
సీఎంగా వైఎస్ జగన్ కు నూటికి నూరు మార్కులు పడుతాయి. ఆయన పాలన దక్షత.. నిర్ణయాల్లో వేగం.. పేదలకు సంక్షేమం అందించడంలో ఉదారత ఆయన్ను బెస్ట్ సీఎంను చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 40ఇయర్స్ ఇండస్ట్రీ చందబాబును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగేంచేస్తున్నాడన్న ప్రచారమూ ఉంది.
*జగన్ స్ట్రాంగ్.. కిందోళ్లు వీక్..
వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహ చతురతలో ఆరితేరిపోయారు. సడన్ నిర్ణయాలతో అందరికీ షాకిస్తున్నారు. నిర్ణయాత్మక కళలో గతంలో కంటే మెరుగ్గా ముందుకెళుతున్నారు. అయితే అతని పీఆర్ టీం తోపాటు సొంత మీడియా బృందం మాత్రం జగన్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేక.. ఆయన ఆలోచనలను పసిగట్టలేక బొక్కబోర్ల పడుతున్న తీరు కనిపిస్తోంది. ఇది జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందంటున్నారు.
*కొనసాగుతున్న ప్రభుత్వ లీక్స్
తరచుగా ప్రభుత్వంలోని కీలక జీవోలు.. లూప్ హోల్స్ ప్రతిపక్ష మీడియాకు చేరడం వెనుక జగన్ సీరియస్ గానే ఉన్నారట.. ఇక ఏరికోరి తన పత్రిక నుంచి తెచ్చుకున్న జర్నలిస్టులను సీఎం జగన్ పీఆర్వోలుగా పెట్టుకున్నారు. ఇప్పుడు వారు కూడా జగన్ కు, ఆయన వైసీపీ పథకాలకు ఆశించినంత ప్రచారం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
*టీడీపీ మీడియా వేగులు..
ఎన్నికల కమిషనర్ వివాదంలో ఆయన రాసిన లేఖను పట్టుకొని టీడీపీ అనుకూల మీడియా ఎంత రచ్చ చేసిందో చూశాం. నిజానికి వైసీపీలోని టీడీపీ అనుకూలవాదులే జగన్ సర్కారుకు వెన్నుపోటు పొడిచి టీడీపీ మీడియాకు ఉప్పదిస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఆ వెన్నుపోటు దారులు ఎవరన్నది జగన్ వెంటనే గుర్తించి ఏరివేయకపోతే అది ఆయన ప్రభుత్వానికి.. ప్రభుత్వ రహస్యాలకు కూడా పెద్ద విఘాతం అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట..
*వైసీపీ ప్రభుత్వంలో ఆ వెన్నుపోటుదారులెవరు?
ఇటీవలే కొత్త ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో సీఎం జగన్ రిటైర్డ్ జడ్జిని నియమించాలని చూశారు. ఇక సీనియర్ ఐఏఎస్ రామసుందర్ రెడ్డి పేరును పీఆర్ టీం లీక్ చేసిందట.. కానీ జగన్ మనసులో రిటైర్డ్ జడ్జి కనకరాజ్ ఉన్నారు. ఆయన్నే తరువాత ప్రకటించారు. కానీ రామసుందర్ రెడ్డిని బేస్ చేసుకొని టీడీపీ మీడియా కులాన్ని తెరపైకి తెచ్చి చేసిన విష ప్రచారం జగన్ సర్కారును ఇరకునపెట్టింది. దీన్ని వైసీపీ ప్రభుత్వంలోనే లీకు వీరులు జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి వ్యూహాత్మకంగా టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.
*జగన్ మేల్కోవాల్సిందే..
జగన్ నియమించుకున్న అధికారులు.. పీఆర్ టీం.. మీడియా వ్యక్తుల్లో చాలా మంది వైసీపీ సర్కారుకు వెన్నుపోటు పొడిచి టీడీపీ బ్యాచ్ కు.. టీడీపీ అనుకూల మీడియాకు ఉప్పందిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీన్ని అరికట్టి నివారించకపోతే జగన్ సర్కార్ కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. మరి ఇప్పటికైనా ఆ బ్లాక్ షీప్ లను జగన్ ఏరివేయాలి.. లేదంటే మొదటికే మోసం రావడం గ్యారెంటీ అంటున్నారు.
-నరేష్ ఎన్నం