Home Blog Page 8588

స్థానిక ఎన్నికలు… చేతులెత్తిసిన టిడిపి!

స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా జరుగుతూ ఉండడం, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితులు కూడా నెలకొండడంతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిక్కుతోచని పరిస్థితులలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.

ఒక వంక అనేకమంది ప్రముఖ నాయకులు అధికార పక్షం నుండి వత్తిడులకు తట్టుకోలేదు పార్టీ మారుతూ ఉంటె, మరో వంక పలువురు సీనియర్ నేతలే అధికార పక్షపు దౌర్జన్యాలను, పోలీసుల వేధింపులను తట్టుకోలేక పోటీకి దూరంగా ఉంటూ ఉండడంతో టిడిపి పోలింగ్ కు ముందుగానే చేతులు ఈట్టివేసిన్నట్లు అవుతున్నది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక పోవడం, ఆయన అధికారమలోకి రాగానే అభివృద్ధి పనులు అన్ని స్తంభించి పోవడం, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దారుణంగా పడిపోతూ ఉండడంతో అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజులలోనే తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటు ఉండడంతో జగన్ ను ఎన్నుకున్న ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారనే ఒక విధమైన అపోహలో టిడిపి నేతలు చిక్కుకు పోయారు.

అయితే వాయిదా వేసే అవకాశం ఉన్నప్పటికీ హడావుడిగా, తగు వ్యవధి లేకుండా అన్ని ఎన్నికలను ఒకేసారి జరుపుతూ ఉండడంతో టిడిపి నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జగన్ పాలనా పట్ల ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రజల తమ ఆగ్రవేశాలను వ్యక్తం చేస్తారని ఎదురు చూస్త్తూ ఉన్నారు. అయితే తీరా ఎన్నికలు జరిగే సరికి ప్రతిపక్షాలు అస్త్రసన్యాసం జరిపినట్లు అవుతున్నది.

వాస్తవానికి ఇప్పటిలో జగన్ ను తాము ఎదుర్కోలేమని దాదాపు టిడిపి నేతలంతా ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రజలు విసుగుచెంది , తిరగబడే వరకు మౌనంగా ఉంటె మంచిదని కూడా భావిస్తున్నారు. కేవలం చంద్రబాబునాయుడు మాత్రమే తన ఉనికిని ప్రదర్శిస్తూ ఉండాలని తాపత్రయ పడుతున్నారు. దానితో జగన్ ఎత్తుగడల ముందు తప్పుకోలేక పోతున్నారు.

ఒక వంక డిజిపి హైకోర్టు లో రోజంతా అనిలబడి, సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడినా, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆత్మరక్షణలో పడినా అధికార పార్టీ మాత్రం ఏమాత్రం బెదిరిపోవడం లేదు. జగన్, ఆయన సహచరులతో కనిపిస్తున్న మనోనిబ్బరం టిడిపి నేతలను కలవారానికి గురిచేస్తున్నది. మీడియా దృష్టి ఆకర్షించడం కోసం మొక్కుబడిగా నిరసనలు వ్యక్తం చేయడమే తప్పా ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరించే సాహసం మాత్రం చేయలేక పోతున్నారు.

సమాజంలో ధైర్యం నూరిపోసేందుకే జనసేన పార్టీ

• మనకు బలం ఉంది… కాబట్టే మనపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు
• రాష్ట్ర ప్రయోజనాలకు మన పార్టీ అవసరం
• ఏడేళ్లు కాదు ఏడు దశాబ్దాలయినా జనసేన నిలబడుతుంది
• అధికారం వచ్చినా రాకున్నా జనసేన ఉనికి కోల్పోదు
• దేశ సమగ్రతకు అవసరమనే బీజేపీతో పొత్తు
• క్రిమినల్స్ మనల్ని పాలించాలి అనుకొంటే వైసీపీకి మద్దతు ఇవ్వండి

