Home Blog Page 8549

కరోనాపై పోరు.. సచిన్ ఇన్నింగ్స్ చూసి నేర్చుకోండి: లారా


ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు ‘మాస్టర్ 241’ను స్ఫూర్తిగా తీసుకోవాలని క్రికెట్ దిగ్గజం లారా అన్నారు. సచిన్ ఆడిన ఇన్నింగ్స్ లో ‘మాస్టర్ 241’ చాలా క్రమశిక్షణతో కూడుకున్నదని పేర్కొన్నారు. సిడ్నీ మైదానంలో సచిన్ అజేయంగా సాధించిన 241 పరుగులు మాత్రం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం చేసినవన్నారు. ప్రస్తుతం ప్రపంచం కరోనా ఎదురొనేందుకు ఈ ఇన్నింగ్స్ లో సచిన్ చూపిన పట్టుదల ప్రతీఒక్కరిలో రావాలని లారా తన ఇన్ స్ట్రాగ్రామ్లో కోరాడు.

2004 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో టూర్‌లో సచిన్‌ ఫామ్‌ కోల్పోయి చాలా ఇబ్బందిపడ్డాడు. ఆ టూర్ సచిన్ ను త్వరగా అవుట్‌ చేసేందుకు ఆసీస్‌ బౌలర్లు కవర్‌ డ్రైవ్‌ ఆడేలా ఊరిస్తూ దెబ్బతీశారు. అయితే చివరి టెస్టులో మాత్రం సచిన్ అలాంటి షాట్లకు వెళ్లకుండా ఏకాగ్రతతో పరుగులు రాబట్టి డబుల్ హండ్రెడ్ సాధించి సత్తా చాటాడు. 241 పరులు సాధించింది అజేయంగా నిలిచాడు. అదేవిధంగా 16ఏళ్ల వయస్సులో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన క్రికెటర్ 24ఏళ్లపాటు జట్టులో కొనసాగడం మామూలు విషయం కాదని లారా తెలిపారు. కాగా సిడ్ని టెస్టు డ్రాగా మారింది.

https://www.instagram.com/p/B-e-OuAlxU6/

దేశంలో తొలిసారి.. బిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషంట్


తొమ్మిది నెలల గర్భిణీకి కరోనా వైరస్ సోకిన సంగతి తెల్సిందే. తాజాగా ఆమె పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కరోనా పేషంట్ బిడ్డకు జన్మనివ్వడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకలేదని వైద్యులు తెలుపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఓ వైద్యుడికి కరోనా సోకింది. పేషంట్లను నుంచి వైద్యుడికి కరోనా సంక్రమించినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు ముందు జాగ్రత్తగా వైద్యుడి భార్యను టెస్టు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె తొమ్మిది నెలలు గర్భిణీ కావడంతో వైద్యులు అప్రమత్తమై చికిత్సమయ్యారు. వీరిద్దరికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

ఎయిమ్స్ గైనకాలజీ విభాగంలో పని చేస్తున్న వైద్య నిపుణురాలు నీర్జా భట్ల ఆ గర్భిణీకి శస్త్రచికిత్స చేసి పండంటి మగబిడ్డను బయటకు తీశారు. ఆమె డెలివరీ సమయానికంటే వారంరోజుల ముందే బిడ్డకు జన్మించినట్లు వైద్యులు వెల్లడించారు. శిశువుకు కరోనా లక్షణాలేవీ లేవని నీర్జా భట్ల తెలిపారు. పుట్టిన బిడ్డ ప్రస్తుతం తల్లితోనే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. చక్కగా తల్లి పాలు తాగుతున్నట్లు వివరించారు. తల్లి పాల ద్వారా కరోనా సోకుతున్నట్లు ఆధారాలేవీ లేవన్నారు. బిడ్డకు పాలు పట్టే విషయంలో తల్లి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

బీజేపీ 40వ వార్షికోత్సవంగా మోదీ `దీపం వెలిగించు’


కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో ప్రజల సంఘీభావం, కృతనిశ్చయం మరోసారి వెల్లడి చేయడం కోసం దేశంలోని ప్రజలంతా ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిముషాల సేపు లైట్లను ఆపివేసి, దీపాలు వెలిగించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశంలో సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది. ఆయన అసలు ఈ పిలుపు ఎందుకు ఇచ్చారనే విషయమై ఎవ్వరికీ వారు తమ వాఖ్యానాలు చెబుతున్నారు.

ప్రతిపక్షాలయితే ప్రధాని జరుపుతున్న మరో `ఈవెంట్ మానేజిమెంట్’ అంటు కొట్టిపారగేస్తున్నాయి. కరొనపై పోరాటంలో ఎదురవుతున్న సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే అని కూడా ఆరోపిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో పలువురు ముఖ్యమంత్రులు వలస కార్మికులకు వసతి, ఆహారం కల్పించడం తమకు భారమవుతున్నదని అంటూ ఆర్ధిక సమయం కోరారు. ఈ బాధ్యత కేంద్రానిదే అని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసినా ఈ విషయమై ప్రధాని నుండి స్పందన లేదు.

అదే విధంగా కరోనా బాధితులకు అసమాన సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన `వ్యక్తిగత రక్షణ పరికరాలు’ (పిపిఇ)లు మన దేశంలో అంతగా అందుబాటులో లేవు. అట్లాగే రోగులను ఉంచవలసిన ఐసియులో గాలి బైటకు వెళ్లకుండా ప్రత్యేక ఏసీ ఏర్పాట్లు ఉండాలి. ఇటువంటి మౌలిక సదుపాయాల గురించి అంతగా పట్టించుకోవడం లేదు.

