Home Blog Page 8590

కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ఫిక్స్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బహుబలి’ సీరీస్ కలెక్షన్ల రికార్డులు సృష్టించిన సంగతి తెల్సిందే. బహుబలి మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇండియాలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన లిస్టులో బహుబలి-2 ముందంజలో ఉంటుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రాజమౌళి మూవీలు ఉండటంతో ఆయన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. బహుబలి మాదిరిగానే ఇండియాలో రికార్డులు సృష్టించిన మరో మూవీ కేజీఎఫ్. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ మూవీ కూడా బహుబలి రేంజ్లో అభిమానులను అలరించింది.

కేజీఎఫ్ మూవీకి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో యష్ పక్కన శ్రీనిధిశెట్టి నటించింది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్-2 వస్తోంది. ‘కేజీఎఫ్’ మూవీ భారీ విజయం సాధించడంతో కేజీఎఫ్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ తారాగణంతో ఎక్కడ రాజీపడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘కేజీఎఫ్-2’లో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రావురమేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్‌-2 విడుదల చేస్తున్నట్టు చిత్రబందం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పోస్టర్‌లో ‘మే ఐ కమింగ్‌’ అనే టాగ్‌తో యశ్ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

చంద్రబాబు ప్రతిపక్ష పదవికి జగన్ ఎసరు!

Jagan-Chandrababu

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా గల హోదాను కొల్లగొట్టడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్కెచ్ వేసిన్నట్లు కనిపిస్తున్నది. మొదట్లో ఎన్నికైన వారెవరైనా సరే పార్టీలో చేరాలి అంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి, కేవలం అసెంబ్లీలో టిడిపి ఉనికిని ప్రశ్నార్ధకరం చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

గత కొద్దీ రోజులుగా వివిధ జిల్లాల్లో ప్రముఖ టిడిపి నాయకులు, మాజీ ఎమ్యెల్యేలు వరుసగా టిడిపిలో చేరుతూ ఉండగా,ఇప్పుడు ఎమ్యెల్యేలపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ముగ్గురు ఎమ్యెల్యేలు అధికారం పక్షంలో చేరారు. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాం లు పార్టీ వదలి వెళ్లిపోయారు.

కనీసం మరో పది మంది ఎమ్యెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వారిని కూడా చేర్చుకొని, టిడిపి శాసనసభపక్షంలో చీలిక అంటూ వైసిపిలో వారు విలీనం చేసే విధంగా వ్యూహరచన చేసిన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరిస్తూ, రాజకీయంగా ఆయన సలహాలను ఆచరిస్తున్న జగన్ ఈ విషయంలో సహితం ఆయననే మార్గదర్శిగా తీసుకొన్నట్లు స్పష్టం అవుతున్నది.

అధికార పార్టీకి మద్దతుగా మరో పదిమంది ఎమ్మెల్యేలు చేరినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని వైసిపి సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొనడం గమనార్హం. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదా కూడా నిలుపు కునే అవకాశం ఉండకపోవచ్చని తేల్చి చెప్పారు.

తెలంగాణ లో ఏ విధంగా అయితే రెండింట మూడు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత టి ఆర్ ఎస్ లో చేరారో, ఇక్కడ కూడా అదే విషంగా చేయడానికి సిద్దపడుతున్నారు. ప్రస్తుతం టిడిపికి 23 మంది సభ్యులు ఉన్నారు. వారిలో సగం మందికి పైగా వైసిపిలో చేరితో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోతారు. దానితో ఆయన భద్రత, ఇతర విషయాలలో సహితం ప్రాధాన్యతను కోల్పోతారు.

ఇప్పటికే శాసన మండలిని కూడా రద్దు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు సహితం ఏకపక్షంగా జరుగుతున్నాయి. నామినేషన్లు వేయడానికే సీనియర్ నేతలు టిడిపి సహితం భయపడుతున్నారు. ఇటువంటి పరిష్టితులలో ప్రతిపక్ష హోదాను సహితం చంద్రబాబు కోల్పోతే రాష్ట్రంలో టిడిపి ఉనికికే ఎసరు పెట్టిన్నట్లు కాగలదని జగన్ అంచనా వేస్తున్నారు.

మాళవిక శర్మ అందం అభినయానికి అభిమానులు ఎక్కువే!

