Home Blog Page 8504

సడలింపుపై కేసీఆర్ వైఖరి!

మే 3తో రెండవ దశ లాక్ డౌన్ ముగుస్తుండటంతో.. దేశంలో అనేక ఆర్థిక కార్యకలాపాలకు సడలింపులిస్తూ.. మూడవ దశ లాక్ డౌన్ ని మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే తెలంగాణలో ఎక్కడా సడలింపులు ఇవ్వొద్దని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. కేంద్రం విడుదల చేసిన లాక్‌బ డౌన్​ గైడ్‌ లైన్స్, సడలింపులపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ ఫోన్‌ లో మాట్లాడినట్టు తెలిసింది. లాక్‌ డౌన్‌ ను పకడ్బందీగా అమలు చెయ్యాలని వారికి సూచించినట్లు సమాచారం. ఈ నెల 7 తర్వాత ఏం చేయాలన్న దానిపై ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్​భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్.

కేంద్రం జారీ చేసిన రూల్స్​ ప్రకారం తెలంగాణలో చాలా జిల్లాల్లో లాక్‌ డౌన్  సడలింపులను ఈ నెల 7 తర్వాత అమలు చేసే ఛాన్స్​ ఉందని ఉన్నతాధికారులు అన్నారు. లాక్‌ డౌన్‌ పై కేంద్రం ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్‌ ను పరిశీలిస్తున్నామని సీఎస్ సోమేశ్​కుమార్​చెప్పారు. వీటిపై ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌ లో ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

వెబ్ సిరీస్ వైపు చూస్తున్న సుకుమార్


హాలీవుడ్ లో గాని , హిందీలో గానీ పేరున్న నటీనటులు, దర్శకులు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. క్రిష్ జాగర్లమూడి, నందినీ రెడ్డి , సత్యదేవ్ లాంటి వాళ్లు తప్పితే పేరున్న దర్శకులు అటు వైపు చూడట్లేదు. అలాంటి సమయం లో టాప్ డైరెక్టర్ సుకుమార్ వెబ్ సిరీస్ వైపు చూస్తున్నట్లు వార్త లొస్తున్నాయి.

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

త్వరలో దర్శకుడు సుకుమార్ ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించవచ్చని తెలుస్తోంది. అది ఆయన కొత్త సినిమా ‘పుష్ప’కు అనుబంధంగా ఉంటుందని తెలుస్తోంది. నిజానికి ” పుష్ప “. సినిమా కథ తయారు చేసుకొనే క్రమంలో సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఎంతగానో పరిశోధన చేయడం జరిగింది. దాంతో సుకుమార్ వద్ద ఎర్ర చందనం అక్రమ రవాణా గురించిన అనేక రహస్యాలు , వాటికి సంబందించిన సమాచారం ఉంది. కానీ సినిమాకి ఉన్న పరిమితులు దృష్ట్యా ఆ సమాచారం లో కొంత మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతోంది. అలా మిగిలి ఉన్న ఎర్ర చందన స్మగ్లింగ్ సమామాచారం తో వెబ్ సిరీస్ చేద్దామన్న ఆలోచన సుకుమార్ కి వచ్చిందట… ఒక దశలో ‘పుష్ప’కు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడిచిందట …. దీనిపై సుకుమార్ రకరకాలుగా ఆలోచించాడని .. చివరికి వెబ్ సిరీస్‌కే మొగ్గు చూపాడని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది .

పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?

ఆ క్రమం లో ` అమేజాన్ ప్రైం ‘ సంస్థ తో ఈ విషయం ఫై డిస్కషన్లు నడుస్తున్నాయట. కాగా రామ్ చరణ్ బందువొకరు అమేజాన్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆయన వాళ్లతో మాట్లాడి బడ్జెట్, ఇతర వ్యవహారాల్ని ఫైనలైజ్ చేస్తున్నారని.తెలుస్తోంది . ఈ ప్రాజెక్ట్ కనుక సెట్ అయితే రామ్ చరణ్ అందులో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసేది ఎవరన్నది మాత్రం సస్పెన్సు గానే ఉంది .

పవన్ కళ్యాణ్ , నాని , నాగచైతన్య తో సినిమా


ఊహల కందని ఈ అనూహ్య కాంబోలో ఒక సినిమా రూపుదిద్దుకో బోతోంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నేచురల్ స్టార్ నాని , అక్కినేని నాగ చైతన్య ల కలయికలో ఒక సినిమా రాబోతుంది. ఈ వార్త నిజమే , వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేయ బోతున్నారు. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే నాగ చైతన్య హీరో గా నటించబోయే చిత్రానికి వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు.

లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?

త్వరలో నాగచైతన్య హీరోగా `మిస్టర్ పర్ ఫెక్ట్ `ఫేమ్ దశరధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మాతగా నిర్మించ బోతున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సమర్పకుడు గా వ్యవహరించ బోతున్నాడు. దరిమిలా ఈ చిత్రం ` పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ‘ సమర్పణలో `వాల్ పోస్టర్ సినిమా ‘సినిమా బ్యానర్ లో ఈ చిత్రం నిర్మాణం కాబోతుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఇదే కాంబోలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా జాయిన్ కాబోతున్నాడు… అంటున్నారు .ఆ విషయం ఇంకా నిర్దారణ కాలేదట ..

పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?

ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ” లవ్ స్టోరీ ” చిత్రాన్ని పూర్తి చేసి విధులకు ఎదురు చూస్తున్నాడు అలాగే నాని నటించిన ” వి ” మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది . ఇక పవన్ కళ్యాణ్ నటించిన ” వకీల్ సాబ్ ” కొంత షూటింగ్ మిగిలి ఉంది. అది కూడా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది .

ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కి పాటలు ఉంటాయి


వరుస సినిమాలతో విజయాలు సాధిస్తున్న కొరటాల శివ కి నిజజీవితంలో కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఇష్టం. అది ఆయన తీసిన సినిమాల్లో స్పష్టంగా కనపడుతుంది ఇక తాజాగా ఆయన చిరంజీవి తో తీస్తున్న “ఆచార్య ” చిత్రం లో ఒక నక్సలైట్ పాత్ర ఉండబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆ పాత్ర కథా పరంగా లెక్చరర్ గా మారుతుంది. నక్సలైట్ గా ఉన్న వ్యక్తి …లెక్చరర్ గా ఎలా మారాడు అన్నదే ఈ చిత్రం యొక్క కథ లోని కీలకాంశం అని తెలుస్తోంది .అలా రెండు రకాలుగా విభిన్న పాత్రలో రామ్ చరణ్ కనిపించ నున్నాడు. అంతే కాదు రామ్ చరణ్ కి ఈ చిత్రం లో రామ్ చరణ్ కి రెండు పాటలు ఉంటాయని తెలుస్తోంది.అందులో ఒక పాట మామూలు డాన్స్ సాంగ్ కాగా రెండో పాట ఎమోషనల్ గా సాగుతుందట … కాగా ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా నటిస్తాడని అంటున్నారు.

పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?

ఇక ఆచార్య చిత్రంలోచిరంజీవి సరసన కాజల్ , రాం చరణ్ సరసన సరసన రష్మిక మందన్న హీరోయిన్ లుగా నటించ నున్నారు. అలాగే చాలా గ్యాప్ తరవాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ సంగీతం అందించటం ఈ చిత్రంలో ఉన్న మరో విశేషం . .

ఎవర్ గ్రీన్ లవర్ బాయ్


బాలీవుడ్ హీరో రిషి కపూర్ తాత పృథ్విరాజ్ కపూర్, తండ్రి రాజ్ కపూర్ కూడా అగ్ర నటులే. కాగా తన తండ్రి హీరో గా నటించిన `మేరా నామ్ జోకర్ ` సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రిషి కపూర్ హీరో అవ్వడం వెనుక పెద్ద కథ వుంది .

స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి

1973లో వచ్చిన “బాబీ ” రిషి కపూర్ హీరోగా నటించిన మొదటి చిత్రం. ఇక ఈ చిత్రానికి దర్శకుడు రిషి కపూర్ తండ్రి రాజ్ కపూర్. తొలి సినిమా ‘బాబీ’తోనే పెద్ద స్టార్ అయిపోయాడు రిషి కపూర్. ఆ సినిమా భారత దేశమంతటా ఘన విజయం సాధించింది .ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్, విజయవాడ లాంటి చోట్ల వంద రోజులాడింది. ఐతే ఇంత పెద్ద హిట్ సినిమా వెనుక ఓ ఆసక్తికర కథ దాగి ఉంది. రిషి కపూర్ ని హీరోగా పరిచయం చేయడం కోసం తీసిన సినిమా కాదిది. రిషి కపూర్ బాల నటుడిగా, తండ్రి రాజ్ కపూర్ హీరో గా నటించిన ‘మేరా నామ్ జోకర్’ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం రాజ్ కపూర్ ‘బాబీ’ తీసినట్లుగా ఓ ఇంటర్వ్యూలో రిషి కపూర్ స్వయంగా వెల్లడించడం జరిగింది .

లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

నిజానికి బాబీ సినిమాలో హీరోగా రాజేష్ ఖన్నాను తీసుకోవాలని రాజ్ కపూర్ అనుకున్నారట. ఐతే రాజేష్ ఖన్నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేక రాజ్ కపూర్ కొడుకు రిషి కపూర్ ని హీరోగా పరిచయం చేశాడట. అలా తండ్రి ఆర్థిక కష్టాలు తీర్చడం కోసం ఆయన హీరో అయ్యాడు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రాజ్ కపూర్ కి బాగా లాభాలు రావడమే గాక రిషి కపూర్ ని స్టార్ ని కూడా చేసింది .

సాధారణంగా ఒక హీరో లేదా నటుడిని అతని కెరీర్ లో బెస్ట్ సినిమాతో కౌంట్ చేస్తారు .ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ ని ఆయన కెరీర్ బెస్ట్ ట్రెండ్ సెట్టర్ అయిన ” జంజీర్ ” చిత్రం తో కౌంట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి ని కెరీర్ బెస్ట్ అయిన ” ఖైదీ ” తో లెక్కిస్తారు . అలాగే ఏ హీరోకైనా కెరీర్ బెస్ట్ ఒక సినిమా ఉంటుంది. కానీ విచిత్రం గా రిషి కపూర్ కి మాత్రం ఫస్ట్ సినిమా అయిన ” బాబీ ” చిత్రం తోనే కౌంట్ చేస్తారు. అందుకే రిషి కపూర్ ని `ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ‘ గా సినీ చరిత్ర లో లిఖించడం జరుగుతుంది .

ఈ క్రెడిట్ గ్రామ వాలంటీర్లదే!

ఏపీలో మొత్తం 58.22లక్షల మంది వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ దారులుండగా ఒక్కరోజే 90 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత గ్రామ వాలంటీర్లకే దక్కుతుంది. నిన్న ఒక్కరోజే 53లక్షల మంది లబ్ధిదారులకు రూ.1300కోట్లు వాలంటీర్లు పంపిణీ చేశారు. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయోమెట్రిక్‌ వేయకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మొబైల్‌ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా జియోట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను వాలంటీర్లు ఫోన్లలో అప్‌ లోడ్‌ చేస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో ఉండి పోయినట్లయితే వారిని కూడాగుర్తించి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్‌ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవి, డయాలసిస్‌,పేషెంట్లకు డిబిటి విధానంలో శుక్రవారం పెన్షన్‌ సొమ్మును జమచేశారు. ఎవరైనా మేనెల పెన్షన్‌ సొమ్మును అందుకోలేక పోతే వారికి జూన్‌ నెలలో అందజేసే సమయంలో ఈ పెన్షన్‌ కూడా కలిపి అందిస్తామని సెర్ప్‌ సిఈఓ పి.రాజబాబు వెల్లడించారు

పింఛన్‌ కోసం రూ.1421.20కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజునే 53లక్షలకు పైగా పెన్షన్‌ దారులకు రూ.1300 కోట్లకు పైగా నగదును పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ సాధిస్తున్న ఫలితాలకు పెన్షన్ల పంపిణీయే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?


తన దాకా వస్తేకానీ పత్రికలకు తత్వం బోధపడలేదు. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన పట్టుమని పదిరోజులకే తెలుగులోని రెండు అగ్రశ్రేణి దినపత్రికలు ఉద్యోగులను రోడ్డున పడేశాయి. వారికి కనీసం సమాచారం ఇవ్వకుండానే లీవుల పేరిట ఓ సంస్థ.. హోల్డ్ పేరిట మరో సంస్థ కొలువులు పీకేసింది. లాక్ డౌన్ ముగిసి మళ్లీ పునరుద్దరణ జరిగితే వీరి ఉద్యోగాలు ఉండేది.. లేదంటే వీరి జీవితాలు రోడ్డునపడ్టట్టే..

లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

*కరోనా నష్టం పత్రికలకు రూ4500 కోట్లు అట
కరోనా లాక్ డౌన్ తో చిన్న కష్టానికే గుండెలు బాదుకొని గల్లాపెట్టె నుంచి రూపాయి తీయకుండా ఉద్యోగులను తీసేసిన పత్రికలు.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ముసలికన్నీరు కారుస్తున్నాయి. లాభాల్లో ఉండి కోట్లకు కోట్లు సార్వత్రిక ఎన్నికల వేళ క్యాష్ చేసుకున్న పత్రికల యాజమాన్యాలు నెలరోజుల లాక్ డౌన్ కుదేలయ్యాయట.. ఏకంగా కరోనా నష్టం రూ.4500కోట్లు అని.. వచ్చే ఆర్నెళ్లలో మరో 15వేల కోట్ల నష్టం అని కేంద్రానికి తాజాగా న్యూస్ పేపర్ సొసైటీ (ఎన్ఎన్ఎస్) వినతిపత్రం అందజేసింది. వెంటనే కేంద్రం తమను ఆదుకోవాలని విన్నవించుకుంది.800 వార్త పత్రికలపై 30 లక్షల మది జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. పత్రికలు కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు.

*ఉద్యోగులపై లేని కరోనా ప్రభుత్వానికి ఉంటుందా?
కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను కరోనా నష్టం పేరుతో సాగనంపిన సంస్థలు ఇప్పుడు కేంద్రం ఆదుకోవాలని అంటున్నాయి. సొంత సంస్థలకు లేని పట్టింపు 130కోట్ల మందిని చూసుకునే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా అంటే అనుమానమే.. ప్రస్తుతం ఐఎన్ఎస్ కేంద్రానికి ఇచ్చిన వినతిలో రెండేళ్లపాటు పన్ను రాయితీ, ప్రభుత్వం ప్రకటన రేట్లు పెంచడం.. ప్రింట్ మీడియాకు ప్రకటనల బడ్జెట్ పెంచడం , కేంద్రం బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

*ఉద్యోగులకు ఒక న్యాయం.. పత్రికా సంస్థలకు ఒకన్యాయమా?
కరోనా లాక్ డౌన్ తో 10 రోజుల నష్టాన్ని కూడా పత్రికలు భరించకుండా జర్నలిస్టులను రోడ్డు పాలు చేశాయి. ఇన్నాళ్లు సంపాదించిన సొమ్మును కనీసం ఒక నెలపాటు పత్రిక కోసం జర్నలిస్టుల జీవితాల కోసం ఖర్చు చేయలేదు. ఇప్పడు మొత్తం నష్టపోయామని కేంద్రం ఆదుకోవాలని కోరుతున్నాయి. జర్నలిస్టులు ఎలాగూ రోడ్డునపడ్డారు. తిరిగి పత్రికలు పునరుద్దరించబడడం కష్టమే. వారి ఉద్యోగాలు రావడం కష్టమే. మరి ఇంతమందిని రోడ్డుపాలు చేసిన పత్రికా యాజమాన్యాలకు కేంద్రం సాయం చేసినా అరకొరతోనే నడిపిస్తాయి. చేయకున్నా నడిపిస్తాయి. ఉద్యోగులను తిరిగి తీసుకుంటేనే ప్యాకేజీ ఇస్తే బాగుంటుంది. లేదంటే ప్యాకేజీని జేబులో వేసుకొని జర్నలిస్టులను అలాగే వదిలేసే ప్రమాదం ఉంది. జర్నలిస్టులందరినీ తీసుకుంటేనే ప్యాకేజీ ఇచ్చేలా కేంద్రం చొరవచూపాల్సిన అవసరం ఉంది

*ఇంతటి సంక్షోభంలో కేంద్రం ఆదుకోవడం కష్టమే..
రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకునే విషయంలో కూడా కేంద్రం చేతులెత్తి రాష్ట్రాలపై భారం మోపింది. అలాంటిది ప్రైవేటు వారి చేతుల్లో ఉండి.. అది ప్రభుత్వాలను ఎప్పుడూ విమర్శించే పత్రికలు.. మీడియాను కేంద్రం ఆదుకుంటుందన్నది అత్యాశే. మీడియా పవర్ ఎంత తగ్గితే పాలకులకు అంత నయం. అందుకే పత్రికా యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వ సాయం చేస్తుందనుకోవడం అత్యాశే. జర్నలిస్టుల జీవితాలను రోడ్డున పడేసిన సంస్థలపై ఇప్పుడు వారంతా కోపంగా ఉన్నారు. సంస్థ బతికినా తమను తీసుకుంటుందన్న గ్యారెంటీ లేదు. సో ఇలాంటి సంస్థలకు కేంద్రం సాయం చేసినా దండగే అని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. జర్నలిస్టులందరినీ తీసుకుంటామంటేనే కేంద్రం సాయం చేయాలని కోరుతున్నారు.

