
ఒక పక్క పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే… మరోపక్క చిన్న హీరోలకు కథలను అందిస్తూ తన నిర్మాణ సంస్థలోనే సినిమాలు తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉప్పెన సినిమా లైన్ లో ఉంది. సుకుమార్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ అమ్మడికి సుకుమార్ మరో సినిమాలో నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది.
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడట సుకుమార్. ఉప్పెన సినిమాలో తన క్యూట్ పెర్ఫార్మన్స్ చూసిన సుకుమార్ వెంటనే ఈ సినిమాలో సెకండ్ ఛాన్స్ ఇచ్చాడట. మరి ఉప్పెన రిలీజ్ అవకముందే అమ్మడికి రెండో ఛాన్స్ కూడా వచ్చేసింది. ఉప్పెన హిట్ అయితే ఇక ఆ హీరోయిన్ కి వరుస అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.