‘నేల టిక్కెట్’ మూవీలో మాస్ మహరాజ్ రవితేజతో ఆడిపాడిన హీరోయిన్ మాళవిక శర్మ. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన ఈ అమ్మాయి నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఇస్మార్ట్ హీరో రామ్ నెక్ట్స మూవీ ‘రెడ్‌’లో నటిస్తోంది. రెడ్ సినిమా తనకు తప్పకుండా మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని మాళవిక హోప్స్ పెట్టుకుంది.

ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉంది. ఇప్పటికే రిలీజైనా రెడ్ మూవీ ‘నువ్వే నువ్వే’ సాంగ్‌లో అందంగా కనిపించి అందరి దృష్టిలో పడింది. సోషల్ మీడియాలో మాళవికకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో తనకు బాగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ అమ్మడు పెట్టిన ఫొటోలకు లైక్స్, కామెంట్స్ లిస్ట్ పెద్దదే. తన ట్యాలెంట్, బ్యూటీ తో మాళవిక ఇదంతా సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు.

మాళవిక “రెడ్ ” మూవీ తో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మంచి పాత్రలు, అలరించే కథల ఎంపికలో ఉన్న మాళవిక త్వరలో వాటి వివరాలు తానే స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు. అందంతో పాటు అభినయం ఉన్న ఈ అమ్మడికి అభిమానులు కూడా ఎక్కువే.

భారతదేశంలో రెండో కరోనా మరణం!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా వైరస్ సోకి నిన్న మరో వ్యక్తి మృతి చెందారు. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ వైరస్‌ సోకి మరణించింది. ఢిల్లీలో ఆరో కరోనా కేసుగా రికార్డయిన ఆమె.. కొద్ది రోజులుగా అక్కడి రామ్ మనోహర్​ లోహియా ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటోంది. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దింతో కరోనా సోకి చనిపోయిన మృతుల సంఖ్య రెండుకు చేరింది. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 81కి పెరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా 5వేల మంది కరొనా కి బలికాగా దాదాపు 1,32,000 మంది దాని బారిన పడ్డారు. చైనాలో మరణాలు, కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 80వేల కేసులు అక్కడ నమోదయ్యాయి అందులో 3,177 మంది చనిపోయారు. ఇటలీలో చనిపోయిన వాళ్ల సంఖ్య వెయ్యి దాటేసింది, దాదాపు 15,113 కేసులు నమోదయ్యా యి. ఇరాన్‌లో 514 మంది చనిపోయారు అందులో నిన్న ఒక్కరోజే 85మంది చనిపోవడం గమనార్హం. దక్షిణ కొరియాలో 71, స్పె యిన్‌లో 120, ఫ్రాన్స్‌లో 61 మంది చనిపోయారు. అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 41కి పెరిగగా.. పాజిటివ్ కేసులు 1,832 నమోదయ్యాయి.

Malvika Sharma Beautiful Pics

ప్రపంచ ఆర్దికాన్ని కుప్పకూల్చిన మహమ్మారిని ఐక్యంగా తరిమేద్దాం

కరోనా వైరస్ ప్రపంచాన్ని దిగ్భంధం చేసింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ దిగ్బంధనం మొత్తం ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. నిన్ననే విడుదలైన జనవరి పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకారంగానే వున్నా కరోనా వైరస్ ప్రభావం వాటిపై లేదు. ఫిబ్రవరి నుంచి ఇంకా చెప్పాలంటే ఈ నెల లెక్కలు పూర్తిగా గతి తప్పుతాయి. మార్చి లెక్కలు ప్రపంచాన్ని ఆర్ధిక మాంద్యంలోకి నెట్టుతాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యూరప్ ఇప్పటికే మాంద్యంలోకి కూరుకుపోయిందని అనిపిస్తుంది. మిగతా ప్రపంచం ముఖ్యంగా అమెరికా కూడా ఆ దిశగా అడుగులేయొచ్చు. ఈ వార్తలు సాక్ష్యాలతో ప్రసారం కావటానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు. ఇదేదో కావాలని భయం సృష్టించటానికి చెబుతున్న మాటలు కావు లాజికల్ గా ఆలోచిస్తే వస్తున్న కంక్లూజన్స్ . అవేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.

