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మూవీ ప్రారంభం అవుతుందని భావించినా అది జరుగలేదు. మహేష్ కొత్త మూవీకి పరుశురామ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. మహేష్‌తో మూవీ తీసేందుకు గతంలోనే ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు దర్శకుడు పరుశురామ్ సన్నాహాలు చేస్తున్నారు.

మహేష్ కొత్త మూవీని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించనుంది. గతంలోనే ఈ సంస్థ మహేష్ తో ‘శ్రీమంతుడు’ నిర్మించి భారీ హిట్టందుకుంది. తాజాగా పరశురామ్‌-మహేష్‌ బాబు కాంబినేషన్లో కొత్త మూవీని ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. సినిమా ప్రారంభించించాక ఇతర నటీనటులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. దీంతో మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

తెలంగాణ యాసలో అలరించనున్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల సీనీరంగంలో 15ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంటుంది. అందం, అభినయం, డాన్స్ తో తమన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచు మనోజ్ నటించిన ‘శ్రీ’ మూవీతో తమన్నా తెలుగువారికి పరిచమైంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే అందరు అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’లో తమన్నా అద్భుతమైన నటన కనబరిచింది. తమన్నా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

తాజాగా మిల్కీ బ్యూటీ ‘సీటీమార్’లో నటిస్తుంది. సంప‌త్ నంది దర్శకత్వంలో గోపిచంద్ కు జోడీగా ఎంపికైంది. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ మూవీల్లో నటించింది. ‘సీటీమార్’ ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌గా ‘సీటీమార్’ తెరకెక్కుతుంది.

ఈ మూవీలో గోపీచంద్ ఆంధ్ర క‌బ‌డ్డీ జ‌ట్టు కెప్టెన్‌గా, త‌మ‌న్నా తెలంగాణ క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌గా క‌నిపించనుందని సమాచారం. తమన్నా తెలంగాణ అమ్మాయిగా క‌న‌ప‌డ‌టానికి చాలా కష్టపడుతుందని తెలుస్తోంది. దర్శకుడు సంప‌త్ నంది సాయంతో తెలంగాణ యాస నేర్చుకుంద‌ట‌. అదేవిధంగా ఫిట్‌గా ఉండేందుకు యోగా, ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తూ క‌బ‌డ్డీ ట్రైనింగ్ తీసుకుంద‌ట‌. తెలంగాణలో యాసలో తమన్నా అభిమానులకు అలరించేందుకు సిద్ధమవుతుంది. వేసవిలో ‘సీటీమార్’ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

6ఏళ్లలో జనసేన మలుపులు, కుదుపులు

2014 నుంచి 2020 వరకు జనసేన పార్టీ అనేక మలుపులు తిరిగి, కుదుపులకు గురై 6వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంలో ఆ పార్టీని గూర్చి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

ఒకటి లేదా రెండు ఎదురు దెబ్బలకే మనకెందుకొచ్చిన రాజకీయాలు అనుకునే రాజకీయ నాయకులకు భిన్నంగా 6సంవత్సరాలుగా అనేక అవరోధానాలకు ఎదురొడ్డి నిలబడ్డ ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది. హాయిగా సాగే రంగుల జీవితం నుంచి అసత్య, అవాస్తవ విమర్శలు చేసే రాజకీయ జీవితాన్ని ఎంచుకున్న పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు అని చెప్పడంలో అతిసేయోక్తి లేదు. ఈ 6ఏళ్లలో అనేక సమస్యలపై పోరాడి, ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్. సమాజం పట్ల, భావితరాల పట్ల బాధ్యత ఉందని, ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుక అయ్యాడు పవన్. అవినీతి రహిత రాజకీయాలను ప్రజలకు చూపించాలని 6ఏళ్ళ క్రితం ఇదే రోజున జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్.

 6ఏళ్లలో జనసేన…

రాష్ట్ర విభజన, ప్రజారాజ్యం పార్టీ చేదు అనుభవాలతో మార్చి 14, 2014న పవన్ కళ్యాణ్ ఎన్నో అవాంతరాలు, అపనమ్మకాల మధ్య జనసేన పార్టీ పెట్టారు. దింతో జనసేనపై మెగా అభిమానులు కూడా అంత ఆసక్తి చూపలేదు అయినా వెనుకడుగు వేయకుండా పార్టీని స్థాపించి పవర్ స్టార్ కాస్త జనసేనానిగా మారారు.

2014 సాధారణ ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉండడం పార్టీ నిర్మాణం లేకపోవడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చిన జనసేనాని మొదటి నుండి కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత, మోడీ నాయకత్వం పై ప్రజలు సానుకూలంగా ఉండడంతో జనసేనాని వెంటనే గుజరాత్ వెళ్లడం, మోడీ, బీజేపీకి భేషరతు మద్దతు ప్రకటించి ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని మాటిచ్చారు.

