Home Blog Page 8511

మెగా అభిమానులకు చిరు సర్ ప్రైజ్ వీడియో


లాక్ డౌన్ సమయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఫ్యామెలీతో గడుపుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోకి అడుపెట్టిన చిరు ఎప్పుడు యాక్టివ్ ఉంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈమేరకు నిన్న అభిమానులకు ఇటీవల ఓ పాట తరుచూ వింటున్నాను.. మళ్లీ పాజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాను.. దీనికి కారణంగా రేపు చేపుతానంటూ ట్వీటర్లో ట్వీట్ చేశారు. అన్నట్లుగానే మెగాస్టార్ మంగళవారం ఉదయం తన ట్వీటర్లో ఓ సర్ ప్రైజ్ వీడియో ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి తన మనువరాలు నవిష్కతో కన్పించారు. చిరు తన ఒళ్లో మనువరాలిని కూర్చోబెట్టుకొని తనకు ఏ పాట కావాలని అడుగగా ‘మిమ్మీ’ అంటూ సమాధానమిచ్చింది. దీంతో చిరు ఎప్పుడూ ఆ పాటేనా.. మరో పాట విందాం అంటాడు.. దీనికి చిరు మనువరాలు బుంగమూతిపెట్టి ఏడుపు ప్రారంభించింది. చిరు వెంటనే మనువరాలిని సముదాయించి ఖైదీ-150 మూవీలోని ‘మిమ్మీ’ పాటను ప్లే చేశారు. దీంతో ఆ చిన్నారి హుషారుగా కేరింతలు వేయడం కన్పించింది. మధ్య మధ్య పాటను పాజ్ చేస్తూ నవిష్కను చిరు ఆట పట్టించాడు. నవిష్క చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ-కల్యాణ్ దేవ్ దంపతుల కూతురు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా కరోనా లక్షణాలు?

విపరీతమైన కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులు, రక్త నాళాల్లో వాపు వంటి లక్షణాలు కూడా కరోనా వ్యాధికి సంబంధించిన లక్షణాలే అని వైద్యులు వెల్లడిస్తున్నారు. బ్రిటన్ లోని కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు బయటపడటం కలవరపేడుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే .. ఒకవైపు కరోనా విజృంభణతో బ్రిటన్‌ అతలాకుతలం అవుతుంది, మరోవైపు ఆ దేశం చిన్నారుల్లో అంతుపట్టిన అనారోగ్య సమస్యలను వెంటాడుతున్నాయి. గత మూడు రోజులుగా దాదాపు ఒకే లక్షణాలున్న వందలాది మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. విపరీతమైన కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇవి కూడా కరోనా లక్షణాలంటూ కొంతమంది వైద్యులు భావిస్తున్నప్పటికీ.. వైరస్‌ బారినపడిన బాధితుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది.

ఆ దేశ పిల్లల్లో రక్త నాళాల్లో వాపు కనిపించే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్రిటన్‌ ప్రభుత్వం పిల్లలు అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ఆస్పత్రుల్లో చేర్పించాలని తెలిపింది. అనుమానితులను వెంటనే గుర్తించి ఐసీయూల్లో ఉంచి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆరోగ్య విభాగాన్ని ఆదేశించింది.

బ్రిటన్‌ లో నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,569కి చేరుకోగా.. 24 వేలకు పైగా బాధితులు మృత్యువాత పడ్డారు.

తెలంగాణలో కరోనా లేని జిల్లాలు 21


తెలంగాణాలో 21 జిల్లాలో ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు.

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భరోసా వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమని కేసీఆర్ తెలిపారు. వైరస్ వ్యాప్తి, ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు ప్రకటించారు.

ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ పాజిటివ్ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని సిఎం భరోసా వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ వచ్చిన వారు సోమవారం నాటికి 1003 మంది కాగా, అందులో 332 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 646 పాజిటివ్ కేసులున్నాయి” అని చెప్పారు. మొత్తం పది జిల్లాల్లో (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల) ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని తెలిపారు.

మరో 11 జిల్లాలు (జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ) మంగళవారం (ఏప్రిల్ 28) నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారనున్నాయి. హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయని కేసీఆర్ వివరించారు.

జిహెచ్ఎంసి పరిధిలో 30 సర్కిళ్లు ఉంటే, చాలా సర్కిళ్లలో పాజిటివ్ కేసులు లేవు. కొన్సి సర్కిళ్లు ఆక్టివ్ కేసులు లేని సర్కిళ్లుగా మారాయి. కొన్ని సర్కిళ్లకే వైరస్ పరిమితమైంది. దీంతో చాలా కంటైన్మెంట్లు ఫ్రీ అవుతున్నాయి. యాక్టివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ కంటైన్మెంట్ల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గిస్తున్నదని సీఎం ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరస్ సోకిన వారిలో అత్యధిక శాతం మంది క్వారంటైన్ పీరియడ్ మే 8 నాటికి ముగుస్తున్నది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క పాజిటివ్ కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం కేసీఆర్ వ్యక్తం చేశారు.

పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే


లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల్లో పది లక్షల మంది ఇంటినుంచే పనిచేసే అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్‌ భావిస్తున్నారు. అయితే, కరోనా వైరస్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఐటీ రంగ సంస్థలు భవిష్యత్తులో ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అవకాశాలు మెండుగావున్నాయని చెప్పారు. కానీ, ఇదే సమయంలో ఉద్యోగుల తొలగింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని భరోసా వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టి సానుకూల పరిస్థితులు నెలకొన్న తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయని, ఇంటినుంచి పనిచేయడానికి అలవాటు పడిన వారు కార్యాలయాలకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని చెప్పారు. ఇప్పటికే చాలా మంది ఇంటినుంచి పనిచేయడానికి టెక్నాలజీ పరంగా ఎన్నో చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

కానీ అందుకోసం క్లయింట్ల అనుమతితో బిజినెస్‌ ప్రాసెసింగ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఆయన భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారిలో 90 నుంచి 95 శాతం వరకు ఉద్యోగులు ఇంటినుంచి పనిచేస్తున్నారని, పని కూడా వేగవంతంగా పూర్తవుతుండటంతో భవిష్యత్తులో కూడా ఇదే తీరును కొనసాగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ఇంటి నుంచి పనిచేయనుండటంతో చిన్న స్థాయి స్టార్టప్‌లకు భారీ ప్రయోజనం చేకూరనున్నదని తెలిపారు. ఆఫీస్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు తగ్గి ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరనున్నదని చెప్పారు. సానుకూల పరిస్థితులు నెలకొన్నతర్వాత సంస్థలు ఆఫీస్‌ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారని, దీంతో ఖర్చులు తగ్గనుండటం ఆయా సంస్థలకు ఆర్థికంగా లాభం చేకూరనున్నదని ఆయన చెప్పారు.
లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా 20 నుంచి 30 శాతంవరకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడానికి మొగ్గుచూపుతారని చెబుతూ ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే భవిష్యత్తులోనూ రన్‌ చేయవచ్చునని, నియామకాలు చేపట్టే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు.

‘కరోనా’పై ట్యూషన్ పెట్టించుకోండి..!


అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన టీడీపీ నాయకులు ఏమి మతాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. మీళ్ళంతా చంద్రబాబు హయాంలో మంత్రులై మేధావులమని బిల్డప్ ఇచ్చేవారని ట్విట్ చేశారు. కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.

టెస్టులు ఎక్కువ చేసి చూపించడమేంటని ప్రశ్నించారు. వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటంటూ కరోనా వైరస్ పై అవగాహన పెంచుకునేందుకు ట్యూషన్ పెట్టించుకోవాలని టిడిపి నాయకులకు సూచించారు.

వరదలొస్తాయని ముందుగా సమాచారం ఉన్నప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని, సకాలంలో స్పందించక పోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలన్నారు. కరోనా విషయంలో కూడా యనమల, కళా లాంటి కాలం చెల్లిన మేధావులు ‘వరద ముంపు’ తరహా విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట..!


రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’ నెట్టిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయని, వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆరోపించారు.

మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనాన్ని బయటపెట్టడం పాలకుల లక్షణం కాదన్నారు. గతంలో సీఎం ‘కరోనా వస్తుంది, పోతుంది… పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’ అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని… ఇప్పుడు ‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’ అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడం మనసు కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు.

రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం కొన్న ధాన్యంలో పదో వంతు కూడా మన రాష్ట్రంలో కొనలేదని విమర్శించారు. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడీ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదని చెప్పుకొచ్చారు.

బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు టీడీపీ అండగా ఉందని పేర్కొన్నారు. కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో కూడా నిబంధనలు వైసీపీ నేతలు పాటించలేదని ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని అందువల్లే కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృతమైందని తెలిపారు. కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైసీపీ నేతల ధోరణి ఉంది తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాలంటీర్ల వేతనాలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ, ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చౌకడిపోల వద్ద వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టారని.. కరోనా వైరస్ వ్యాప్తికి ఇది మరో కారణమన్నారు. లాక్‌డౌన్‌లోనూ యధేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. హెల్త్ బులెటిన్లను ఫార్స్‌గా మార్చారని వ్యాఖ్యానించారు. కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కరోనా టెస్టింగ్‌లను నిర్లక్ష్యం చేయడమే రాష్ట్రంలో పెను విషాదంగా మారిందన్నారు. నాసిరకం పీపీఈలతో కరోనా వైద్య సిబ్బంది‌ని వైరస్‌పై యుద్ధానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశమే అని ఆయన అన్నారు.

వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకడం, వారిలో నలుగురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులకు రాజకీయ లాభాలపై ఉన్న శ్రద్ద ప్రజారోగ్యంపై లేదన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల ప్రధానాధికారిని తొలగించడం, హుటాహుటిన చెన్నై నుంచి మరో వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం, ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునివ్వడం, వైసీపీ నాయకులంతా ర్యాలీలు జరపడం, నగదు పంపిణీ చేస్తూ ఓట్లు వేయాలని కోరడం, గుంపులుగా తిరగడం వల్లే రాష్ట్ర ప్రజలు ఇన్ని మూల్యాలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇవన్నీ చూసే పొరుగు రాష్ట్రాలు సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారన్నారు. తనను నిందించినా, టీడీపీని దూషించినా ప్రజల కోసం భరిస్తామని కానీ రాష్ట్రానికి తీరని నష్టం చేయడాన్ని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని భరించలేమని స్పష్టం చేశారు.

విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బైటపడేదన్నారు. వైసీపీ రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా టెస్టింగ్‌లపై లేదన్నారు. మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి అంటూ ప్రజలను ఆయన కోరారు.

కరోనా లెక్కల్లో బొక్కలు!

Telangana

తెలంగాణలో ప్రకటిస్తున్న కరోనా లెక్కల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆది, సోమ వారాల్లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన కరోనా లెక్కల్లో తప్పులు దొర్లుతున్నాయి. తెలంగాణలో ఆదివారం,సోమవారం విడుదలైన హెల్త్ బులెటిన్లను పరిశీలిస్తే పూర్తిగా తప్పుడు లెక్కలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం నాటికి తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 1001. సోమవారం 2 కేసులు మాత్రమే నమోదయ్యాయని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అంటే 1003. ఈ 2 కేసులు కూడా హైదరాబాద్ లో అని తెలిపారు. దీని ప్రకారం హైదరాబాద్ జిల్లాలో రెండు కేసులు పెరగాలి. మిగతా జిల్లాల లెక్కలన్నీ యధావిధిగా ఉండాలి. కానీ అలా లేవు.

హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ కేసులలో తేడాలు ఉన్నాయి. ఆదివారం నాటికి హైదరాబాద్ లో కరోనా కేసులు 540. సోమవారం రెండు పెరిగితే దాని సంఖ్య 542కు చేరాలి. కానీ సోమవారం ప్రకటించిన లెక్కలల్లో 556గా తెలిపారు. అంటే 16 పెరిగినట్టు. ప్రభుత్వం మాత్రం 2 పెరిగాయని తెలిపింది. ఇక ఆదివారం మేడ్చల్‌లో 22 కేసులు చూపించగా సోమవారం 12 మాత్రమే చూపించారు. రంగారెడ్డిలో ఆదివారం 33 చూపించగా సోమవారం 31 చూపించారు. నల్గొండలో ఆదివారం 17 కేసులుండగా సోమవారం 15 ఉన్నాయి. ఎవరైనా డిశ్చార్జ్ అయితే డిశ్చార్జ్ అయిన సంఖ్య పెరగాలి, యాక్టివ్ కేసులు తగ్గాలి. కానీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకూడదు. తెలంగాణ సర్కార్ విడుదల చేస్తున్న లెక్కల పై విమర్శలు వస్తున్నాయి. సర్కార్ కేసుల సంఖ్య పెరుగుతున్నా తప్పుడు లెక్కలు విడుదల చేస్తుందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఆది,సోమవారాలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లు పరిశీలిస్తే చాలా స్పష్టంగా తప్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన వివరాలు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.

సినిమా వారి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు

కరోనా లాక్ డౌన్ మొదలయ్యాక ప్రజలు ఇబ్బందుల్లో వుంటే సినిమా వాళ్లే అందరి కన్నా ముందుగా స్పందించారు. కానీ
ఈ కరోనా కష్ట కాలంలో ప్రజలు సినిమాల పట్ ల ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కూడా సినిమా లాస్ట్ ఆప్షన్ అని అనుకొంటోంది. దాంతో లాక్ డౌన్ నుంచి బయట పడ్డా కానీ సినిమా షూటింగ్స్ కి అనుమతి రాదని అర్థమౌతోంది .