మరోవంక, బిజెపి మద్దతు దారులైతే `దీపం వెలిగించు’ సమయానికి జ్యోతిష్యంతో సంబంధం ఏర్పరచి, తొందరలో కరోనా మహమ్మారి దేశం నుండి అదృశ్య కావడానికి దోహదపడుతుందని విశ్లేషణలు ఇస్తున్నారు.

ఇలా ఉండగా, ఈ పిలుపు వెనుక బీజేపీ పార్టీ కార్యక్రమం దాగి ఉన్నదనే అనుమానాలు కూడా వెళ్ళడి అవుతున్నాయి. సరిగ్గా 40 ఏళ్ళ క్రితం ఈ రోజున బిజెపిని ప్రారంభించారు. పార్టీ 40వ వార్షికోత్సవాలను సహజంగా అయితే భారీ ఎత్తున జరుపుకొనే ఉండేవారు. కానీ లాక్ డౌన్ కారణంగా వీలు లేకపోవడంతో దేశ ప్రజలు అందరి చేత దీపాలు వెలిగిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది.

మృత్యు ఘోష..రెండు రోజుల్లో 10వేల కరోనా మరణాలు!


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 60 వేలు దాటింది. ఏప్రిల్ 2న 50 వేలకు చేరిన కోవిడ్ మరణాలు.. రెండు రోజుల్లోనే మరో పదివేలకుపైగా పెరిగాయి. ప్రస్తుతం కరోనాకు బలైన వారి సంఖ్య 62 వేలకు చేరువలో ఉండగా.. యూరప్ దేశాల్లోనే 40 వేల మందికిపైగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఇటలీ, స్పెయిన్, అమెరికా, బ్రిటన్‌లలో అత్యధిక కోవిడ్ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటలీలో 14,681 మంది కరోనా మహమ్మారికి బలి కాగా.. స్పెయిన్‌లో 11,198 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దేశాల్లోనూ కోవిడ్ బాధితుల సంఖ్య 1.20 లక్షలకు చేరువలో ఉంది.

మరోవైపు అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి అమెరికాలో 7400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో 6500 మందికిపైగా కరోనా బారిన పడి చనిపోగా.. ఇక్కడ 644 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్లోనూ కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక్కడ 4300 మందికిపైగా కోవిడ్‌ కు బలయ్యారు.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ‘మహానటి’


‘మహానటి’ కీర్తి సురేష్ పెళ్లి ఖరారైనట్లు నెట్టింట్లో వార్తలు హల్చల్ చేశాయి. జాతీయ మీడియా సంస్థలు కూడా కీర్తి సురేష్ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేశాయి. దీంతో సినిమాల్లో బీజీగా ఉన్న కీర్తి సురేష్ ఇంత సడెన్ గా పెళ్లి చేసుకోనుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలో నిజంలేదని స్పష్టం చేశారు.

తాను ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉన్నానని చెప్పింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు తన కాల్షీట్స్ డైరీ ఫుల్‌గా ఉందని తెలిపారు. ఈ త‌రుణంలో పెళ్లి ఎలా చేసుకుంటానని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయ‌కండి అంటూ కీర్తి సురేష్ విజ్ఞప్తి చేసింది. కీర్తి సురేష్ ప్ర‌స్తుతం నితిన్ సరసన ‘రంగ్ దే’ మూవీలో నటిస్తుంది. అదేవిధంగా సూప‌ర్‌స్టార్ రజినీకాంత్-శివ కాంబినేష‌న్లో తెరకెక్కుతున్న ‘అణ్ణాత్త‌’ మూవీ న‌టిస్తుంది.

‘నేను శైలజ’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ ‘మహానటి’తో జాతీయ అవార్డు దక్కించుకుంది. అందం, అభినయం ఉన్న కొద్దిమంది నటీమణుల్లో కీర్తి సురేష్ ఒకరు. తాజాగా ఆమె పెళ్లి వార్త నేపథ్యంలో ఆమె అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని నటనకు దూరమైపోతుందనే భావనలో ఉన్నారు. తాజాగా తనపై ‘మహానటి’ క్లారిటీ ఇవ్వడంతో కీర్తీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

అన్నపూర్ణగా మారిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul-Preet-Singh


కరోనా భాదితులను ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి హీరోలు బాగా ముందుకొచ్చారు .మెగా స్టార్ దగ్గరం నుంచి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దాకా అందరూ స్పందించారు. తమ శక్తి కొలది ఆర్ధిక విరాళాలు ఇచ్చారు . కానీ ఈ విషయం లో హీరోయిన్ లు , లేడీ ఆర్టిస్ట్ లు ఎందుకో వెనుక బడ్డారు. అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత , లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే సి సి సి పిలుపుకి స్పందించి ఆర్ధిక విరాళం ఇచ్చారు విచిత్రం ఏమిటంటే కోట్లు , లక్షల్లో అత్యధిక పారితోషకం తీసుకొనే తారామణులు కూడా .ఎటువంటి స్పందన కనబరచ లేదు. అలాంటి స్థితిలో ధ్రువ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఒక విచిత్ర వార్త తెలిసింది.

