
రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడు.. ఇక రాడని అనుకున్నారందరూ.. కానీ ఎక్కడున్నా అదే స్పీడు.. అదే ఫాలోయింగ్.. అదే క్రేజ్.. జనసేనాని పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి రుజువైంది. సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఏ నేతకు దక్కని అరుదైన గౌరవాన్ని ప్రజలు కట్టబెట్టారు. ముఖ్యంగా యువత ఉద్యోగులు, మేధావులు, చదువుకున్న విద్యావంతులు పవన్ పై ప్రేమను కనబరిచారు. తమ నిజమైన నేత నీవే అంటూ పవన్ కు అరుదైన ఘనతను సాధించిపెట్టారు.
*పవన్ జీవితంలో పాస్
ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ చూస్తే కులాల కంపు కొడుతుందనే విమర్శలున్నాయి. టీడీపీ అంటే కమ్మ బ్యాచ్ అంటారు. వైసీపీ అంటే రెడ్డి బ్యాచ్ అంటారు. ఇక కాపులందరూ పవన్ ను ఓన్ చేసుకున్నా.. పవన్ మాత్రం కులాలు, మతాలకు అతీతుడి అని తాను భారతీయుడనంటూ సామరస్యాన్ని చాటుతారు. పవన్ లోని దేశభక్తుడిని తట్టి లేపుతారు. అందుకే రాజకీయాల్లో కులాల అడ్డుగోడలతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫెయిల్ కావచ్చు. కానీ ఆయన నిస్వార్థ రాజకీయ చరిత.. ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పానికి జనాలు ఎప్పుడూ దాసోహం అవుతూనే ఉంటారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఓడించిన జనాలు ఇప్పుడు ఆయనను ఏపీలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన రాజకీయ నేతగా నిలబెట్టారు. ఓటమికి, అభిమానానికి తేడాను చూపించారు. పవన్ ను ఓన్ చేసుకున్నారు.
*నంబర్ 1 రాజకీయ పార్టీగా జనసేన
ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ వల్ల కాలేదు. అన్నేళ్లుగా రాజకీయం చేస్తున్న టీడీపీ వల్ల కాలేదు. కొన్ని సంవత్సరాల్లోనే పవన్ తన జనసేనను అగ్రపథాన నిలబెట్టారు. ఫాలోవర్స్ లో జనసేనకు కనుచూపు మేరలో వైసీపీ, టీడీపీ సహా ఏ పార్టీని లేకుండా చేశారు. అరుదైన చరితను లిఖించారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ లో జనసేన జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు నంబర్ 1 రాజకీయ పార్టీగా డిజిటల్ ప్రపంచంలో జనసేన ఠీవీగా నిలబడింది.
*జనసేన సాధించింది..
కొద్దినెలల్లోనే ట్విట్టర్లో జనసేన పార్టీ ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీ ఒక రికార్డును కైవసం చేసుకుంది. ఏకంగా మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి పార్టీగా రికార్డును అందుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 5.6 లక్షల మంది మాత్రమే ఫాలోవర్లు ఉండడం గమనార్హం. ఇక మీడియాను, సోషల్ మీడియాను బాగా మేనేజ్ చేసే తెలుగుదేశం పార్టీకి ఫాలోవర్స్ కేవలం 4 లక్షలే కావడం గమనార్హం.
*యువత మేధావుల అండ.. జనసేన వెంటే..
జనసేనకు ట్విట్టర్ ఫాలోవర్స్ పెరగడం వెనుక యువత, మేధావులే, ఉద్యోగులు, విద్యావంతులే కారణం.. సెల్ ఫోన్లు ఎక్కువగా వీరే వాడుతారు. దీంతో వారికే ఎక్కువ ట్విట్టర్ అకౌంట్స్ ఉండడంతో జనసేనపై తమ అభిమానాన్ని వారు చాటుకున్నారు. జనసేనను టీడీపీ, వైసీపీలను మించి అగ్రపథాన నిలబెట్టారు.
*పవన్ ఓడిపోలేదు.. గెలిచినట్టే..
10 లక్షల ఫాలోవర్స్ తో జనసేన ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల పార్టీలన్నింటికి అందనంత ఎత్తులో ఉంది. పవన్ కు ఓట్లు పడకపోవచ్చు.. కానీ అభిమానంలో.. ఆయన రాజకీయ నిస్వార్థ సేవకు మాత్రం లైక్స్, వ్యూస్ పడుతూనే ఉంటాయి. ఈ ట్విట్టర్ ఫాలోవర్స్ చూస్తుంటే అనిపిస్తోంది… పవన్ కళ్యాణ్ ఓడిపోలేదని.. జయహో జనసేన అని..
-నరేశ్ ఎన్నం