ప్రపంచం మొత్తం మీద జీడీపీ లో అధిక వాటా సేవా రంగం, ఉత్పత్తి రంగం. వ్యవసాయ రంగం వాటా బహు తక్కువ. ఈ రోజు ప్రపంచ దిగ్బంధనం తో సేవా రంగం అత్యధికంగా నష్టపోయింది. హాస్పిటాలిటీ రంగం, టూరిజం, వ్యాపారం, వినోదం, క్రీడలు, విమానయానం, ఒకటేమిటి అన్నిరంగాలు మూతబడి పరిస్థితి వచ్చింది. ఈ రంగాల్లోనే ఎక్కువమంది పనిచేస్తున్నారు. వీటిల్లో చాలా భౌతికంగా హాజరయితేనే జరిగేవి. ఇందులో కొన్ని విపరీతమైన పెట్టుబడులు కలిగివున్న రంగాలు. కొద్దిరోజులు పని ఆగిపోతేనే నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి. అటువంటిది నెల రోజులు మూతబడితే వాటి ఆర్ధిక పరిస్థితి వూహించనలవి కాదు. ఈ రంగాలన్నీ తీవ్ర నష్టాల్లోకి వెళ్తాయి. అందులో పనిచేసే ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోతుంది. పర్యవసానం ప్రపంచం మొత్తం వస్తువులకు గిరాకీ ఉండదు. ఇది ఒకనెల అయితే తిరిగి కోలుకోవచ్చు. అదే కొన్ని నెలలు ఏకంగా ఇదే పరిస్థితులు ఉంటే జరిగే పరిణామాలను వూహించలేకపోతున్నాము.

ఇక ఉత్పత్తి రంగం చూస్తే ప్రపంచంలో మొదటి స్థానాల్లో వున్న చైనా, అమెరికా, జపాన్, జర్మనీలు ఇప్పటికే ఒత్తిడిలో వున్నాయి. ప్రధమ స్థానంలో వున్న చైనా దాదాపు రెండు నెలలనుంచి ఉత్పత్తి ఆగిపోయింది. చైనాలో ఉధృతి తగ్గినా తిరిగి పూర్తి స్థాయీ ఉత్పత్తి సాధించటానికి కనీసం నెలపైనే పడుతుంది. ఒకవేళ ఉత్పత్తి చేసినా డిమాండ్ ఉండాలి. అమెరికాలో ప్రస్తుతానికి ఉత్పత్తి ఆగలేదు. కానీ ముందు ముందు ఆగే పరిస్థితులు కనబడుతున్నాయి. జర్మనీ ,జపాన్లు ఇప్పటికే రెడ్ జోనులో వున్నాయి. ఒక వైపు ఉత్పత్తి ఆటంకాలు, రెండో వైపు గిరాకీ లేని పరిస్థితి డిమాండ్-సప్లై కొరతలోకి నెట్టివేయబడ్డాయి.

ఇక ఆయిల్ పరిస్థితులు ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పలేము. సౌదీ-రష్యా ఆయిల్ యుద్ధం భారత్ కు మేలుచేస్తుందని స్థూలంగా అనుకున్నా పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశాలు లేవు. ఆయిల్ పరిశ్రమ సంక్షోభంలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే సౌదీ అధిక ఉత్పత్తి చేసి రష్యా ని, అమెరికా ని దెబ్బ తీయాలని ప్రయత్నించటం ముందు ముందు ఎక్కడకి దారి తీస్తుందో చెప్పలేము. ప్రస్తుతం అమెరికా షేల్ సాంకేతికత తో ఆయిల్ గుత్తాధిపత్యాన్ని బద్దలుచేసినా అది లాభదాయకంగా నడవాలంటే కనీసం బ్యారెల్ కి 50 డాలర్లు రేటు లేకపోతే ఆ రంగం మూతబడటం ఖాయం. ఓ విధంగా రష్యా అదే కోరుకుంటుంది. ఈ కరోనా వైరస్ ఆయిల్ ఉత్పత్తి దేశాల మధ్య కత్తులు నూరే వైరాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేము. చరిత్ర చూస్తే అమెరికా తన వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకోదు. ప్రపంచంలో నూతన ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాలే వున్నాయి. ప్రస్తుతానికి మన కరెంట్ ఖాతా లోటు తగ్గటానికి, ద్రవ్యోల్బణం తగ్గటానికి ఈ పరిస్థితి ఉపయోగపడుతుంది. కానీ దీర్ఘకాలంలో ఇది కొనసాగే అవకాశాలు లేవు.