కరోనా విపత్తు వల్ల కూటికి లేక బాధపడే వారికి రకుల్ ప్రీత్ సింగ్ రోజూ భోజనం పంపిస్తోంది. చాలా గుప్తంగా జరిగే ఈ అన్నదానం అనుకోకుండా బయటికి వచ్చింది. ఆ విషయమే రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగితె అవునని ఒప్పుకొంది. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఎంతమందికి భోజనం పంపిస్తుందో తెలుసా ? సరిగ్గా రెండు వందల ( 200 ) మందికి …అదీ కూడా రెండు పూటలా పంపుతోంది. ప్రస్తుతం పెద్దగా ఫార్మ్ లో కూడా లేని రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న ఈ సాయం ఆమెకి ఒకరకం గా భారమే …అయినా గానీ ఎంతో ఆనందం తో , ఆత్మతృప్తి తో అన్నదానం చేస్తూ అన్నపూర్ణ అనిపించు కొంటోంది. పబ్లిసిటీ లేకుండా ఇలాంటి సాయం చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ని అందరూ మనస్పూర్తి గా అభినందిస్తున్నారు . a small help is greater than big words

సినిమా హీరోతో నటన ,టీవీ హీరోతో ప్రేమ


బుట్ట బొమ్మ గా `ఆల వైకుంఠపురం లో` అలరించిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇపుడు పెద్ద హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. అంతేకాదు భారీగా పారితోషికం తీసుకొంటోంది . కూడా ….ప్రస్తుతం ఈ బ్యూటీ అక్కినేని అఖిల్ కు జోడీగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో నటిస్తోంది. అందుకు గాను హీరోకంటే ఎక్కువ పారితోషకం తీసుకొంటోంది. ఈ చిత్రంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 20 వ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.. తమిళం నుండీ కూడా పెరియపడంలో నటించమని ఆఫర్లు వస్తున్నాయి. అదంతా నాణానికి ఒక వైపు ,ఇక రెండో వైపు చూస్తే ఈ బుట్టబొమ్మ సీరియల్ హీరో కం మోడల్ అయిన రోహాన్‌ మెహ్రాతో ప్రేమలో పడిందని కొన్ని నిశ్చల చిత్రాలు చూసాక అనుకోక తప్పట్లేదు .

ఒకనాటి బాలీవుడ్ హీరో వినోద్ మెహ్రా కుమారుడు అయిన రోహన్ మెహ్రా హిందీలో పెద్ద స్టార్ కాదు. జస్ట్ మోడల్ మాత్రమే . మధ్యలో కొన్ని సీరియల్స్ లో నటించి కాస్తో కూస్తో పేరు సంపాదించాడు.

అలాంటి ` బుల్లి ` తెర నటుడితో పూజా హెగ్డే.. డేటింగ్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ధ్రువీకరిస్తూ ఇప్పుడు కొన్ని ఫోటోలు దర్శన మిచ్చాయి. ముంబై లోని కొన్ని ప్రదేశాలలో పూజా హెగ్డే , రోహన్ మెహ్రా కలిసి ఉండగా.. కొందరు ఫాన్స్ తమ ఫోన్లతో క్లిక్ మనిపించారు. అదీ సంగతి …

12లక్షలు దాటిన కరోనా కేసులు


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తుంది. ఈ వైరస్ ప్రపంచలోని అన్ని దేశాలకు పాకింది. ఈ వైరస్ పేరుచెబితే దేశాలన్నీ వణికిపోతున్నాయి. పేద, ధనిక దేశాలు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కరోనా విజృంభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులను చూస్తే భయాందోళనలు నెలకొంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి విలవిలలాడిపోతుంది. అందమైన ఇటలీ దేశం శవాలదిబ్బను తలపిస్తుంది. ఇక బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో రాజకుటుంబాలే కరోనా బారినపడ్డాయి. దీంతో కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 12లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 12,01,964కాగా ఇందులో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 64,727కు చేరుకుంది. కరోనా నుంచి రికవరీ అయినవారి సంఖ్య 2,46,638. ప్రపంచవ్యాప్తంగా యాక్టీవ్ గా కరోనా కేసులు 8,90,599. ఇందులో మరో 40వేల మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం అక్కడ తగ్గు ముఖంపడుతోంది. అయితే చైనేతర దేశాల్లో ఇది విలయతాండవం చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,588కు చేరింది.

ఏపీలో 226 కి చేరిన కరోనా బాధితులు


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 226 కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు 34 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 30, నెల్లూరు జిల్లాలో 34, ప్రకాశం జిల్లాలో 23, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, విశాఖపట్నం జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 27 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 34 నమోదై నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో రాత్రి 24 కేసులు నమోదు అవడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

ఉదయం కరోనా పాజిటివ్, సాయంత్రం నెగటివ్..!


నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించగా, ఈ నెల 3వ తేదీ ఉదయం జరిగిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్థానిక అధికారులు అతనిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అదే రోజు సాయంత్రం వచ్చిన మరో రిపోర్టులో అతనికి వైరస్ సోకలేదని తేలింది. ఇందుకు సంబంధించిన రెండు రిపోర్టులూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలే తీవ్ర భయాందోళనల్లో ఉన్న ప్రజలు, ఈ తరహా ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కరోనా పరీక్షలకు సంబంధించిన నివేదికలు మారటం వల్ల ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రిపోర్టులు మారడంపై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అదనపు ఆర్ఎంఓ డాక్టర్ కనకాద్రి స్పందించారు. ఆ యువకుడికి కరోనా సోకలేదని తేల్చారు. సాంకేతిక సమస్య కారణంగా తొలుత వచ్చిన రిపోర్టు పాజిటివ్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆపై తప్పు సరిచేసుకుని, దాన్ని నెగటివ్ గా నిర్దారించి, రిపోర్టును ఆసుపత్రికి పంపించారని తెలియజేశారు.

