ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ప్రగల్బాలు పలికిన జనసేన, బిజెపి కూటమి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చతికలబడింది.
అన్ని స్థానాలలో పోటీ చేసి తమ ప్రభావాన్ని చాటుతామని చెప్పుకొంటూ వచ్చిన నేతలు ఇప్పుడు సగం స్థానాలలో కూడా అభ్యర్థులను నిలబెట్టలేక పోయారు. ఈ కూటమి మీడియా సమావేశాలకు పరిమితం కావడం తప్ప ఇప్పటివరకు జనం మధ్యకు వెళ్లిన దాఖలాలే లేవు.
ప్రస్తుతం 9694 ఎంపిటిసి పదవులకు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఈ కూటమి కనీసం సగం స్థానాలలో కూడా అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. జనసేన 2027 చోట్ల పోటీ చేస్తుండగా, బీజేపీకి 1816 చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నది. అంటే 5851 చోట్ల ఈ కూటమి అభ్యర్థులే లేరు.
మరోవంక, మున్సిపాలిటీ లలో అయినా వీరు పోటీ చేయలేక పోయారు. జనసేన 434, బీజేపీ 554 వార్డులు, డివిజన్ లలో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలిగారు. వీరిలో మరెంతమంది గెలుస్తారో సందేహాస్పదమే.
కూటమి పేరుకే గాని, స్థానికంగా ఈ రెండు పార్టీలు తలో పార్టీతో కుమ్మక్కైన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలుచోట్ల జనసేన టిడిపి అభ్యర్థులతో అవగాహనకు వస్తుండగా, బిజెపి అభ్యర్థులు వైసిపి అభ్యర్థులతో చేతులు కలుపుతున్నారు.
స్థానిక సంస్థలలో కనీసం అభ్యర్థులను కూడా పెట్టలేని దుష్టితిలో ఉన్న బిజెపి నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వైసిపి దౌర్జన్యాలకు పాల్పడి ఎవ్వైర్ని నామినేషన్లు కూడా వేయనీయడం లేడని అంటూ ఆరోపణలతో కాలం గడుపుతున్నది. పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి వివరించగా, రాష్త్ర అధ్యక్షుడు కన్నా లక్షనారాయణ ఆయనకు లేఖ వ్రాసారు.
మరోవంక రాష్ట్ర బిజెపి నాయకులు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికార పక్షం చెప్పిన్నట్లే నడుచుకొంటున్నాట్లు ఆరోపణలు చేశారు.