అందుకే లాక్ డౌన్ తీసివేసిన తర్వాత నిర్మాణంలో ఉన్న సినిమాలకు షూటింగ్ చేసుకొనే అవకాశం ఇస్తే చాలని సినీ పరిశ్రమ భావిస్తోంది. కొత్త గా ప్రారంభం కాబోయే సినిమాలను మాత్రం పరిస్థితులు మామూలు అయ్యేంతవరకు ఆపాలని అనుకొంటున్నారు. ఇపుడు షూటింగ్ జరుపుకొంటున్న పెద్ద సినిమాలు మళ్ళీ మొదలైతే వందల మంది జూనియర్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఆ క్రమం లో పెద్ద సినిమాలకి షూటింగ్ చేసే ఛాన్స్ ఉండక పోవచ్చు . సింపుల్ గా లోబడ్జట్ లో తీసే సినిమాలకు షూటింగ్ చేసుకొనే ఛాన్స్ రావచ్చు. అలాగే సినిమా థియేటర్ లకు కూడా ఇప్పట్లో ప్రదర్శనకు అనుమతులు లభించక పోవచ్చు .. సినిమా థియేటర్స్ పూర్వం లా రన్ అయ్యే వరకు `ఓటిటి ప్లాటుఫామ్` లలో చిన్న చిత్రాలు రిలీజ్ చేయక తప్పేలా లేదు. అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతే సినిమా థియేటర్ లు పూర్వంలా కళకళ లాడాలంటే రెండేళ్లు పైగానే పడుతుందని అన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు .

ఇక కొంత భాగం షూటింగ్ పూర్తి చేసు కొన్న ” ఆర్.ఆర్.ఆర్.”, ” ఆచార్య”, “ప్రభాస్ సినిమా”, “పుష్ప”, “మహేష్ బాబు, పరశురామ్ కాంబో సినిమా” ,” పవన్ కళ్యాణ్ ,క్రిష్ కాంబో మూవీ ” లాంటి భారీ చిత్రాలు ఇప్పట్లో సెట్స్ మీదకి వెళ్లడం సాధ్యం అయ్యేలా లేదు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ వచ్చే సంవత్సరంలో గాని మోక్షం పొందవు. .

మత సామరస్యం-అపోహలపై ఘర్షణలు (భాగం 2)

దేశం లో మత సామరస్యం సాధ్యమేనా? ( Part1)
దాదాపుగా కరోనా మహమ్మారి రాకముందు మూడు నెలలుగా ముస్లిం సమాజం ఆందోళన లో వుంది. ఇటీవలికాలం లో ఇన్నాళ్ళు సుదీర్ఘంగా మతపరమైన ఆందోళనలు జరగలేదు. ఎవరో కావాలని రెచ్చగొడితే ఇంత విస్తృత పరిధిలో జరగదు. ముమ్మూరు తలాఖ్ వివాదం లో కొంతమేర ఆందోళన జరిగినా ఈ స్థాయి లో జరగలేదు. నిజంగానే ముస్లిం సమాజం లో అశాంతి వుండబట్టే ఇన్నాళ్ళు నిలబడగలిగింది. వాళ్ళ భయాందోళనలలో వాస్తవముందా లేక కేవలం కొంతమంది సృష్టించిన ప్రచారం లో కొట్టుకుపోయారా అనేది లోతుగా పరిశీలించాల్సి వుంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి రావటంతో ఈ ఘర్షణకు తాత్కాలిక ఫులుస్టాప్ పడింది. ఈ లోపల డిల్లీలో ఎంతోమంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడైనా ఈ విరామసమయం లో ఈ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు పడాల్సి వుంది.

ప్రస్తుత ఆందోళనలు దేనిపై ?

ఈ అల్లర్లు ప్రధానంగా పౌరసత్వ బిల్లు ఆమోదం పొందినదగ్గర్నుంచి మొదలయ్యాయి. పౌరసత్వ బిల్లు భారతదేశం లోని పౌరులకు సంబంధించినది కాదు. బయట దేశాలనుంచి వచ్చి భారతదేశం లో వుంటున్న వాళ్ళలో కొంతమందికి పౌరసత్వం త్వరగా రావటానికి ఉద్దేశించింది. అయితే అది మతపరమైన విచక్షణ చూపుతుందని భారత రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు, మేధావులు , ఇస్లాం మతపెద్దలు నిరసన తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఇది రాజ్యాంగ సూత్రాలకు అనుకూలంగానే రూపొందించామని అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఇతరదేశాల్లో వేధింపులకు గురికాబడి ఇక్కడకు పారిపోయి వచ్చిన ఆదేశ మైనారిటీలకు ఇస్తున్నామని దీనితో ఈ దేశ పౌరులకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ బిల్లు పౌరసత్వం ఇవ్వటానికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది కానీ ఎవరి పౌరసత్వం తీసివేయటానికి కాదని వివరణ ఇచ్చింది. అయినా ఈ అలజడి సద్దుమణగ లేదు. దీన్ని జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌరసత్వ పట్టిక ల తో జతచేసి ప్రచారం చేయటం తో ముస్లిం ప్రజలు తమ పౌరసత్వం ప్రమాదం లో పడిందని నిజంగానే ఆందోళనకు గురయ్యారు. ప్రధానమంత్రి స్వయంగా జోక్యంచేసుకొని అసలు జాతీయ పౌరసత్వ పట్టిక తయారి పై ప్రాధమిక చర్చలు కూడా జరగలేదని, ఎటువంటి నిర్దిష్ట విధానం రూపొందకుండానే భయాందోళనలు చెందనవసరం లేదని వివరణ ఇచ్చినా ఆందోళనలు సద్దుమణగ లేదు. ఇందులోని యోగ్యతాయోగ్యతల జోలికి ప్రస్తుతం వెళ్ళటం లేదు. అనేకసార్లు దీనిపై ఇంతకుముందు చర్చించటం జరిగింది. మన ప్రస్తుత చర్చనీయాంశం పైనే ప్రధానంగా దృష్టి సారిద్దాం.

ఈ ఆందోళన వెనక వున్న అసలు కారణాలు 

మోడీ అధికారం లోకి వచ్చినతర్వాత వాళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు అనుకూలంగా కొన్ని సామాజిక చర్యలకు ఉపక్రమించాడు. అందులో ముఖ్యమైనది ముమ్మూరు తలాఖ్ బిల్లు. మొదటి దఫా అధికారం లోకి వచ్చినప్పుడు ఈ బిల్లు ని ప్రవేశపెట్టినా రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ఆమోదింప చేసుకోలేకపోయాడు. రెందోదఫా అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ బిల్లు ని ఉభయసభల్లో ఆమోదింప చేసి చట్టం చేయగలిగాడు. ఇది ఇస్లామిక్ సంప్రదాయవాదులకు మింగుడుపడలేదు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆర్టికల్ 370 ని రద్దుచేసి జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా విడగొట్టారు. ఇదీ సంప్రదాయవాదులకు మింగుడుపడలేదు. ఎప్పటినుంచో అపరిష్కృతంగా వున్న బాబ్రీ మసీదు-రామ మందిర్ వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు రావటం అది హిందువులకు అనుకూలంగా రావటం కూడా మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్లు అయ్యింది. అయినా అది సుప్రీం కోర్టు తీర్పు కాబట్టి మిన్నకుండాల్సి వచ్చింది. అలాగే మోడీ ప్రభుత్వం మద్రసాలను నియంత్రణలోకి తీసుకొని ఆధునిక విద్యను ప్రవేశపెట్టటం, ఒంటరిగా స్త్రీలు హజ్ యాత్రకు వెళ్ళే సదుపాయం కల్పించటం కూడా సంప్రదాయ వాదులకు మింగుడుపడలేదు.