‘సాంఘిక దూరం’ పట్టించుకోని ఏపీ ప్రభుత్వం


నేడు మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా కట్టడికి `సామజిక దూరం’ పాటించడమే ఏకైక మార్గం అని అందరు చెబుతున్నారు. ఆ విధంగా చేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హిత బోధనలు చేస్తున్నాయి. కేవలం అందుకోసమే ప్రధాని నరేంద్ర మోదీ నుండి మూడు వరాల పాటు లాక్ డౌన్ పాటించమని ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక వంక కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉండగా, సాంఘిక దూరం పాటింప చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడి అవుతున్నది. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఈ విషయంలో ప్రభుత్వ అధికారులే ధిక్కార ధోరణి అవలంభిస్తున్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పేదలకు రూ 1,000 నగదు పంపిణి సహితం పరవశంగా జరిగి పోయింది. శనివారం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం పంచాయతీ ఎన్నికల ప్రచారం స్థాయిలో, ఒక పార్టీ కార్యక్రమం వలే కోలాహలంగా జరిగింది. వైసిపి కార్యకర్తలు గుంపులుగా ఇంటింటికి వెళ్లి డబ్బు పంచుతూ కరోనా నియంత్రణ గురించి ఏమాత్రం పట్టించుకోనని లేదు.

మరోవంక, స్వయంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఒంగోలు లో జరిగింది. జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (ఎఎన్‌ఎం), జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జిఎన్‌ఎం) పోస్టుల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా స్వయంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు.

ఈ సందర్భంగా `సామాజిక దూరం’ పాటించక పోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు గురి కావాల్సి వచ్చింది.కరోనా నేపథ్యంలో ఎఎన్‌ఎం, జిఎన్‌ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో, దరఖాస్తు చేసుకొనేందుకు ఒంగోలు కలెక్టరేట్‌లోని డిఎం అండ్‌ హెచ్‌ఒ కార్యాలయానికి శనివారం సుమారు 250 మంది మహిళలు వచ్చారు.

అభ్యర్థులు భౌతిక దూరం పాటించేలా, ఇతర జాగ్రత్తల విషయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదు. దీంతో, ఒక్కసారిగా వచ్చిన మహిళల అభ్యర్థులు కార్యాలయం వద్ద గుంపులు గుంపులుగా చేరారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, కరోనా నివారణ నిబంధనలు అమలు కాని పరిస్థితి నెలకొందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయం తెలుసుకొని పోలీసులు వచ్చి వారిని వరుసలో, దూరం – దూరంగా నిలబెట్టారు. కరోనా సమయంలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సిన శాఖే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలకు తావిచ్చింది.

జగన్ ఇలాంటి వారికి అండగా ఉండడం దురదృష్టకరం


ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న వీడియో సందేశం వెలువరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. దేశాన్ని భయపెడుతున్న కరోనా సమస్య ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదని అన్నారు. ఆయన అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎవరైనా ఏ మతస్తులైనా మత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని, రవిశంకర్ శిష్యులైనా, పాల్ శిష్యులైనా, తబ్లిఘీ శిష్యులైనా ఎవరైనా తమ మతానికి చెందిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చన్నారు.

అయితే, ప్రభుత్వం ఎప్పుడైనా అడిగితే వారంతా స్వచ్ఛందంగా వచ్చి సహకరించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం వారంతా అలా వచ్చి సహకరించకపోవడమే కాకుండా వికృత చేష్టలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతే కాకుండా సిబ్బందిపై దాడికి దిగడం ఖండించాల్సిన విషయమన్నారు. ఇలాంటి వారికి ముఖ్యమంత్రి వెన్నుదన్నుగా నిలవడం సరికాదన్న ఐవైఆర్.. మిగిలిన ఆధ్యాత్మిక సమావేశాలతో దీనికి ముడిపెట్టి సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని ఐవైఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా, లాక్‌డౌన్ లతో ఐటీకి గడ్డు కాలమే


కరోనా వైరస్, లాక్‌డౌన్ పరాభవాలతో దేశీయ ఐటీ రంగంకు గడ్డు కాలమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నా.. విదేశీ ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడ్డ భారతీయ ఐటీ రంగానికి కరోనా కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది ఐటీ రంగ వృద్ధి స్థిరంగానో లేదంటే ప్రతికూలంగానో ఉండవచ్చని ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్ అంచనా వేస్తున్నారు.

2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యం కంటే ఇప్పుడున్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయని బాలకృష్ణన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు సహితం 2008 కంటే దారుణంగా కనిపిస్తుండటం గమనార్హం. నాటి మాంద్యం తర్వాత కూడా దేశీయ ఐటీ కంపెనీలు కొంత వృద్ధిరేటును కనబరిచాయని, త్వరగా కోలుకున్నాయని కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించట్లేదని ఈ రంగ నిపుణులు ఆందోళన .

సింగపూర్ లాంటి దేశాల్లోనూ లాక్‌డౌన్ పరిస్థితులు కనిపిస్తుండడంతో భారతీయ ఐటీ సంస్థల ైక్లెయింట్లు పెట్టుబడులను భారీగా తగ్గించుకునే వీలున్నదని, ఇప్పటికే సిద్ధమైన పెట్టుబడులనూ వెనక్కి తీసుకోవచ్చని భావిస్తున్నారు.

అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న సంస్థలు తమ ఉద్యోగులకు అభయమిచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ మధ్య ఉద్యోగాలకు వచ్చిన భయమేమీ లేదన్నాయి. పలు సంస్థలు ఈ విపత్కర పరిస్థితులు మూడు నెలలున్నా.. భయపడవద్దని చెప్పాయి. మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏకంగా ఏడాదిపాటు ఉద్యోగ కోతల జోలికి వెళ్లబోమని హామీ ఇవ్వడం గమనార్హం.

ఎస్‌ఏపీ, సేల్స్‌ఫోర్స్, బూజ్ అల్లెన్ హామిల్టన్ సంస్థలు 90 రోజులు ఇదే పరిస్థితులున్నా ఉద్యోగులకు వచ్చిన ముప్పేమీ లేదన్నాయి. అయితే వెల్స్ ఫర్గో, జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్, హెచ్‌ఎస్‌బీసీ, డ్యూషే బ్యాంక్, క్రెడిట్ సూసీ, స్టార్‌బక్స్, పేపాల్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ మాత్రం ఇప్పటికెలా ఉన్నా.. భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం లేదు. ఉద్యోగాల హామీ ఇవ్వలేకున్నా.. ఉద్యోగుల్ని కాపాడుకుంటామని చెప్తున్నాయి.

గూగుల్, అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు కరోనా ప్రభావిత ఉద్యోగాల తొలగింపు ఉండవని స్పష్టం చేశాయి. తమ నగదు నిల్వల్ని ఈ కష్టకాలంలో జీతాలకు వాడుతున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ పెను బీభత్సాన్నే సృష్టిస్తున్నది. కరోనా మృతులు లక్షకు పరిమితమైతే మనం అదృష్టవంతులమేనన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలనుబట్టి అక్కడ కరోనా విలయాన్ని అంచనా వేసుకోవచ్చు. అయితే భారత ఐటీ రంగానికి అతిపెద్ద విదేశీ కస్టమర్ అమెరికానే. అలాంటి దేశం ఇప్పుడు కరోనా కాటుకు బలైపోతున్నది. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగంపైనా తప్పక ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రిటైల్, ఆర్థిక సేవలు తదితర కీలక రంగాలన్నింటిపైనా కరోనా ప్రభావం గట్టిగా కనిపిస్తున్నదని, నిరుద్యోగం పెరిగిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులు తగ్గి వాటి ధరలు కూడా పడిపోయే వీలుందని చెబుతున్నారు. ఐరోపా దేశాల్లోనూ కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తుండటం భారతీయ ఐటీ పరిశ్రమకు శరాఘాతమవుతున్నది.

కరోనా’ సాయం అధికార పార్టీ నాయకులచే పంపిణీ..!


ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో గత కొద్ది రోజులుగా పనులు లేక ఖాళీగా ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని (కరోనా రిలీఫ్ ఫండ్)శనివారం నుండి ఆయా గ్రామ వాలంటీర్లు పంపిణీ చేయవలసి ఉండగా వాలంటీర్లతోపాటు ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ వేసిన అభ్యర్థులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు రాష్ట్రంలో పలుచోట్ల బహిరంగంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎంపీటీసీలకు నామినేషన్ వేసిన అభ్యర్థులు ఇలాంటి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు పక్కాగా ఉన్నా ఎన్నికలకు ప్రత్యేకంగా నియమించిన మండల స్థాయి అధికారులు వీరిపై ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే గ్రామ వాలంటీర్లు కూడా ఎంపీటీసీలకు పోటీ చేసిన అభ్యర్థులతోనే వెయ్యి రూపాయలను ప్రజలకు అందజేయటంపై గ్రామాల్లో చర్చలు సాగుతున్నాయి. ఇటువంటి సంఘటనలపై పలు ఆధారాలతో ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేయనున్నాయి.

అలాగే అలాంటి వలంటీర్లపై ఆధారాలతో పోలీసులు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఆధారాలను సేకరించినట్లు తెలియవచ్చింది.

కరోనా ప్రత్యేక సాయం పంపిణీ దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ పేర్కొంది. ఈ సంఘటనలపై గవర్నర్ బిశ్వ భూషణ్ కు పిర్యాదు చేసారు. సంక్షోభంలోను స్వార్థ రాజకీయం సరి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తితో దేశం, రాష్ట్రం తీవ్రఇబ్బందిలో ఉన్న ఈ పరిస్థితుల్లో విపత్తు నిర్వహణ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సొంత నిధులుగా స్టిక్కర్ వేసి వాలంటీర్లతో కలిసి వైసీపీ కార్యకర్తలు తమపార్టీ ఇస్తున్నట్లు పంచడాన్ని తప్పుబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

“దీపం పిలుపు” వెనుక అసలు రహస్యం.. ఇదేనా?

కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా, ప్రజా ఐక్యతకు సూచనగా, జాతీయ పోరాటానికి గుర్తుగా ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి 9 గంటలకు ఇంట్లో ఉన్నఎలెక్అట్ర్ర్ఈఈకాల్ లైట్లను మరియు లైట్ కొవ్వొత్తులు లేదా డయాస్ లేదా తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఉపయోగించాలని పిఎం మోడీ కోరారు.కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా, ప్రజా ఐక్యతకు సూచనగా, జాతీయ పోరాటం గుర్తుగా ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి 9 గంటలకు ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ లైట్లకు ఆర్పేసి వాటికి బదులుగా కొవ్వొత్తులు, దీపాలు లేదా మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఉపయోగించాలని పిఎం మోడీ కోరారు.

ఏప్రిల్ 5 ఎందుకు? రాత్రి సమయం ఎందుకు? దీని ప్రత్యేకత ఏమిటి?

హిందు క్యాలెండర్‌ ప్రకారం ప్రతి నెలా ప్రదోష్ వ్రతం లేదా ప్రడోశం రెండుసార్లు వస్తుంది. ఈ క్రమంలో ఏప్రిల్ లో ప్రదోష్ వ్రతం ఏప్రిల్ 05, ఆదివారం. ప్రడోషా పూజ సమయం:
Apr 05, 6:40 PM – 8:59 PM. ఇదే నెలలో ఏప్రిల్ 20న మరోసారి కూడా వస్తుంది.

