
ఊహల కందని ఈ అనూహ్య కాంబోలో ఒక సినిమా రూపుదిద్దుకో బోతోంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నేచురల్ స్టార్ నాని , అక్కినేని నాగ చైతన్య ల కలయికలో ఒక సినిమా రాబోతుంది. ఈ వార్త నిజమే , వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేయ బోతున్నారు. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే నాగ చైతన్య హీరో గా నటించబోయే చిత్రానికి వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు.
లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?
త్వరలో నాగచైతన్య హీరోగా `మిస్టర్ పర్ ఫెక్ట్ `ఫేమ్ దశరధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మాతగా నిర్మించ బోతున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సమర్పకుడు గా వ్యవహరించ బోతున్నాడు. దరిమిలా ఈ చిత్రం ` పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ‘ సమర్పణలో `వాల్ పోస్టర్ సినిమా ‘సినిమా బ్యానర్ లో ఈ చిత్రం నిర్మాణం కాబోతుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఇదే కాంబోలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా జాయిన్ కాబోతున్నాడు… అంటున్నారు .ఆ విషయం ఇంకా నిర్దారణ కాలేదట ..
పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?
ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ” లవ్ స్టోరీ ” చిత్రాన్ని పూర్తి చేసి విధులకు ఎదురు చూస్తున్నాడు అలాగే నాని నటించిన ” వి ” మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది . ఇక పవన్ కళ్యాణ్ నటించిన ” వకీల్ సాబ్ ” కొంత షూటింగ్ మిగిలి ఉంది. అది కూడా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది .