Home Blog Page 8505

గేట్ విద్యార్థులకు శుభవార్త..!


కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యమ్నాయాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో గేట్ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వ విద్యాలయాల ఆధ్వర్యంలో ఆన్ లైన్ గేట్ కోచింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఏప్రిల్ 28న అన్ని యూనివర్సిటీ ల వి సీ లతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో ఈ సూచన చేశారు. మంత్రి సూచన మేరకు ఆన్లైన్ లో గేట్ కోచింగ్ నిర్వహణకు అధికారులు కార్యక్రమ రూపకల్పన చేశారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ, యోగి వేమన విశ్వవిద్యాలయం వైయస్ఆర్ కడప, గేట్ కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 3 మరియు 4 వ సంవత్సర విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నోలో ఈ అవకాశం పొందవచ్చు. ప్రతి విద్యార్థికి రోజుకు రెండు సబ్జెక్టులు ఆన్‌లైన్ ద్వారా బోధించబడతాయని తెలిపారు. ఇద్దరు వేర్వేరు అధ్యాపకులు. ఆన్‌లైన్ హాజరును పరిశీలిస్తారు.

ప్రతి విషయాన్ని అధ్యాపక సభ్యులు, ఈ క్రింది వెబ్‌పోర్టల్ నుండి వివరాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

www.jntua.ac.in/gate-online-classes/list-of-faculty

విద్యార్థులు ఆన్‌లైన్ గేట్ కోచింగ్ తరగతుల కోసం ఈ క్రింది వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు.

www.jntua.ac.in/gate-online-classes/registration

తరగతుల షెడ్యూల్ కో-ఆర్డినేటర్, సంబంధిత విద్యార్థులకు ఈ -మెయిల్ ద్వారా పంపబడుతుంది.
ఇ-మెయిల్: gateonline@jntua.ac.in

నమోదు ప్రక్రియ ఈ నెల 2 వ తేదీ నుంచి ప్రారంభమై 7వ తేదీతో ముగుస్తుంది.
తరగతులు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

కో-ఆర్డినేటర్ల వివరాలు:

1. డాక్టర్ ఎస్. వి. సత్యనారాయణ,
డైరెక్టర్ అకడమిక్ అండ్ ప్లానింగ్
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపూర్
అనంతపురం
ఇ-మెయిల్: svsatya7.chemengg@jntua.ac.in మొబైల్: 98495-09167

2. డాక్టర్ వి. శ్రీనివాసులు,
డైరెక్టర్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ
కాకినాడ
ఇ-మెయిల్: fdc@jntuk.edu.in
మొబైల్: 97012-78555.

ఆరోపణలు రుజువు చేస్తావా … రాజీనామా చేస్తావా కన్నా!


కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చేస్తున్న ఆరోపణలపై కొద్దీ రోజులుగా ఎదురు దాడులు జరుపకుండా మౌనం వహిస్తున్న వైసిపి నేతలు తిరిగి తమ దాడిని ప్రారంభించారు. ఈ సారి నేరుగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రంగంలోకి దిగారు.

జగన్ కి థాంక్స్ చెప్పిన పవన్!

ఆరోపణలను రుజువు చేస్తే రేపు ఉదయం 9.30 గంటల కల్లా మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రుజువు చేయలేని పక్షంలో తన పదవికి కన్నా రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

కరోనా టెస్టింగ్ కిట్లను తాను సరఫరా చేసినట్లు కన్నా ఆరోపించడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇంత వయసొచ్చిన ఆయన ఇలా మాట్లాడటం సరైంది కాదని మంత్రి కన్నాకు హితవు చెప్పారు. కన్నా తన వయసుకు, బాధ్యతకు తగిన విధంగా మాట్లాడాలని హితవు చెప్పారు.

తనకు కంపెనీ ఉండి.. దాని ద్వారా కిట్లను సరఫరా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ చేశారు. పైగా, రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, రాజకీయం చేయడానికి ఇంకా సమయం ఉందని, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని మంత్రి బుగ్గన పిలుపు ఇచ్చారు.

పంట వేసేటప్పుడే ధర…ఏపీ నూతన విధానం…!

