Home Blog Page 8537

రౌద్రం రణం రుధిరం చిత్రం నిడివి 3 గంటలు ఉండాల్సిందే

rrr shooting


సినిమా విజయంలో ఒక్కోసారి చిత్రం యొక్క నిడివి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న సినిమాలకు సినిమా నిడివి తక్కువగా, క్లుప్తంగా ఉంటే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే భారీ బడ్జట్ చిత్రాలకు అయితే నిడివి కొంచెం ఎక్కువగా ఉంటే కూడా ప్రేక్షకులు ఏమీ ఇబ్బంది పడరు.

2015 జూలై 10 న వచ్చిన ‘బాహుబలి’ రెండున్నర గంటలకి పైనే వుంది. అయినా ప్రేక్షకులు ఏమీ బోర్ ఫీల్ అవ్వలేదు ఇక ‘బాహుబలి 2’ విషయానికొస్తే, 10 నిమిషాల తక్కువ 3 గంటల లెంగ్త్ వుంది. అయినా గానీ చిత్ర విజయానికి ఎటువంటి డోకా ఏర్పడ లేదు. దాంతో రాబోయే రాజమౌళి చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ ఎంత నిడివిని కలిగి ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమా 3 గంటల నిడివిని కలిగి ఉండేలా చూసుకొంటున్నాడు. దర్శకుడు రాజమౌళి …

ఇద్దరు స్టార్ హీరోలు, వారికి తగ్గ కథాకథనాలు … ప్రధాన పాత్రలలో నటిస్తున్న అగ్ర నటులకు తగిన ప్రాధాన్యత .. వారికి తగ్గ భారీ పాటల కారణంగా సినిమా 3 గంటల నిడివిని కలిగి ఉండే చాన్సు ఉంది.. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. అందువలన ఆయా భాషల నటుల పాత్రలకు కూడా న్యాయం చేయాల్సి వస్తుంది ఇక భారీ బడ్జట్ కావడం తో ఈ సినిమాకి దృశ్యాల చిత్రీకరణ ప్రత్యేక ఆకర్షణ గా మారి నిడివి పెరుగుతుందని అంటున్నారు. ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. సో ప్రేక్షకులు నిడివి గురించి ఆలోచించడం జరగదు.అని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది ..

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదం


ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కరోనా వ్యాప్తికి ఒక సామాజిక ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీకి పోయి పంక్షన్లు చేసుకుని, ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చేస్తున్నారని, ఇకనైనా శుభ్రంగా ఉండాలంటూ నారాయణ స్వామి సూచించారని తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన ముస్లింలు వైద్యులకు సహకరించడం లేదని, ఆసుపత్రుల్లో భౌతిక దూరం పాటించలేదని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని వ్యాఖ్యనించారని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నయి.

సీఎం జగన్ మాత్రం కరోనాకు కులం, మతం లేదని చెబుతున్నారు. మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని ఆయన అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమించవద్దని, భౌతికదూరం పాటిస్తూ కరోనాను తరిమేద్దామని జగన్‌ పిలుపునిచ్చారు. ఆయన మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ ప్రభావం ప్రభుత్వంపై పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో నారాయణస్వామిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముస్లిం సంఘాల పెద్దలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

మరోవైపు ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి తెలిపారు. జమాత్ నుంచి వచ్చిన ముస్లిం లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించే ప్రయత్నం చేశానని, కరోనా చికిత్స పొందుతున్న రోగులు వైద్యులకు సహకరించడం, ఇతరులకు వైరస్ అంటుకోకుండా జాగ్రత్త పడాలన్నదే నా ఉద్దేశమన్నారు. ప్రతీ మతస్థుడు తమ ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చని చెప్పారు. భావ వ్యక్తీకరణ లోపం కారణం గానే నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని తెలిపారు.

అంతేగాని ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదని, నాకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉందన్నారు. ఈ విషయాన్ని నా ఆత్మసాక్షి గా చెబుతున్నట్లు తెలిపారు. నేను కూడా అణగారిన ఎస్సి వర్గానికి చెందిన వాడినేన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం..


దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. లాక్డౌన్ కారణంగా ఓ వైపు ప్రజలు ఇళ్లకే పరిమితమైన సమయంలో ఢిల్లీలో భూకంపం రావడం ఆందోళన కలిగింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. సుమారు 3నుంచి 4సెకన్లపాటు భూప్రకంనలు వచ్చినట్లు తూర్పు ఢిల్లీలోని భూకంప కేంద్రం గుర్తించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లో 3నుంచి 4సెకన్లపాటు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది.