రాత్రి 9గంటలకు పూజ ముగుస్తోంది. పూజ తరువాత, చాలా మంది భక్తులు దర్శనం కోసం శివుని ఆలయాలను సందర్శిస్తారు. ప్రదోషం రోజున ఒక్క దీపమైన వెలిగించడం చాలా మంచిదని అని నమ్ముతారు. కాబట్టి, రాత్రి 9 గంటలకు దీపం వెలిగించమని కోరతారు. ఈ రోజు రాత్రి 9గంటలకు మోడీ అదే పిలుపును ఇవ్వడం గమనార్హం.

కరోనా ని పారదోలే క్రమంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆలోచించి దేశ ప్రధానిగా మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక ఒక ఆచారంగా భావించి దేశానికి ఈ పిలుపునిచ్చారా..? అనేది అప్రస్తుతం. కరోనా వ్యాప్తితో భయబ్రాంతులకు గురయ్యే వారికి, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం.. అనుకునే వారికి మోడీ “దీపం”పిలుపు ఎంతో కొంత ధైర్యాన్ని ఇస్తుందని భావిద్దాం..!

కొంతమందికి ఇంట్లోవుండటం ఇబ్బందే

రోజులు గడుస్తున్నాయి భారంగా , ఇంట్లో బందీలం , బలవంతంగా టీవీ ప్రేక్షకులం. అయినా క్షేమం , కరోనా మహమ్మారి విముక్తులం. ఇంటి లక్ష్మణ రేఖ దాటితే కాచుకుకూర్చుంది కరోనా భూతం, అందుకే ఇల్లు వదలం , కరోనాను దరిచేరనివ్వం. ఏప్రిల్ 15 దాకా లాక్ డౌన్ పాటిస్తాం, మానవాళి ని కాపాడుకుంటాం. ఈ యుద్ధంలో అంతిమ విజయం మనదే మనదే. ఇదే  మన లక్ష్యం , ఇదే మన గమ్యం.

ఈ లక్ష్యంతో హాయిగా ఆనందంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరితో గడుపుదాం. ఇంట్లో వాళ్ళు కూడా ఎన్నాళ్ళనుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి పాతరోజులు గుర్తుకుతెచ్చుకుంటే వేసవికాలం వచ్చిందంటే చాలు అందరం ఊళ్లకు చేరి కాలక్షేపం చేసేవాళ్ళం. ఆరోజులే వేరు. మరి ఇన్నాళ్ళకు అటువంటి అవకాశం మళ్ళా వచ్చింది. ఈ మధ్యలో పరుగుల యుగంలోకి ప్రవేశించి పాత జీవితం మరిచిపోయామని కాబోలు ఈ మహమ్మారి మనల్ని పాత జ్ఞాపకాల దొంతరలోకి నెట్టింది. అప్పటికీ ఇప్పటికీ తేడా అప్పుడు పుస్తకాలు , కబుర్లు, ఆటల్లో మునిగిపోతే ఇప్పుడేమో స్మార్ట్ ఫోను, స్మార్ట్ టీవీ , లాప్ టాప్ లతో క్షణం తీరికలేకుండా గడుపుతున్నాం. ఇంట్లోవున్నా ఇవి అందుబాటులో ఉండటంతో టైం ఇట్టే గడిచిపోతున్నట్లుంది కదూ.

కొంతమందికి ఇంట్లో వుండటం ఇబ్బందే 

అయినా ఇంట్లో వుండమంటే ఇబ్బందిపడే జనానికి తక్కువేమీ లేదు. తిరిగే కాలు తిట్టే నోరు కట్టిపడేస్తే ఇబ్బందే మరి. కొంతమందికి మంది మార్బలం లేకపోతే నిద్రపట్టదు. ప్రత్యర్ధి పార్టీ వాళ్ళను తిట్టందే నోటి దురద తీరదు. ఏం చేద్దాం ఎవరి అలవాట్లు వారివి. ఇంట్లో కట్టిపడేసే సరికి ఏమిచేయాలో తెలియక కస్సు బస్సు లాడటం మొదలయ్యిందంట. ఇంట్లో కబుర్లు చెప్పమంటే కసురుకోవటం , ప్రతర్దులమీద చూపించే కోపం ఇంట్లో వాళ్ళ మీద చూపించటం జరుగుతుందంట. దీనికి ఇంటి ఆడపడుచులందరూ కలిసికట్టుగా ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నారంట. లేకపోతే మధ్యాహ్నం సీరియళ్ళు మిస్ అవుతున్నారంట. అందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. రానే వచ్చింది సువర్ణవకాశం. మొన్నటికి మొన్న మోడీ వీడియో రిలీజ్ చేసాడు. ఈసారి అరగంట కాకుండా పది నిముషాలలోనే ముగించాడు. అందుకనే ముందు రోజు రేపు చిన్న వీడియో రిలీజ్ చేస్తానని ముందుగానే చెప్పాడు. వెంటనే మీడియా లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. మోడీ ఏమి మాట్లాడబోతున్నాడో ననే ఊహాగానాలు , డిబేట్లు షరా మామూలే. ఆ టైం రానే వచ్చింది. క్లుప్తంగా తను చెప్పాల్సింది సూటిగా చెప్పాడు. లాక్ డౌన్ ఇప్పటిదాకా సక్సెస్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సామాజిక దూరాన్ని వచ్చే పది రోజుల్లో కూడా తప్పకుండా పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొడదామని పిలుపునిచ్చాడు. చివరగా ఆదివారం 9 గంటలకు 9 నిముషాలు లైట్లు ఆపి దీపం వెలిగించమని విజ్ఞప్తి చేసాడు. ఇక మీడియా ఎప్పటిలాగే డిబేట్లే డిబేట్లు. కాకపోతే ఎక్కువగా మానసిక శాస్త్రవేతల్ని పిలిచి దీనిపై చర్చించటం బాగానే వుంది.