వీటితోపాటు ముందు ముందు వుమ్మడి పౌర స్మృతి చట్టాన్ని తీసుకు వస్తామని , బహుభార్యత్వం , నిఖా హలాలా లాంటి సంప్రదాయాల్ని రద్దుచేస్తామని , జనాభా నియంత్రణ చట్టాలు చేస్తామని కొంతమంది బిజెపి నాయకులు ప్రకటనలు చేయటం కూడా ఇస్లామిక్ సంప్రదాయవాదులకు కంటగింపుగా మారింది. ఆ ప్రకటనలు చేసిన నాయకులు అంత ప్రాముఖ్యత గల నాయకులు కాకపోయినా మీడియా వాటికిచ్చిన ప్రచారం మత సమీకరణాలకు మరింత ఆజ్యం పోశాయి.అలాగే మొదటి దఫా అధికారం లోకి వచ్చినప్పుడు జరిగిన గో వధ అల్లర్లు కూడా మత సమీకరణాలకు ఆజ్యం పోసింది. ఇలా ఒక్కొక్కటే పేరుకుపోయి ఇస్లామిక్ సంప్రదాయవాదుల్లో మోడీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కి దారి తీసింది. వీటన్నింటి పర్యవసానమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం. సిఎఎ పై ఆందోళన కేవలం ప్రేరణ మాత్రమే.

ఇందులో నిజా నిజాలెంత ?

ఒక్కసారి చరిత్ర లోకి తొంగిచూస్తే స్వాతంత్రంవచ్చిన తర్వాత రాజ్యాంగ మండలి చర్చల్లో సామాజిక మార్పు కోసం, భారత సెక్యులర్ భావాలకు అనుకూలంగా , గుర్తింపు రాజకీయాలకు చరమగీతం పాడటానికి చాలామంది పెద్దలు వుమ్మడి పౌర స్మృతి ని తీసుకురావాలని ప్రయత్నం చేసారు. అయితే ఆ ప్రయత్నం విఫలమయ్యింది. ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ స్మృతి బిల్లు కొంతమేర హిందూ సమాజం లో మార్పులకు దోహదపడింది. రాజరామమోహన రాయ్ , ఈశ్వరచంద్ర విద్య సాగర్ లాంటి సంఘ సంస్కర్తలు , అంబేద్కర్ లాంటి మేధావుల పుణ్యామా అని హిందూ సమాజం లో ఎన్నో మార్పులొచ్చాయి. సతీసహగమనం, బహు భార్యత్వం, బాల్య వివాహాలు, చిన్నతనంలోనే భర్తను కోల్పోతే జీవితాంతం విధవగా గుండుగీయించుకొని తెల్ల వస్త్రాలు ధరించి జీవనం సాగించటం, ఆస్తిలో మహిళకు వాటా లేకపోవటం లాంటి అనేక దురాచారాలనుండి హిందూ మహిళ ఈ రోజు విముక్తయ్యింది. అలాగే నిచ్చెన మెట్ల లాంటి కుల వ్యవస్థ, అంటరాని తనం, దళితులకు దేవాలయ ప్రవేశ నిషిద్దం, విద్యాభ్యాసం కేవలం కొన్ని కులాలకే పరిమితం లాంటి అనేక సాంఘిక దురాచారాలు కూడా చాలావరకు మార్పులకు గురయ్యాయి. ఈ సంస్కరణలు అంత  తేలికగా రాలేదు. సంప్రదాయవాదుల వ్యతిరేకతల నడుమ ఈ మార్పులు జరిగాయని మరిచిపోవద్దు.

అదే ముస్లిం సమాజం లో వున్న కొన్ని దురాచారాల్లో ఇప్పటికీ మార్పురావకపోవటం శోచనీయం. దీనికి ప్రధాన కారణం సంప్రదాయవాదుల పట్టు సమాజం పై అధికంగా వుండటం. ఎటువంటి సంస్కరణలు రావటానికి ఈ వర్గం ఇష్టపడకపోవటం తో ముస్లిం ప్రజలు , ముఖ్యంగా మహిళలు నష్టపోతున్నారు. ముమ్మూరు తలాఖ్ పై ముస్లిం మత పెద్దలు చేసిన రభస ఇంతా అంతా కాదు. దాన్ని ముస్లిం సమాజం పై దాడిగా అభివర్ణించారు. బహు భార్యత్వం , నిఖా హలాలా ఈరోజుకీ కొనసాగుతున్నాయి . ఆస్తి హక్కు లో మహిళకు అన్యాయం జరుగుతూనే వుంది. దేశంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు ఎవరంటే ముస్లిం ప్రజానీకమే. దీనికి కారణం ఎవరు? బిజెపి గత అయిదు సంవత్సరాలనుంచే అధికారం లో వుంది. అంతకు ముందంతా సెక్యులరిస్ట్ లుగా ముద్రపడి ముస్లిం ల పై అతి ప్రేమ ఒలకపెట్టే వారే అధికారం లో వున్నారు. మరి ఎందుకు ముస్లిం లు అందరికంటే కడు పేదరికం లో వున్నారో వారే చెప్పాలి. వాళ్లకు మద్దతిచ్చే మత పెద్దలు కూడా ఇందుకు జవాబుదారే నని మరవొద్దు. ముస్లిం సమాజం లో ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చినా ఈ సంప్రదాయవాదులు వ్యతిరేకించటం పరిపాటయ్యింది.

ఇరువైపులా వచ్చిన మార్పులేంటి?

హిందూ సమాజం అదివరకటి కన్నా సంఘటిత మయ్యింది. మత ఆచారాలు పాటించినా పాటించకపోయినా సమస్యపై ఒకటిగా ప్రతిస్పందించటం ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది వాస్తవం. బిజెపి అధికారం లోకి రావటం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇదివరకటి మైనారిటీ సంతూష్టీకరణ విధానాలను అనుసరించకపోవటం, తమ ఎన్నికల వాగ్దానాలను పటిష్టంగా అమలు చేయటం లాంటి చర్యలతో హిందూ సమాజం మరింత సంఘటిత మయ్యింది. దీనికి కొంతమేర సాంఘిక మాధ్యమం, టీవీ ప్రచార మాధ్యమం కూడా కారణమే. ముస్లిం సమాజం లో పెరుగుతున్న అతివాద పోకడలు కూడా కొంతమేర హిందూ సమాజం మరింత సంఘటితం కావటానికి దోహదపడింది.