శనివారం సాయంత్రం ధవళేశ్వరం సమీపంలోని శ్రీరామ పాదాల రేవులో మన నది – మన నుడి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ మనల్ని ఒక విధంగా భయపెడితే… వైసీపీ మనల్ని మరోలా భయపెట్టాలని చూస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. లొంగిపోయి ఉనికి కోల్పోతామో… గుండె ధైర్యంతో నిలబడి సత్తా చాటడమో యువతే నిర్ణయించుకోవాలని అన్నారు. క్రిమినల్స్ మనల్ని పాలించాలి అనుకుంటే వైసీపీకి మద్దతు ఇవ్వండి… సమ సమాజం నిర్మిద్దామనుకుంటే జనసేనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ధైర్యం, తెగింపు ఉండాలని, లేనివారు జనసేనలోకి రావొద్దని అన్నారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “సమాజానికి పిరికితనం ఆవహించింది. దానిని తొలగించి, ధైర్యం నూరిపోయడానికే జనసేన పార్టీ పెట్టాను. పార్టీ ప్రారంభించే నాటికి ఆంధ్ర పాలకులు చేసిన తప్పులకు ఆంధ్ర ప్రజలను తిడుతుంటే, దాడులు చేస్తారనే భయంతో ఒక్క నాయకుడు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోయారు. ఒక్కొక్కరికి వేలకోట్లు, వేల ఎకరాలు ఉన్నా వారిలో ధైర్యం చచ్చిపోయింది. ధైర్యంగా ఒక్కడైనా మాట్లాడాలని ఆ రోజు పార్టీ పెట్టాను.

• పిడుగు మీద పడ్డా నిలబడే వ్యక్తులు కావాలి
అధికార పార్టీ బెదిరింపులకు, ఒత్తిళ్లకు భయపడి కొంతమంది నాయకులు పారిపోతున్నారు. అలాంటి వారిని పెట్టుకొని పార్టీ నిర్మాణం చేయలేను. పిడుగు మీద పడ్డ, ఫిరంగు వదిలినా బెదరకుండా నిలబడే వ్యక్తులే పార్టీకి కావాలి. అలాంటి వారి కోసమే ఎదురుచూస్తున్నాను. రాజమండ్రిలో కవాతు చేస్తే దాదాపు 10 లక్షల మంది వరకు వచ్చారు.

ఓటు మాత్రం ఎవరైతే రౌడీయిజం చేస్తారో, క్రిమినల్స్ ను ప్రోత్సహిస్తారో వారికి వేశారు. మహాత్ముడిని పూజిస్తాం… నేతాజీని గౌరవిస్తాం… అంబేద్కర్ ను గుండెల్లో పెట్టుకుంటాం… కానీ ఎన్నుకున్నది మాత్రం నేరచరిత్ర ఉన్న వ్యక్తులని. ఇదేమి లాజిక్కో నాకు అర్ధం కాదు. ఓటమి ఎదురైనా ఎక్కడో ఒక దగ్గర మార్పు రావాలని బలంగా నిలబడ్డాను. ఏడు సంవత్సరాలు కాదు ఏడు దశాబ్దాలు అయినా జనసేన పార్టీ బలంగా నిలబడుతుంది.