సామాజిక మాధ్యమాలు, మేధావులు

మోడీ ఇచ్చిన పిలుపు స్పష్టంగా వుంది. ఎందుకు ఈపని చేయాలో చెప్పాడు. ఇంట్లో ఒక్కరిగా వున్నా మీకు 130 కోట్ల ప్రజానీకం తోడున్నారని ఆత్మవిశ్వాసం పెంపొందించటానికి అందరం కలిసి ఈ కార్యక్రమం చెప్పట్టాలని చెబితే వెంటనే సామాజిక మీడియా లో దీనికి వున్న సంఖ్యా శాస్త్ర ప్రాధాన్యతని ఏకరువు పెడుతూ పుంఖాను పుంఖాల పోస్టులు వెలువడ్డాయి( ఏదో ఆయన వీళ్ళ చెవిలో చెప్పినట్లే) . కొంతమంది దీని రాశి బల ప్రాముఖ్యాన్ని వివరించారు. కొన్ని తెలుగు ఛానళ్ళయితే అదేపనిగా పనిగట్టుకొని ఈ ప్రచారం చేసారంట. ఇంకేముంది హేతువాదులూ , వామపక్ష మేధావులూ మోడీ ఈ దేశానికి ప్రదానమంత్రా లేక మూఢ నమ్మకాలకి ప్రతినిధా అని ఎద్దేవా చేస్తూ పోస్టింగులు పెట్టారు. అసలు సమస్య పక్కదోవపట్టింది. ప్రజలు 21 రోజులు ఇంట్లోనే గడపాలంటే మధ్య మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు చేయకపోతే పట్టు సడలిపోయే అవకాశం వుంటుందనేది ఏమాత్రం బుర్ర పెట్టి ఆలోచించే వాళ్లకు అర్ధమవుతుంది. ముఖ్యంగా వామపక్ష మేధావులకు ఈ విషయం లో పూర్తి అవగాహన వుంది. ఎందుకంటే దీర్ఘకాలిక సమ్మెలు చేసిన అనుభవముంది కదా. ఒక్కసారి పిలుపు నిచ్చి వూరుకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలిసికూడా దీనిపై యాగి చేయటం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా.దీనిపై  సానుకూల దృక్పధం తో ఆలోచిస్తే విషయం అర్ధమయ్యి అందరిలో ఐక్యత పెరుగుతుంది. అంతేగాని గ్రహబలాలు, ,సంఖ్యా బలాలు ఇందులోకి చొప్పిస్తే కార్యక్రమ లక్ష్యం దెబ్బతింటుందని ఈ అత్యుక్షాహకులు గ్రహిస్తే మంచిది. అలాగే వామపక్ష మేధావులు కూడా ఇదేదో మోడిని విమర్శించటానికి మంచి అవకాశం వచ్చిందని అనుకోవటం కూడా మంచిదికాదు. ఇద్దరూ కలిసి ఈ పిలుపుని రాజకీయం చేయటం ఎంతవరకు సబబు? ఆలోచించండి. మీ అందరికీ దండాలు. కొంచెం సంయమనం పాటించండి మహానుభావులూ .

రాజకీయ నాయకుల నోటి దురద తీరింది

రాజకీయనాయకుల్ని వట్టిగా ఇంటిదగ్గర కోర్చోమంటే ఎట్లా చెప్మా? ఎటూ బయట తిరగటం లేదు. సామాజిక దూరం పేరుతో మంది మార్బలం లేకుండా అయిపోయింది. ఇక మిగిలిందల్లా నోటి దురద . ఇది కూడా బంద్ అయితే ఎట్లా? ఆ కోపం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తున్నారంట ? ఇదో పెద్ద సామాజిక సమస్య అయ్యేటట్లుంది. ఇటీవల వార్తల్లో వచ్చింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మద్యం షాపులు మూసేయటం వలన కేరళలో రోజూ మద్యం తాగే వాళ్లకు సామాజిక సమస్య వచ్చిందంట. కరోనా మహమ్మారి తో చచ్చిపోయిన వాళ్ళకంటే వీళ్ళ ఆత్మహత్యలే ఎక్కువున్నాయంట. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కేరళ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుందంట. అలాగే రాజకీయ నాయకుల నోళ్ళు కట్టేస్తే , బయట తిరగకుండా కట్టడి చేస్తే ఇదికూడా ముందు ముందు పెద్ద సామాజిక సమస్య  అయ్యేటట్లు వుందంట.

అనుకోకుండా వీళ్ళందరికీ ఓ మంచి అవకాశం వచ్చింది. మోడీ  వీడియో సందేశం తో రెచ్చిపోయారు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు . మోడీ సందేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని అవన్నీ అడియాశలయ్యాయని వాపోయారు. ఒకాయనయితే ఇదంతా మోడీ ఫోటో సందడి, ప్రచారాలు తప్పితే ఏమీ లేదనీ విమర్శించాడు. ఇంకో ఆయన మేమేదో వలస కార్మికులకి, పేద వాళ్లకి, అనాధలకి ఆర్ధిక పాకేజీ ప్రకటిస్తాడనుకుంటే తుస్సుమనిపించాడని హేళన చేసాడు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడయితే నేను లైట్లు ఆర్పనంటే  ఆర్ప, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. జాగ్రత్త సుమా , ఒక్కసారి చెక్ చేసుకుందాం. వాళ్ళావిడ కామ్ గా లైట్లాపకుండా చూసుకోవాలి. అసలే మహిళా సాధికారతపై మోడీ ఉపన్యాసాలు దంచేస్తున్నాడు. ప్రజాస్వామ్యం కదా  ఒక్కసారి జాగ్రత్తపడండి అదిర్ రంజన్ చౌదరి గారూ.