ఇకపోతే ముస్లిం సమాజం లో గత కొన్నిదశాబ్దాలలో ఆలోచనల్లో గణనీయమైన మార్పు వచ్చింది.  చారిత్రకంగా భారత ఉపఖండం సూఫీ ఇస్లాంకి పుట్టినిల్లు. ముస్లిం రాజులు  రాజ్యాలు జయించినా ప్రజాబాహుళ్యం లో ఇస్లాం మతాన్ని దగ్గరకు చేర్చింది సూఫీ తత్వవేత్తలు, ప్రచారకులే. అందుకే మన దేశం లో మసీదులు కన్నా దర్గాలు ఎక్కువ. కానీ ఇటీవలి కాలం లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. సౌదీ వహాబిజం మన దేశం లో త్వరితంగా విస్తరిస్తుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో సూఫీ మసీదులు ఒక్కొక్కటి వాహబ్బి మసీదులుగా మారుతున్నాయి. ఈ పరిణామం గత కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ డబ్బులతో జరుగుతుంది. ఇది ఉదారవాద , బిజెపి వ్యతిరేక ఇంగ్లీష్ ఛానలు గా పేరుపడిన ఎన్ డి టీవీ 24/7 లో శ్రీనివాస్ జైన్ పరిశోధన  జరిపి రెండు భాగాలుగా కొన్ని సంవత్సరాల కింద ప్రచారం చేసింది. ఇంత విపులంగా ఇది వుదహరించటానికి కారణముంది. సలాఫీ ఉద్యమం పేరుతో ఎటువంటి మార్పులు చేయకుండా 7 వ శతాబ్దం లో మహమ్మద్ ప్రవక్త చెప్పినవి, ఖురాన్ లో వున్నవి ఖచ్చితంగా అమలుచేయాలనే ప్రచారం వాహబిజం ద్వారా వ్యాప్తిచెందటం కొన్ని అనర్ధాలకు దారి తీస్తుంది. మారిన సామాజిక మార్పుల కనుగుణంగా ఇస్లాం సమాజం లో వచ్చిన మార్పుని ఈ వహాబిజం తిరస్కరిస్తుంది. ఇస్లాం భారత్ కి వచ్చేటప్పటికి ఇక్కడి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చెందిన మార్పులను ఒప్పుకోదు. చివరకు వాళ్ళు దర్గాలను కూడా ఇస్లాం వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. షియాలను , ఇతర ఉప తెగలను ఇస్లామేతర సిద్ధాంతాలుగా ప్రచారం చేస్తుంది. మత వుద్రిక్తలు పెరగటం లో ఈ మారిన ఆలోచన కూడా వుందనేది ఒక వాదన.                                                                                                                                                                                                                                                                                                                                       బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత  ఆ పార్టీకి చెందిన కొంతమంది  నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం , వాటిని పార్టీ ఖండించక పోవటం కూడా ఇస్లాం సమాజం లో ఆందోళనకు , సంఘటితం కావటానికి కారణమయ్యింది. అధికారం లో వున్న పార్టీ మరింత భాధ్యతా యుతంగా వ్యవహరించి కింది నాయకులను కట్టడి చేసి వుండాల్సింది.మూడోది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సంప్రదాయవాదుల సంస్కరణల వ్యతిరేకత. వీటిలో చివరకు విద్యావేత్తలు కూడా ప్రభావితం కావటం సమాజం రెండుగా మానసికంగా విడిపోవటం ఇటీవలి కాలం లో జరిగిన పరిణామం.

ప్రభుత్వం ఏం చేసి వుండాల్సింది?

ముస్లిం సమాజం లో ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చినా సంప్రదాయవాదుల నుంచి పెద్ద ప్రతిఘటన వస్తుందని ప్రభుత్వానికి తెలుసు. అటువంటప్పుడు సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరంగా చేసి వుండాల్సింది. ఏ మాత్రం తటస్థంగా వున్న వాళ్ళను కూడా సంప్రదింపుల్లో భాగస్వాములను చేసివుండాల్సింది. బిజెపి మిత్ర పక్షాలనే పూర్తి సంప్రదింపుల్లో భాగస్వామ్యం చేయకపోవటం కూడా లోపంగా భావించాలి. అలాగే ప్రజా సంబంధాల ప్రక్రియను ఇంకా సమర్ధంగా చేయాల్సింది. ముస్లిం లలోని అతి పేద వర్గాలకు ప్రత్యెక ప్యాకేజి ప్రకటించటం కూడా ఇందులో భాగంగా వుండాల్సింది. అన్నింటికన్నా ముఖ్యంగా మంత్రులుగా వున్న వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే ప్రకటనలు ఇస్తున్నప్పుడు వాళ్ళను మందలించటం అవసరమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకొని వుంటే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వం లోని అతి ముఖ్యులు అటువంటి ప్రకటనలు ఎప్పుడూ ఇవ్వకపోయినా మంత్రివర్గ సహచరులు రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చినప్పుడు మందలించక పోవటం కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయని మరిచిపోవద్దు.

మొత్తం మీద తిలా పిడెకడు తలా కొంచెం లాగా అందరూ కలిసి సామాజిక ఉద్రిక్తతలు పెరగటానికి దోహదం చేశారు. అవే చివరకి చిలికి చిలికి గాలివాన లాగా అయ్యాయి. డిల్లీ నిరసనలు పైకి కనబడేటట్టు సిఎఎ వ్యతిరేక నిరసనలు కాదు. ఇన్నాళ్ళు గూడుకట్టుకున్న అపార్ధాలు, అనుమానాలు , భయాలు కలగలిపి పెల్లుబికాయని చెప్పొచ్చు. మరి దీనికి తాత్కాలికంగా కరోనా మహామ్మరితో తెరపడినా తిరిగి మళ్ళీ రాజుకోదని గ్యారంటీ ఏమీ లేదు. ఈ లోపలే దీనికి తగు పరిష్కారం కనుగొనాలి. అది ఎలా? ఎవరు చేయాలి? ఏయే  పాత్రధారులు, సూత్రధారులు ఈ పరిష్కారానికి అవసరం?

( సశేషం) 

 

 

మూడో సినిమా చేయనున్న ఉయ్యాలా జంపాలా జోడీ


సినిమా రంగం లో సెంటిమెంట్ లకు కొదవ ఉండదు. ఇక్కడ హిట్ సినిమాలో నటించిన నటీనటులకు గుర్తింపు బాగా ఉంటుంది. ఆ క్రమం లో హిట్ సినిమాలో నటించిన హీరో ,హీరోయిన్ లకు హిట్ పెయిర్ అని ముద్ర వేసి ఛాన్స్ లిస్తారు. అలా హిట్ పెయిర్ గా ముద్ర పడ్డ రాజ్ తరుణ్ , అవికాగోర్ జోడీ ఇపుడు మూడో సినిమాలో దర్శనమివ్వ బోతున్నారు. వీరిద్దరూ 2013 లో విడుదల అయిన ` ఉయ్యాలా జంపాలా ‘ చిత్రంతో హీరో ,హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో ” సినిమా చూపిస్తమావ” చిత్రంలోనూ కల్సి నటించారు. .ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత ఈ జోడీ మరో సినిమాలో కలిసి నటించలేదు.

ఐదేళ్ల గ్యాప్ అనంతరం ఈ జోడీ మళ్లీ వెండితెరపై కనపడనుంది. గతంలో రాజ్ తరుణ్ తో ” సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ” సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో హీరో , హీరోయిన్ లుగా రాజ్ తరుణ్ , అవికాగోర్ ని ఎంపిక చేసుకొన్నాడు. గత మూడేళ్ళ లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కనీసం ఈ చిత్రం తో నైనా తన పూర్వ వైభవం తనకు వస్తుందని ఆశతో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ సినిమా మొదలెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది .

ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘిస్తే క్వారంటైన్‌ కేంద్రాలకే


ఆంధ్ర ప్రదేశ్ లో గత నాలుగైదు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ప్రజలలో ఆందోళన కనిపించడం లేదు. అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారిని కట్టడి చేయడం పోలీసులుకు సాధ్యం కావడం లేదు.

