
ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు ‘మాస్టర్ 241’ను స్ఫూర్తిగా తీసుకోవాలని క్రికెట్ దిగ్గజం లారా అన్నారు. సచిన్ ఆడిన ఇన్నింగ్స్ లో ‘మాస్టర్ 241’ చాలా క్రమశిక్షణతో కూడుకున్నదని పేర్కొన్నారు. సిడ్నీ మైదానంలో సచిన్ అజేయంగా సాధించిన 241 పరుగులు మాత్రం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం చేసినవన్నారు. ప్రస్తుతం ప్రపంచం కరోనా ఎదురొనేందుకు ఈ ఇన్నింగ్స్ లో సచిన్ చూపిన పట్టుదల ప్రతీఒక్కరిలో రావాలని లారా తన ఇన్ స్ట్రాగ్రామ్లో కోరాడు.
2004 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో టూర్‌లో సచిన్ ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బందిపడ్డాడు. ఆ టూర్ సచిన్ ను త్వరగా అవుట్ చేసేందుకు ఆసీస్ బౌలర్లు కవర్ డ్రైవ్ ఆడేలా ఊరిస్తూ దెబ్బతీశారు. అయితే చివరి టెస్టులో మాత్రం సచిన్ అలాంటి షాట్లకు వెళ్లకుండా ఏకాగ్రతతో పరుగులు రాబట్టి డబుల్ హండ్రెడ్ సాధించి సత్తా చాటాడు. 241 పరులు సాధించింది అజేయంగా నిలిచాడు. అదేవిధంగా 16ఏళ్ల వయస్సులో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన క్రికెటర్ 24ఏళ్లపాటు జట్టులో కొనసాగడం మామూలు విషయం కాదని లారా తెలిపారు. కాగా సిడ్ని టెస్టు డ్రాగా మారింది.