•జనసేన ఉనికి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు
భారత దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన హోంమంత్రి అమిత్ షా గారు. అలాంటి వ్యక్తి వచ్చి భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయమని కోరినా కాదన్నాను. రాష్ట్ర ప్రయోజనాలకు జనసేన పార్టీ అవసరం ఉందని గ్రహించి ఆ నిర్ణయం తీసుకున్నాను. జనసేన అనే ఉనికి కోల్పోతే పవన్ కళ్యాణ్ లేనట్లే. పార్టీ ఉనికిని ఎప్పుడూ కాపాడుతాను. అధికారం వచ్చినా రాకపోయినా ఉనికి మాత్రం కోల్పోము. ఏదో ఒక రోజు జనసేన అనే మొక్క మహావృక్షమై తీరుతుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో విభేదించాను తప్ప… నా స్వార్ధం కోసం ఏనాడు విభేదించలేదు. రాజకీయాలు అంటే జనసేన పార్టీకి నేషనల్ సర్వీసు.
జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీతోపాటు అన్ని పార్టీలు వెంపర్లాడాయి. కానీ జనసేన మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీనికి కారణం దేశాన్ని పటిష్టం చేయాలన్న, దేశసమగ్రతను కాపాడాలన్న అది బీజేపీతోనే సాధ్యం. ముఖ్యంగా బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. మిగతా పార్టీలన్ని వారసత్వ పార్టీలే. ఇవాళ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మాదిరి భవిష్యత్తులో ఆ పార్టీలో ఇంకా బలమైన నాయకులు వస్తారు. కర్ణాటకలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక జర్నలిస్టునీ, న్యాయవాదినీ ఎంపీలుగా చేసింది. దేశానికి ఇలాంటి పార్టీ అవసరమని పార్టీ నాయకులతో ముఖ్యంగా ముస్లిం నాయకులతో చర్చించి పొత్తు పెట్టుకున్నాం.

• వైసీపీ నాయకులది మేకపోతు గాంభీర్యం
2018 అక్టోబర్ లో తిత్లీ తుపాన్ సంభవించి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయితే జనసేన పార్టీ పరుగుపరుగున అక్కడికి చేరుకుంది. చిమ్మ చీకట్లలో బాధితులకు అండగా నిలబడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ అలాంటి పార్టీ గెలిచింది అంటే తప్పు జనసేనది కాదు… ఓట్లు వేసిన ప్రజలది. వైసీపీ నాయకులు ఢిల్లీలో బీజేపీ నాయకులకు మద్దతుగా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి మేము వాళ్లకు వ్యతిరేకం అంటారు. ఢిల్లీలో కాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడకొచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. నేను అలా చేయను. జనసేన పార్టీ స్థాపించింది అందరూ వదిలేసిన సమస్యలను పరిష్కరించడానికే. నిస్సహాయులకు అండగా ఉండాలనే. కర్నూలులో 14 ఏళ్ల అమ్మాయి సుగాలీ ప్రీతిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. న్యాయం చేయాలని అన్ని ఆధారాలతో దివ్యాంగురాలైన ఆమె తల్లి కన్నీటితో వేడుకుంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంగానీ, ఇప్పటి వైసీపీ ప్రభుత్వంగానీ పట్టించుకోలేదు. జనసేన పార్టీ పోరాడి బాధితులకు అండగా నిలబడింది కనుకే ఇవాళ సుగాలీ ప్రీతి కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. గోదావరి రైతుల సమస్యలు, అమరావతి రైతుల ఆవేదనను ప్రపంచానికి తెలిసేలా చేశాం. వ్యవస్థలో మార్పు రావాలంటే మనలాంటి వారు బయటకు రావాలి.

• మాదైన రోజున సత్తా చూపిస్తాం
జనసేన పార్టీకి బలం ఉండబట్టే వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని వదిలేసి మన పార్టీ నాయకుల మీద దాడులు, బెదిరింపులకు పాల్పడుతుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నాయకులపై దాడులకు పాల్పడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్య, పార్టీ పి.ఏ.సి. సభ్యులు డా.హరిప్రసాద్, శ్రీకాళహస్తి పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత, ఇతర నాయకులపై కేసులుపెట్టారు. అనంతపురంలో పీఏసీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదర్ రెడ్డిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, జిల్లాలో నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారు. జనసేన ప్రభావం ఏమీ లేదంటూనే భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇన్ని బెదిరింపులకు దిగుతున్నా అనంతపురం జిల్లాలో శ్రీమతి పద్మావతి పోటీకి దిగారు. అలాంటి వీరమహిళలు మనకు ఉన్నారు. కాకినాడలో దాడులు చేసినప్పుడూ వీర మహిళలు ధైర్యంగా ఉన్నారు. అధికార పార్టీ దాడులకు, ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా నిలబడ్డ అభ్యర్ధులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జనసైనికులపై దాడులు చేసినా, అక్రమంగా కేసులు పెట్టి బెదిరించినా, ప్రలోభాలకు గురి చేసినా బలంగా నిలబడే సమూహం జనసేనది. మాదైన రోజున సత్తా చూపిస్తాం. అప్పటి వరకు భరిస్తామని” అన్నారు.