మనదేశంవరకు చూసుకుంటే సేవా రంగందెబ్బతినటం తో ప్రజల ఆదాయం తగ్గటంతో పాటు ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. దానితో ఆర్థికలోటు ఇంకా పెరుగుతుంది. జీడీపీ ఏదైతే తగ్గుతుందని ఆర్ధిక సంస్థలు అంచనా వేశాయో ఆ మేరకు కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకా గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయి. మనదేశం తీసుకున్న దిగ్బంధన చర్యలు కనుక ఓ నెల రోజుల్లో ఎత్తివేసే పరిస్థితులు లేకపోతే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. అవి వూహించటానికే వీలులేనంత స్థాయిలో ఉండొచ్చు. ప్రభుత్వం ఇచ్చే ఉద్దీపన చర్యలు పరిమిత ప్రయోజనాన్నే ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే ఇది కేవలం ఆర్ధిక మాంద్యం కోణంలో చూడలేము. అంతకన్నా దారుణమైనది. ఆర్ధిక మాంద్యం అయితే ఉద్దీపన చర్యలు తిరిగి ఆర్ధిక పునరుజ్జీవనానికి ఉపయోగపడతాయి. అదే అన్ని కార్యక్రమాలు దిగ్బంధనం చేస్తే ఉద్దీపన చర్యల వలన ఆర్ధిక వ్యవస్థ పుంజుకోదు. నాకు తెలిసి ఆధునిక ప్రపంచంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు.

తక్షణ కర్తవ్యం ఏమిటి?

ముందుగా కరోనా వైరస్ ను ఆపగలగటం. ఇప్పటివరకు భారత్ మిగతా దేశాలతో పోలిస్తే మెరుగ్గానే వుంది. చాలావరకు బయటినుంచి వచ్చే ప్రమాదాన్ని గడప దగ్గరే ఆపగలిగారు. ఇప్పుడు ఏకంగా విదేశీయుల వీసా లన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేయటం సరైన చర్య. ముందుగా ఈ వైరస్ ని మన గడప దగ్గర ఆపగలిగితే సగం ప్రమాదాన్ని నివారించగలిగినట్లే. మిగతాది ఇప్పటికే దేశంలో కి ప్రవేశించిన కేసులు మిగతావారికి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవటం. అందుకు కొద్ది రోజులు అన్ని పబ్లిక్ కార్యక్రమాల్ని రద్దుచేయటం మినహా వేరే మార్గం లేదు. ఇప్పటికే ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు సినిమా హాళ్లు మూసివేశాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. క్రీడా కార్యక్రమాలు రద్దుచేశాయి. సాధ్యమైనంతవరకు ప్రయాణాలు నివారించగలిగితే ఇంకా మంచిది. వీటికి ప్రజలు పూర్తిగా సహకరించాలి. ఇదేదో ప్రభుత్వాలు అతిగా స్పందిస్తున్నాయని అనుకోవద్దు. ఒకసారి దేశంలోకి ప్రవేశించిన మహమ్మారిని రూపుమాపగలిగితే తిరిగి అన్ని కార్యక్రమాల్ని పునరుద్ధరించుకోవచ్చు. అందుకనే మనందరి , మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ మాత్రం మనం సహకరించలేమా?

