
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా మూవీ ‘పుష్ప’. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం విడుదల చేసింది. ఫస్టు లుక్కుతోనే అర్జున్ ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేశాడు. ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ ఈ మూవీలో కనిపించనున్నారు. ‘పుష్ప’ ఫస్టు లుక్కులోనే దర్శకుడు సుమార్ ఈ విషయాన్ని చూపించారు. బన్నీ తొలిసారి ఢిఫరెంట్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్టు లుక్కు సోషల్ మీడియాలో పలు రికార్డులను తిరగరాసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే మూవీల్లో ఐటమ్ సాంగ్స్ ఓ రేంజ్లో ఉంటాయి. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’లో పూజాహెగ్డేతో జీగేల్ రాణి సాంగ్.. తెరకెక్కించాడు. ఈ మూవీలో ‘జిగేల్ రాణి’ సాంగ్ ఎంతలా హిట్టయిందో తెల్సిందే. తాజాగా ‘పుష్ప’లోనూ ఓ స్పెషల్ సాంగ్ తెరకెక్కించే ప్లాన్లో దర్శకుడు సుకుమార్ ఉన్నాడు. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ ఈ స్పెషల్ సాంగ్లో నటించనుందని ప్రచారం జరుగుతుంది. ఈమేరకు కియారాను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కియారా అడ్వాణీ తెలుగులో మహేష్ బాబుతో కలిసి ‘భరత్ అనే నేను’ మూవీలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రాంచరణ్ తో కలిసి ‘వినయవిధేయరామ’లో నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే ఈ అమ్మడు బాలీవుడ్లో బీజీగా ఉండటంతో టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టడం లేదు. తాజాగా బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’లో నటించి బాక్సాఫీస్ విజయం అందుకున్న సంగతి తెల్సిందే. తాజాగా సుకుమార్ ఈ మూవీ కోసం సంప్రదించగా కియారా ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో బన్నీతో బాలీవుడ్ భామ కియారా స్పెప్పులేయడం ఖాయంగా కన్పిస్తుంది.