ముఖ్యంగా వైరస్ ఉధృతంగా ఉన్న కర్నూల్, విజయవాడ, గుంటూరు లలో లాక్ డౌన్ నిబంధనలను అమలు జరపడం వారికి సవాల్ గా మారింది. అందుకనే పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిని పోలీస్ వ్యాన్ లలో కాకుండా అంబులెన్సు లలో ఎక్కించడం ప్రారంభించారు. వారిని అంబులెన్స్ లలో పోలీస్ స్టేషన్ లకు కాకుండా నేరుగా క్వారంటైన్‌ కేంద్రాలకు పంపుతున్నారు.

‘ఎంత చెప్పినా వినడంలేదు.. లాఠీలు ఎత్తితే ఆరోపణలు వస్తున్నాయి.. వాహనాలు సీజ్‌ చేస్తే నడుచుకొంటూ రోడ్డెక్కుతున్నారు.. వదిలేద్దామంటే కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి.. వీటన్నిటికీ చెక్‌ పెట్టాలంటే పోలీసు జీపులో స్టేషన్‌కు కాకుండా అంబులెన్స్‌ ఎక్కించి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించడమే ఉత్తమం’ అంటూ పోలీసులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.

కర్నూలు, విజయవాడ, గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష జరిపినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చాలాచోట్ల ప్రజలు వినడం లేదని, ఆదివారం మాంసం దుకాణాల వద్ద ఎగబడి తోసుకొంటున్నారని, కట్టడి చేయలేక దుకాణాలు మూయించేశామని పోలీసు అధికారులు తమ ఇబ్బందులను చెప్పుకొంటూ వచ్చారు.

దానితో అనవసరంగా బయటికి వచ్చిన వారిని అంబులెన్స్‌లో క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తే ఫలితం ఉండొచ్చని డీజీపీ ఒక నిర్ణయానికి వచ్చారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికి ఈ-పాస్‌ తప్పని సరి అనిస్పష్టం చేశారు. వెంటనే సోమవారం నుండే అమలు ప్రారంభించారు.

వెంటనే విజయవాడ లోని కృష్ణలంక, మాచవరంలో పోలీసులు ఉదయం పది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆపి ఆరా తీశారు. సరైన కారణం, ఆధారం చూపించని వారిని అంబులెన్స్‌ ఎక్కించి క్వారంటైన్‌కు పంపారు. అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు సైతం ఆకతాయిలకు ఇదే తరహా పనిష్మెంట్‌ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేయడం పక్కా


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాల లోనూ కనిపించాలను కొంటున్నాడు .ఆ క్రమంలో ఇపుడు రెండు సినిమాలకు షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ త్వరలో మరో రెండు చిత్రాలకు సైన్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించే ‘వకీల్ సాబ్’ చిత్రం తో పాటు , గౌతమీపుత్ర శాతకర్ణి ఫేమ్ క్రిష్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసిన తరవాత హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తాడట. ఆ తరువాత `గోపాల గోపాల ఫేమ్ డైరెక్టర్ డాలీతో ఓ సినిమా చేయబోతున్నాడు .వెరసి పవన్ కళ్యాణ్ మొత్తం నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని రంజింప చేయనున్నాడు .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం మొగలాయిల కాలం నాటి కథ అని తెలుస్తోంది . కాగా ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ పాత్ర పోషిస్తున్నాడని ,సినిమా కధంతా కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది . తాజాగా ఓ తమిళ స్టార్ హీరో ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది .టి వి రంగం నుంచి కోలీవుడ్ లోకి అడుగు పెట్టి పెద్ద స్టార్ గా మారిన శివ కార్తికేయన్ పవన్ కళ్యాణ్ చిత్రం లో కీలక పాత్ర పోషించ నున్నట్టు తెలుస్తోంది. శివ కార్తికేయన్ ‘రెమో’ ‘,సీమ రాజా ‘ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. కాగా అతడి టాలెంట్ కి తగ్గ పాత్రనే క్రిష్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది .

రణబీర్ కపూర్ కి డబల్ దిమాక్


ఇదర్ కా మాల్ ఉదర్ , ఉదర్ కా మాల్ ఇదర్ అన్నట్టు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఒక భాష నుంచి మరో భాషకి వలస వెళ్తుంటాయి . ఆ ప్రక్రియ నే రీమేక్ అని ఇంగ్లీష్ లో , పునర్ నిర్మాణం అని తెలుగులో అంటారు. ఇప్పటివరకు ఎన్నో వేల చిత్రాలు అలా పరభాషల్లోకి వలస వెళ్లాయి. ప్రస్తుతం బాలీవుడ్ నిర్మాత ,దర్శకులు సౌత్ సినిమాల వైపు ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారు . తెలుగులో ఏ సినిమా హిట్టయినా సరే హిందీ లోకి పట్టుకెళ్లిపోతున్నారు. గత ఏడాది `అర్జున్ రెడ్డి` సినిమా ని కబీర్ సింగ్ పేరుతొ , `టెంపర్’ సినిమాని ` సింబా` పేరుతొ రీమేక్ చేసి భారీ విజయం సాధించడం జరిగింది. దాంతో తెలుగులో హిట్టయ్యే ప్రతి సినిమానూ బాలీవుడ్ వాళ్లు కొనుక్కెళుతున్నారు .

ఆ క్రమంలో ఇపుడు నాని హీరోగా నటించిన ` జెర్సీ` సినిమా అదే పేరుతో హిందీలో రీమేక్ కాబోతుంది . అదే విధంగా గత ఏడాది తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన `ఇస్మార్ట్ శంకర్ ‘ చిత్రం హిందీలో రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం లో `చాక్లెట్ బాయ్` రణబీర్ కపూర్ హీరోగా నటించనున్నాడు కెరీర్లో ఇప్పటిదాకా ఒక్క మాస్ సినిమా కూడా చేయని రణబీర్ కపూర్ ఈ సినిమా కథ నచ్చి హీరోగా చేయడానికి ముందుకొచ్చాడట …

ఆ సినిమా పరిస్థితి అలా ఉంటే మరోవైపు ఈ ఏడాదిలో సంచలన సక్సెస్ సాధించిన ” అల వైకుంఠపురములో” , ” హిట్ ” వంటి చిత్రాల్ని కూడా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

కరోనా మాయం, ఎప్పటికి?

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అంచెలంచెలుగా పెరిగి, పాకి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ లో అడుగుపెట్టిన కోవిద్19 రోజురోజుకి కేసుల సంఖ్యను పెంచుకుంటూ..ప్రజలను భయపెడుతూ.. తన ఉనికిని చాటుకుంటుంది. పిడిగు పాటుగా వచ్చి పడిన ఈ విపత్తుని అదుపుచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షల మధ్యలో మొదటి దశ, రెండవ దశ లాక్ డౌన్ లను అమలుపరుస్తూ వస్తున్నాయి. అయినాసరే దేశంలో ఈ మహమ్మారి పోకడ ఇప్పటివరకు అదుపుకాలేదు. మరి ఈ హడావుడి ఎప్పటికి తగ్గుతుంది? ఈ వైరస్ హల్ చల్ ఎప్పటికి కట్టడి అవుతుందనే? ప్రశ్నలు సర్వసాధారణం. ఈ కరోనా విజృంభన తగ్గుదల పై అనేకమంది నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వివిధ సర్వేలు భిన్న స్వరాలను వినిపిస్తున్నాయి.

