
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఎక్కువ కావడంతో కేంద్ర, రాష్ట్ర ఆధ్వరంలోని వివిధ శాఖలు అప్రమతమౌతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 250 రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.50లకు పెంచుతున్నట్లు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని సికింద్రాబాద్ సహా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్లాట్ ఫాంపై రద్దీని తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధర రేపటి నుంచి అమల్లోకి రానుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పెంచిన ధర అమల్లో ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది.