
కార్మిక చట్టాల తూట్లుకు రంగం సిద్ధం

ఇక ఇంటి వద్దకే దుకాణాలు

గ్యాస్ లీక్ పై కేంద్ర జోక్యం కోరుతున్న టిడిపి

పెద్ద, చిన్న నాయుడు లను రాష్ట్రానికి పంపండి..!

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.
‘మద్యం’ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!
పెద నాయుడు, చిన నాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్‌లో ఉండిపోయిందని ట్వీట్ చేశారు. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండని కోరారు.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం: పవన్
విమానంలొనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా అంటూ పోస్ట్ చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో ఐఏఎస్‌లు తప్ప నిపుణులు లేరన్న బాబు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అచ్చెన్నాయుడు నేతృత్వంలో కమిటీ వేయటాన్ని ఎద్దేవ చేశారు.
గుర్రంపై ఎమ్మెల్యే పర్యటన..!

విశాఖపట్టణం జిల్లా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్తపల్లి భాగ్యలక్ష్మి తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వెళ్లేందుకు గుర్రాన్ని ఆశ్రయించడం చర్చనీయంగా మారింది. పూర్తిగా అటవీ ప్రాంతమైన ఈ నియోజకవర్గ పరిధిలో 300 వరకూ ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనాలపై వెళ్లేందుకు అవకాశం లేదు. దీంతో ఆమె గుర్రం పై గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!
లాక్‌డౌన్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు పయనమయ్యారు. డింగిరాయి నుంచి చిత్తమామిడి వరకు గుర్రంపైనే ప్రయాణించారు. స్థానికులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు పంపిస్తామని వారికి హామీ ఇచ్చారు.
శ్రీదేవితో నటించడం స్వీట్ మెమొరీ: మెగాస్టార్

నేటితో మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీ 30ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కొన్ని ఆసక్తికర విశేషాలను వివరించారు. ముఖ్యంగా హీరోయిన్ శ్రీదేవిపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో ఇంద్రజ పాత్ర శ్రీదేవీ కోసమే పుట్టిందా? అనిపిస్తుందని తెలిపారు. శ్రీదేవి లేకపోతే ఈ సినిమా లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం: పవన్ కల్యాణ్
అతిలోక సుందరి పాత్రలో దేవకన్యగా శ్రీదేవిని తప్ప మరెవరినీ ఊహించుకోలేమని ఆయన అన్నారు. ఈ మూవీలో తొలిసారిగా శ్రీదేవితో పోటీపడి నటించినట్లు మెగాస్టార్ చెప్పారు. శ్రీదేవి తన అందచందాలు, హొయలతో, చిలక పలుకులు, అమాయకపు చూపులతో పాత్రలో లీనమై అత్యద్భుతంగా చేసిందని కితాబిచ్చారు. ఇప్పటికీ మనం అతిలోక సుందరిగా శ్రీదేవిని తలుచుకుంటున్నామంటే ఆమె ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆమెతో పనిచేయడం తనకు ఒక అద్భుతమైన అవకాశం.. మంచి అనుభూతినిచ్చిందని తెలిపారు.
సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
అదేవిధంగా పాటల చిత్రీకరణలో శ్రీదేవితో చేసేటప్పుడు తాను ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తాను కనిపించే పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. శ్రీదేవి తన అందాలు, హొయలు, లుక్స్ అభిమానులను అంతలా ఆకట్టుకునేలా ఉంటాయని తెలిపారు. శ్రీదేవితో చేయడానికి తొలిసారి కొంచెం శ్రమ పడాల్సి వచ్చిందన్నారు. శ్రీదేవితో కలిసి పని చేయడం తనకు ఎప్పటికీ స్వీట్ మెమొరీని మిగిల్చిందని మెగాస్టార్ తెలిపారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో నిర్మాత అశ్వినీదత్ భారీతానానికి ఏమాత్రం వెనుకడాకుండా ఖర్చుపెట్టారని తెలిపారు. దర్శకుడు రాఘవేంద్రరావు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీని అత్యద్భుతంగా తెరకెక్కించారని కొనియాడుతూ పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మద్యం షాపులపై జగన్ మరో కీలక నిర్ణయం!

మద్యం ధరలు పెంచడంలో, మద్యం షాపులను తగ్గించండంలో ఏపీ సీఎం జగన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా మద్యం షాపులపై జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపులను మరో పదమూడు శాతం తగ్గిస్తున్నట్లు సీఎం నిర్ణయం తీసుకోవడం విశేషం. మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఇరవై శాతం షాపులు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం మరో పదమూడు శాతం షాపులను తగ్గించింది. దీంతో మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లయింది.
మొత్తంగా జగన్ సీఎం పీఠం ఎక్కిన తర్వాత 4,380 మద్యం షాపులను 2,934కి తగ్గించారు. తాజా నిర్ణయం ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆర్టీసీ భవిష్యత్ ఏంటి? మూతపడడమేనా?