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలో నియమించిన సాధికార కమిటీ భారత్‌ లో వైద్య నిర్వహణపై, వైరస్ కట్టడిపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మే 16 నాటికి దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవచ్చని తేల్చి చెప్పింది. ఈ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం… మే 3వ తేదీ వరకు దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అనంతరం క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. మే 3 నుంచి 12 మధ్యలో రోజుకు సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతాయి. అనంతరం పూర్తిగా తగ్గిపోతాయని వెల్లడించింది. మే 16 నాటికి 35,000 కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పింది.

భారత్‌ లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరోనా తగ్గే అవకాశం ఉండొచ్చని కొందరు అంచనాలు వేస్తున్నారు. అలాగే, భారతీయులకు ఉన్న ఎక్కువ వ్యాధినిరోధక శక్తి వల్ల తక్కువగా విస్తరించే అవకాశాలున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లభించలేదు.

మరోవైపు, కేంద్ర సాధికార కమిటీ నివేదికలో స్పష్టమైన అంశాలు నిజమయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సింగపూర్ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలోనూ ఇవే విషయాలు బయటపడ్డాయి. భారత్‌ లో కరోనా కేసుల నమోదు, మరణాలు, డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్యతో పాటు వైరస్‌ వ్యాప్తి రేటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సింగపూర్‌ వర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ పరిశోధకులు పలు అంచనాలు వేశారు. వారు వెల్లడించిన అధ్యయనంలో భారత్‌ జులై 25 నాటికి కరోనా నుంచి పూర్తిగా బయటపడుతుందని తేలింది. మే 21 నాటికి భారత్‌ లో కరోనా తీవ్రత 97 శాతం తగ్గుతుదని ఈ పరిశోధకులు వెల్లడించారు.

ప్రజలు ఏమి చేయాలి? ప్రభుత్వాలు ఏమి చేయాలి?

కరోనా మహమ్మారి కట్టడి, వ్యాప్తిలో తగ్గుదలపై ఎవరు ఎన్ని సర్వేలు చేసినా ప్రజలు లాక్ డౌన్ నియమాలు పాటించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే పరిస్థితి మరింతగా దిగజారే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోవిద్19 నియంత్రణకు ప్రజలు జాగ్రత్తలు ఎంత ముఖ్యమో ప్రభుత్వ విధానాలు, కట్టడి చర్యలు కూడా అంతే ముఖ్యం. మాస్ టెస్టింగ్ లు చేస్తూ. క్వారంటైన్‌ నియమాలను విధిగా పాటిస్తూ ముదుకెళ్తే కరోనాని నియంత్రించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరయ్యా.. పవన్ ఫెయిలయ్యాడందీ?


రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడు.. ఇక రాడని అనుకున్నారందరూ.. కానీ ఎక్కడున్నా అదే స్పీడు.. అదే ఫాలోయింగ్.. అదే క్రేజ్.. జనసేనాని పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి రుజువైంది. సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఏ నేతకు దక్కని అరుదైన గౌరవాన్ని ప్రజలు కట్టబెట్టారు. ముఖ్యంగా యువత ఉద్యోగులు, మేధావులు, చదువుకున్న విద్యావంతులు పవన్ పై ప్రేమను కనబరిచారు. తమ నిజమైన నేత నీవే అంటూ పవన్ కు అరుదైన ఘనతను సాధించిపెట్టారు.

*పవన్ జీవితంలో పాస్
ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ చూస్తే కులాల కంపు కొడుతుందనే విమర్శలున్నాయి. టీడీపీ అంటే కమ్మ బ్యాచ్ అంటారు. వైసీపీ అంటే రెడ్డి బ్యాచ్ అంటారు. ఇక కాపులందరూ పవన్ ను ఓన్ చేసుకున్నా.. పవన్ మాత్రం కులాలు, మతాలకు అతీతుడి అని తాను భారతీయుడనంటూ సామరస్యాన్ని చాటుతారు. పవన్ లోని దేశభక్తుడిని తట్టి లేపుతారు. అందుకే రాజకీయాల్లో కులాల అడ్డుగోడలతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫెయిల్ కావచ్చు. కానీ ఆయన నిస్వార్థ రాజకీయ చరిత.. ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పానికి జనాలు ఎప్పుడూ దాసోహం అవుతూనే ఉంటారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఓడించిన జనాలు ఇప్పుడు ఆయనను ఏపీలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన రాజకీయ నేతగా నిలబెట్టారు. ఓటమికి, అభిమానానికి తేడాను చూపించారు. పవన్ ను ఓన్ చేసుకున్నారు.

*నంబర్ 1 రాజకీయ పార్టీగా జనసేన
ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ వల్ల కాలేదు. అన్నేళ్లుగా రాజకీయం చేస్తున్న టీడీపీ వల్ల కాలేదు. కొన్ని సంవత్సరాల్లోనే పవన్ తన జనసేనను అగ్రపథాన నిలబెట్టారు. ఫాలోవర్స్ లో జనసేనకు కనుచూపు మేరలో వైసీపీ, టీడీపీ సహా ఏ పార్టీని లేకుండా చేశారు. అరుదైన చరితను లిఖించారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ లో జనసేన జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు నంబర్ 1 రాజకీయ పార్టీగా డిజిటల్ ప్రపంచంలో జనసేన ఠీవీగా నిలబడింది.

*జనసేన సాధించింది..
కొద్దినెలల్లోనే ట్విట్టర్లో జనసేన పార్టీ ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీ ఒక రికార్డును కైవసం చేసుకుంది. ఏకంగా మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి పార్టీగా రికార్డును అందుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 5.6 లక్షల మంది మాత్రమే ఫాలోవర్లు ఉండడం గమనార్హం. ఇక మీడియాను, సోషల్ మీడియాను బాగా మేనేజ్ చేసే తెలుగుదేశం పార్టీకి ఫాలోవర్స్ కేవలం 4 లక్షలే కావడం గమనార్హం.

*యువత మేధావుల అండ.. జనసేన వెంటే..
జనసేనకు ట్విట్టర్ ఫాలోవర్స్ పెరగడం వెనుక యువత, మేధావులే, ఉద్యోగులు, విద్యావంతులే కారణం.. సెల్ ఫోన్లు ఎక్కువగా వీరే వాడుతారు. దీంతో వారికే ఎక్కువ ట్విట్టర్ అకౌంట్స్ ఉండడంతో జనసేనపై తమ అభిమానాన్ని వారు చాటుకున్నారు. జనసేనను టీడీపీ, వైసీపీలను మించి అగ్రపథాన నిలబెట్టారు.

*పవన్ ఓడిపోలేదు.. గెలిచినట్టే..
10 లక్షల ఫాలోవర్స్ తో జనసేన ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల పార్టీలన్నింటికి అందనంత ఎత్తులో ఉంది. పవన్ కు ఓట్లు పడకపోవచ్చు.. కానీ అభిమానంలో.. ఆయన రాజకీయ నిస్వార్థ సేవకు మాత్రం లైక్స్, వ్యూస్ పడుతూనే ఉంటాయి. ఈ ట్విట్టర్ ఫాలోవర్స్ చూస్తుంటే అనిపిస్తోంది… పవన్ కళ్యాణ్ ఓడిపోలేదని.. జయహో జనసేన అని..

-నరేశ్ ఎన్నం

జగన్ కు పక్కలో బల్లెంలా వెన్నుపోటుదారులు?


సీఎంగా వైఎస్ జగన్ కు నూటికి నూరు మార్కులు పడుతాయి. ఆయన పాలన దక్షత.. నిర్ణయాల్లో వేగం.. పేదలకు సంక్షేమం అందించడంలో ఉదారత ఆయన్ను బెస్ట్ సీఎంను చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 40ఇయర్స్ ఇండస్ట్రీ చందబాబును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగేంచేస్తున్నాడన్న ప్రచారమూ ఉంది.

*జగన్ స్ట్రాంగ్.. కిందోళ్లు వీక్..
వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహ చతురతలో ఆరితేరిపోయారు. సడన్ నిర్ణయాలతో అందరికీ షాకిస్తున్నారు. నిర్ణయాత్మక కళలో గతంలో కంటే మెరుగ్గా ముందుకెళుతున్నారు. అయితే అతని పీఆర్ టీం తోపాటు సొంత మీడియా బృందం మాత్రం జగన్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేక.. ఆయన ఆలోచనలను పసిగట్టలేక బొక్కబోర్ల పడుతున్న తీరు కనిపిస్తోంది. ఇది జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందంటున్నారు.

*కొనసాగుతున్న ప్రభుత్వ లీక్స్
తరచుగా ప్రభుత్వంలోని కీలక జీవోలు.. లూప్ హోల్స్ ప్రతిపక్ష మీడియాకు చేరడం వెనుక జగన్ సీరియస్ గానే ఉన్నారట.. ఇక ఏరికోరి తన పత్రిక నుంచి తెచ్చుకున్న జర్నలిస్టులను సీఎం జగన్ పీఆర్వోలుగా పెట్టుకున్నారు. ఇప్పుడు వారు కూడా జగన్ కు, ఆయన వైసీపీ పథకాలకు ఆశించినంత ప్రచారం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*టీడీపీ మీడియా వేగులు..
ఎన్నికల కమిషనర్ వివాదంలో ఆయన రాసిన లేఖను పట్టుకొని టీడీపీ అనుకూల మీడియా ఎంత రచ్చ చేసిందో చూశాం. నిజానికి వైసీపీలోని టీడీపీ అనుకూలవాదులే జగన్ సర్కారుకు వెన్నుపోటు పొడిచి టీడీపీ మీడియాకు ఉప్పదిస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఆ వెన్నుపోటు దారులు ఎవరన్నది జగన్ వెంటనే గుర్తించి ఏరివేయకపోతే అది ఆయన ప్రభుత్వానికి.. ప్రభుత్వ రహస్యాలకు కూడా పెద్ద విఘాతం అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట..

*వైసీపీ ప్రభుత్వంలో ఆ వెన్నుపోటుదారులెవరు?
ఇటీవలే కొత్త ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో సీఎం జగన్ రిటైర్డ్ జడ్జిని నియమించాలని చూశారు. ఇక సీనియర్ ఐఏఎస్ రామసుందర్ రెడ్డి పేరును పీఆర్ టీం లీక్ చేసిందట.. కానీ జగన్ మనసులో రిటైర్డ్ జడ్జి కనకరాజ్ ఉన్నారు. ఆయన్నే తరువాత ప్రకటించారు. కానీ రామసుందర్ రెడ్డిని బేస్ చేసుకొని టీడీపీ మీడియా కులాన్ని తెరపైకి తెచ్చి చేసిన విష ప్రచారం జగన్ సర్కారును ఇరకునపెట్టింది. దీన్ని వైసీపీ ప్రభుత్వంలోనే లీకు వీరులు జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి వ్యూహాత్మకంగా టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.

*జగన్ మేల్కోవాల్సిందే..
జగన్ నియమించుకున్న అధికారులు.. పీఆర్ టీం.. మీడియా వ్యక్తుల్లో చాలా మంది వైసీపీ సర్కారుకు వెన్నుపోటు పొడిచి టీడీపీ బ్యాచ్ కు.. టీడీపీ అనుకూల మీడియాకు ఉప్పందిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీన్ని అరికట్టి నివారించకపోతే జగన్ సర్కార్ కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. మరి ఇప్పటికైనా ఆ బ్లాక్ షీప్ లను జగన్ ఏరివేయాలి.. లేదంటే మొదటికే మోసం రావడం గ్యారెంటీ అంటున్నారు.

-నరేష్ ఎన్నం

ఆహా అనిపిస్తున్న అల్లు అఫర్


ప్రస్తుతం సినీ రంగం ఓ టి టి ప్లాట్ ఫార్మ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఆ విషయం ముందుగానే గ్రహించిన అల్లు అరవింద్ ” ఆహా ” అనే ఓ టి టి ప్లేట్ ఫారం స్టార్ట్ చేయడం జరిగింది .అయితే ఇంతకుముందే ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో పాతుకు పోయిన ` నెట్ ఫ్లిక్స్, `అమెజాన్ ప్రైమ్, ` జీ 5, `సన్ నెక్స్ట్ ` హాట్ స్టార్` లాంటి ఓటిటి ప్లాటుఫార్మ్స్ తో పోటీ పడలేక పోతోంది.

అలాంటి సమయంలో ` ఆహా `తో ఓ టి టి రంగంలోకి వచ్చిన అల్లు అరవింద్ పోటీని ఎలా తట్టుకోవాలో బాగా అలోచించి ఒక నిర్ణయం తీసు కొన్నట్టు తెల్సింది. కేవలం వెబ్ సిరీస్ లు వల్లనే జనాలు ఆకర్షితులు కారు. కొన్నికొత్త సినిమాలు మన దగ్గర ఉండాలి అని గ్రహించడం జరిగింది . మంచి సినిమాలు, కొత్త సినిమాలు “ఆహా “ లో ఉంటే తప్ప జనం డబ్బులు కట్టి సబ్ స్క్రైబర్స్ గా మారరు అని గ్రహించి అల్లు అరవింద్ చిన్న సినీ నిర్మాతలకు ఒక అఫర్ ఇవ్వడం జరిగింది . లాక్ డౌన్ సమయంలో ఆగిపోయిన మీ చిత్రాలకు అయిన ఖర్చు మేము ఇస్తాం “ ఆహా “ద్వారా మీ సినిమాలు రిలీజ్ చేసుకోండని చెప్పాడట …

అగ్ర నిర్మాతగా తనకున్న పలుకుబడితో అల్లు అరవింద్ నిర్మాతలను ఆకట్టు కోవాలని ఆశిస్తున్నారు. ఎపుడు థియేటర్ లు తెరుచుకుంటాయో , ఎపుడు తమ సినిమా రిలీజ్ చెయ్యాలో తెలీక సందిగ్ధం లో ఉన్న చిన్న నిర్మాతలకు ఈ అఫర్ ఒక అయాచిత వరం అని చెప్పక తప్పదు . ఈ అఫర్ ఉపయోగించుకొంటే లాభాలు రాక పోయినా నష్టాలు లేకుండా నిర్మాతలు బయట పడొచ్చు. కాకపొతే తమ సినిమాలు థియేటర్ లో చూడాలన్న ఆశ మాత్రం నెరవేరదు .