ఇదిలా ఉండగా ఢిల్లీలో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. అదేవిధంగా ఆదివారం ఢిల్లీలో వాయికాలుష్యం ఒక గీతపెరిగి ‘మితమైన(మోడరేట్)’ కేటగిరిలో నిలిచింది. అయితే గతవారం ఢిల్లీలో లాక్డౌన్ కారణంగా వాయికాలుష్యం తగ్గి ‘గుడ్ కేటరిగి’లోకి వచ్చింది. అయితే ప్రధాని మోదీ కరోనా చీకట్లను తొలగించాలని ఏప్రిల్ 5న పిలుపునివ్వగా కొందరు దీపాలకు బదులుగా కాకర్స్ కాల్చారు. దీంతో వాయికాలుష్యం పెరిగినట్లు తెలుస్తోంది.

కాగా భూకంపం వల్ల ఢిల్లీలో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలను భూకంపం రోడ్లపై పడేయడం శోచనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు.

కేంద్రం ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తుందా..!


కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు దేశంలో గత నెల 23 నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. లాక్ డౌన్ ముగింపు గడువు సమీపిస్తుండటంతో లాక్ డౌన్ ను కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అనే అంశంపై కేంద్రం అందరి సలహాలను సేకరిస్తోంది. కొందరు కొనసాగించాలని, మరి కొందరు ఎత్తివేయాలని కోరుతుండటంతో లాక్ డౌన్ పై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో కరోనా కట్టడికి దేశాన్ని మూడు జోన్లుగా విభజించాలనే ప్రతిపాధిస్తోంది. ఈ జోన్ లలో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా ఉంటాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే రెడ్ జోన్లలో పూర్తి స్థాయి ఆంక్షలు. ఆరెంజ్ జోన్ లో పరిమిత స్థాయిలో ఆంక్షలు. కరోనా కేసులు ఒక్కటి కూడా లేని గ్రీన్ జోన్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తువేసే ఆలోచనను సూచిస్తుంది. లాక్ డౌన్ పై త్వరలోనే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఈ మార్గదర్శకాలలో పేర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరోవైపు కరోనా సమస్య తీవ్రంగా ఉన్న స్పెయిన్ లాక్ డౌన్ ను ఈ నెల 25 వరకూ పొడిగించింది. ఇటలీలో ఈ నెల 13 తో లాక్ డౌన్ ముగుస్తుండగా మరో రెండు వారాలు పొడిగించింది. భారత ప్రభుత్వం లాక్ డౌన్ గురించి ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించ లేదు. మన దేశంలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా కరోనా వ్యాప్తి పెరిగిందని కేంద్రం విడుదల చేస్తున్న గణాంకాలు చెబుతున్నాయి.వారం రోజుల కిందట రోజుకు సుమారు 500 మంది కొత్తగా కరోనా బారిన పడుతుంటే ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యికి పెరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం కీలకంగా మారింది.

కేంద్రం తీసుకునే నిర్ణయం ఏదైనా తమ రాష్ట్రా పరిధిలో ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని దేశంలోని ఏడు రాష్ట్రాలు నిర్ణయించాయి. వీటిలో అందులో ఆరు రాష్ట్రాలు బీజేపీయేతర పాలిత ప్రాంతాలైతే, బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్ణాటక కూడా ప్రధాని నిర్ణయంతో సంబంధం లేకుండా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాకపోతే వ్యవసాయ, పారిశ్రామిక రంగాకు కొన్ని మినహాయింపు ఇస్తూ సీఎం యడ్యూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాలు ప్రధానితో సీఎం వీడియోకాన్ఫరెన్స్‌కు ముందే ఈ ప్రకటన చేయగా, తాజాగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు పొడిగింపు నిర్ణయం తీసుకున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుపై కేంద్రమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలుని సీఎం లంతా ప్రధానికి సూచిస్తునే, అంతకు ముందే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొడిగింపు ప్రకటన చేయడం గమనార్హం.

మాస్కు ధరించకుంటే 5వేల జరిమానా!


దేశంలో కరోనా ఎంట్రీలో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. కేంద్రం విధించిన 21రోజుల లాక్డౌన్ ఈనెల 14తో పూర్తవుతుందని అందరూ భావించారు. అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో కేంద్రం మరో రెండువారాలపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 30వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తూనే కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తుంది.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. తెలంగాణ, ఏపీలోనూ ఇళ్ల నుంచి బయటికి వచ్చే మాస్కు ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బహిరంగం ఉమ్మివేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన సంగతి తెల్సిందే. అదేవిధంగా ఒడిశాలో మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.200 జరిమానా అమలు చేస్తుంది. తొలి మూడుసార్లు వరకు రూ. 200జరిమానా పరిమితం చేశారు. ఇక నాలుగోసారి ఉల్లంఘిస్తే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

అదేవిధంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రజలు తప్పనిసరిగా మాస్కలు ధరించాలని నిబంధన చేసింది. నగరంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే ముఖానికి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తాజాగా ప్రకటించింది. లేనట్లయితే మూడేళ్లు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ నిబంధనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ పై రష్మీ గౌతమ్ ఫైర్


హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రష్మీ గౌతమ్ కు సినిమాల్లో కంటే జబర్దస్ షో ద్వారానే ఎక్కువ ప్లాపులారిటీ వచ్చిన సంగతి తెల్సిందే. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. నిత్యం సమాజంలో జరిగే విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంది. ఒక్కొసారి ఆమె పెట్టే పోస్టులతో నెటిజన్ల కొపానికి గురవుతుంటుంది. అయినప్పటికీ ఆమె చెప్పదలుచుకున్న విషయాలను నిర్మోహమాటంగా చెబుతోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పై రష్మిక చేసిన హాట్ కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాతో కలిసొచ్చిన సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వినియోగించుకుంటున్నారు. కొందరు హీరోయిన్లు తమ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. మరికొందరు ఇంట్లో ఫ్యామిలీతో గడిపిన పిక్స్ షేర్ చేస్తున్నారు. కొందరు వంటలు నేర్చుకుంటుండా మరికొందరు యోగా, ఫిట్ నెస్ వంటి పనులతో కాలాన్ని గడుపుతున్నాయి. తాజాగా సోనమ్ కపూర్ కూడా తాను చాక్ లెట్ కేక్ తయారుచేసినట్లు సోషల్ మీడియాలో పెట్టింది. అయితే తాను చాక్ లెట్ కేక్ తయారు చేసేందుకు ఇంట్లో చాకె లెట్లు లేవని చెప్పింది. దీంతో ఫార్చ్యున్ గార్మెట్స్ సంస్థను చాక్ లెట్స్ కావాలని కోరగా వెంటనే వారు పంపించారని చెప్పుకొచ్చింది. ఈ విషయంలోనే సోనమ్ కపూర్ ను రష్మి గౌతమ్ తప్పుపట్టింది.

కరోనా విజృంభిస్తున్న సమయంలో మీ హోదా ఉపయోగించి బయటి నుంచి చాక్ లెట్ తెప్పించుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇలాంటి సమయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని సోనమ్ పై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా? అంటూ నిలదీసింది. కాగా రష్మి గౌతమ్ కరోనా సమయంలో తనకు తోసిన విధంగా మూగజీవులకు ఆహారం పెడుతూ సేవ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో అందరూ ఆమె చేసిన అభినందించిన విషయం తెల్సిందే. అయితే సోనమ్ కపూర్ చేసిన పనికి ఈ భామ ఇంతలా రియాక్ట్ కావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

కులాలపై మోహన్ బాబు హాట్ కామెంట్


సినీ పరిశ్రమలో ముక్కుసూటి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోహన్ బాబేనని ప్రతీఒక్కరు చెబుతున్నారు. మనస్సులో ఏ విషయంలో దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు విషయం చెప్పేస్తారు. దాని వల్ల ఎవరు తనను నిందించినా.. ఎవరు బాధపడిన ఆయన పట్టించుకోరు. మొదటి నుంచి ఆయన నైజమే అలాంటిదని అందరూ సరిపెట్టుకుంటారు. తాజాగా ఆయన కులాలపై హాట్ కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు.

ప్రపంచంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్నవి రెండు కులాలేనని. అవి పాజిటివ్, నెజిటివ్ అని తనదైన శైలిలో వివరించారు మోహన్ బాబు. పదవీ అహంకారంతో ఉండే ఎవరైనా దీనిని అర్థం చేసుకుంటే చాలని జీవితాంతం గొప్పగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు కరోనా వచ్చిందని మోహన్ బాబు చెప్పారు.

‘ఎవరైనా బాంబ్ వేస్తే ఒక్కరోజులో చచ్చిపోతాం.. కానీ కరోనా విషయంలో మాత్రం ప్రతీక్షణం చస్తూ బ్రతుకుతున్నామని.. ఏ క్షణంలో ఎవరికి వస్తుందో ఏమిటో తెలియదని.. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా వస్తుందో తెలియదని చెప్పారు. కరోనా వైరస్ ‘తల్లి బిడ్డల మధ్య దూరం పెంచిందని.. భార్యాభర్తలను కూడా కలవకుండా చేస్తుందని.. ఇంతకంటే శిక్ష ఏముంటుంది.. ఇకనైనా ప్రతీఒక్కరూ మారాల్సిన సమయం వచ్చిందని’ మోహన్ బాబు తెలిపారు. ఆయన మాటలు ఆధ్యాత్మిక చింతనతో కూడినవిగా ఉండటంతో మోహన్ బాబు కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కరోనాపై కేటీఆర్ పిక్.. నెట్టింట వైరల్


దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 30వరకు పొడగించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీటర్లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ వారంలో తనకు ఎంతో నచ్చిన ఫొటో ఇదేనంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఈ ఫొటోలో ఏముందంటే.. ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు సామాజిక దూరం పాటించడం కన్పిస్తుంది. దుకాణం ఎదురుగా గీసిన బాక్సుల్లో దూరంగా నిల్చొని ఈ చిన్నారులు సామాజిక దూరం పాటించడం అందరనీ ఆకట్టుకుంటుంది. చిన్నారులకు పెద్దలకు సామాజిక దూరంగా పాటించాలని చెబుతున్నారని దీనిని ప్రతీఒక్కరు అర్థం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. అందరూ ఇంట్లో జాగ్రత్త ఉండాలని సూచించారు.

https://twitter.com/KTRTRS/status/1249237313604874242

కాగా ప్రభుత్వం కరోనాపై ఎంత అవగాహన కల్పించినా కొందరు తరుచూ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా ప్రభుత్వం లాక్డౌన్ పొడగించడంతోపాటు నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రోడ్లపైకి వచ్చే వాహనాలు 3కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. బయటికి వెళ్లేవారు తప్పని ముఖానికి మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జైలు శిక్ష తప్పదని తాజాగా ఉత్వర్వులను విడుదల చేసింది. ప్రజలు ఈ నిబంధనలు పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని ప్రభుత్వం చెబుతోంది.

కొడుక్కి హీరో పేరు పెట్టుకున్న స్టార్ డైరెక్టర్


దర్శకుడు అనిల్ రావుపూడి తాజా చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావుపూడి కాంబినేషన్లలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయింది. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ‘సరిలేరునికెవ్వరు’ చిత్రం నిలిచింది. ఈ మూవీ ప్రీ రీలీజు వేడుక సందర్భంలోనే అనిల్ రావుపూడికి కుమారుడు పుట్టిన సంగతి తెల్సిందే. తాజాగా ఆయన కొడుక్కి పేరు పెట్టాడు. ‘సరిలేరునికేవ్వరు’లో మహేష్ పేరు అజయ్ కృష్ణ. ఈ పేరునే తన కొడుక్కి పెట్టినట్లు అనిల్ రావుపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

‘సరిలేరునీకెవ్వరు’ మూవీలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటించారు. ఇందులో మహేష్ క్యారెక్టర్ పేరు అజయ్ కృష్ణ. ఈ పేరంటే ఇష్టంతోనే మహేష్ పాత్రకు ఆ పేరు పెట్టినట్లు చెప్పాడు. ఈ సినిమా విజయం గుర్తిండిపోయేలా తన కుమారుడి అజయ్ సూర్యన్ష్ అనే పెట్టినట్లు అనిల్ రావుపూడి చెప్పాడు. ఇక ‘సరిలేరునీకెవ్వరు’ ప్రీరిలీజ్ సందర్భంగా మెగాస్టార్-మహేష్-విజయశాంతి హంగామా ‘నెవ్వర్ బీఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్’ లా సాగింది. ఈ సినిమా హిట్టు తర్వాత స్టార్ హీరోలంతా అనిల్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్-3 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డారు. గతంలో విడుదలైన ‘ఎఫ్-2’ మూవీ సీక్వెల్ గా ‘ఎఫ్-3’ మూవీ రాబోతుంది. ఈ మూవీ స్ర్కీప్ట్ పనుల్లో అనిల్ బీజీగా ఉన్నాడు. ఇప్పటివరకు అనిల్ దర్శకత్వంలో వచ్చిన అన్ని మూవీలు సూపర్ హిట్టుగా నిలిచాయి. ‘ఎఫ్-2’లో నటించిన విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ మూవీలో నటించనున్నారు. అయితే హీరోయిన్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సిందే. ఈ మూవీ ‘ఎఫ్-2’ తరహాలోనే ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’తో అద్భుతంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే..

ఇక అలాంటి తప్పులు చేయనంటున్న హాట్ బ్యూటీ


చిత్రసీమలో హీరోయిన్ గా కొనసాగాలంటే ముందుగా కావాల్సింది గ్లామర్. అయితే కొంతమంది హీరోయిన్లకు గ్లామర్ పుష్కలంగా రాణించలేకపోతున్నారు. ఇందులో ఒకరు అనూ ఇమ్మాన్యుయిల్. ఈ అమ్మడికి అందం పుష్కలంగా అదృష్టంగా మాత్రం కలిసి రావడం లేదు. కెరీర్ తొలినాళ్లలో అగ్రహీరోలతో నటించిన ఈ భామ సరైన హిట్టులేక కనుమరగయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో అమ్మడు తెలివిగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ దర్శక, నిర్మాతలను ఆకట్టుకునే పడిలో పడింది. తాజాగా ఆమె అందాలకు ఫిదా అయిన ఓ యంగ్ దర్శకుడు తన సినిమాలో అవకాశం ఇచ్చాడు.