దానితోపాటు వ్యక్తిగత శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం , దగ్గు, జలుబు వున్న వ్యక్తులకు కనీస దూరం పాటించటం , మన ఇల్లు, పరిసరాలు శుభ్రంగా అట్టిపెట్టుకోవటం మన చేతిలో పని. ప్రభుత్వం చేయాల్సినవి చేస్తే మనం చేయాల్సినవి చిత్త శుద్ధి తో చేద్దాం. ప్రభుత్వం , ప్రజలు కలిసి పనిచేస్తేనే మనం ఈ మహమ్మారిని వేగంగా మన దేశంనుంచి తరిమేయగలం. మనం భయాందోళనలకు గురికావాల్సిందేమీలేదు. ప్రభుత్వం చెప్పినట్లు చేస్తూ తగుజాగ్రత్తలు తీసుకుంటే త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. దయచేసి ఇప్పుడు రాజకీయాలు చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ ఎదో నిరసన ప్రదర్శనలు చేయబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు కావాల్సింది నిరసన ప్రదర్శనలు కాదు. ప్రభుత్వానికి సహకరించటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొత్త తలనెప్పులు తీసుకురావద్దు. రాహుల్ గాంధీ ప్రకటన బాధ్యతారాహిత్యంగా వుంది. ఇన్నాళ్టికి కూడా పరిణితి రాక పోవటం విచారకరం. మీదగ్గర ఏమన్నా నిర్దిష్ట ప్రతిపాదనలుంటే ప్రభుత్వానికి ఇవ్వండి. అంతేగానీ దీంట్లో రాజకీయ లబ్ది పొందాలనుకుంటే ప్రజలు హర్షించరు . ఇప్పుడు కావాల్సింది అందరం కలిసి ఓ వుద్యమం లాగా కలిసి పనిచేయటం. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు కలిసి ముందుకు నడుస్తాయని ఆశిద్దాం. మహమ్మారిని తరిమేద్దాం. ఎంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటే అంతత్వరగా ప్రజలకు మేలు జరుగుతుంది. అందరం అందుకు సహకరిద్దాం.

Vaani Kapoor Hot Pics

Adah Sharma Latest Hot Photos

చెల్లిని హతమార్చిన అన్నదమ్ములు

సమాజంలో రోజురోజుకు మానవత్వ విలువలు పతనమవుతున్నాయి. పరువు పేరుతో హత్యలు కొనసాగుతున్నాయి. చెల్లి ఒకరిని ప్రేమించిందని సొంత అన్నదమ్ములే దారుణంగా హత్యచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌ సమీపంలోని న్యూమండిలో ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్లోని కొకడ గ్రామానికి చెందిన సుమిత్‌కుమార్‌, సోను అన్నదమ్ములు. వీరికి ఒక చెల్లి ఉంది. ఆమె భర్త రెండేళ్ల కింద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే ఆ తర్వాత ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఇంట్లో చెప్పి ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఆ చెల్లెలు సోదరుల ముందుంచింది. అయితే దీనిని అన్నదమ్ములిద్దరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ యువకుడితో సంబంధాన్ని మానుకోవాలని చెల్లిలిని పలుమార్లు హెచ్చరించారు.

అయితే ఈ యువకుడిని ప్రేమిస్తున్న ఆ సోదరి వాళ్ల మాటలను పట్టించుకోలేదు. తరుచూ ప్రేమికులు కలిసుకుంటుండటంతో తమ పరువు పోతుందని అన్నదమ్ములు భావించారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ములిద్దరూ చెల్లి గొంతు నులిమి హతమర్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా కుటుంబ సభ్యుల సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆ యువకుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన చెల్లిని అన్నదమ్ములే గొంతునిలిమి చంపడం చూస్తుంటే.. మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో అద్ధంపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ తో పోటీ పడుతున్న కింగ్

టెలివిజన్ షోలలో ‘బిగ్ బాస్’కు ప్రత్యేక స్థానం ఉంది. సెలబ్రెటీలు, సామాన్యులతో ఇప్పటివరకు వచ్చిన ‘బిగ్ బాస్’ బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే మూడు సీజన్లలో ‘బిగ్ బాస్’ అలరించింది. తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించేందుకు నిర్వాహాకులు రెడీ అవుతున్నారు. ‘బిగ్ బాస్-4’కు హోస్ట్ గా వ్యవహరించేది వీరేనంటూ సోషల్ మీడియాలో వార్తలు విన్పిస్తున్నాయి. వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున పేర్లు ఉండటం ఆసక్తిని రేపుతోంది.

‘బిగ్ బాస్’ మొదటి సీజన్లో ఎన్టీఆర్, రెండో సీజన్లో నాని, మూడో సీజన్లో నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. ఇక నాలుగో సీజన్ గా హోస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవహరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మహేష్ సన్నిహితులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. మహేష్ ఇలాంటి షోలు చేయడంపై ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. అలాగే మహేష్ ను బిగ్ బాస్ నిర్వాహకులు ఇంతవరకు సంప్రదించలేదని చెబుతున్నారు.