-నరేశ్ ఎన్నం

లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?


లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది. మే 17వరకు కొనసాగిస్తామని తెలిపింది. అయితే మూడు జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల స్థితిగతులను బట్టి మినహాయింపులిచ్చింది.. కేంద్రం నిర్ణయం వల్ల కరోనా వ్యాపించని ప్రాంతాలకు ఊరట దక్కగా.. కరోనా ప్రబలంగా ఉన్న రెడ్, కంటోన్మెంట్ జోన్లలో పరిస్థితి మరింత కట్టుదిట్టమవుతుంది. దీంతో కొందరు జనాలు సేఫ్ జోన్లో ఉండగా.. మరికొందరు మాత్రం స్వేచ్ఛంగా నెలన్నర రోజుల తర్వాత ఊపిరిపీల్చుకునే అవకాశం ఏర్పడింది.

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

దేశవ్యాప్తంగా జిల్లాలను జోన్లుగా విభజించారు. ఇందులో 130 జిల్లాలు రెడ్ జోన్ గా ఉన్నాయి. తెలంగాణలో 18 ఆరెంజ్, 9 గ్రీన్ జోన్లు, 6 రెడ్ జోన్లుగా విభజించారు.

*గ్రీన్ జోన్ వారికి పండుగే..
గ్రీన్ జోన్లో మొత్తం వెసులుబాటును కల్పించారనే చెప్పవచ్చు. ప్రస్తుతం మునుపటి రోజులు ఈ జోన లో వచ్చేశాయి. బస్సులు తిరగడానికి కూడా అనుమతిచ్చారు. వృద్ధులు, పిల్లలు మాత్రం బయటకు రావద్దు. మద్యం, పాన్, గుట్కాలాంటి వాటిని కూడా ఇక్కడే తెరుస్తున్నారు. దీంతోపాటు పరిశ్రమలు, వివిధ వర్గాల వ్యాపారాలకు వెసులుబాటు కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలు, గోవా సహా పలు రాష్ట్రాల్లో గ్రీన్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ యథాతథా స్థాయి పునరుద్ధరించబడుతాయి. షాపుల నుంచి మొదలుపెడితే అన్ని వ్యాపారాలు. పనులను మునిపటిలాగానే యథేచ్చగా గ్రీన్ జోన్లలో చేసుకోవచ్చు.

లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

*ఆరెంజ్ జోన్లలోనూ కాస్త ఊరటే..
ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రీన్ జోన్లతోపాటు ఆరెంజ్ జోన్లలో కూడా మద్యం, పాన్, గుట్కా అమ్మకాలకు సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ అమ్మకాలు సాగించుకోవచ్చని తెలిపారు. అయితే ఇక్కడ మద్యం అమ్మకాలు ఐచ్చికంగా వదిలేశారు. రాష్ట్రాలు అమలు చేయవచ్చు. లేదంటే బంద్ చేయవచ్చు. ఇక గ్రీన్ జోన్లలో మాత్రం మద్యం అమ్మకాలుంటాయి. ఆరెంజ్ జోన్లలో పరిమిత మంది ప్రయాణికులతో క్యాబ్ లకు అనుమతిచ్చారు.

*రెడ్ జోన్లలో సర్వం బంద్
శరామామూలుగానే రెడ్ జోన్లలో సర్వం బంద్ చేశారు. అన్నింటిపై నియంత్రణ కొనసాగుతుంది. రాత్రిపూట 7 గంటల నుంచి ఉదయం గంటల దాకా కర్ఫ్యూ ఉంటుంది. ఇక్కడ పూర్తిగా తగ్గే వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా కొనసాగించుకోవచ్చని కేంద్రం తెలిపింది.

