ప్రస్తుతం తన సినిమాలు సరిగ్గా ఆడటంలేదని గ్రహించిన రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో తన పట్టు సడలించాడు. పారితోషకంగా సినిమాలో వాటా తీసుకొంటూ నిర్మాతలకు భారం తగ్గిస్తున్నాడు. దరిమిలా పలు నిర్మాతలు రవితేజ కోసం క్యూ కడుతున్నారు. ఆ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ రాసిన కథతో, ‘నేను లోకల్’ , “సినిమా చూపిస్తా మామా”హలో గురూ ప్రేమకోసమే ” ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా బ్యానర్ లో విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి దర్శకుడు నక్కిన త్రినాధరావు తో రవితేజ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ, కొన్ని కారణాలు వల్ల ఆలస్యం అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాని జూన్ నుంచి మొదలుపెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు.
వినోద ప్రధాన చిత్రాలను నిర్మించడం లో సిద్ధహస్తుడైన నక్కిన త్రినాధరావు ఈ చిత్రాన్ని కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా నిర్మించ బోతున్నాడు. అలాంటి దర్శకుడికి కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగల రవితేజ తోడవ్వడం తో సినిమా ఫై అంచనాలు భారీగా పెరిగాయి.
కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని దర్శకుడు నక్కిన త్రినాథరావ్ చెబుతున్నాడు.తన గత చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాల స్థాయికి తగ్గకుండా ఇంకా ఒక మెట్టు ఎక్కువగానే సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా రవితేజ వీర ఫేమ్ రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ రమేష్ వర్మ సినిమా కంటే కూడా ముందు త్రినాథరావ్ నక్కిన సినిమానే మొదలవుతుందట.
Good entertainars are safe at box office