అఖిల్ హీరోగా నటించిన ‘మజ్ను’ చిత్రం ద్వారా అనూ టాలీవుడ్ ప్రేక్షకుల పరిచమైంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. పవన్ తో నటించిన ‘అజ్ఞాతవాసి’ ఆమెకు నిరాశనే మిగిల్చింది. బన్నీతో నటించిన ‘నాపేరు సూర్య’ అమ్మడికి సరైన విజయాన్ని అందించ లేకపోయింది. నాగచైతన్యతో నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ మాత్రం పర్వాలేదనిపించింది. దీంతో ఈ భామ సినిమాల్లో నటిస్తే ప్లాప్ అవుతుందనే ప్రచారం కావడంతో అవకాశాలు తగ్గుముఖంగా పట్టాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఛాన్సులపై అనూ ఆసక్తికరంగా స్పందించింది.

తనకు సినిమా పరిశ్రమ కొత్త కావడంవల్లే మొదట్లో తడబడినట్లు చెప్పింది. అలాగే తనకు ఏ కథలు ఎంచుకోవాలో తెలిసేది కాదని పేర్కొంది. అంతేకాకుండా దర్శకులు కేవలం సినిమాలో తన పాత్ర వరకు మాత్రమే విన్పించేవారని చెప్పింది. సినిమా గురించి పూర్తిగా తెలియకపోవడంతోనే ఆ మూవీలు ప్లాప్ అయ్యాయని అంటోంది. ఇక నుంచి అలాంటి తప్పులు చేయనని స్పష్టం చేసింది. తన వద్దకు పూర్తి స్ర్కిప్టుతో వచ్చినవారి కథలనే వింటున్నానని.. మిగతా వారిని మర్యాదగానే తిప్పి పంపిస్తున్నానని వివరించింది. ఆమె కెరీర్ గాడిలోనే లేని సమయంలో సినిమాపై అవగాహన పెంచుకోవడం మంచిదే అయినప్పటికీ ఈ నిర్ణయం తనకు ఏమేరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే..

16 కోట్ల మాస్కుల పంపిణీ


రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్క్‌ల వల్ల కొంత రక్షణ లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వీటిని పంపిణీ చేయాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని సీఎం కు వివరించారు. 32,349 మందిని వైద్యాధికారులకు ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు రిఫర్‌ చేసినట్లు చెప్పారు. వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. వీరేకాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని జగన్ ఆదేశించారు. కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల కోవిడ్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వివరించారు.

కోవిడ్‌ వ్యాప్తి ఉన్న జోన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వీరిపట్ల అనుసరించాల్సిన వైద్య విధానాలు, ప్రక్రియలను కింది స్థాయి వైద్య సిబ్బంది వరకూ చేరవేయాలని సూచించారు. ఉత్తమమైన, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు.

అలాగే నమోదవుతున్న కేసులు, వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్‌ తప్పనిసరిగా చేయాలని కోరారు. ఎక్కడా కూడా జనం గమిగూడ కుండా ఉండాలన్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమెదైన కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరిస్తూ…మొత్తం నమోదైన కేసులు 417, వీరిలో విదేశాలనుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసులు 13, వారిద్వారా సోకిన కేసులు సంఖ్య 12, ఢిల్లీ వెళ్లిన వారిలో పాజిటివ్‌ కేసులు 199, వారిద్వారా సోకిన వారు 161, మిగిలిన పాజిటివ్‌కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల వ్యాధి సోకిన వారు, వారి ద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32 మంది ఉన్నారని తెలిపారు.

0.2 శాతం మందికే వర్క్‌ ఫ్రం హోం సామర్ధ్యం


కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అన్నిచోట్లా లాక్‌డౌన్లు విధించడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులంతా వర్క్‌ ఫ్రం హోం నిర్వర్తిస్తున్నారు. కానీ వీరిలో చాలామంది పనితీరు సక్రమంగా లేదని, కేవలం 0.2 శాతం మంది మాత్రమే చక్కగా పనిచేస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

మిగిలిన 99.8 శాతం మందికి ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించే సామర్థ్యం లేదని ‘సైకీ మైండ్‌టెక్‌’ అనే సంస్థ తన సర్వే నివేదికలో స్పష్టం చేసింది.

ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించలేకపోతున్న వారిలో చాలామంది కొత్తగా నేర్చుకోవడం, విశ్లేషణ (95% మంది), ప్రాక్టికల్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాల కొరత (65% మంది), సరైన ప్రణాళిక లేకపోవడం (71%మంది).. ఇలా ఏదో ఒక అంశంలో వెనుకబడి ఉన్న ట్టు ఈ సర్వేలో తేలింది.

సవాళ్ళను స్వీకరించేందుకు 16.97% మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ, ఇలాంటివారికి చిన్నచిన్న సలహాలిస్తే సత్ఫలితాలుంటాయని ఈ అధ్యయనం సూచించింది.