*ఆర్థిక అతలాకుతలం.. మోడీ ఇచ్చిన రిలాక్సేషన్
ఆర్థికరంగం అతలాకుతలం అవుతుందని.. లాక్ డౌన్ పొడిగిస్తే ఆకలిచావులేనని తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్లు రఘురామ రాజన్ , దువ్వూరి సుబ్బారావులు భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందుకే మోడీ సర్కారు ఎంతో కాలం లాక్ డౌన్ విధించి దేశాన్ని దిగ్బంధించలేమని నిర్ణయానికి వచ్చింది. ఇలానే లాక్ డౌన్ కొనసాగిస్తే కరోనా చావులంటే కంటే ఆకలిచావులే ఎక్కువ అవుతాయని వ్యాఖ్యానించారు. అందుకే మోడీ సర్కార్.. రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లను విభజించి ఆయా జోన్లలో మినహాయింపులు ఇచ్చింది.

*లాక్ డౌన్ కొనసాగింపుతో లాభమా నష్టమా?
కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ కొనసాగింపుతో లాభమా.? నష్టమా అని ఆలోచిస్తే.. లాభమేనని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా ఉన్న ప్రాంతాలను లేని ప్రాంతాలను ఒకే గాటిన కట్టకుండా రెడ్ జోన్లలో కట్టడి చేస్తూ గ్రీన్ జోన్లలో మినహాయింపులు ఇచ్చింది. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి ప్రజలకు అవకాశం చిక్కింది. దీంతో ఉపాధికి మోడీ సర్కార్ బాటలు పరిచింది. ఇక మోడీ విధించిన ఈ త్రి ఫార్ములాను రాష్ట్రాలు అమలు చేస్తాయా? ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫస్ట్ నుంచి స్టిక్ట్ గా వెళుతున్నారు. ఆయన ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి

ఎమ్మెల్యే లపై హైకోర్టులో పిల్..!


లాక్‌డౌన్‌ నిబంధనలకు ఉల్లంఘిస్తూ సమావేశాల్లో పాల్గొంటున్న అధికారపార్టీ నేతలను అడ్దుకోవాలంటూ లాయర్ కిశోర్ పిల్‌ వేశారు. నిబందలను ఉల్లంఘించిన వైసీపీ నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్ కు తరలించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ప్రతివాదులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భియ్యపు మధుసూదన్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజారెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీలను చేర్చారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితంకావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి న్యాయవాది
గుర్తు చేశారు. అయినా కొందరు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు యదేచ్ఛగా జనంలో తిరుగుతున్నారని తెలిపారు.

మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల తీరును తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందడానికి అధికార పార్టీ నాయకుల వైఖరే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికార పార్టీ నాయకులకు పిల్ తో కొత్త చిక్కులు వచ్చినట్లయ్యింది.

లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

మూడవ దశలో దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ను ఈ నెల మే 17 వరకు మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే లాక్ డౌన్ లో అనేకమైన ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అందులో భాగంగా గ్రీన్‌ జోన్లలో మద్యం, పాన్‌ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం, పాన్‌ షాపులకు కేంద్రం సడలింపును ఇచ్చింది. ఆయా షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌ డౌన్‌ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో మార్చి 24 నుంచి మే 3 వరకు రెండు దశలలో మొత్తం 40రోజుల పాటు కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ని అమలుపరిచిన విషయం తెలిసిందే.

ఇంటర్ బోర్డ్ కీలక ఆదేశాలు!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ పీరియడ్ ని పెంచుకుంటూ వెళ్తున్న సమయంలో తెలంగాణ ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు, విద్యాలయాలకు కొన్ని ఆదేశాలు, హెచ్చరికలను జారీ చేసింది. తాజాగా లాక్ డౌన్ 3.0 ని మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో ఈ ఆదేశాలను బేఖాతరు చేయకూడదని బోర్డ్ హెచ్చరించింది. ఆ ఆదేశాలు ఇవే..

  • లాక్ డౌన్ ముగిసే వరకు ప్రైవేటు కాలేజ్ లు ఏవి కుడా ఇంటర్ ఫస్ట్ ఈయర్ అడ్మిషన్లు తీసుకోవద్దు.
  • విద్యార్థులు ఎవరు కూడా ఫీజు కట్టి అడ్మిషన్లు తీసుకోవద్దు.
  • పదో తరగతి పరీక్షలు పూర్తి కానందున్నా కాలేజీ లకు బోర్డు ఆఫ్లియేషన్ ఇవ్వలేదు.
  • విద్యార్థులు అడ్మిషన్ల ఫీజులు చెల్లించి నష్టపోవద్దు.
  • ఈ సారి కొన్ని కాలేజీల గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉంది.
  • ఏవైనా కాలేజీ లు విద్యార్థుల దగ్గర అడ్మిషన్లు తీసుకంటే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటమని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు.