‘బిగ్ బాస్’ సీజన్లలో ఒక్క ఎన్టీఆర్ మాత్రం హోస్ట్ గా రాణించారు. మిగతావాళ్లు అనుకున్నంతగా ఫార్మామెన్స్ చేయలేదు. ఇప్పటికే నాగార్జున మూడవ సీజన్ కు హోస్టుగా వ్యహరించిన ఆయనే బిగ్ బాస్-4 సీజన్ కు తీసుకోవాలని నిర్వాహాకులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా నిర్వాహాకులు ప్రకటిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆకాశాన్ని తాకిన పారితోషకాలు

సినిమా రంగంలో విజయాలు శాశ్వతం కాదు. తరచూ మారిపోతుంటాయి. అందుకే తారలు మరియు సాంకేతిక నిపుణులు తమ తమ పారితోషకాలను సక్సెస్ ఉన్నపుడే పెంచు కొంటూ పోతారు. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ఒక దర్శకుడు మరియు హీరో తమ కొత్త చిత్రాలకు తీసుకొంటున్న పారితోషకాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. నిజానికి ఒక పెద్ద సినిమా బడ్జెట్ లో సగానికి పైగా పారితోషకాలు హీరో మరియు దర్శకుడికే వెళ్లిపోతాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను నెక్స్ట్ తీబోయే చిత్రానికి గాను పారితోషకం గా 20 కోట్లు తీసుకొంటున్నాడట…

అల వైకుంఠపురములో చిత్రానికి డైరెక్ట్ చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పదిహేను కోట్ల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. అల వైకుంఠపురం లో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు జూనియర్ ఎన్ టి ఆర్ తో చేయబోయే సినిమాకి త్రివిక్రమ్ పారితోషికం ఇరవై కోట్లు అయిందట.

అలాగే ఈ సినిమాకి తారక్ కూడా తన పారితోషికం భారీగా తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్ టి ఆర్ కి ఈ సినిమాలో నటించేందుకు నలభై కోట్లు పారితోషకంగా ముడుతుంది. దానికి తోడు అన్నయ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి భాగస్వామి కాబట్టి అతనికి వచ్చే లాభంలో వాటా కూడా వసుంది. ఆ లెక్కన రెండు విధాలా లాభ పడ నున్నాడు.
కేవలం పారితోషకం గానే త్రివిక్రమ్, తారక్ ఈ చిత్రానికి అరవై కోట్లు వసూలు చేస్తుంటే అంటే ఇక మిగతా ఖర్చులన్నీ కలిపి ఎంత అవుతాయో …అని అందరూ షాక్ అవుతున్నారు. అనధికారంగా తెలుస్తున్న దాన్ని బట్టి ఈ సినిమాకి 120 నుంచి 130 కోట్ల దాకా బడ్జట్ అవుతుందని అంటున్నారు. ఇంత ఖర్చు పెట్టి నిర్మించే ఈ భారీ చిత్రానికి పేరేమిటో తెలుసా ? ..”.అయినను పోయిరావలె హస్తినకు ” వెరైటీగా వుంది కదూ.
Bread will made as per mill

తెలుగు తెర ఫై మరో మళయాళ కుట్టి

రీమేక్ చిత్రాలంటే ఎక్కువ మక్కువ చూపే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మరో రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా తమిళం లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అసురన్ ఇపుడు తెలుగులోవెంకటేష్ హీరోగా నారప్ప పేరుతొ రీమేక్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా ఇందులో ఇద్దరు హీరోయిన్ లు నటించాల్సి ఉంది . అందులో ఒక హీరోయిన్ గా ప్రియమణి నటిస్తోంది. కాగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేమరో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంలో చాలా వార్తలు బయటికి వచ్చాయి.. ఓ సందర్భంలో అమలాపాల్ నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మలయాళ ముద్దు గుమ్మ రెబా జాన్ రెండో హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన రెబా జాన్..గత ఏడాది వచ్చిన బిగిల్ (తెలుగులో విజిల్ ) చిత్రం లో అనిత అనే పాత్రలో నటించడం జరిగింది.ఆయా చిత్రాల్లో రెబా జాన్ నటన చూసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆమెను సంప్రదించడం ఆమె ఓకే అనడం జరిగిపోయింది.. ఆసక్తికరమైన విషయమేమంటే..ఈమె నా పేరు సూర్య,శైలజా రెడ్డి అల్లుడు ఫేమ్ అను ఇమ్మాన్యుయేల్ కి సోదరి అవుతుంది. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను, తెలుగు నిర్మాత డి.సురేశ్ బాబు తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదల అయ్యే నారప్ప చిత్రం అగ్రవర్ణాల , దళితుల మధ్య భూవివాదాల నేపథ్యంలో రూపొందుతోంది.
Beauty has no language barriers

Actress Twiinkle Saaj Photo Stills

ఉన్నావ్ దోషికి మరో భారీ షాక్!