ప్రభుత్వం పరంగా ఏమైనా తప్పులు జరిగితే తగిన సలహాలు, సూచనలు చేయాలని, విమర్శలు చేయకూడదని మంత్రి పేర్కొన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి గుర్తు చేశారు.

ఇదివరలో టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై ట్వీట్ ఇచ్చిన కన్నా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నుండి రూ 20 కోట్లు ముడుపులు తీసుకొని ఆ విధమైన ఆరోపణలు చేస్తున్నారని వైసిపి ఎంపీ వి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపడం తెలిసిందే.

వారం రోజులపాటు సాగిన ఆ దుమారం సద్దుమణగగా, తిరిగి కన్నా కిట్ల కొనుగోలుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ గవర్నర్ కు లేఖ వ్రాయడంతో మూడు రోజలపాటు మౌనంగా ఉన్న వైసిపి నేతలు నేడు తీవ్రంగా స్పందించారు.

హాలీవుడ్ లో మరో నటుడికి కరోనా


కరోనా దెబ్బ హాలీవుడ్ బాగా గట్టిగానే తగిలింది. ఇప్పటికే సుమారు పదిమంది నటులు కరోనా బారినపడి మరణించారు. ఇపుడు తాజాగా కరోనా సోకిన హాలీవుడ్ నటుడు నిక్ కార్డేరో.. చివరకు తన కాలును కూడా కోల్పోవాల్సి వచ్చింది. 42 ఏళ్ళ నిక్ కార్డేరో ఏప్రిల్ 2 వ తారీఖున హాస్పిటల్ లో జాయిన్ అయ్యి 16 రోజుల తరవాత ఏప్రిల్ 18 వ తారీఖున కుడి కాలుని కోల్పోవాల్సి వచ్చింది .

కేటీఆర్ పిలుపుకు స్పందించిన కవిత

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నిక్ కార్డేరో లాస్ ఏంజెలెస్ లోని’ సెడార్స్ -సినాయ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా కారణంగా అతను తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. దీంతో అతని కుడి కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి, ముక్కలుగా విడిపోయింది. ఇది ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశం ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతని కాలును ఏప్రిల్ 18 న అతని కాలును వైద్యులు తొలగించారు. కాగా ఈ విషయాలన్నీ నిక్ కార్డేరో భార్య అమండా క్లూట్స్ ప్రముఖ ఇంగ్లీష్ వార్తా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొనడం జరిగింది .

Surya Movie Stills

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంకు టీం ఇండియా


విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. నాలుగేళ్లుగా చేబూనిన నెంబర్ వన్ రాంక్ ను చేజార్చుకోవడమే కాకుండా, మూడో రాంక్ కు పడిపోయింది.

అక్టోబర్ 2016 నుంచి టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. అయితే ఐసీసీ నేడు ప్రకటించిన పురుషుల క్రికెట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీంఇండియాకు నిరాశే మిగిల్చీనదని చెప్పవచ్చు.

2019 మే నుంచి ఆడిన అన్ని మ్యాచ్‌లను 100 శాతంగా, అంతకుముందు రెండేళ్ల మ్యాచ్‌లను 50 శాతంగా పరిగణనలోకి తీసుకొని పాయింట్లను కేటాయించారు. మెరుగైన పాయింట్లను సాధించడం ద్వారా ఐసీసీ పురుషుల టెస్ట్ టీం ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా (26 మ్యాచ్‌లు) 116 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకుకు ఎగబాకింది.

115 పాయింట్లతో న్యూజిలాండ్ (21 మ్యాచ్‌లు) రెండో స్థానం సాధించగా భారత్ (27 మ్యాచ్‌లు) ఇప్పుడు 114 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. టాప్‌-3 జట్లు కేవలం ఒక్కో పాయింట్‌ తేడాతో తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

నాలుగేండ్ల తర్వాత తొలిసారి టీమ్‌ఇండియా ఫస్ట్‌ర్యాంక్‌ను కోల్పోవడం గమనార్హం. 2016-17 సీజన్‌లో 12 టెస్టులు గెలిచిన భారత్‌ కేవలం ఒక్క టెస్టులోనే ఓటమిపాలైంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో సహా మొత్తం ఐదు సిరీస్‌లను గెలుచుకుంది.

ఐతే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. అత్యధిక టెస్టు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

కాగా, టీ20లో కూడా ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. టీ20 ర్యాంకింగ్స్‌లోనూ కంగారూలదే అగ్రస్థానం. రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఇంగ్లాండ్‌, భారత్‌ నిలిచాయి. పాకిస్థాన్‌ నాలుగు, సౌతాఫ్రికా ఐదో ర్యాంకు సాధించాయి.

కేటీఆర్ పిలుపుకు స్పందించిన కవిత


నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల శుక్రవారం హైదరబాద్లోని తన నివాసంలో రక్తదానం చేశారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు వారంరోజులపాటు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుకు స్పందించిన ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత శుక్రవారం రక్తం చేశారు.

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. తలసేమియా, అత్యవసరంగా చికిత్స అందేవారికి సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు ఆమె తెలిపారు. సమాజ సేవలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముందుండాలన్నారు. లాక్డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకుల్లో రక్తంనిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. ఈమేరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువుగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రక్తదాన సమయంలో ఆమె మాస్క్‌లు ధరించి ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నారు.

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?


కరోనా ఎఫెక్ట్ తో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుముఖంపట్టాయి. దీంతో ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో గ్యాస్ ధరలు తగ్గడం వినియోగదారులకు ఒకరకంగా శుభవార్తే అని చెప్పొచ్చు. ఆయిల్ కంపెనీలు నెలవారీగా సమీక్షలో భాగంగా తగ్గిన గ్యాస్ ధరలను ప్రకటించాయి. నేటి నుంచి 15రోజులపాటు తగ్గిన గ్యాస్ ధరలు అమల్లో ఉంటాయని ప్రకటించాయి.

రేపు లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్న మోదీ

ఈమేరకు హైదరాబాద్ నగరంలో 14.2కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.207కు తగ్గింది. దీంతో గ్యాస్ ధర రూ.589.50నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.336 తగ్గి రూ.988నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలో ఎలీపీజీ సిలిండర్ ధర రూ.744నుంచి రూ.581.50కు తగ్గింది. ముంబై నగరంలో రూ.714.50 నుంచి రూ.579కు పడిపోయింది. కోల్‌కతాలో రూ.190 తగ్గి రూ.584.50కు, చెన్నై నగరంలో రూ.569.50కు ధరలకు పడిపోయింది.

ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19కేజీలు)ధర రూ.336 క్షీణించింది. ఢిల్లీలో రూ. 744 నుంచి రూ.611కు తగ్గింది. కోల్‌క‌తాలో రూ. 839 నుంచి రూ. 774కు, ముంబైలో సిలిండ‌ర్ ధ‌ర రూ. 579కి త‌గ్గింది. హైద‌రాబాద్లో రూ. 862 నుంచి రూ. 796కు త‌గ్గింది. ఈ ధరలన్నీ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

అర్జున్ రెడ్డి కాంబోలో మళ్ళీ సినిమా


విజయ దేవరకొండ కి స్టార్ డమ్ తెచ్చి పెట్టిన చిత్రం అర్జున్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. అప్పటిదాకా సాఫ్ట్ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో మాస్ జనాలకు కూడా నచ్చడం జరిగింది. తెలుగు సినిమాల్లో సరికొత్త మార్పులకు నాంది పలికిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా కూడా క్రేజీ డైరెక్టర్ గా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు అదే సినిమాని హిందీలో తీసి సూపర్ సక్సెస్ అందుకొన్నాడు బాలీవుడ్ కి చెందిన టీ సిరీస్ సంస్థ ఇదే చిత్రాన్ని” కబీర్ సింగ్ ” పేరుతో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రీమేక్ చేసి సెన్షేషనల్ హిట్ దక్కించు కొంది.

జగన్ కి థాంక్స్ చెప్పిన పవన్!

దాంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కి మరో హిందీ మూవీ అఫర్ వచ్చింది .ఇక త్వరలో మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్న టైం లో .. లాక్ డౌన్ కారణంగా సందీప్ రెడ్డి ప్లాన్ మొత్తం తారుమారై పోయింది. దాంతో ఈ లాక్ డౌన్ వేళ ఇంటి వద్దనే ఉంటున్నాడు. అది తెలిసిన విజయ్ దేవరకొండ ఏమైనా కథల్ని సిద్ధం చేస్తే, లాక్డౌన్ తర్వాత ఇద్దరం కలిసి సినిమా చేయొచ్చని సందీప్ రెడ్డి నుద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది . దీంతో అర్జున్ రెడ్డి కాంబోలో మరో సినిమా రాబోతుందంటూ..వార్త బయటి కొచ్చింది .

రేపు లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్న మోదీ


ఇంకో రెండ్రోజుల్లో కేంద్రం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. తొలి విడుత లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నుంచి లాక్డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో తొలివిడుత లాక్డౌన్ 21రోజులు జరిగింది. ఇక రెండో విడుత లాక్డౌన్ 19రోజులపాటు అంటే మే 3వరకు సాగనుంది. ఈనేపథ్యంలోనే మరోసారి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈసారి మోదీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠతతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం

లాక్ డౌన్ ముగుస్తుండటంతో ప్రధాని మోదీ అధ్యక్షతన తాజాగా ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయ‌ల్‌, కేబినెట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబాతోపాటు పలువురు ఉన్న‌త స్థాయి అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా పరిస్థితి.. లాక్డౌన్ కొన‌సాగింపు, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు. ఈమేరకు ప్రధాని మోదీ రేపు ఉదయం 10గంటలకు జాతీనుద్దేశించి ప్రసంగించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది.

రాష్ట్రంలో 79 వెరీ యాక్టివ్ కరోనా క్లస్టర్లు..!

ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీఎం అభిప్రాయాలను తీసుకున్నారు. మెజార్టీ సీఎంలు లాక్డౌన్ కొనసాగించాలని.. మరికొందరు సడలించాలని కోరారు. ఈనేపథ్యంలో ప్రధాని రేపు లాక్డౌన్ కొనసాగింపు లేదా ఎత్తివేతపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ లాక్డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే ఆసక్తి దేశ ప్రజల్లో నెలకొంది.

మహాసముద్రం లో సిద్ధార్థుడు


మల్టీ స్టారర్ చిత్రాలకు హిందీలో ఉన్నంత వెసులు బాటు తెలుగు సినీ పరిశ్రమలో ఉండదు. ఇక్కడ హీరోలు మల్టీ స్టారర్ చిత్రాలు చేయాలంటే అనేక విధాలుగా ఆలోచిస్తారు. ఒక పట్టాన అడ్జస్ట్ కారు. అందుకే తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి. ఇపుడు ఆ ఇబ్బందే ఒక దర్శకుడుకి వచ్చింది. “ఆర్ ఎక్స్ 100 ” సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి, ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. దానిక్కారణం అజయ్ భూపతి సిద్ధం చేసుకున్న ‘మహాసముద్రం’ అనే మల్టీ స్టారర్ కథ పట్ల కథానాయకులు ఆసక్తిని చూపకపోవడమే అని తెలుస్తోంది. .

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులకు ప్రాధాన్యత ఉంటుంది. ఒక కథానాయకుడి పాత్రకిగాను శర్వానంద్ ను ఎంపిక చేసిన అజయ్ భూపతి, మరో కథానాయకుడి పాత్ర కోసం ఇంతకాలం అన్వేషిస్తూ వచ్చాడు. చివరకు బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ చిత్రం లో శర్వానంద్ జోడీగా సాయిపల్లవిని నటిస్తుంటే , సిద్ధార్థ్ సరసన జోడీ ఇంకా ఫిక్స్ కాలేదు. గతంలో” బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే నేనొద్దంటానా “వంటి వరుస హిట్ సినిమాలు చేసిన సిద్ధార్థ్ కి తెలుగులో మంచి క్రేజ్ వుంది. దరిమిలా సిద్దార్థ ని రెండో హీరోగా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది .

రాష్ట్రంలో 79 వెరీ యాక్టివ్ కరోనా క్లస్టర్లు..!


ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు ఉండగా 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు, 68 యాక్టివ్‌ క్లస్టర్లు, 53 డార్మంట్‌ క్లస్టర్లు, 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని వెల్లడించిన అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరీక్షలు లక్ష దాటాయి. ప్రతి మిలియన్‌కు 2వేలకు చేరువయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 పరీక్షలు నిర్వహించగా, నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు జరిపారు.

జగన్ కి థాంక్స్ చెప్పిన పవన్!

ప్రతిమిలియన్‌ ప్రజలకు 1,919 మందికి పరీక్షలు నిర్వహించి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం నిలిచింది. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీటిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కృష్ణబాబుకు బాధ్యత అప్పగించారు. సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం, మందులు అందుతున్నాయా లేదా అన్నదానిపై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు అధికారులు తీసుకుంటున్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్‌ నంబర్‌ తమ వద్ద ఉందని, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ర్యాండమ్‌గా కాల్‌చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని తెలియజేసిన అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.

సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

లాక్‌డౌన్‌ సడలింపులు నేపథ్యంలో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయని సమావేశంలో జరిగింది. వీరిని స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సమీక్షించారు. వీరి సంఖ్య అధికంగా ఉండే అవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న సీఎం ఆదేశించారు. ఎవరిని క్వారంటైన్లో పెట్టాలి, ఎవర్ని ఎక్కడ పెట్టాలి అన్నదానిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. క్వారంటైన్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని ఆదేశించారు.

అలాగే వివిధ రాష్ట్రాలనుంచి వస్తున్నవారి విషయంలో కూడా సరైన విధానాన్ని అనుసరించాలన్నారు.విదేశాల నుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్‌ విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

అలాగే గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని, అలాగే శ్రీకాకుళం చేరుకునేవారికి కూడా సెంటర్లు ఏర్పాటుచేసి, పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారుల వెల్లడి. వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించారు. వీరికి పరీక్షలు చేసి, లక్షణాలు ఉంటే ముందస్తు వైద్యం అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని ఆదేశం. హైరిస్క్‌ ఉన్నవారు శ్వాసకోసతో సంబంధిత సమస్యలతోగాని, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు ఏ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఈ నంబర్లకు కాల్‌ చేస్తే వెంటనే వైద్యం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

టెలిమెడిసన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం, భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నిర్ణయించారు.టెలీమెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ పొందడం, అక్కడ నుంచి నేరుగా విలేజ్‌ క్లినిక్‌ ద్వారా మందులు సరఫరా చేయడం జరగాలన్న సీఎం ఆదేశించారు.

ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే శాసన మండలికి ఎన్నిక కావడంపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ఎట్టకేలకు ఆయన ఎన్నిక కావడానికి మార్గం సుగమమైనది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన మహారాష్ట్ర శాసనమండలిలో 9 స్థానాలకు జరుగవలసిన ఎన్నికలను ఈ నెల 21న జరపడానికి కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేయడంతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదం తప్పింది.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

ఏ సభలో సభ్యుడు కానీ ఉద్ధవ్‌ థాక్రే నవంబర్ 28న ముఖ్యమంతిగా ప్రమాణస్వీకారం చేయడంతో, ఆరు నెలలలోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావలసి వచ్చింది. మండలి ఎన్నికలు వాయిదా పడడంతో గవర్నర్ కోటా నుండి నామినేషన్ చేయవలసిన రెండు స్థానాలలో ఒక దానిలో ముఖ్యమంత్రిని నామినేట్ చేయమని సిఫార్స్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఏప్రిల్ 9న మొదటిసారి తీర్మానం పంపింది.

రేషన్, లాక్ డౌన్ డబ్బులపై కీలక నిర్ణయం!