మూడో లాక్ డౌన్ లో మూడు ముళ్లకి సడలింపు!

దేశంలో కరోనా వైరస్‌ ను నియంత్రించేందుకు కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్‌ డౌన్‌ ను పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాలకు 50 మందికి మించి, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి నిరాకరించింది.

బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటిస్తూ.. ఐదుగురికి కంటే మించి ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, మద్యం సేవించడం, పాన్‌, గుట్కా, పొగాకు నమలడం నిషేధించారు.

గతంలో మొదటి దశ లాక్ డౌన్ మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు 21 రోజులు అమలుపరచగా, రెండవ దశలో ఏప్రిల్ 15 నుండి మే 3వరకు 19 రోజుల పాటు పొడిగించారు. రేపటితో లాక్ డౌన్ 2.0 ముగుస్తుండటంతో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ 3.0 ను మే 17 వరకు అమలుపరచనున్నారు

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో లాక్  డౌన్1.0, 21 రోజులు, లాక్ డౌన్ 2.0 19 రోజులు అమలుపరచగా తాజాగా మరో రెండు వారాలపాటు మే 17వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ లాక్ డౌన్ 3.0 లో అనేకమైన పనులకు సడలింపులు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రింద ఇవ్వబడిన పనులకు నిబంధనలు వర్తిస్తాయి.

  • విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
  • స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌
  • హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌
  • స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి
  • అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు
  • అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి
  • గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
  • రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు
  • వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన
  • కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు
  • గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
  • గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
  • ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
  • ఆరెంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
  • ఆరెంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి
  • ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
  • గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్‌ క్యాబ్‌లకు అనుమతి
  • వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి
  • రెడ్‌ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు
  • 33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి
  • రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
  • బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి
  • గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ఆన్‌ లైన్‌ షాపింగ్‌కు అనుమతి
  • ప్రైవేట్‌ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి
  • అన్ని రకాల గూడ్స్‌, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి
  • బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించాల్సిందే
  • పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు
  • అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి

వలస కూలీలకు అడుగడుగునా పరీక్షలే!

లాక్ డౌన్ ప్రారంభం నుండి నలుగుతున్న వలస కూలీల సొంత ఊళ్ళ ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్లను నడిపేందుకు హోంశాఖ అనుమతివ్వడంతో రాష్ట్రాల సహకారంతో రైల్వేశాఖ మరిన్ని రైళ్లను నడపనుంది. కేంద్ర మార్గదర్శకాలను అనుగుణంగా ప్రొటోకాల్ పాటిస్తూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేయనున్నారు. రైళ్లు టికెట్లు, సామాజిక దూరం, ఇతర రక్షణ చర్యలకు సంబంధించి రైల్వేశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

ప్రయాణికులను పంపించేటప్పుడు, తీసుకెళ్లేటప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. వలస కార్మికులను పంపే రాష్ట్రాలు విధిగా అందరినీ పరీక్షించాల్సి ఉంటుంది. కోవిడ్ లక్షణాలు లేని వారినే ప్రయాణానికి అనుమతించాలి. రాష్ట్ర ప్రభుత్వమే శానిటైజ్ చేసిన బస్సుల ద్వారా రైల్వే శాఖ సూచించిన స్టేషన్ వద్దకు ప్రయాణికుల చేరవేయాలి. బస్సుల్లో తరలించేటప్పుడు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రత్యేక రైళ్ల ప్రయాణంలో మధ్యలో ఎక్కడా స్టాప్స్ ఉండవు. పాయింట్ టు పాయింట్ మాత్రమే రైళ్లను నడుపుతారు. గమ్యస్థానం వచ్చిన తర్వాత.. సదరు స్టేషన్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచాలి. అక్కడ మరోసారి పరీక్షలు చేసిన తర్వాత బస్సుల్లో ఎక్కించాలి. కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్‌ కు తరలించాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ పై హరీష్ రావు సెటైర్లు!


ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడుతుంటే.. ప్రతిపక్షాలు ఐసోలేషన్‌ లో ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుల పక్షాన కేసీఆర్ సర్కార్ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు ఏసీ రూమ్స్‌ లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం రైతుల నుంచి పంట కొనుగోలు చేయడంలేదని.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో తాము రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మద్దతు ధర చెల్లించి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు గుప్పించారు.

మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ..”మేం రైతుల మధ్య, ప్రజల మధ్య తిరుగుతున్నాం. ప్రతిపక్షాలు హైదరాబాద్ లో, గాంధీ భవన్ లోకూర్చున్నారు. హైదరాబాద్ లో ఎసీ రూంలలో కూర్చుని ప్రతిపక్ష నేతలు రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు. కరోనా వచ్చిన కష్ట కాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు కొంటున్నాం. కరోనా ఇబ్బంది పరిస్థితుల్లో ఎమ్మెల్యే, అధికారులు, ఐకేపీ సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారు. కరోనా వల్ల దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రం రైతుల నుంచి పంటలు కొనడం లేదు. కర్ణాటకలో ప్రభుత్వం శనగలు కొనుగోలు చేయడం లేదు. బీదర్ రైతులు నారాయణ ఖేడ్, జహీరాబాద్ కు తెచ్చి అమ్మందుకు ప్రయత్నిస్తున్నారు. రైతు శ్రేయోభిలాషి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు విమర్శలు, అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. రాష్ట్ర మంతా లాక్ డౌన్ ఉన్నా…రైతులకు లాక్ డౌన్ లేదు.” అని హరీష్ రావు పేర్కొన్నారు.

లాక్ డౌన్ సంపూర్ణంగా అమలు చేస్తున్నాం: ఈటల

TRS


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్డౌన్ అమలు చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా చేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. కేంద్రం సూచించిన విధంగానే తెలంగాణలో టెస్టులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ టెస్టులు చేపట్టొద్దని ఐసీఎంఆర్ చెప్పిందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరోనా పాజిటిల్ లక్షణాలు ఉన్నావారికే టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించిదని ఆయన చెప్పారు.

మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగింపు

సీఎం కేసీఆర్ కరోనా విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు అన్నివిధలా సహకారం అందిస్తున్నారని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరని ఇప్పటికే అప్రమత్తం చేశారని మంత్రి స్పష్టం చేశారు. కాగా శుక్రవారం తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించారు. వీటిని కూడా కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,044కు చేరిందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 24మంది బాధితులు ఇవాళ డిశ్చార్జి చేసినట్లు ఆయన తెలిపారు.

బ్రేకింగ్ న్యూస్.. మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగింపు


దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ అమలుకే కేంద్రం మొగ్గుచూపింది. మే 17వరకు లాక్డౌన్ కొనసాగించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. మే3తో రెండోవిడుత లాక్డౌన్ ముగిస్తుండగా మరోసారి కేంద్రం లాక్డౌన్ పొడగించింది. అయితే ఈమేరకు కేంద్రం తాజాగా ప్రకటించిన రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులిచ్చింది. గ్రీన్ జోన్లలో అన్నిరకాల కార్యకలాపాలకు కేంద్రం అనుమతిచ్చింది.

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

ఆరెంజ్ జోన్లలో కొన్ని షరతులతో కార్యకలాపాలకు అనుమతిచ్చింది. ఇక రెడ్ జోన్లు, కంటైనర్ జోన్లలో ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయనుంది. వీటితో కరోనా బఫర్ జోన్లను గుర్తించి తదనుగుణంగా చర్యలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల నిషేధించేంది. అలాగే విమానాలు, రైళ్ల రాకపోకలపై నిషేధం విధించింది. జనసంచారం ఉండే విద్యాసంస్థలు, బస్సు సర్వీసులు, విద్యాసంస్థలకు లాక్డౌన్ నిబంధనలు అమలు కానున్నాయి. కాగా మే7వరకు తెలంగాణలో లాక్డౌన్ అమలవుతోంది. తాజాగా కేంద్రం మే 17వరకు లాక్డౌన్ పొడగించింది.

ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం

అయితే లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాని మోదీ రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి మరోసారి ప్రసగించనున్నారు. లాక్డౌన్ అమలుపై తన ప్రసంగంలో ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రీన్ జోన్లో కార్యాకలాపాలకు అనుమతినిస్తూ కొన్ని జోన్లలో సడలింపులు కల్పిస్తే కేంద్రం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు అర్థం అవుతోంది.