అప్పటికే చుక్కాని లేని నావలా ఉన్న టీడీపీ 2009-14 మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు అలాంటి సమయంలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులకి కూడా నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ బీజేపీతో జట్టు కట్టడంతో వెంటనే చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకోవాలని నిర్ణయించాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అటు బీజేపీ తో పాటు నాకు ప్రచారం చేసి పెట్టాలని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి దేహి అని అర్ధించడంతో అనుభవంలో జగన్ కన్నా చంద్రబాబు మేలని విడిపోయిన రాష్ట్రానికి తన అనుభవంతో న్యాయం చేస్తాడని టీడీపి-బీజేపీ కూటమికి ప్రచారం చేయడంతో 1.7 శాతం ఓట్ల తేడాతో కూటమి గెలిచింది ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టడం ప్రజా వ్యతిరేక పాలన వల్ల 2019 లో టీడీపీ కి వ్యతిరేకంగా పోటీచేసిన జగన్ బృందం చేసిన టీడీపీ-జనసేన కుమ్మక్కు ప్రచారం వల్ల జనసేన అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు తన అసలు బలం తెలిసి భవిష్యత్ లో జనసేనతో కలిసి పోటీ చేయాలి అని ఆలోచన చేసి ప్రతి సభలో వైసీపీ, పవన్ కళ్యాణ్ పై చేసే విమర్శలు తిప్పి కొట్టినట్టు నటించి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను తన వైపు లాక్కోవాలని అనుకున్నాడు అయితే ఇవన్నీ తెలిసినా మౌనంగా ఉంటూ వైసీపీ యొక్క అధికారం తెచ్చిన అహంకారం ఎదుర్కోవాలంటే కేంద్రంలో బలమైన,నమ్మకమైన బీజేపీతో జట్టు కట్టాలని భావించాడు పవన్. బీజేపీ మరియు మోడీని 2019 ఎన్నికల్లో అణిచివేయాలని చూసిన చంద్రబాబుని ఇక జీవితంలో కలిసేది లేదని అమిత్ షా ప్రకటించడంతో ఆ పార్టీతో పొత్తుకు జనసేనాని ఒప్పుకున్నారు.

ప్రస్తుతం బీజేపీ-జనసేన కూటమి 2020స్థానిక ఎన్నికలలో తన మార్క్ ని చూపించాలనే ఆలోచనలో ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఈ కూటమి ఎంతవరకు కట్టడి చేస్తుందో.. తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

Naina Ganguly Hot Photos

Rakul Preet Singh Glamorous Pics

చేతులెత్తేసిన జనసేన, బీజేపీ కూటమి!

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ప్రగల్బాలు పలికిన జనసేన, బిజెపి కూటమి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చతికలబడింది.

అన్ని స్థానాలలో పోటీ చేసి తమ ప్రభావాన్ని చాటుతామని చెప్పుకొంటూ వచ్చిన నేతలు ఇప్పుడు సగం స్థానాలలో కూడా అభ్యర్థులను నిలబెట్టలేక పోయారు. ఈ కూటమి మీడియా సమావేశాలకు పరిమితం కావడం తప్ప ఇప్పటివరకు జనం మధ్యకు వెళ్లిన దాఖలాలే లేవు.

ప్రస్తుతం 9694 ఎంపిటిసి పదవులకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఈ కూటమి కనీసం సగం స్థానాలలో కూడా అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. జనసేన 2027 చోట్ల పోటీ చేస్తుండగా, బీజేపీకి 1816 చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నది. అంటే 5851 చోట్ల ఈ కూటమి అభ్యర్థులే లేరు.

మరోవంక, మున్సిపాలిటీ లలో అయినా వీరు పోటీ చేయలేక పోయారు. జనసేన 434, బీజేపీ 554 వార్డులు, డివిజన్ లలో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలిగారు. వీరిలో మరెంతమంది గెలుస్తారో సందేహాస్పదమే.

కూటమి పేరుకే గాని, స్థానికంగా ఈ రెండు పార్టీలు తలో పార్టీతో కుమ్మక్కైన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలుచోట్ల జనసేన టిడిపి అభ్యర్థులతో అవగాహనకు వస్తుండగా, బిజెపి అభ్యర్థులు వైసిపి అభ్యర్థులతో చేతులు కలుపుతున్నారు.

స్థానిక సంస్థలలో కనీసం అభ్యర్థులను కూడా పెట్టలేని దుష్టితిలో ఉన్న బిజెపి నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వైసిపి దౌర్జన్యాలకు పాల్పడి ఎవ్వైర్ని నామినేషన్లు కూడా వేయనీయడం లేడని అంటూ ఆరోపణలతో కాలం గడుపుతున్నది. పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి వివరించగా, రాష్త్ర అధ్యక్షుడు కన్నా లక్షనారాయణ ఆయనకు లేఖ వ్రాసారు.