దానిపై భగత్ సింగ్ కోషియారి స్పందించక పోవడంతో అదే విషయమై రెండో సారి కూడా మంత్రివర్గం తీర్మానం చేసింది. మొత్తం మంత్రివర్గం వెళ్లి ఆయనను కలిసింది. న్యాయసలహా తీసుకొంటున్నట్లు ఆయన చెప్పారు. మే 27 లోగా మండలికి ఎన్నిక కాలేని పక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, ఈ విషయంలో జోక్యం చేసుకోమని కోరారు. ఆ తర్వాత రెండు, మూడు రోజులకే గవర్నర్ ఈ రోజు ఉదయం స్పందించారు. ఉద్ధవ్‌ థాక్రేను మండలికి నామినేట్ చేసే విషయం తేల్చకపోయినప్పటికీ, రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 9 స్థానాలకు ఎన్నికలు జరిపామని సిఫార్స్ చేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ వ్రాసారు.

ఆ వెంటనే ఎన్నికల కమీషన్ స్పందిస్తూ ఎన్నికల పక్రియను ప్రకటించింది. అయితే, ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా బారిన పడకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. అంద‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించి, సామాజిక దూరం పాటిస్తూ పోలింగ్‌లో పాల్గొనాల‌ని ఈసీ పేర్కొంది.

పంట వేసేటప్పుడే ధర…ఏపీ నూతన విధానం…!


రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ పంట వేయాలన్న విషయాన్ని రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకె) ద్వారా అవగాహన కలిగించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లాక్ డౌన్, వ్యవసాయం రంగంపై శుక్రవారం సమీక్షించారు. ఏ పంట వేస్తే మార్కెట్‌లో మంచి ధరకు లభించే అవకాశాలు ఉన్నాయన్నదానిపై రైతులకు అవగాహన కలిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామంలో ఏయే పంటలు ఎంతమేర పండించాలన్న విషయమై రైతులతో మాట్లడి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి ఆమేరకు కార్యాచరణ రూపొంచాలని అధికారులకు సూచించారు.

జగన్ కి థాంక్స్ చెప్పిన పవన్!

రాష్ట్రస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు, జిల్లా అడ్వైజరీ బోర్డులు, మండల అడ్వైజరీ బోర్డులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఏ పంటలు, ఎక్కడ ఎంతమేర సాగుచేయాలన్నదానిపై ఈ బోర్డులు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ బోర్డుల ఏర్పాటుకు వెంటనే చర్యలు ప్రారంభించాలన్నారు. పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలని నిర్ణయించారు. దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతోందని భావిస్తున్నారు. పంటలను ఇ– క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం, ఈ ప్రక్రియలన్నీ వ్యవస్థీకృతంగా సాగిపోవాలని సూచించారు.

పోలీసుల కష్టానికి ప్రతిఫలం!

ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందన్న అధికారులు సీఎంకు తెలిపారు. ఒక్క కృష్ణాజిల్లాలో సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదన్న స్పష్టం చేశారు. చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దని, వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టం చేశారు. పంటలను రోడ్డుమీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవన్న సీఎం అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాససింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలన్నారు.

జగన్ కి థాంక్స్ చెప్పిన పవన్!

లాక్ డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను సొంత గ్రామాలకు చేర్చడానికి జగన్ సర్కార్ తీసుకున్న చొరవకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అందుకు కృషి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పవన్ వెల్లడించారు.

గతంలో శ్రీకాకుళం జిల్లా నాయకులు మత్స్యకారుల గురించి ఆయనకు తెలిసిన వెంటనే ట్విటర్ ద్వారా చేసిన విజ్ఞప్తికి తక్షణం స్పందించి మత్స్యకారులకు కావలసిన ఆహార పదార్ధాలను అందించిన గుజరాత్ ప్రభుత్వ అధికారులకు కూడా పవన్ కృతఙ్ఞతలు చెప్పారు. 36 బస్సులలో సుమారు 3800 మంది గుజరాత్ లోని వెరావల్ తీర ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరారని తెలిసి తను చాలా సంతోషిస్తున్నట్లు పవన్ తెలిపారు. కిషన్ రెడ్డి చొరవతో మత్స్యకారుల తరలింపునకు మూడు కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసారు.

పోలీసుల కష్టానికి ప్రతిఫలం!

