మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన అసలు పేరుతొ కెరీర్ ప్రారంభం లో పిల్ల నువ్వులేని జీవితం , సుప్రీమ్ ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్లు కొట్టి తన సత్తా చాటాడు. ఆ తర్వాత వరుసగా తిక్క, విన్నర్, జవాన్, నక్షత్రం, ఇంటెలిజెంట్ , తేజ్ ఐ లవ్ యు వంటి ఆరు చిత్రాలు ఫ్లాప్ కావడం తో న్యూమరాలజీ ప్రకారం పేరులో ధరమ్ ని తీసేసాడు ఈ మెగా మేనల్లుడు.. ఇక సాయి తేజ్ అనే పేరులో సౌండింగ్ గొప్పగా లేకపోయినా కానీ ఈ స్క్రీన్ నేమ్ నిజంగానే అతనికి భలేగా కలిసి వస్తోంది.
అలా పేరు మార్చుకున్నతరవాత తొలి గా వచ్చిన చిత్రలహరి సినిమాతో మెగా మేనల్లుడి అదృష్టం సుడి తిరిగింది. ఇక ఆ తరవాత వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా ఏకం గా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సుమారు నలభై కోట్లు షేర్ వసూలు చేసింది.
ఇప్పుడు అతని తాజా చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్” ఇంకా రిలీజ్ కూడా కాకముందే నిర్మాతలకి విపరీతమైన లాభాలు తెచ్చి పెడుతోంది. ఇది కొత్త దర్శకుడు సుబ్బు తీస్తున్న సినిమా అయినా కానీ దీనికి బిజినెస్ బాగా జరుగుతోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా సూపర్ గా జరిగింది. అలాగే సాటిలైట్, డిజిటల్ హక్కులకు కలిపి ఇంకో పది కోట్లు కూడా వచ్చాయట…
ఇరవై కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి నిర్మాత ఒక ఇరవై కోట్లు టేబుల్ ప్రాఫిట్ వెనకేసుకుంటున్నాడు.అంటే డబల్ లాభం అన్నమాట. ఇదంతా సాయి ధరమ్ తేజ్ తన పేరులోని ధరమ్ ని త్యాగం చేయడం వల్లనే జరిగింది అని అందరూ అంటున్నారు. అలా పేరు మార్చిన వేళా విశేషం వల్లనే ఏమో ఇప్పుడు బెటర్ డెసిషన్స్ కూడా తీసుకొంటున్నాడు.
Right decision in right time