ప్రకృతి ప్రకోపిస్తే ఎంతగొప్ప నాయకులైన మటాష్..

• దేశంలో జీవ నదులు కలుషితమవుతున్నాయి
• జీవానిచ్చే నది… జీవనాన్ని ఇచ్చే నుడిని కాపాడుకోవడం అందరి బాధ్యత
• ‘మన నది – మన నుడి’ ప్రారంభోత్సవంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

శనివారం సాయంత్రం ధవళేశ్వరం సమీపంలోని శ్రీరామ పాదాల రేవులో మన నది – మన నుడి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… మనకు జీవం ఇచ్చే జలాలకు… జీవనాన్ని ఇచ్చిన నుడికి గౌరవం తెలపడానికే ‘మన నది – మన నుడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అంతరించిపోతున్న విలువలను కాపాడుకోవడానికి, కాలుష్య కాషారంగా మారుతున్న నదులను పరిరక్షించుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సంధ్యాసమయంలో ఇంత చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని చెప్పారు.  “గురువుకి నమస్కరించి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా అది విజయవంతం అవుతుంది. ఇవాళ నా గురువు స్థానంలో ఉన్న సుబ్బరాయుడు శర్మగారి పాదాలకు నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రకృతి ప్రకోపిస్తే ప్రపంచాన్ని శాసించే గొప్ప గొప్ప నాయకులను కూడా ఇంట్లో కూర్చోపెడుతుంది. ఇవాళ కరోనా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికించే నాయకులను ఇంట్లో కూర్చొబెట్టింది. అందుకే ప్రకృతిని స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు.

• సత్యం కోసం ప్రాణాలు ఇస్తాం

భారతదేశం వేదభూమి. ఎవరు ఎన్ని దాడులు చేసినా మన సంస్కృతి నశించదు. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలను సమానంగా గౌరవించడం భారతదేశ జీవన విధానం. అలాంటి దేశంలో జీవనాడులైన నదులు కలుషితమవుతున్నాయి. వాటిని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత. అందుకే గోదావరమ్మ ఒడ్డున ఇవాళ ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కొంతమంది నాయకులు మన భాషను ఉపయోగించి వేలకోట్లు, వేల ఎకరాలు సంపాదించారు. ఇప్పుడు ఆ భాషనే చంపేయాలని చూస్తున్నారు. భాషను కాపాడుకోవడానికి ఈ సమాజంలో ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు. సంస్కృతిని కాపాడుకోవడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, సత్యం కోసం ప్రాణాలైన అర్పిస్తాం.
పెద్ద బాలశిక్ష సంపూర్ణమైన జ్ఞానం ఇస్తుంది. అందుకే బాలబాలికలకు పెద్ద బాలశిక్షను కానుకగా ఇచ్చాను. నదులను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఎలాంటి విధానాలు అవలంబించాలి అనేది తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. నదులు, భాషను రక్షించుకోవడానికి ఎవరి స్థాయిలో వారు కృషి చేయాల”ని కోరారు.

Shraddha Srinath Sizzling Photos

Iswarya Menon Saree Photos

పురందేశ్వరి అమరావతి మహళలకు మద్దతు ఇవ్వరా!