లాక్ డౌన్ టైంలో సరైన విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆరోగ్యంపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి విధుల కేటాయింపు ఉండేలా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా ఆర్జీలు పెట్టుకోకుండానే వారి పరిస్థితిని అంచనా వేసి శాంతిభద్రతలు, ట్రాఫిక్ వంటి కష్టంతో కూడిన విధులు కాకుండా మరేదైనా విభాగంలో వారి సేవలను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.

ఈ మొత్తం వివరాలను పోలీస్ పథకం ఆరోగ్య భద్రతకు లింక్ చేయనున్నారు. ఇప్పటికే ఆరోగ్య భద్రతను టీఎస్ కాప్‌తో అనుసంధానం చేశారు. దీంతో పోలీసుల ఆరోగ్యానికి సంబంధించిన వివారాలు ఉన్నతాధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 25 వేల మంది సిబ్బంది ఆరోగ్య వివరాలు సేకరించారు. ఈ నెల 3 వరకు అందరి ఆరోగ్య వివరాలు సేకరించనున్నారు. వీటి ఆధారంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు ఇతర చర్యలు తీసుకోనున్నారు.

వలస కార్మికుల కోసం.. లింగపల్లి-ఝార్ఖండ్ స్పెషల్ ట్రైన్


దేశంలో లాక్డౌన్ అమలు చేయడంతో వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ అమలుతో ఉన్నచోట పనిలేక.. సొంతూళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కరోనా ఎఫెక్ట్ తో తమవాళ్లు ఎలా ఉన్నారో అనే ఆవేదన వలస కార్మికుల్లో కన్పించింది. దీంతో కొందరు కాలినడననే కొన్ని వేలకిలోమీటర్లు నడుచుకుంటూ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు మార్గమధ్యలో మృతిచెందిన సంఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు వారిని ఆవేదనను గుర్తించి లాక్డౌన్ సమయంలో వారిని సొంతూళ్లకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు కేంద్రం వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది.

రేషన్, లాక్ డౌన్ డబ్బులపై కీలక నిర్ణయం!

లాక్డౌన్ సమయంలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులను సొంత ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటను కేంద్రం కల్పించింది. దీంతో ఆయా రాష్ట్రాలు వలస కార్మికులను తరలించేందుకు చర్యలు చేపట్టాయి. తెలంగాణలో 15లక్షల మంది వలస కార్మికులు ఉండగా వీరిందరినీ బస్సుల్లో తరలించడం కష్టంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం

ఈమేరకు తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు తొలి ట్రైన్‌ ప్రారంభమైంది. దాదాపు 1100మంది కూలీలతో లింగంపల్లి నుంచి జార్ఖండ్‌కు శుక్రవారం తెల్లవారుజామున స్పెషల్‌ ట్రైన్‌ బయలుదేరి వెళ్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మీదుగా ప్రయాణించనుంది. వీరంతా స్వస్థలాలకు వెళ్లిన తర్వాత టెస్టులు నిర్వహించి హోం క్వారంటైన్లో ఉంచాలని ఆయా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

రేషన్, లాక్ డౌన్ డబ్బులపై కీలక నిర్ణయం!


తెలంగాణలో రేషన్‌ కార్డుదారులకు నేటి నుంచి ఉచిత బియ్యం, శనివారం నుంచి నగదు బదిలీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకునేందుకు కార్డుదారుడి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, నిత్యావసర సరకుల కొనుగోలుకు కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదు బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఏప్రిల్‌ లో మాదిరిగానే మే నెలలో కూడా ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ రోజు బ్యాంకులు, పోస్టాఫీసులకు సెలవు కావటంతో శనివారం నుంచి నగదు బదిలీ ప్రారంభం అవుతుంది.  కేంద్ర ప్రభుత్వం ప్రతి కార్డుదారునికి ఒక కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ లెక్కన రాష్ట్రంలోని 87.54 లక్షల కార్డుదారులకు నెలకు 8,754 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం కాగా ఇప్పటి వరకు జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య(నాఫెడ్‌) నుంచి 3,233 మెట్రిక్‌ టన్నులే సరఫరా అయింది. సాధారణంగా రేషన్‌ దుకాణాలు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకే పని చేయనుండగా కరోనా నేపథ్యంలో 23 వరకు పని చేస్తాయని పేర్కొంది.