ఇప్పటికే వీలున్న చోటల్లాఅప్పులు చేస్తూ కాలం గడుపుతున్న తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో చిక్కుకు పోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అప్పు పరిమితిని పెంచమని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసింది. కేంద్రం ఆమోదిస్తే మరింత భారీగా రుణాలు సమకూర్చుకునేందుకు చూస్తున్నది. అయితే కేంద్రం నుండి స్పందన లభిస్తున్న దాఖలాలు లేవు.
ప్రస్తుతం జిఎస్‌డిపిలో మూడు శాతం వరకు రుణాలు తీసుకునేరదుకు కేంద్రం అనుమతి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి 3.5 శాతం వరకు ఈ పరిమితిని పెంచారు. అయితే చాలాసార్లు 3.5 శాతం పరిమితి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలు రాలేదు. ఈ నేపథ్యరలోనే నాలుగు శాతానికి పరిమితి పెరచాలని కేంద్రానికి లేఖ రాయడం విశేషం.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వృద్ధి రేటులో మూడు శాతానికి మించి రుణం తీసుకోరాదు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మరో అర శాతం రుణం తీసుకునేందుకు అనుమతి ఉంది. అయితే రాష్ట్రానికి ఈ వెసులుబాటు లభించడం లేదు. దీనిపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం నుండే కేంద్రానికి లేఖలు వ్రాస్తూ వస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటులో కూరుకుపోయిందని, రుణాలను 58.32 శాతాన్ని రాష్ట్రానికి పెంచడం కూడా ఆర్ధిక సమస్యకు కారణమైందని తాజా లేఖలో పేర్కొన్నారు. ఆ రుణాలకు వడ్డీ కూడా రాష్ట్రమే భరించాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. దీనివల్ల ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితిలోకి ఈ రుణాలు చేరుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడుతోందని తెలిపారు.
ఇదే సమయంలో ఆర్థిక పరిస్థితి
కూడా నిరాశాపూరితంగా ఉన్నట్లు కేంద్రానికి తెలిపారు. దీనివల్ల సాధారణ మౌలిక సౌకర్యాల కల్పనకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నీటిపారుదల పథకాలు, రోడ్లు, విద్యా సంస్థలు, ఇతర రంగాల అభివృద్ధికి నిధుల లేమి నెలకొందని వివరించారు. ఇటువంటి ప్రధాన సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలు తీసుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




దేశంలో కరోనా వైరస్ మొదటి మరణం బెంగుళూరులో జరగడమే కాకుండా, ఈ వైరస్ పట్ల అక్కడి ప్రభుత్వం తొలుత నిర్లక్ష్యం వహించడంతో విస్తృతంగా వ్యాప్తి చెందిన్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి.


కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారల పాటు వాయిదా వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ లో సవాల్ చేయగా, మరో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు సహితం తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసాయి.
పోలవరం సాగు నీటి ప్రాజెక్టు వ్యయాన్ని తామే పూర్తిగా భరిస్తామని చెబుతూనే కేంద్రం తరచూ మెలికలు పెడుతున్నది. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని ఈ మధ్య చెప్పగా, తాజాగా రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తనకూ వాటా ఇవ్వాలని కేంద్రం మెలిక వేసింది. అంచనా వ్యయంలో భారీగా కొత్త విధించింది. అయినా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోరు విప్పలేక పోతున్నది.


దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుండటంతో పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలను కుదించాలని పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. పాఠశాలలు, థియేటర్లను మూయించడంతో పాటు ఎక్కువమంది జనం గుమికూడె సమావేశాలు, ఉత్సవాలు జరపరాదని ఆంక్షలు విధిస్తు, పార్లమెంట్ సమావేశాలను మాత్రం యధావిధిగా జరపడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
