ఉన్నావ్ అత్యాచార కేసుకు సంబంధించి దోషి కుల్‌ దీప్‌ సెంగార్‌ కు ఢిల్లీ కోర్టు మరో షాక్ ఇచ్చింది. కేసులో పదిసంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే ఉన్నావ్ అత్యాచార కేసులో సెంగార్‌‌ కు యావజ్జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే.. అత్యాచార బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించిన కేసులో మరో 10ఏళ్ళ జైలు శిక్ష విధించింది కోర్టు. కుల్‌ దీప్‌ సెంగార్‌ ను అరెస్టు చేయడానికి బదులుగా ఉన్నావో పోలీసులు అక్రయ ఆయుధాల కేసులో బాధితురాలి తండ్రిని అరెస్టు చేసి, చిత్రహింసల పాలుజేశారు. దీంతో బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలోనే మరణించారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు, సెంగార్‌ కు, అతని తమ్ముడికి పదేళ్ల జైలు శిక్ష, పదిలక్షల జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబానికి దోషులిద్దరూ చెరో పదిలక్షలు చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

2019 జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జైళ్లో ఉన్న తన బంధువును కలుసుకోడానికి లాయర్, కుటుంబసభ్యులతో వెళ్తున్న ఆమె వాహానాన్ని ట్రక్కుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, బాధితురాలు, లాయర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసును ఢిల్లీకి బదిలీచేసి.. బాధితులను వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌ లో సఫ్దర్జంగ్ హాస్పిటల్‌ కు తరలించారు.

ఒక్కసారికే.. ఐటమ్ అయిపోతానా: రెజీనా


రెజీనాను కుర్రకారులో భారీ క్రేజీ ఉంది. ఈ అమ్మడి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ చిరంజీవి పక్కన హీరోయిన్ కాదు.. ఒక స్పెషల్ సాంగ్లో ఆయన పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుంది. చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ కోసం రెజీనాను సంప్రదించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే రామోజీ ఫిల్మీ సిటీలో చిరంజీవి-రెజీనాలపై ఓ మాస్ బీట్ సాంగ్ చిత్రీకరించారు.

తాజాగా రెజీనా చిరు పక్కన నటించిన ఐటమ్ సాంగ్ పై స్పందించింది. మెగాస్టార్ పక్కన డాన్స్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. చిరంజీవి పక్కన స్పెషల్ సాంగ్‌ అనగానే ఆలోచించకుండా ఒప్పుకున్నాన్నట్లు చెప్పింది. ఈ సాంగ్‌లో నటించినందుకు మాత్రం తనను ఐటమ్‌ అనవద్దని.. ఈ సాంగ్‌ను కూడా ఐటమ్‌ సాంగ్‌ అని పిలవద్దని విజ్ఞప్తి చేసింది. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ సాంగ్ చెబుతుంది. మెగాస్టార్ తన తన డాన్స్‌ను మెచ్చుకున్నారని అమ్మడు మురిసిపోతుంది.

‘ఆచార్య’ మూవీలో చిరుకు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. ఇందులో తెలుగమ్మాయి ఈషారెబ్బా, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాంచరణ్ కొణిదల ప్రొడక్షన్లో ఈ మూవీని మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. చిరంజీవి మూవీ మణిశర్మ చాలా ఏళ్ల తర్వాత సంగీతాన్ని సమకురుస్తున్నాడు.

