మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్నాడు. ఈ మూవీలో చిరుకు జోడీగా త్రిష ఎంపికైంది. తాజాగా ఆమెను ఈ మూవీని తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ గురించింది. ఇంకో వారంలో ‘ఆచార్య’ షూటింగ్లో త్రిష పాల్గొనాల్సి ఉండగా ఉన్నట్టుండి త్రిష తప్పుకోవడంతో ఏం జరిగి ఉంటుందా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని త్రిష ట్వీటర్లో అభిమానులకు తెలియజేంది. ‘ముందు చెప్పినవి, చర్చించినవి జరగడం లేదు.. ఇలాంటి క్రియేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల చిరంజీవి సర్ సినిమాలో భాగం కాలేకపోతున్నా. టీమ్‌కి ఆల్ ద బెస్ట్. ప్రియమైన తెలుగు ఆడియన్స్ కోసం త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో మీ ముందుకొస్తా’ అని త్రిష ట్విట్టర్లో పేర్కొంది. సీనియర్ హీరో అయిన త్రిష తన పాత్రకు ప్రాధాన్యత తగ్గడంతోనే ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. త్రిష ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తుంది.
త్రిష ‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకోవడంతో కాజల్ అగర్వాల్ ను పేరు తెరపైకి వచ్చింది. కాజల్ గతంలో చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో చిరంజీవి పక్కన నటించి మెప్పించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ‘ఆచార్య’ మూవీ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని ఆగస్ట్ 14 విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్లో బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తుంగా మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుంది. ప్రస్తుతం చిరు పక్కన నటించే ముద్దుగుమ్మ ఎవరేనేది హాట్ టాపిక్ గా మారింది.