
ప్రస్తుతం సినీ రంగం ఓ టి టి ప్లాట్ ఫార్మ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఆ విషయం ముందుగానే గ్రహించిన అల్లు అరవింద్ ” ఆహా ” అనే ఓ టి టి ప్లేట్ ఫారం స్టార్ట్ చేయడం జరిగింది .అయితే ఇంతకుముందే ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో పాతుకు పోయిన ` నెట్ ఫ్లిక్స్, `అమెజాన్ ప్రైమ్, ` జీ 5, `సన్ నెక్స్ట్ ` హాట్ స్టార్` లాంటి ఓటిటి ప్లాటుఫార్మ్స్ తో పోటీ పడలేక పోతోంది.
అలాంటి సమయంలో ` ఆహా `తో ఓ టి టి రంగంలోకి వచ్చిన అల్లు అరవింద్ పోటీని ఎలా తట్టుకోవాలో బాగా అలోచించి ఒక నిర్ణయం తీసు కొన్నట్టు తెల్సింది. కేవలం వెబ్ సిరీస్ లు వల్లనే జనాలు ఆకర్షితులు కారు. కొన్నికొత్త సినిమాలు మన దగ్గర ఉండాలి అని గ్రహించడం జరిగింది . మంచి సినిమాలు, కొత్త సినిమాలు “ఆహా “ లో ఉంటే తప్ప జనం డబ్బులు కట్టి సబ్ స్క్రైబర్స్ గా మారరు అని గ్రహించి అల్లు అరవింద్ చిన్న సినీ నిర్మాతలకు ఒక అఫర్ ఇవ్వడం జరిగింది . లాక్ డౌన్ సమయంలో ఆగిపోయిన మీ చిత్రాలకు అయిన ఖర్చు మేము ఇస్తాం “ ఆహా “ద్వారా మీ సినిమాలు రిలీజ్ చేసుకోండని చెప్పాడట …
అగ్ర నిర్మాతగా తనకున్న పలుకుబడితో అల్లు అరవింద్ నిర్మాతలను ఆకట్టు కోవాలని ఆశిస్తున్నారు. ఎపుడు థియేటర్ లు తెరుచుకుంటాయో , ఎపుడు తమ సినిమా రిలీజ్ చెయ్యాలో తెలీక సందిగ్ధం లో ఉన్న చిన్న నిర్మాతలకు ఈ అఫర్ ఒక అయాచిత వరం అని చెప్పక తప్పదు . ఈ అఫర్ ఉపయోగించుకొంటే లాభాలు రాక పోయినా నష్టాలు లేకుండా నిర్మాతలు బయట పడొచ్చు. కాకపొతే తమ సినిమాలు థియేటర్ లో చూడాలన్న ఆశ మాత్రం నెరవేరదు .