ఇలా ఉండగా, కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగా మనదేశంలో కేవలం ఎగుమతిరంగంలోనే కోటిన్నర ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్‌ అధ్యక్షుడు షరద్‌కుమార్‌ సరాఫ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్ల కారణంగా 50శాతం ఆర్డర్లు రద్దయ్యాయని తెలిపారు.

భవిష్యత్తు కూడా నిరాశాజనకంగానే ఉందని దాంతో భారీగా ఉద్యోగాల కోత పడుతాయని స్పష్టం చేశారు. భారత్‌లోని 40 కోట్లమంది పేదలు కరోనా సంక్షోభం కారణంగా మరింత దారుణమైన పేదరికంలోకి జారిపోనున్నారని అంతర్జాతీయ కార్మిక సంఘం ప్రకటించిన నేపథ్యంలో షరద్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘పుష్ప’లో బాలీవుడ్ భామ ఐటమ్ సాంగ్


స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా మూవీ ‘పుష్ప’. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం విడుదల చేసింది. ఫస్టు లుక్కుతోనే అర్జున్ ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేశాడు. ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ ఈ మూవీలో కనిపించనున్నారు. ‘పుష్ప’ ఫస్టు లుక్కులోనే దర్శకుడు సుమార్ ఈ విషయాన్ని చూపించారు. బన్నీ తొలిసారి ఢిఫరెంట్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్టు లుక్కు సోషల్ మీడియాలో పలు రికార్డులను తిరగరాసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే మూవీల్లో ఐటమ్ సాంగ్స్ ఓ రేంజ్లో ఉంటాయి. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’లో పూజాహెగ్డేతో జీగేల్ రాణి సాంగ్.. తెరకెక్కించాడు. ఈ మూవీలో ‘జిగేల్ రాణి’ సాంగ్ ఎంతలా హిట్టయిందో తెల్సిందే. తాజాగా ‘పుష్ప’లోనూ ఓ స్పెషల్ సాంగ్ తెరకెక్కించే ప్లాన్లో దర్శకుడు సుకుమార్ ఉన్నాడు. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ ఈ స్పెషల్ సాంగ్లో నటించనుందని ప్రచారం జరుగుతుంది. ఈమేరకు కియారాను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కియారా అడ్వాణీ తెలుగులో మహేష్ బాబుతో కలిసి ‘భరత్ అనే నేను’ మూవీలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రాంచరణ్ తో కలిసి ‘వినయవిధేయరామ’లో నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే ఈ అమ్మడు బాలీవుడ్లో బీజీగా ఉండటంతో టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టడం లేదు. తాజాగా బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’లో నటించి బాక్సాఫీస్ విజయం అందుకున్న సంగతి తెల్సిందే. తాజాగా సుకుమార్ ఈ మూవీ కోసం సంప్రదించగా కియారా ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో బన్నీతో బాలీవుడ్ భామ కియారా స్పెప్పులేయడం ఖాయంగా కన్పిస్తుంది.

పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్


అల వైకుంఠపురంలో విజయం తరవాత అల్లు అర్జున్ లో చాలా మార్పు వచ్చింది ఇక మీదట తాను చేసే చిత్రాలు పాన్ ఇండియా ప్లాట్ ఫార్మ్ కు తగ్గట్టుగా ఉండాలి అని నిర్ణయం తీసుకొన్నాడు. ఆ క్రమంలో నటులు మరియు సాంకేతిక నిపుణులు జాతీయ స్థాయికి తగ్గట్టు ఉండేలా చూసుకొంటున్నాడు.

దరిమిలా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ లో నటుల ఎంపిక కు ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్నాడు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. కాగా ” పుష్ప” చిత్రం తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ ,మల్లువుడ్ లలో అల్లు అర్జున్‌కి కావాల్సినంత క్రేజ్ ఉండ‌టంతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ హిందీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి బ‌న్నీ ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడ‌ట‌. ప్ర‌ధాన పాత్ర‌ల్లో వీలైనంత మంది బాలీవుడ్ న‌టీన‌టుల‌ను న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు .

ఆ ఆలోచనలో భాగంగా ఈ ” పుష్ప” సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం వినయ విద్య రామ ఫేమ్ కియారా అద్వానీని సంప్ర‌దిస్తున్నార‌ని తెలుస్తోంది. కాగా.. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ యాక్ట‌ర్‌ను తీసుకోబోతున్నార‌ట‌. ఆ క్రమం లో ఒకనాటి స్టార్ హీరోలైన సంజ‌య్ ద‌త్‌, సునీల్ శెట్టి పేర్ తెర పైకి వచ్చాయి.ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కూడా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో దర్శనమివ్వ నున్నాడు .. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జరిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌ నున్నఈ చిత్రం లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

భయపడి బాలయ్య వెనక్కి తగ్గాడు

ప్రస్తుతం బాలయ్య బాబు పరిస్థితి పుండు మీద పుట్ర లా తయారయ్యింది .సినిమాల ఎంపిక లో ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. అసలే ఈ మధ్య విజయాలు దూరమౌతున్నాయి. చివరగా. విడుదలైన `రూలర్ `చిత్రం అయితే మరీ భయపెట్టింది. బాలయ్య కెరీర్ లోనే బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచి పోయింది. .

నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక చాలా చిత్రంగా ఉంటుంది. తనకు తోచిన రీతిలోముందుకు వెళ్తుంటాడు. కాంబినేషన్ గురించి ఎటువంటి శ్రద్ద తీసుకోడు..గత పది పదిహేనేళ్ల బాలయ్య కెరీర్‌ను తీసుకుంటే.. పి.వాసు, జయంత్.సి.పరాన్జీ, దాసరి నారాయణ రావు కె.ఎస్.రవికుమార్ లాంటి ఔట్ డేటెడ్ దర్శకులతో సినిమాలు చేశాడు.

బాలయ్యతో సినిమాలు చేసే సమయానికి వీళ్లెవ్వరూ సరైన ఫాంలో లేరు. అయినా సీనియర్ లన్న భావనతో వీళ్లతో సినిమా చేసాడు. ఇపుడు మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. బి.గోపాల్ లాంటి మరో ఔట్ డేటెడ్ డైరెక్టర్‌తో బాలయ్య బాబు సినిమా చేయబోతున్నాడన్న వార్త బయటికి వచ్చింది. దానికి తోడు చిన్నికృష్ణ లాంటి మాస్ రైటర్ కథతో బాలయ్య ఈ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి.

బి.గోపాల్, చిన్నికృష్ణ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ హిట్ కాంబో అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కానీ ఇపుడు ట్రెండ్ మారింది. కొత్త తరం కధలు రాజ్యమేలు తున్నాయి. ప్రేక్షకులు కూడా వినూత్న ప్రయోగాలకు పట్టం కడుతున్నారు అందుకే ముందు బి.గోపాల్ ప్రాజెక్టు పట్ల ఆసక్తితోనే ఉన్న బాలయ్య.. ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది . అసలే కెరీర్ అంతంత మాత్రంగా వున్న ఈ కష్ట కాలంలో ఇలాంటి సినిమాను ఎందుకు చేయాలి అని పునరాలోచించుకొని బాలయ్య ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడట . మామూలుగా ఎవరి సలహాలూ పట్టించుకోని బాలయ్య.. ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం సన్నిహితుల హెచ్చరికల్ని పట్టించుకున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ లో కూడా ప్రచారమా?

ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆందోళన చెందుతుంటే మన రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ భారీ ప్రచార కార్యక్రమాలకు తెర తీస్తున్నారు. వీరి ప్రచార యావ, ఆర్భాటం చూసి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఒక పక్క భౌతిక దూరం పాటించాలంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తుంటే.. మరో పక్క అధికార పార్టీ నేతలే మరో ప్రచారాన్ని చేపడుతుండటం ముక్కున వేలు వేసుకునేలా చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా గత నెల 22 నుంచి రాష్ట్రంలో జన జీవనం స్తంభించింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు చేసేందుకు పనిలేక, బయటకు వెళ్లలేక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చిన వలసదారులు చాలా సమస్యలకు గురవుతున్నారు. ఈ సమయంలో పలు సంస్థలు వారిని తోచిన విధంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేసింది. ఈ పంపిణీలో బాధితులకు సాయం చేసే విషయం కంటే, పార్టీ ప్రచార ఆర్భాటమే ఎక్కువగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడటంతో ఆ పట్టణంలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. దీంతో అక్కడ అత్యవసర రాకపోకలూ స్తంభించాయి. పట్టణంలో పరిస్థితి ఇంత టెన్షన్ గా ఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం ఫ్లెక్సీ యాత్ర చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇతర ప్రాంతాల్లో చేసిన పార్టీ ప్రచారం ఎక్కువగా చేసుకున్నారు. కొన్ని చోట్ల మాస్క్ లపైన పార్టీ గుర్తు ముద్రించి ఇచ్చారని చెబుతున్నారు. ఈ కార్యక్రమాలలో నాయకులు సామాజిక దూరం పాటించడం లేదు.

