Home Blog Page 8585

రమ్యకృష్ణ దుర్మార్గురాలు అని తెలుస్తోంది

మంచినటిగా ప్రూవ్ చేసుకొన్న రమ్యకృష్ణ 1999 లో వచ్చిన పడయప్పా ( తెలుగులో నరసింహ ) చిత్రం లో నీలాంబరి అనే నెగటివ్ రోల్ లో కనిపించి ప్రేక్షకులని ఆశ్చర్యం లో ముంచెత్తింది. సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ దుష్ట నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు .

ఆ తరవాత వచ్చిన ‘బాహుబలి’ సిరీస్ లో శివగామి పాత్రతో రమ్యకృష్ణ మరింత పేరు తెచ్చుకుంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన శివగామి గా రమ్యకృష్ణ పాత్రలో జీవించిన తీరుకి విశ్వ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆ పాత్రకి రమ్యకృష్ణనే కరెక్ట్ అనుకున్నారు సినిమా చూసిన వారంతా. అదలావుంటే మళ్ళీ ఇన్ని రోజుల తరవాత విలనిజంతో కూడిన పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది.

మెగా మేనల్లుడు చిత్రలహరి, ప్రతిరోజూ పండగే ఫేమ్ సాయితేజ – దేవకట్టా కాంబినేషన్లో రూపొందనున్న కొత్త సినిమాలో రమ్యకృష్ణ వాంప్ తరహా పాత్రను పోషించనుంది. సాయితేజ్ – దేవ కట్టా కాంబినేషన్లో ఓ పొలిటికల్ డ్రామా రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారట. నీలాంబరి, శివగామి వంటి పాత్రల్లో దర్శనమిచ్చిన తరువాత రమ్యకృష్ణ చేసిన పాత్రలేవీ ఆ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అందువలన సాయితేజ చిత్రం లోని ఈ పాత్ర తన కెరియర్ ను మరింత ముందుకు తీసుకెళుతుందని రమ్యకృష్ణ బలంగా నమ్ముతోందని తెలుస్తోంది.
Negative characters gives positive result

సుకుమార్ తో ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన హీరోయిన్

ఒక పక్క పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే… మరోపక్క చిన్న హీరోలకు కథలను అందిస్తూ తన నిర్మాణ సంస్థలోనే సినిమాలు తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉప్పెన సినిమా లైన్ లో ఉంది. సుకుమార్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ అమ్మడికి సుకుమార్ మరో సినిమాలో నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది.

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడట సుకుమార్. ఉప్పెన సినిమాలో తన క్యూట్ పెర్ఫార్మన్స్ చూసిన సుకుమార్ వెంటనే ఈ సినిమాలో సెకండ్ ఛాన్స్ ఇచ్చాడట. మరి ఉప్పెన రిలీజ్ అవకముందే అమ్మడికి రెండో ఛాన్స్ కూడా వచ్చేసింది. ఉప్పెన హిట్ అయితే ఇక ఆ హీరోయిన్ కి వరుస అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.

స్వీయ గృహనిర్బంధంలో కేంద్ర మంత్రి

కరోనా వైరస్‌ వ్యాప్తి కీలక పదవులలో ఉన్నవారిని సహితం ఆందోళనకు గురిచేస్తున్నది. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి. మురళీధరన్‌ అయితే స్వీయ గృహ నిర్భంధంకు పరిమితం అయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో మంత్రి మురళీధరన్‌ తన ఇంటి నుండి గత రెండు రోజులుగా బైటకు రావడం లేదు.

మార్చి 14న త్రివేండ్రంలోని ఓ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరైన ఓ డాక్టర్‌కు కరోనా సోకినట్లు మార్చి 15న నిర్ధారణ అయింది. డాక్టర్‌ స్పెయిన్‌ నుంచి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో అనుమానంతో మురళీధరన్‌ కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. కానీ కేంద్ర మంత్రికి కరోనా నెగిటివ్‌ అని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలనుకున్నారు కేంద్ర మంత్రి.

కేరళలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 24 నమోదు కాగా, ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. మరో ముగ్గురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 126కి చేరుకుంది.

మ‌రో దిశ ఘ‌ట‌న‌.. అత్యాచారం, దారుణ హ‌త్య‌..!

తెలంగాణాలో దిశ తరహాలో మరో ఘటన జరిగింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడిపల్లిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. మంగళవారం ఉదయం తంగడిపల్లి శివారులో ఓ బ్రిడ్జి కింద ఓ గుర్తు తెలియని 30 ఏళ్ళ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం బండరాయితో ఆమె తలపైన బాదడం వంటి ఆనవాళ్లు ఉండడంతో అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇక ఆ మహిళ దుస్తుల జాడ ఇంకా ఎలాంటి క్లూ కనపడక పోవడంతో పోలీసులకు నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. కాగా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎంపీలో ముదురుతున్న సంక్షోభం..

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను మంగళవారమే నిర్వహించాలన్న గవర్నర్‌ లాల్జి టాండన్‌ ఆదేశాన్ని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఖాతరు చేయకపోవడంతో వివాదం సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చింది. అంతకు ముందు సోమవారం బలపరీక్ష జరపాలన్నా గవర్నర్ ఆదేశాన్ని స్పీకర్ ప్రజాపతి సహితం లెక్క చేయకుండా కరోనా వైరస్ సాకుతో సమావేశాలను 26 వరకు వాయిదా వేయడం తెలిసిందే.

మరోవంక, వెంటనే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల తరపున ఎవరూ విచారణకు హాజరు కాకపోవడాన్ని బీజేపీ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తప్పుబట్టారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరపున విచారణకు హాజరు కాకపోవడంపై స్పందన తెలియజేయాలంటూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని కోర్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

జ్యోతిరాధిత్య సింధియాకు మద్దతుగా ఆరుగురు మంత్రులతో సహా 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు. దానితో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కు పడిపోయింది. 112 మంది మద్దతు తెలిపితేనే కమల్‌నాథ్‌ గట్టెక్కుతారు.

వారిలో 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించనందున కాంగ్రెస్‌ బలం 108 మందిగా ఉన్నది. ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలుసుకున్నారు. మరో నలుగురు స్వతంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకం కాగలదు.

సెంట్రల్ జైల్ లో ర‌వితేజ ‘క్రాక్’ మూవీ

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ చిత్రాల త‌రువాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టిస్తున్న సినిమా ఇది. శ్రుతి హాసన్ నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ నెగ‌టివ్ రోల్స్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్ లో జ‌రుగుతోంద‌ని స‌మాచారం. పోలీస్ అధికారిగా న‌టిస్తున్న ర‌వితేజ‌తో పాటు ప‌లువురు ఆర్టిస్టులు పాల్గొన‌గా… జైల్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. ఏప్రిల్ 2 వ‌ర‌కు ఈ షెడ్యూల్ సాగుతుంద‌ని… దీంతో టాకీ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. అనంత‌రం ఏప్రిల్ 4 నుండి జ‌ర్మ‌నీ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ ప్లాన్ చేశార‌ని.. అవ‌య్యాక హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్ లో చివ‌రి గీతాన్ని షూట్ చేస్తార‌ని టాక్. థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న `క్రాక్` మే 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రాజమౌళి సినిమా మళ్ళీ వాయిదా వేయబోతున్నారా

దేశమంతా కరోనా వైరస్ విపత్తు ఆవహించిన ప్రస్తుత పరిస్థితులలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై కొత్త అనుమానాలు వెల్లువెత్తు తున్నాయి.. ఆర్ ఆర్ ఆర్ భారీ చిత్రం కావడంతో వందల మంది సిబ్బంది దృశ్యాల చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నటులు మరియు సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది వేరు వేరు ప్రదేశాలకు చెందివారు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా షూటింగ్ నిర్వహించడం ఇబ్బందే .పొరబాటున చిత్ర బృందం లో ఎవరో ఒకరు కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సజావుగా సాగే అవకాశం ఉండదు.

దేశంలో అన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రభావం ఉంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు తిరగడం నటులకు సైతం భయం కలిగించే విషయమే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారీ షూటింగ్స్ కి అనుమతులు ఇవ్వకపోవచ్చు.ఆ లెక్కన భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాను ఎలాగోలా చుట్టేసి విడుదల చేద్దాం అంటే కుదరదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా తెరకెక్కించినప్పుడే దాని అవుట్ ఫుట్ రిచ్ గా ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యల మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ అనుకున్న టైం కి పూర్తి కాడం అసాధ్యం అనిపిస్తోంది.
Prevention is better than cure

దిశ తరహాలో మరో దారుణం!


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరువకముందే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో అదే తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్‌ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి ఆతర్వాత హత్యచేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని ఓ బ్రిడ్జి కింద నగ్నంగా ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె తలపై తీవ్ర గాయాలున్నాయి.

స్థానికుల పర్యాధు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో ..అత్యాచారం చేసి ఆతర్వాత హత్యచేసి ఉంటారని, యువతిని గుర్తించకుండా ఉండటం కోసం తలపై రాయితో బాదినట్టు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు.

చిరంజీవితో మాటల మాంత్రికుడు

ఖైదీ నంబర్ 150 తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవికి ప్రేక్షకులు ఘనంగానే స్వాగతం పలికారు. తిరిగి పూర్వపు వైభవం తీసుకొచ్చారు. దాంతో చిరంజీవి రెట్టించిన ఉత్సాహం తో సినిమాలను చేయడం జరుగుతోంది .సైరా వంటి పిరియాడికల్ హిట్ మూవీ తరవాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక విభిన్న చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తరవాత చేయ బోయే చిత్రాల వరుసలో పలువురు దిగ్దర్శకులు ఉన్నారు. వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా వచ్చిన “అల వైకుంఠపురములో.” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రేంజ్ మారిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్-చిరంజీవి కాంబో మూవీ ఎలా ఉండబోతోందనే విషయం లో కూడా ఒక వార్త బయటి కొచ్చింది.1983 లో చిరంజీవి నటించిన హిట్ చిత్రం మంత్రిగారి వియ్యంకుడు తరహాలు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా తీయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకొంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగ్స్, కామెడీ పంచ్ లతో నిండి ఉంటుంది.అలాంటి దర్శకుడు మెగాస్టార్ తో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా తెరకెక్కించాలని ఉవిళ్లూరు తున్నాడు.అంటే.. మెగాభిమానులను మాటల మాంత్రికుడు.. కడుపుబ్బా నవ్వించబోతున్నాడన్న మాట.

చిరంజీవి అప్పుడెప్పుడో చంటాబ్బాయి,దొంగ మొగుడు వంటి సినిమాల చేసి ప్రేక్షకుల్ని అలరించాడు. మళ్ళీ ఆ స్థాయి కామెడీ చిత్రం కావాలని మెగా అభిమానులు కోరుకొంటున్నారు. అందుకే ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రం అనే సరికి చిరంజీవి కూడా త్రివిక్రమ్ కథకు ఒప్పుకున్నాడట. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ తో సినిమా తీయబోతున్నట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించాడు. ఈ సినిమా పూర్తవ్వగానే చిరంజీవి తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో చిరంజీవికి కొరటాల శివతో ‘ఆచార్య’ సినిమా కూడా పూర్తవు తుంది.
A cake walk movie for All

ప్రజలపై అన్ని చార్జీల భారం పెంచనున్న కేసీఆర్

టీఆర్ఎస్ హయాంలో ఏం ఛార్జీలు పెంచలేదని,కాంగ్రెస్  హయాంలోనే ఛార్జీలు విపరీతంగా పెంచారని విమర్శలు కురిపిస్తూ ప్రజలపై మోయరాని భారం మోపనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులమయం కావించిన కేసీఆర్ తన ఆర్ధిక నిర్వహణ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక్కటొక్కటిగా ప్రజలపై బండెడు భారం మోపడానికి సిద్దపడుతున్నారు.