అసలు నాకు తెలియక అడుగుతానూ మోడీ అంతకుముందు రెండుసార్లు మాట్లాడినప్పుడు కూడా ఆర్ధిక పాకేజీ గురించి మాట్లాడలేదు కదా. మధ్యలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లక్షా డెబ్భై ఐదువేల ఆర్ధిక ఉద్దీపనా పాకేజీ  ప్రకటించింది, మోడీ కాదుకదా . వీళ్ళకు ఆమాత్రం తెలియదంటావా?  లేక తెలిసే నాటకమాడుతున్నారా? ఏమో ఏదైనా కావచ్చు. కాంగ్రెస్ నాయకులు బాగా అనుభవజ్ఞులు మనకు తెలిసినంత మాత్రం వాళ్లకు తెలియదని అనుకోలేం కదా. ఏదో మిషమీద నోటి దురద తీరింది. వాళ్ళ మానసిక సమస్యా తీరింది. హమ్మయ్య ప్రస్తుతానికి కొద్ది రోజులు పర్వాలేదు. లోలోపల మోడీకి కృతజ్ఞతలు కూడా చెప్పారంట. లేకపోతే పెద్ద సామాజిక సమస్య వచ్చిపడేది సుమా. ఆ తర్వాత ఇంట్లో కూడా గొడవపెట్టుకోవటం లేదంట. అందుకు ఇంటి ఆడపడుచులు కూడా మనసులో మోడీకి నమస్కారం పెట్టుకున్నారంట. విధి వైచిరీత్యమంటే ఇదేనేమో. బద్ధ శత్రువు మోడీ పరోక్షంగా వీళ్ళకు ఉపయోగపడటం .

సినిమా వాళ్ళే నయం 

వీళ్ళ కన్నా సినిమా ఆర్టిస్టులు మెరుగనిపించారు. వాళ్ళు రాజకీయనాయకులు కాదుకదా. ఏ ప్రభుత్వం అధికారం లో వున్నా ఇటువంటి సందర్భంలో మద్దత్తు నివ్వటమే తెలుసు. రాజకీయం చేయటం తెలియదు. మంచి పాటలతో కరోనా మహమ్మారి పై ప్రజలకు హితబోధచేస్తున్నారు. కొంతమంది ఇంట్లో తీరికగా ఏం చేస్తున్నారో వీడియోలు తీసి రిలీజ్ చేస్తూ ప్రజలను టెన్షన్ నుంచి రిలాక్స్ చేస్తున్నారు. ఇప్పుడుకావాల్సింది ఇదే. చేతనయితే ప్రభుత్వ కార్యక్రమాలకు తోడ్పాటునివ్వటం లేకపోతే ఇంట్లో హాయిగా సినిమాలు చూస్తూ పెళ్ళాం పిల్లలతో కాలక్షేపం చేయటం. అంతేగానీ ప్రజల్ని గందరగోళ పరిచే ఆలోచనలు చేయొద్దు మహాప్రభో. మరొక్కసారి మీ అందరికి చేతులెత్తి నమస్కారాలు. ఎలాగోలాగా ఇంకో పది రోజులు ఇంట్లోనే గడపండే. బాబ్బాబు మీకు పుణ్యముంటుంది. లాక్ డౌన్ కి పూర్తిగా సహకరించండి. మనందరం కలిసి కరోనా మహమ్మారి ని తరిమేద్దాం. అందుకు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిద్దాం.

ఇవీ ఈ వారం ముచ్చట్లు. సరదాకోసంమాత్రమే ఎవరినీ ఉద్దేశించి మాత్రం కాదు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవు.

అన్నట్లు మరచాను . అందరం ఆదివారం దీపం/కాండిల్/టార్చ్ లైట్/ఫ్లాష్ లైట్ వెలిగిద్దాం, 130 కోట్లమందిమి ఒక్కటని చాటుదాం. 

…….మీ రామ్

 

కరోనా ఎఫెక్ట్.. మద్యం చోరి


కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్డౌన్ అమలవుతోంది. ఈనేపథ్యంలో ప్రజారవాణా స్తంభించిపోయింది. అలాగే వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు, వైన్ షాపులు మూతపడ్డాయి. లాక్డౌన్ ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో మందుబాబులకు మద్యం దొరకక అల్లాడిపోతున్నారు. కొంతమంది పిచ్చి చేష్టలతో ఆసుత్రులకు క్యూ కడుతున్నారు. కొంతమంది ఏకంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి.

లాక్డౌన్ నేపథ్యంలో రెండు వారాల నుంచి వైన్ షాపులు తెరవడం లేదు. మద్యం దొరకక కొందరు మద్యంషాపుల్లో చోరికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని గాంధీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర వైన్ షాపులో శుక్రవారం రాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని దుండగులు వైన్ షాపు వెనుక భాగంలోని రేకులను తొలగించి లోపలికి వెళ్లారు. వైన్ షాపులోని పలు బ్రాండ్ల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారుగా లక్ష రూపాయాలు ఉంటుందని సమాచారం. అలాగే షాపు డ్రాలో ఉన్న రూ.15వేల డబ్బును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం షాపులోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీని ఆధారంగా ఇద్దరు వ్యక్తులు చోరికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ చోరీకి పాల్పడింది మద్యంబాబులా? లేక ఎవరైనా మద్యాన్ని బ్లాక్‌లో అమ్ముకునేందుకు చేసారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.