మరోవైపు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రచారానికి విస్తృతంగా ఉపయోగించు కుంటుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘కరోనా’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోని ఆ పార్టీ ఎం.పి.టి.సి అభ్యర్థులచే అందచేయించడం రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంది. ఈ అంశంపై ప్రతి పక్షాలు గవర్నర్ కు పిర్యాదు చేశాయి. అధికార పార్టీ మంత్రులు ఈ వ్యవహారాన్ని సమర్ధించుకున్నపటికీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా వ్యాప్తి నివారించేందుకు కృషి చేయాల్సిందిపోయి దాని వ్యాప్తి అనుకూలంగా వుండే చర్యలకు పార్టీ నాయకులు పాలపడటం వివాదాస్పదం అవుతుంది. ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి చూచిస్తుంటే సేవా కార్యక్రమాల పేరుతో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ప్రచారం నిర్వహించడం విడ్డురంగా ఉంది.

గత నెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ఆరు వారాలు వాయిదా పడటంతో ఆ ఎన్నికలకు సిద్ధమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉంది. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు వాయిదా సమర్థిస్తూ, ఈ సమయంలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కోడ్ ను ఎత్తివేస్తూ ఎన్నికలను వాయిదా వేసిన కాలంలో ప్రచారం నిర్వహించవద్దని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మాత్రం పుల్ స్టాప్ పెట్టలేదు.

ప్రధాని ముందు కరోనా తీవ్రతను తక్కువగా చూపిన జగన్


కరోనా ముప్పు రాగలదని స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ పై ఒక వంక కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ, ఆయనను ఆర్డినెన్సు ద్వారా ఆ పదవి నుండి తొలగించిన ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోవంక రాష్ట్రంలో కరోనా తీవ్రతను తక్కువగా చూపి లాక్ డౌన్ ను సడలించేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ కొనసాగింపుపై వ్యతిరేకత తెలిపిన ఇద్దరు ముఖ్యమంత్రులలో జగన్ ఒకరు కావడం గమనార్హం. దారుణంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిష్టితి నుండి బైట పడటం కోసం లాక్ డౌన్ సడలింపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం రాష్ట్రంలో తీవ్రమవుతున్న కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించి చూపేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదివరలో రోజువారీ హెల్త్ బుల్లెటిన్ లలో జరిపిన కరోనా పరీక్షల వివరాలు, స్వీయ నిర్బంధంలో ఉంచిన వారి వివరాలు, ఆసుపతుర్లలో ఉన్న వారి వివరాలు ప్రతిరోజూ ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యను మాత్రమే ఇస్తున్నారు. విజయవాడలో దంపతులు మృతి చెందితే మూడు రోజుల తరవాత బైటకు పొక్కడంతో ఒక్కరి మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించడం గమనార్హం.

అట్లాగే శనివారం సాయంత్రంకు సగంకు పైగా జిల్లాలో, 7 జిల్లాల్లో 20 కి పైగా పాజిటివ్ కేసులు ఉంటె, ప్రధానికి మాత్రం రెండు అని మాత్రమే చెప్పారు. కరోనా వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్‌ 405 కేసులతో దేశంలో 8వ స్థానంలో ఉండగా, సమస్య తీవ్రతను తగ్గించి చూపేందుకు విఫల ప్రయత్నం చేసారు.

మార్చి 20వ తేదీ నాటికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే, అదీ పదికిలోపు కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం తెలిపారు. మరో 20 రోజుల్లో అంటే, శుక్రవారం నాటికి విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాలకు వైరస్‌ పాకిందని, అందులోనూ కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే 20కిపైగా కేసులు నమోదయ్యాయని ఈ ప్రజంటేషన్‌లో జగన్ వివరించారు.

కానీ, వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే శుక్రవారమే ఏడు జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు 20కి మించి నమోదయ్యాయి. శనివారం సాయంత్రానికే ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది.

చిత్తూరు, విశాఖల్లో సరిగ్గా 20 కేసులు ఉండటంతో ‘రెడ్‌ జోన్‌’లో పడలేదు. మరొక్క కేసు అదనంగా నమోదైనా అవీ రెడ్‌లో పడేవి. అనంతపురం జిల్లాలో కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ… ఒక మరణం చోటు చేసుకుంది.

శనివారం మధ్యాహ్నం వరకు మీడియా బులెటిన్‌ ఇవ్వకుండా పాత అంకెలతోనే నడిపించారు. ఆ తర్వాత బులెటిన్‌ విడుదల చేశారు. దీనిప్రకారం చూసినా 7 జిల్లాల్లో 20కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, విశాఖపట్నంలో సరిగ్గా 20 కేసులు లెక్క తేలాయి. మొత్తం కేసుల సంఖ్య 400 మార్కును దాటింది.

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ కొత్తగా మండలాల లెక్క బయటికి తీశారు. ఏపీలో 676 మండలాలకుగాను 37 మండలాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయన్నారు. 44 ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయని… 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదని తెలిపారు.

నిజానికి, కరోనా తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్రం జిల్లాను యూనిట్‌గా తీసుకుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ జిల్లాల వారీగానే లెక్కలు విడుదల చేస్తున్నారు.