మునిగిపోయే దశలో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు ఛార్జీలు పెంచామని సమర్ధించుకోవడం తెలిసిందే. పెంచిన ఛార్జీలతోనే బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించామని సూచించారు. ఆర్టీసీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు గూడ్స్ పద్దతిని అవలంభిస్తున్నామని, త్వరలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు.

ఆ తర్వాత దివాళా స్థితిలో ఉన్న డిస్కోమ్ లను కాపాడటం కోసం విద్యుత్ చార్జీలు పెంచడం తప్పనిసరి అని ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా, రాష్ట్రాభివృద్ధి కోసం, ఆర్ధిక మనుగడ సాధించాలంటే కొన్ని రంగాల్లో మార్పులు చేయడం అవసరమని అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్, ఇసుక, మైన్స్, కరెంట్ , మద్యం ధరల్ని పెంచబోతున్నట్లు తేల్చి చెప్పారు.

కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ త్వరలోనే మద్యం ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించారు. గతంలో మద్యపాన నిషేదం విధిస్తే అట్టర్ ప్లాప్ అయ్యిందన్న కేసీఆర్..మద్యం తాగకుండా ఉండేలా ధరల్ని పెంచుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ సరసన అందాల రాక్షసి

గత కొంత కాలంగా సరైన ఛాన్స్ లు లేవని.. సక్సెస్ అందని ద్రాక్ష అయ్యిందని తెగ కలత చెందుతోంది లావణ్య త్రిపాఠి. ఇక లాభం లేదు.. మన వంతు ప్రయత్నం గట్టిగా చేయాల్సిందేనని నిర్ణయించుకుంది. గ్లామర్ డోస్ పెంచాలని అనుకొంటోంది. అలాంటి సమయంలో వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ వచ్చింది.

రెండేళ్ల గ్యాప్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎం సి ఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్షన్లో ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం హీరో ఫ్లాష్ బ్యాక్ మినహా షూట్ మొత్తం పూర్తి చేసుకుంది.

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కథానాయకిగా మొడటి నుండి శృతి హాసన్ పేరు పరిశీలనలో ఉంది. కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి పేరు కూడా తెరపైకి వచ్చింది మధ్యలో ఇలియానా పేరు బయటికి వచ్చినా అది రూమర్ అని తెలిసింది.. ఒకవేళ ఈ చిత్రం లో లావణ్య త్రిపాఠి కి గనుక ఛాన్స్ దొరికితే ఆమె కెరీర్ ఇక గాడిలో పడినట్టే అనుకోవాలి. ఇక వరుస సినిమా అవకాశాలు ఆమెని వెతుక్కొంటూ వస్తాయి.
Patience is bitter but its fruits are sweet

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ కు క్యాట్ లో చుక్కెదురు

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. సస్పెన్షన్‌పై ఆయన వేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) మంగళవారం కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యానికి నిరాకరించింది.

రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పీలు చేసుకోవాలని ఈ మేరకు క్యాట్ సూచించింది. ఈ సస్పెన్పన్‌ను రద్దు చేసేందుకు క్యాట్ నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ సమర్థించినట్లయ్యింది. కాగా ఇప్పటికే ఈ సస్పెన్షన్‌ను కేంద్ర హోం శాఖ సమర్థించిన సంగతి తెలిసిందే.

1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించినందుకు సస్పెండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్‌ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్‌ చేసినట్లు జీవో నంబర్‌ 18లో స్పష్టం చేసింది. పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్స్‌ విధానాలను సైతం ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది.

Tamanna Stunning Pictures

Vaani Kapoor Latest Photoshoot Stills

రంజన్‌ రాజ్యసభకు నామినేట్ పై విమర్శలు!

సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌.. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని 80వ అధికరణం ప్రకారం గొగోయ్‌ ని రాజ్యసభకు నామినేట్‌ చేయాలని రాష్ట్రపతి నిర్ణయించారు. నామినేటెడ్‌ సభ్యుల్లో ఒకరైన కేటీఎస్‌ తులసీ రిటైర్‌ కావడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్య‌స‌భ‌కు జ‌స్టిస్ గొగోయ్‌ ను నామినేట్ చేయ‌డాన్ని విప‌క్షాలు త‌ప్పుప‌ట్టాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు.. ఈ చ‌ర్య‌ను క్విడ్‌ ప్రోకోగా అభివ‌ర్ణించాయి. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై దీని ప్ర‌భావం ఉంటుంద‌ని ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. దేశ ప్ర‌జ‌ల‌కు, భ‌విష్య‌త్తు సీజేఐల‌కు రాష్ట్ర‌ప‌తి ఏం చెప్పాల‌నుకుంటున్నార‌ని క‌ర్నాట‌క మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య ప్ర‌శ్నించారు.

రంజ‌న్ గొగోయ్ గ‌త ఏడాది న‌వంబ‌ర్ 17వ తేదీన రిటైర్ అయ్యారు. 2018 అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి 2019 న‌వంబ‌ర్ 17 వ‌ర‌కు ఆయ‌న 46వ చీఫ్ జ‌స్టిస్‌గా చేశారు. ఆయన సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం ట్రిపుల్ తలాక్, అయోధ్య భూ వివాదం, శబరిమల, రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలైన పిటిషన్లపై తీర్పులు ఇచ్చింది.

హిట్ డైరెక్టర్ తో మాస్ మహారాజా

ప్రస్తుతం తన సినిమాలు సరిగ్గా ఆడటంలేదని గ్రహించిన రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో తన పట్టు సడలించాడు. పారితోషకంగా సినిమాలో వాటా తీసుకొంటూ నిర్మాతలకు భారం తగ్గిస్తున్నాడు. దరిమిలా పలు నిర్మాతలు రవితేజ కోసం క్యూ కడుతున్నారు. ఆ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ రాసిన కథతో, ‘నేను లోకల్’ , “సినిమా చూపిస్తా మామా”హలో గురూ ప్రేమకోసమే ” ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా బ్యానర్ లో విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి దర్శకుడు నక్కిన త్రినాధరావు తో రవితేజ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ, కొన్ని కారణాలు వల్ల ఆలస్యం అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాని జూన్ నుంచి మొదలుపెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు.

వినోద ప్రధాన చిత్రాలను నిర్మించడం లో సిద్ధహస్తుడైన నక్కిన త్రినాధరావు ఈ చిత్రాన్ని కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా నిర్మించ బోతున్నాడు. అలాంటి దర్శకుడికి కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగల రవితేజ తోడవ్వడం తో సినిమా ఫై అంచనాలు భారీగా పెరిగాయి.

కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని దర్శకుడు నక్కిన త్రినాథరావ్ చెబుతున్నాడు.తన గత చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాల స్థాయికి తగ్గకుండా ఇంకా ఒక మెట్టు ఎక్కువగానే సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా రవితేజ వీర ఫేమ్ రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ రమేష్ వర్మ సినిమా కంటే కూడా ముందు త్రినాథరావ్ నక్కిన సినిమానే మొదలవుతుందట.
Good entertainars are safe at box office

సుష్మా, జైట్లీ లేకపోవండతో సంక్షోభంలో మోదీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా అంతర్జాతీయంగా తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అల్లర్లు పౌరసత్వ చట్టం అంశాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా పలు దేశాలలో రాజకీయ వర్గాల నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఒక అధ్యక్ష అభ్యర్థితో పాటు, కొందరు సెనేటర్లు కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. ఐరోపా యూనియన్ పార్లమెంట్ లో ఈ అంశంపై తీర్మానంపై ప్రయత్నం జరుగుతున్నది.

ఇప్పటి వరకు ఇంతటి ప్రతికూలతను ఆయన ఎన్నడూ ఎదుర్కొనలేదు. అంతర్జాతీయ మీడియాలో మొదటిసారిగా విస్తృతంగా మోదీ నేతృత్వంలో భారత్ లో `హిందూ రాజ్యం’ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటూ నిశితంగా విమర్శిస్తూ కధనాలు వచ్చాయి.

ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, నిందితుల పట్ల పక్షపాతంతో వ్యవహరించారని అంటూ అనేక కధనాలు వచ్చాయి. ఇవ్వన్నీ అంతర్జాతీయంగా మోదీ ప్రతిష్టను మసకబారుతున్నాయి.

మొదటి ఐదేళ్లు ఆయన మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు ఇప్పుడు లేకపోవడంతోనే ఆయన ప్రతిష్ట ఈ విధంగా మసకబారుతున్నట్లు భావించవలసి వస్తున్నది. వారు సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ. వారిద్దరూ ఇప్పుడు జీవించి కూడా లేరు.

ఏదైనా సమస్య తలెత్తితే విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలలు క్రియాశీలకంగా వ్యవహరించి, భారత్ ప్రతిష్టతను ఇనుమడించే విధంగా చేయడంలో సుష్మా అందరు ప్రశంశలు అందుకున్నారు. ఇప్పుడు స్వయంగా ప్రముఖ దౌత్య అధికారి ఎస్ జైశంకర్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన రాజకీయ చొరవ చూపడంలో సఫలం కాలేక పోతున్నారు.

మరోవంక అరుణ్ జైట్లీకి మీడియా సంస్థలతో మంచి సంబంధాలు ఉంటూ ఉండెడిది. ప్రభుత్వానికి అనుకూలంగా,ప్రతిపక్షాలకు ఇరకాటం కలిగించే విధంగా మీడియాలలో కధనాలు జొప్పించడంలో ఆయన చాలా ఆచాకచక్యంగా వ్యవహరిస్తుండే వారు. ప్రస్తుతం అటువంటి పాత్ర వహించాగలిగే నేత బిజెపిలో ఎవ్వరు లేకపోవడంతో మీడియాలో ప్రధాని మొదటిసారిగా చాలా ప్రతికూలతను ఎదుర్కోవలసి వస్తున్నట్లు భావిస్తున్నారు.

బీజేపీ అధికార ప్రతినిధులు అందరు మీడియాలో ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తి, ఆయన దృష్టిని ఆకట్టుకోవాలని తాపత్రయ పాడేవారే గాని, మోదీ ప్రభుత్వం ఇమేజ్ ను ఇనుమడించే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించ గలిగిన వారే కనబడటం లేదు. అందుకనే ఢిల్లీ అల్లర్ల అనంతరం ప్రధాని మోదీ తన మంత్రివర్గ సహచరులు, బీజేపీ నేతల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రపంచం అంతగా అలజడి కలిగిస్తున్న కరోనా వైరస్ విషయమై సార్క్ దేశాల మధ్య సయెధ్య కోసం మోదీ చొరవ తీసుకోవడం కేవలం అంతర్జాతీయంగా మసకబారిన ప్రతిష్టను ఇనుమడింప చేసుకోవడమే అని భావించవలసి వస్తున్నది. వాస్తవానికి గత ఐదేళ్లుగా సార్క్ శిఖరాగ్ర సదస్సు జరుగకుండా, దానిని నిర్వీర్యం అయ్యే విధంగా మోదీ చేస్తున్నారు. దక్షిణాసియాలో పాకిస్థాన్ ను ఏకాకి చేయడం కోసం మరో ఉప ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసి ఆయా దేశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

గత ఆగష్టు లో జైట్లీ మృతి చెందినప్పటి నుండి మోదీ ప్రభుత్వం ఒక దాని తర్వాత మరో సంక్షోభములలో చిక్కుకొంటూ వస్తున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరిస్తున్న అమిత్ షా సహితం ధన బలం, అధికార బలంలను ఉపయోగిస్తూ రాజకీయ ప్రత్యర్దులలు ఐటి, ఈడీ దాడులతో వేధించడం; ఇతర ప్రతీల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించడం, సొంత పార్టీలో మరెవ్వరు మాట్లాడకుండా చేయడం తప్పా వ్యూహాత్మకంగా సంక్షోభాలను సరిదిద్దడంలో జైట్లీకి ఉన్న నైపుణ్యం లేదని వెల్లడి అవుతున్నది.