మరోవంక రాష్ట్ర బిజెపి నాయకులు గవర్నర్ విశ్వభూషన్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికార పక్షం చెప్పిన్నట్లే నడుచుకొంటున్నాట్లు ఆరోపణలు చేశారు.

త్రిష చిరు రాబోయే చిత్రం ఆచార్య కి షాక్

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్నాడు. ఈ మూవీలో చిరుకు జోడీగా త్రిష ఎంపికైంది. తాజాగా ఆమెను ఈ మూవీని తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ గురించింది. ఇంకో వారంలో ‘ఆచార్య’ షూటింగ్లో త్రిష పాల్గొనాల్సి ఉండగా ఉన్నట్టుండి త్రిష తప్పుకోవడంతో ఏం జరిగి ఉంటుందా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని త్రిష ట్వీటర్లో అభిమానులకు తెలియజేంది. ‘ముందు చెప్పినవి, చర్చించినవి జరగడం లేదు.. ఇలాంటి క్రియేటివ్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల చిరంజీవి సర్‌ సినిమాలో భాగం కాలేకపోతున్నా. టీమ్‌కి ఆల్‌ ద బెస్ట్‌. ప్రియమైన తెలుగు ఆడియన్స్‌ కోసం త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో మీ ముందుకొస్తా’ అని త్రిష ట్విట్టర్లో పేర్కొంది. సీనియర్ హీరో అయిన త్రిష తన పాత్రకు ప్రాధాన్యత తగ్గడంతోనే ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. త్రిష ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తుంది.

త్రిష ‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకోవడంతో కాజల్ అగర్వాల్ ను పేరు తెరపైకి వచ్చింది. కాజల్ గతంలో చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో చిరంజీవి పక్కన నటించి మెప్పించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ‘ఆచార్య’ మూవీ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని ఆగ‌స్ట్ 14 విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్లో బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తుంగా మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుంది. ప్రస్తుతం చిరు పక్కన నటించే ముద్దుగుమ్మ ఎవరేనేది హాట్ టాపిక్ గా మారింది.

మెగా కుర్రాడికి పేరు తెచ్చిన అదృష్టం

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన అసలు పేరుతొ కెరీర్ ప్రారంభం లో పిల్ల నువ్వులేని జీవితం , సుప్రీమ్ ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్లు కొట్టి తన సత్తా చాటాడు. ఆ తర్వాత వరుసగా తిక్క, విన్నర్, జవాన్, నక్షత్రం, ఇంటెలిజెంట్ , తేజ్ ఐ లవ్ యు వంటి ఆరు చిత్రాలు ఫ్లాప్ కావడం తో న్యూమరాలజీ ప్రకారం పేరులో ధరమ్ ని తీసేసాడు ఈ మెగా మేనల్లుడు.. ఇక సాయి తేజ్ అనే పేరులో సౌండింగ్ గొప్పగా లేకపోయినా కానీ ఈ స్క్రీన్ నేమ్ నిజంగానే అతనికి భలేగా కలిసి వస్తోంది.

అలా పేరు మార్చుకున్నతరవాత తొలి గా వచ్చిన చిత్రలహరి సినిమాతో మెగా మేనల్లుడి అదృష్టం సుడి తిరిగింది. ఇక ఆ తరవాత వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా ఏకం గా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సుమారు నలభై కోట్లు షేర్ వసూలు చేసింది.
ఇప్పుడు అతని తాజా చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్” ఇంకా రిలీజ్ కూడా కాకముందే నిర్మాతలకి విపరీతమైన లాభాలు తెచ్చి పెడుతోంది. ఇది కొత్త దర్శకుడు సుబ్బు తీస్తున్న సినిమా అయినా కానీ దీనికి బిజినెస్ బాగా జరుగుతోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా సూపర్ గా జరిగింది. అలాగే సాటిలైట్, డిజిటల్ హక్కులకు కలిపి ఇంకో పది కోట్లు కూడా వచ్చాయట…

ఇరవై కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి నిర్మాత ఒక ఇరవై కోట్లు టేబుల్ ప్రాఫిట్ వెనకేసుకుంటున్నాడు.అంటే డబల్ లాభం అన్నమాట. ఇదంతా సాయి ధరమ్ తేజ్ తన పేరులోని ధరమ్ ని త్యాగం చేయడం వల్లనే జరిగింది అని అందరూ అంటున్నారు. అలా పేరు మార్చిన వేళా విశేషం వల్లనే ఏమో ఇప్పుడు బెటర్ డెసిషన్స్ కూడా తీసుకొంటున్నాడు.
Right decision in right time

Prema Pipasi Movie Team At Devi Theatre

బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎల్ మురుగన్ ను నియమించడం

వచ్చే సంవత్సరం మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో బీజేపీ దళిత్ కార్డు ప్రయోగిస్తున్నది. సుమారు ఎనిమిది నెలల వరకు కాలయాపన చేసి, చివరకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా యువకుడు, హైకోర్టు న్యాయవాది, దళిత్ ఉద్యమకారుడు ఎల్ మురుగన్ ను నియమించడం ద్వారా రాష్ట్ర రాజకీయ వర్గాలలోని కాకుండా, సొంత పార్టీలో ఆ పదవి ఆశించిన పలువురు సీనియర్లను సహితం ఆశ్చర్యానికి గురిచేశారు.

తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళశై సౌందరాజాన్ ను తెలంగాణ గవర్నర్ గా పంపిన తర్వాత, ఆమె స్థానంలో ఇప్పుడు 43 ఏళ్ళ యువ న్యాయవాదిని నియమించడం రాజకీయంగా కీలకమైన మలుపు కానున్నది. దీంతో బిజెపిని బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణాలకు చెందిన పార్టీగా చేస్తున్న ప్రచారానికి తెరపడే అవకాశం ఉంది.

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ వైస్ చైర్మన్ గా డీఎంకే తమ పార్టీ అధికార పత్రికను ఒక `పంచమి’ భూమి నుండి ప్రచురిస్తూ ఉండడంపై ఎవ్వరు ఫిర్యాదు చేయకుండానే సుమోటో గా ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టడం ద్వారా మురుగన్ ఇదివరకు సంచలనం సృష్టించారు.

“పంచమి” భూములు అంటే వ్యవసాయం చేయడం కోసం బిరిధ్స్ వారి కాలంలో బలహీన వర్గాలకు కేటాయించిన భూములు. ఈ భూముల బదలాయింపులపై ఆంక్షలు ఉన్నాయి. ఈ కమీషన్ ఆయన పనితీరు ఎస్సి వర్గాలలో అందరి ప్రశంసలు పొందింది. “ఆయన ఒకరు ఫిర్యాదు చేసేవరకు ఆగరు. తానే సుమోటో గా తీసుకొని దర్యాప్తు చేబడతారు” అంటూ గుర్తింపు పొందారు.

తిరిచిలో గత జనవరిలో జరిగిన బిజెపి దళిత్ కార్యకర్త విజయ్ రఘు హత్యలో లవ్ జిహాదీ కోణంపై దర్యాప్తు జరిపమని జాతీయ ఎస్సి కమీషన్ ఆదేశించడంలో సహితం మురుగన్ కీలక పాత్ర వహించారు. దానిని వ్యక్తిగత ద్వేషంతో జరిగిన హత్యగా పోలీసులు పేర్కొంటే, తన కుమార్తె లవ్ జిహాదీ కారణంగా జరిగిన హత్యగా మురుగన్ పేర్కొన్నారు.

గతంలో కాంగ్రెస్ నుండి ఎస్సి అభ్యర్థి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆ వర్గానికి ఎప్పుడు ఇవ్వలేదు. ఇక డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు కూడా ఆ వర్గానికి చెందిన వారెవ్వరికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. దానితో ఇప్పుడు రాష్ట్రలో ఎస్సి, ఇతర బలహీన వర్గాలలో చొచ్చుకు పోవడానికి బిజెపికి అవకాశం ఏర్పడే వీలున్నది.

మైక్రోసాఫ్ట్ కి బిల్ గేట్స్ రాజీనామా..!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ ఆ సంస్థనుంచి తప్పుకున్నారు. మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డుకు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో గ్లోబల్ హెల్త్, విద్య వంటి సామాజిక సేవలకు వినియోగించే ఉద్దేశంతో ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా బిల్ గేట్స్ కొనసాగనున్నారు.

2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌ టైం పనికి కూడా గుడ్‌ బై చెప్పారు. 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ పదవినుంచి కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే.

అక్టోబర్ 28, 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌ లో ఒక ధనవంతులు కుటుంబంలో బిల్ గేట్స్ జన్మించాడు. చిన్నతనం నుండే లెక్కలు, సైన్స్ అంటే చాలా ఇష్టపడే బిల్ గేట్స్ కాలేజీ చదువు అనంతరం కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్ (BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌ కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి విక్రయించాడు. అలా బిల్ గేట్స్ ప్రయాణం మొదలయ్యింది. సాఫ్ట్ వేర్ శక్తిని ప్రజాస్వామ్యీకరించే ఉద్దేశంతో బిల్ గేట్స్ 1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి దాన్ని ప్రపంచ నెంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్లారు. 1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు బిల్ గేట్స్. 2007 లెక్కల ప్రకారం బిల్ గేట్స్ ఆస్తి విలువ 58 బిలియన్ డాలర్లు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.