అమరావతి మహిళలు సుమారు మూడు నెలలుగా ఆందోళన చేస్తుండగా, వారికి పూర్తి మద్దతు బిజెపి ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నేతలు చాలామంది గోడమీద పిల్లి వలే వ్యవహరిస్తూ ఉండటం చాలామందికి విస్మయం కలిగిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే ఆ గ్రామాలు సందర్శించి, మహిళలు మద్దతు తెలపడం తప్పితే చెప్పుకోదగిన మిగిలిన నాయకులు ఇప్పటి వరకు సందర్శించని లేదు.

పార్టీకి ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యులు – సోము వీర్రాజు, పివిఎన్ మాధవ్ అటు వైపు చూడలేదు. పైగా, మాధవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేబట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇకటి లేదా రెండు సార్లు వచ్చినా, మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు – సీఎం రమేష్, టిజి వెంకటేష్ సహితం అటువైపే చూడలేదు.

ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరి మహిళా నాయకురాలిగా అటువైపు చూడక పోవడం బిజెపి వర్గాలకే విస్మయం కలిగిస్తున్నది. కనీసం ఆ మహిళలకు మద్దతుగా ఆమె ఎక్కడ మాట్లాడిన్నట్లు లేదు. వాస్తవానికి ఆ ప్రాంతానికి చెందిన పలువురు బిజెపి నాయకులు ఆమెను ఒకసారి అక్కడకు రమ్మనమని కోరినా ఆమె లెక్క చేయలేదని తెలుస్తున్నది.

ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆమె పార్టీలో కీలక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పదవి దక్కని పక్షంలో వైసిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారా అనే అనుమానాలను పలువురు బిజెపి నేతలే వ్యక్తం చేస్తున్నారు.

ఆమె మూడు పదవులను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి వర్గంలో చేర్చు కోవడం. లేదా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం. లేదా జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ పదవి ఇవ్వడం. ఐదేళ్ల క్రితమే ఆమె జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ పదవి కోరుకున్నారని, ఆ మేరకు ఒక సీనియర్ ఆర్ ఎస్ ఎస్ నాయకుడి ద్వారా ప్రయత్నం చేశారని తెలుస్తున్నది.

అయితే ఆ నాయకుడు ఆ పదవి ప్రాధాన్యత తెలియక మహిళా కమీషన్ కు బదులు, మహిళా మోర్చా అని వ్రాసి పంపారని, దానితో మహిళా మోర్చా ఇన్ ఛార్జ్ గా చేసారని చెబుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యతం కూడా లేకుండా ఒక కీలకమైన విభాగానికి ఇన్ ఛార్జ్ గా ఇప్పటి వరకు వారెవ్వరిని చేయలేదు.

ఈ పదవి ద్వారా ఆమె బిజెపి ఆఫీస్ బేరర్ల సమావేశాలకు హాజరు కాగలుగుతున్నారు. అయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఆమెకు అవకాశం దక్కక పోవడంతో మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం కూడా కనబడటం లేదు.

కమల్‌నాథ్ ప్రభుత్వం బలపరీక్ష రేపే!

రాజకీయంగా అస్థిరతకు గురైన మధ్యప్రదేశ్ లోని కమల్‌నాథ్ ప్రభుత్వం సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ విషయాన్ని స్వయంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండనే ప్రకటించారు.ఈ మేరకు గవర్నర్ టాండన్ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించినట్లు తెలుస్తున్నది.

బలపరీక్ష నిర్వహించాలంటూ శనివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ బృందం గవర్నర్ లాల్జీ టాండన్‌ను కోరింది. ‘‘బీజేపీ నేతలం గవర్నర్ లాల్జీ టాండన్‌తో భేటీ అయ్యాం. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే బలపరీక్ష నిర్వహించాలని వినతి పత్రం సమర్పించాము’’ అని చౌహాన్ తెలిపారు.

కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలో పడిపోయిందని, అందుకని రాజ్యాంగ పరంగా వారికి ప్రభుత్వాన్ని నడిపే హక్కే లేదని చౌహాన్ స్పష్టం చేశారు. కమల్‌నాథ్ సర్కారు అసెంబ్లీలో తమ బల పరీక్షను నిరూపించుకోవాలని, అంత వరకూ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి లేదని చౌహాన్ చెప్పారు.

22 మంది ఎంఎల్‌ఎలు రాజీనామా చేశారని, వీడియోల ద్వారా తమ రాజీనామాలు ధ్రువీకరించారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ నియమించిన పరిశీలకుని ద్వారా విశ్వాస పరీక్ష జరగాలని, ఇదంతా వీడియో చిత్రీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎల్‌ఎల బంధువులను, రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని, ఈ ఎంఎల్‌ఎలకు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయని చౌహాన్ ఆరోపించారు.

తమ నేత సింధియాజీ శుక్రవారం దాడికి గురయ్యారని, రాజీనామా చేసిన ఎంఎల్‌ఎలు కేంద్ర బలగాల రక్షణ లేనిదే బెంగళూరు నుంచి తిరిగి రాలేమని డిమాండ్ చేస్తున్నట్టు చౌహాన్ చెప్పారు.

మోడీ హయాంలో పెట్రోల్‌పై 429శాతం పెరిగిన సుంకం


కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పెట్రోలు, డీజల్‌ మీద మూడు రూపాయల ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. ప్రత్యేక ఎక్సైజ్‌ డ్యూటీని రెండు రూపాయలు పెంచింది. రోడ్‌సెస్‌ను లీటర్‌కు ఒక్క రూపాయి పెంచింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లీటర్‌ పెట్రోల్‌పై సుంకం రూ.9.48గా, డీజీల్‌పై రూ.3.56గా ఉన్నది.

2014నాటికి అప్పటి యూపీఏ సర్కారు హయాంతో పోల్చుకుంటే మోడీ సర్కారు హయాంలో పెట్రోల్‌పై సుంకం 429శాతం, డీజీల్‌పై 142శాతం పెరిగింది. 2014, 2016 ఏడాదుల్లో పెట్రోల్‌, డీజీల్‌లపై కేంద్రం తొమ్మిది సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది.

ఈ 15 మాసాల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్‌ సుంకం పెరిగింది. దీంతో 2016-17లో ప్రభుత్వ ఖజానాకు రూ. 2,42,000 కోట్ల ఆదాయం సమకూరింది.

అంతర్జాతీయంగా భారీగా తగ్గిన ముడిచమురు ధరలననుసరించి చమురు సంస్థలు ధరలను సవరించినందున ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంపుతో పెట్రోల్‌, డీజల్‌ రిటైల్‌ ధరలలో ఎలాంటి ప్రభావమూ ఉండబోదని ప్రభుత్వ అధికారులు వెల్లడించడం గమనార్హం. భవిష్యత్‌లో ధరలు పెరిగితే ఏమిటన్న ప్రశ్నకు వారి నుండి సమాధానం లేదు.

నిజానికి 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.16 డాలర్లు. 2018-19 కి ఈ థర 63.98 డాలర్లకు చేరుకోగా, గత సోమవారం నాటికి 31 డాలర్లు మాత్రమే పలికింది. కానీ, దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఈ కాలంలో తగ్గకపోగా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.

అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పతనమైనప్పటికీ కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని పెంచడం పట్ల ప్రతిపక్షాలు విషయం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక మాంద్యంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలపై తాజా పెంపును నేరపూరితమైన దాడిగా అభివర్ణిస్తున్నాయి.

పెళ్లి చేసుకున్న ‘పరుగు’ భామ

హీరోయిన్ షీలా పెళ్లి పీఠలెక్కింది. తన భర్తతో పెళ్లి సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మాకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. చాలా ఆనందంగా ఉంది. మా నూతన జీవితానికి ఇది ఓ కొత్త రోజు’ అని పోస్టు పెట్టింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా ఒక్కసారిగా పెళ్లిపీఠలెక్కి అభిమానులకు షాకిచ్చింది.

