
గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రభాస్ 20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ సెట్స్ లో రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. జార్జియా లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో ఒక ఛేజ్ సీన్ ను, ప్రభ, పూజ హెగ్డే లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు.
ప్రభాస్ 20 మూవీ జార్జియా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని, ఈ షూటింగ్ షెడ్యూల్ తొందరగా కంప్లీట్ చేసేందుకు సహకరించిన జార్జియా టీమ్ కు థ్యాంక్స్ అని దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్ చేశారు. ప్రభాస్ 20 మూవీ మరొక షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ దసరా పండగ కు రిలీజ్ కానుందని సమాచారం. మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ఉగాది పండగకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.