నిజమే.. ఆ పార్టీని మోసం చేశాం..: బీజేపీ


బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి సుధీర్‌ ముంగంతివార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము ఉధ్యేశ పూర్వకంగానే శివసేన పార్టీని మోసం చేశామని ముంగంతివార్‌ అంగీకరించారు. అసెంబ్లీ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు తరహాలో బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటిగా సాగుతాయని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎన్సీపీ నేత అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, ఎన్సీపీ, కాంగ్రెస్ అనుబంధం మూడునెలలని, బీజేపీ-శివసేన మధ్య బంధం 30ఏళ్ళని అన్నారు. మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోకపోవడం ద్వారా బీజేపీ తప్పు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము ప్రభుత్వ ఏర్పాటుకు వెనుకడుగు వేయడంతో ఎన్సీపీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుందని సుధీర్‌ అన్నారు. తమ తప్పును తెలుసుకుని తిరిగి రెండు పార్టీలు కలిసే సమయం ఎంతో దూరంలో లేదని, తమ కలయికను సులభతరం చేసేలా మహారాష్ట్రలోనూ జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారని వ్యాఖ్యానించారు.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కవిత ఓటమి ప్రభావం!

నిజామాబాదు నుండి లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తన కుమార్తె కవితే ఓటమిని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇంతా జీర్ణించుకోలేక పోతున్నారా? దానిని తన వ్యక్తిగత ఓటమిగా భావిస్తున్నారా? అంటే రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థుల ఎంపిక తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది.

కవిత ఓటమికి పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తిరుగుబాటు చేసిన మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ను మూల కారకుడిగా భావిస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా కవితపై గెలుపొందిన డి అరవింద్ ఆయన కుమారుడే కావడం గమనార్హం.

ఒక వంక కాంగ్రెస్ కు చెందిన కీలక వ్యక్తులు అందరు అరవింద్ కు మద్దతు ఇచ్చేటట్లు చేయడంతో పాటు, టి ఆర్ ఎస్ లో కవిత పట్ల విముఖంగా ఉంటున్న వారు సహితం బిజెపికి అండగా అండగా ఉండే విధంగా శ్రీనివాస్ తెరవెనుక నుండి చక్రం తిప్పారని భావిస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న తనను తన సొంత జిల్లా నుండి ఎంపీగా ఉన్న సమయంలో కవిత లెక్కచేయక పోవడం, పైగా పలు సందర్భాలలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తూ ఉండడంతోనే శ్రీనివాస్ పార్టీపై ఎదురు తిరిగారని చెబుతున్నారు.

ఈ విషయంలో కుమార్తెకు నచ్చచెప్పలేక కేసీఆర్ మౌనం వహించడంతో కవిత ఓటమికి డీఎస్ కంకణం కట్టుకున్నారు. పైగా బిజెపి అభ్యర్థిగా కుమారుడే పోటీ చేస్తూ ఉండడంతో అతని గెలుపుకోసం చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేశారు.

జరుగుతున్న ప్రమాదాన్ని ఎన్నికల సమయంలోనే గ్రహించిన కేసీఆర్ అదే జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నేత మండవ వెంకటేశ్వరావు ఇంటికి స్వయంగా వెళ్లి, టి ఆర్ ఎస్ లో చేరి కుమార్తెకు మద్దతు ఇచ్చేటట్లు చేసుకున్నారు. ఆయన రెండు రోజులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది.

నిజామాబాదు లో డీఎస్ ప్రాబల్యాన్ని కట్టడి చేయడం కోసం ఆ జిల్లా నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డిని ఒక వంక రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తద్వారా ఆ జిల్లాల్లో రాజకీయంగా ప్రాబల్యం వహిస్తున్న సామజిక వర్గాన్ని సంతృప్తి పరచే ప్రయత్నం చేశారు.

మరోవంక డీఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సామజిక వర్గానికే చెందిన కె కేశవరావుకు సీట్ నిరాకరిస్తే ఆ వర్గంలో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉన్నదని గ్రహించి ఆయనకు మరోసారి సీట్ ఇవ్వక తప్పలేదు. ఇప్పటికే రెండు సారులుగా రాజ్యసభ సభ్యుడుగా ఉంటున్న ఆయన వయస్సు 80 సంవత్సరాలు.

కుమార్తె కవితను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా, వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ ఎంపిక చేసారని చెబుతున్నారు. త్వరలో కుమారుడికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పడానికి అదును కోసం ఎదురు చూస్తున్న ఆయన ఆమెను ఇప్పుడు ఢిల్లీకి పంపడం పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.