
బాలీవుడ్ హీరో రిషి కపూర్ తాత పృథ్విరాజ్ కపూర్, తండ్రి రాజ్ కపూర్ కూడా అగ్ర నటులే. కాగా తన తండ్రి హీరో గా నటించిన `మేరా నామ్ జోకర్ ` సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రిషి కపూర్ హీరో అవ్వడం వెనుక పెద్ద కథ వుంది .
స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి
1973లో వచ్చిన “బాబీ ” రిషి కపూర్ హీరోగా నటించిన మొదటి చిత్రం. ఇక ఈ చిత్రానికి దర్శకుడు రిషి కపూర్ తండ్రి రాజ్ కపూర్. తొలి సినిమా ‘బాబీ’తోనే పెద్ద స్టార్ అయిపోయాడు రిషి కపూర్. ఆ సినిమా భారత దేశమంతటా ఘన విజయం సాధించింది .ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్, విజయవాడ లాంటి చోట్ల వంద రోజులాడింది. ఐతే ఇంత పెద్ద హిట్ సినిమా వెనుక ఓ ఆసక్తికర కథ దాగి ఉంది. రిషి కపూర్ ని హీరోగా పరిచయం చేయడం కోసం తీసిన సినిమా కాదిది. రిషి కపూర్ బాల నటుడిగా, తండ్రి రాజ్ కపూర్ హీరో గా నటించిన ‘మేరా నామ్ జోకర్’ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం రాజ్ కపూర్ ‘బాబీ’ తీసినట్లుగా ఓ ఇంటర్వ్యూలో రిషి కపూర్ స్వయంగా వెల్లడించడం జరిగింది .
లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!
నిజానికి బాబీ సినిమాలో హీరోగా రాజేష్ ఖన్నాను తీసుకోవాలని రాజ్ కపూర్ అనుకున్నారట. ఐతే రాజేష్ ఖన్నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేక రాజ్ కపూర్ కొడుకు రిషి కపూర్ ని హీరోగా పరిచయం చేశాడట. అలా తండ్రి ఆర్థిక కష్టాలు తీర్చడం కోసం ఆయన హీరో అయ్యాడు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రాజ్ కపూర్ కి బాగా లాభాలు రావడమే గాక రిషి కపూర్ ని స్టార్ ని కూడా చేసింది .
సాధారణంగా ఒక హీరో లేదా నటుడిని అతని కెరీర్ లో బెస్ట్ సినిమాతో కౌంట్ చేస్తారు .ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ ని ఆయన కెరీర్ బెస్ట్ ట్రెండ్ సెట్టర్ అయిన ” జంజీర్ ” చిత్రం తో కౌంట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి ని కెరీర్ బెస్ట్ అయిన ” ఖైదీ ” తో లెక్కిస్తారు . అలాగే ఏ హీరోకైనా కెరీర్ బెస్ట్ ఒక సినిమా ఉంటుంది. కానీ విచిత్రం గా రిషి కపూర్ కి మాత్రం ఫస్ట్ సినిమా అయిన ” బాబీ ” చిత్రం తోనే కౌంట్ చేస్తారు. అందుకే రిషి కపూర్ ని `ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ‘ గా సినీ చరిత్ర లో లిఖించడం జరుగుతుంది .