వచ్చే సంవత్సరం మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో బీజేపీ దళిత్ కార్డు ప్రయోగిస్తున్నది. సుమారు ఎనిమిది నెలల వరకు కాలయాపన చేసి, చివరకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా యువకుడు, హైకోర్టు న్యాయవాది, దళిత్ ఉద్యమకారుడు ఎల్ మురుగన్ ను నియమించడం ద్వారా రాష్ట్ర రాజకీయ వర్గాలలోని కాకుండా, సొంత పార్టీలో ఆ పదవి ఆశించిన పలువురు సీనియర్లను సహితం ఆశ్చర్యానికి గురిచేశారు.
తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళశై సౌందరాజాన్ ను తెలంగాణ గవర్నర్ గా పంపిన తర్వాత, ఆమె స్థానంలో ఇప్పుడు 43 ఏళ్ళ యువ న్యాయవాదిని నియమించడం రాజకీయంగా కీలకమైన మలుపు కానున్నది. దీంతో బిజెపిని బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణాలకు చెందిన పార్టీగా చేస్తున్న ప్రచారానికి తెరపడే అవకాశం ఉంది.
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ వైస్ చైర్మన్ గా డీఎంకే తమ పార్టీ అధికార పత్రికను ఒక `పంచమి’ భూమి నుండి ప్రచురిస్తూ ఉండడంపై ఎవ్వరు ఫిర్యాదు చేయకుండానే సుమోటో గా ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టడం ద్వారా మురుగన్ ఇదివరకు సంచలనం సృష్టించారు.
“పంచమి” భూములు అంటే వ్యవసాయం చేయడం కోసం బిరిధ్స్ వారి కాలంలో బలహీన వర్గాలకు కేటాయించిన భూములు. ఈ భూముల బదలాయింపులపై ఆంక్షలు ఉన్నాయి. ఈ కమీషన్ ఆయన పనితీరు ఎస్సి వర్గాలలో అందరి ప్రశంసలు పొందింది. “ఆయన ఒకరు ఫిర్యాదు చేసేవరకు ఆగరు. తానే సుమోటో గా తీసుకొని దర్యాప్తు చేబడతారు” అంటూ గుర్తింపు పొందారు.
తిరిచిలో గత జనవరిలో జరిగిన బిజెపి దళిత్ కార్యకర్త విజయ్ రఘు హత్యలో లవ్ జిహాదీ కోణంపై దర్యాప్తు జరిపమని జాతీయ ఎస్సి కమీషన్ ఆదేశించడంలో సహితం మురుగన్ కీలక పాత్ర వహించారు. దానిని వ్యక్తిగత ద్వేషంతో జరిగిన హత్యగా పోలీసులు పేర్కొంటే, తన కుమార్తె లవ్ జిహాదీ కారణంగా జరిగిన హత్యగా మురుగన్ పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ నుండి ఎస్సి అభ్యర్థి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆ వర్గానికి ఎప్పుడు ఇవ్వలేదు. ఇక డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు కూడా ఆ వర్గానికి చెందిన వారెవ్వరికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. దానితో ఇప్పుడు రాష్ట్రలో ఎస్సి, ఇతర బలహీన వర్గాలలో చొచ్చుకు పోవడానికి బిజెపికి అవకాశం ఏర్పడే వీలున్నది.