షీలా తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో మొత్తంగా 24చిత్రాల్లో నటించింది. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త సంతోష్ రెడ్డితో షీలా వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇద్దరి బంధువులు, ఆప్తులు సమక్షంలో వివాహ వేడుక జరిగింది. సినిమా పరిశ్రమకు చెందినవారు ఎవరు కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు.

షీలా తెలుగులో అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ మూవీలో నటించింది. బన్నీకి జోడీగా నటించి మెప్పింది. రామ్ సరసన ‘మస్కా’, జూనియర్ ఎన్టీఆర్ పక్కన ‘అదుర్స్’లో నటించింది. అలాగే ‘సీతాకోకచిలుక’, ‘రాజుభాయ్’ మూవీల్లో నటించింది. తెలుగులో చివరగా బాలకృష్ణ నటించిన ‘పరమవీరచక్ర’లో నటించింది. ఈ తర్వాత తెలుగు తెరపై కన్పించలేదు. తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు పెళ్లిపీఠలపై దర్శనమిచ్చింది ఈ ‘మస్కా’ భామ.

అలాంటి పాత్రలు చేయనంటున్న తెలుగమ్మాయి

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటించి అలరించింది. విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన ఈ భామ ఇకపై అలాంటి పాత్రలో నటించనని చెబుతుంది. కెరీర్లో ఆరంభంలో ఐశ్వర్య రాజేష్ అమ్మ పాత్రలు, అక్క పాత్రల్లో నటించింది. తాజాగా ఆమెకు హీరోయిన్ గా భారీ అవకాశాలు వస్తుండటంతో ఇకపై తాను అలాంటి పాత్రలు చేయనంటుంది.

ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే అయినప్పటికీ టాలీవుడ్లో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బీజీగా నటిగా మారింది. తెలుగులో ‘కౌశల్య కృష్ణమూర్తి’లో ఐశ్వర్య రాజేష్ నటించింది. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోయినా ఐశ్వర్య నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులోనూ ఈ భామకు వరకు ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో గతంలో తాను చేసినటువంటి అమ్మ, అక్క పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.

కెరీర్ ఆరంభంలోనే అమ్మ, అక్క క్యారెక్టర్ చేస్తే హీరోయిన్ అవకాశాలు రావడం తగ్గడం సహజం. కానీ ఈ భామకు హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి వరుసగా కుర్ర హీరోల పక్కన ఛాన్సులు దక్కుతున్నాయి. దీంతో ఈ అమ్మడు క్రేజ్ తగ్గట్టుగా నిర్ణయాలను తీసుకుంటుంది. ఐశ్వర్య రాజేష్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Mannara Chopra at Zee Cine Awards

అద్భుమైన స్పీచ్ తో అదరగొట్టిన పవన్!


రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న అధినేత పవన్ కళ్యాణ్ అద్భుమైన స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జనసేన పార్టీ పెట్టటానికి గల కారణాన్ని వివరించారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో ఒక రాష్ట్రము ప్రజలను మరో రాష్ట్రం ప్రజలు తిడుతుంటే చలించిపోయాయని అందుకే ప్రశ్నించే గొంతుగా ఉండాలనే పార్టీ పెట్టటానని పవన్ తెలిపారు. అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో అనేక ఓటములను చవిచూసానని అన్నారు.

ఈ ఆరేళ్ళ జనసేన ప్రయాణంలో అనేక వ్యక్తిగత విమర్శలను ఎదుర్కొని నిలబడ్డాడని, ప్రజలు క్షేమం కోసం తాను ఎన్ని అవమానాలైన భరిస్తానని పవన్ తెలిపారు. భావితరాలకు కుల,మత ప్రాంతీయతత్వం లేని రాజకీయాలను పరిచయం చేయడమే తన లక్ష్యమని పవన్ తెలిపారు. అన్యాయానికి, అవినీతికి ఎదురు నిలబడి, నిస్సహాయులకు అండగా ఉండటంకోసమే తన ముందున్న లక్ష్యమని పవన్ వివరించారు.

ఉత్తరాంధ్రలో తుఫాన్ వస్తే నాలుగు రోజులపాటు చీకటి రాత్రులను గడిపామన్నారు. పక్కనే పర్యటిస్తున్న జగన్‌ ఆ జిల్లా వైపు కూడా చూడలేదని పవన్‌ వెల్లడించారు. కానీ ఓట్లు మాత్రం రౌడీలకు వేశారన్నారు. అలాంటి వాళ్ళను గెలిపించారంటే తప్పు ఎవరిదని పవన్ ప్రశ్నించారు. తనని గెలిపించిన, గెలిపించకపోయినా తాను మాత్రం ప్రజల కోసం నిలబడతానని పవన్ వ్యాఖ్యానించారు.

కరోనా భయంతో తిరుమలలో భక్తుల క్యులపై నిషేధం

తిరుమల అనగానే స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి భక్తులు వేచిఉండే క్యూలు ప్రసిద్ధి. కానీ కరోనా వైరస్ భయంతో గంటల తరబడి బంధించబడిన రీతీలో షెడ్ లలో ఉండటం ఆరోగ్యానికి ప్రమాదకారి కాగలదనే ఉద్దేశ్యంతో క్యూలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది.

కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టిటిడి రద్దు చేసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివరాలను వెల్లడించారు. ‘దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదు. దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది. తిరుమలని సెక్టార్ లుగా విభజించి, శుభ్రత చర్యలు చేపట్టాము’ అని వెల్లడించారు.

గదులు కాళీ చేసిన వెంటనే పూర్తిగా సుద్ది చేసిన తర్వాత మరొకరికి కేటాయిస్తున్నాము. అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశామని వివరించారు. కరోనా వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదని హెచ్చరించారు.

సీతారాముల కళ్యాణం రద్దు చేసి, లైవ్ ద్వరా కళ్యాణం వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలి. భక్తులు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే విదేశీయులు ఎవ్వరు తిరుమలకు రావద్దని టిటిడి కోరింది.

తెలంగాణ షట్ డౌన్!

యావత్ దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ లను ముసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని..ముందస్తు చర్యలు చేపట్టింది.

ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్‌ ప్రకారం జరుగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా రేపు, ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

30 Rojullo Preminchatam Ela team at Khammam

30 Rojullo Preminchatam Ela team at Warangal

‘రాశి’ని వదల్లేకపోతున్న తేజు

హీరోయిన్ రాశికన్నా కేవలం గ్లామర్ తోనే సినిమాల్లో నెట్టొకొస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కుర్రహీరోలందరికీ సరసన నటించింది. ఇటీవల భామకు అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ ఇండస్ట్రీకి చక్కేసిందనే వార్తలు విన్పించాయి. తాజాగా ఈ అమ్మడు మెగా హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసి వార్తల్లో నిలిచింది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజు తాజాగా నటించే చిత్రం రాశికన్నా ఎంపికైనట్లు తెలుస్తోంది.

తేజు-రాశికన్నా కాంబినేషన్లో ఈ చిత్రం మూడోది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘సుప్రీమ్’ మూవీ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ‘ప్రతి రోజు పండుగే’ మూవీలో తేజుకు జోడిగా నటించింది. ఈ మూవీకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. దీంతో వీరిద్దరిది హిట్ పేర్ గా నిలిచిపోయింది.

తాజాగా సాయిధరమ్ తేజ్ దేవ కట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని ఇటీవల పవర్ స్టార్ పవన్ తేజుపై క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నివేదా పేతురేజ్ ఎంపికైంది. మరో హీరోయిన్ గా తేజుకి అచ్చొచ్చిన రాశీఖన్నాని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.