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. మొన్ననే తమకు జీతాలు పెంచాలని.. సమస్యలు తీర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. కేసీఆర్ ను ఎదురించారు. రెండు నెలలు సమ్మె చేశారు. దీని దెబ్బకు ఆర్టీసీ సంస్థ జీతాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారింది. అయితే తర్వాత కేసీఆర్ అందరినీ తొలగించడం.. రచ్చ జరగడం.. చివరకు కాళ్లబేరంతో ఆర్టీసీ వివాదం పరిష్కారమైంది. కార్మికులను చేరదీసిన కేసీఆర్ వారి పోస్టులు వారికిచ్చి నడిపించుకోమ్మని పంపించారు. అంతలోనే కరోనా ఉపద్రవం తెలంగాణ ఆర్టీసీని మరింత కృంగదీస్తోంది.
లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్
*ఆర్టీసీ బతికి బట్ట కడుతుందా?
ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వమే జీతాలు సర్ది లేపింది. ఇలా పట్టాలెక్కగానే అలా కరోనాతో ప్రజారవాణా బంద్ అయిపోయింది. నెలన్నర రోజులుగా ఆర్టీసీ బంద్ అయిపోయి కార్మికులు ఇంట్లోనే ఉంటున్నారు. సగం జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదంట.. ఇక పీకల్లోతు అప్పులు.. ఆర్టీసీ నడవకపోవడంతో గుదిబండగా ఆర్టీసీ తయారవుతుందట..
*కరోనాతో జనాలు బస్సులెక్కడం కష్టమే..
కరోనా భయంతో ఆర్టీసీ మొదలుపెట్టినా జనాలు బస్సులు ఇప్పట్లో ఎక్కడం అనుమానమే.. కిక్కిరిసే బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. అందుకే సొంత వాహనాలను లేదంటే రైలులను చూస్ చేసుకుంటారు. ఈ పరిణామం ఆర్టీసికి చావుదెబ్బగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం
* గూడ్స్ నమ్ముకుంటే బెటర్..
తెలంగాణలో సమ్మె చేసినా.. ఇప్పుడు నెలన్నరగా ఆర్టీసీ లేకున్నా వెళ్లదీసిన జనాలకు ఇప్పుడు ఆర్టీసీ లేని లోటు అంతగా కనిపించడం లేదు. అది లేకున్నా నడిచే పరిస్థితులున్నాయి. దీంతో కరోనా లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా జనాలు బస్సులు ఎక్కడం కష్టమే. కేసీఆర్ ప్రారంభించిన బస్సులతో సరుకు రవాణా గూడ్స్ కు మళ్లితే బెటర్ అన్న ఆలోచన ఉంది. తెలంగాణలో గూడ్స్ కు భారీ డిమాండ్ ఉంది. పాత ఆర్టీసీ బస్సులను ఇప్పటికే గూడ్స్ వాహనాలుగా మార్చారు. ఇప్పుడు ఆర్టీసీలో మరిన్ని గూడ్స్ బళ్లు పెరగొచ్చంటున్నారు.
*జీతాలు.. జీవితాలు కష్టమే..
తెలంగాణ ఆర్టీసీకి అప్పులు భారంగా ఉన్నాయి. నిర్వహణ కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో కరోనా మరింత దెబ్బతీసింది. నెలన్నరగా ఆదాయం లేదు. కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదట.. ఇప్పుడు బస్సులు ప్రారంభించినా ఎక్కే నాథుడే ఉండడు. సో ఆర్టీసీ మనుగడ కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇదే సంస్థను నమ్ముకొని ఉన్న 50వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డట్టే.. మరి కరోనా ఉపద్రవం తెలంగాణ ఆర్టీసీని మరింత కృంగదీసిందనే చెప్పవచ్చు..
*ఆదాయం కోసం ఏపీ ఆర్టీసీ మార్గాలు.. తెలంగాణలో అలాంటివేవి లేవు..
కరోనా-లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి మూతపడ్డ అన్ని వ్యవస్థల్లో కీలకమైన ప్రజా రవాణాను కూడా ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని సమాచారం. కేంద్రం నుంచి సంకేతాలు అందడంతో ఏపీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రధానంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుబోతోంది. కండక్లర్ల వ్యవస్థను పక్కనపెట్టి బస్టాండులు, బస్ స్టాపుల వద్దే వారిని కూర్చుండబెట్టి టికెట్ ఇప్పించాలని యోచిస్తోంది. తద్వారా బస్ కండక్టర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఇక కరోనా దెబ్బకు స్టాప్ ల సంఖ్యను కుదించేస్తోంది. 150కి.మీల దూరం పైన ప్రయాణించే బస్సుల్లో ఆన్ లైన్ ద్వారానే టికెట్లు తీసుకోవాలి. ఇక 150 కి.మీల లోపు బస్సు సర్వీసుల కోసం బస్టాపుల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడే తీసుకొని బస్సెక్కాలి. కండక్లర్లు ఇక బస్సుల్లో టికెట్లు అమ్మకుండా చర్చలు తీసుకుంటున్నారు. సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు ఉండరు. టికెట్ తీసుకునే వారు ఎక్కాలి. కొన్ని స్టాపుల్లో టికెట్లు తీసుకోవాలి. ఈ మేరకు ఈ మార్గదర్శకాలపై ఏర్పాట్లు చేయాలని అన్ని డిపోల మేనేజర్లకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 18 నుంచి ఆర్టీసీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
*తెలంగాణ ఆర్టీసీ మనుగడపై నీలినీడలు
ఇలా ఏపీ ఆర్టీసీని బతికించుకునేందుకు ఏపీ ప్రభుత్వం సవాలక్ష మార్గాలు వెతుకుంటే.. తెలంగాణ ఆర్టీసీలో ఇంకా అలాంటి ప్లాన్లు ఏవీ లేకపోవడం.. స్తబ్దుగా ఉండడంతో తెలంగాణ ఆర్టీసీ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
హరీష్ రావు నోట “సహజీవనం” మాట

వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనాతో సహజీవనం తప్పదని గతంలో కేటీఆర్ చెప్పిన మాటనే ఈరోజు మంత్రి హరీష్ రావు కూడా అన్నారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే కొంత కాలం పాటు సహజీవనం తప్పేటట్టు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ. 1500 నగదు, 12 కిలోల బియ్యం ఇచ్చామని చెప్పారు. రెండవ దశలో మరో రూ. 1500 కూడా ఇస్తున్నామని తెలిపారు.
కరోనా వ్యాప్తి కారణంగా ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని హరీశ్ అన్నారు. సామాజిక దూరం పాటించకుండా గుమికూడవద్దని… మాంసం కోసం వెళ్లి రోగం తెచ్చుకోవద్దని హితవు పలికారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ. 1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. అందరం కలసికట్టుగా మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలునిచ్చారు.
లేడి ఓరియేంటేడ్ మూవీలో ఐశ్వర్య?

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో తండ్రి కలను నెరవెర్చే అమ్మాయిగా నటించి మెప్పింది. చాలా ఎమోషన్ తో కూడిన ఈ పాత్రను చక్కగా నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. తెలుగుతోపాటు తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో నటించింది. విజయ్ భార్య అద్భుతంగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. గ్లామర్, డీగ్లామర్ అనే తేడా లేకుండా నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఐశ్వర్య రాజేష్ ముందుకెళుతోంది.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్
తాజాగా ఈ అమ్మడు తమిళంలో ఓ లేడి ఓరియంటేడ్ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందట. ‘తిట్టం ఇరండు’ అనే టైటిల్ పేరుతో యువ దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. కాగా లాక్డౌన్ ఎత్తివేశాక సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సతీష్ రఘునాథన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. కేవలం నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఐశ్వర్య రాజేష్ మొగ్గుచూపుతోంది. ఇటీవల విజయ్ సరసన ‘వరల్డ్ ఫేమస్’లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది.
మనోజ్ పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్

సినీనటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మనోజ్ రాజకీయ ఎంట్రీపై గతకొంతకాలంగా వార్తలు విన్పిస్తున్నాయి. మంచు మనోజ్ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నాడనే ప్రచారం జరుగుతున్న తరుణంలో మోహన్ బాబు స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందిస్తూ మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే అంశాన్ని అతడినే అడగాలన్నారు. ఒకవేళ మనోజ్ తనను అడిగితే మాత్రం రాజకీయాల్లోకి వెళ్లొద్దనే సలహా ఇస్తానని మోహన్ బాబు అన్నారు.
సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
సినిమా నటులు రాజకీయాల్లో రావడం కొత్తమే కాదన్నారు. అయితే రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదని కామెంట్ చేశారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. అందుకే తనకు నచ్చిన రాజకీయ పార్టీలు, నాయకులకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన వివరించారు. తన కుమారులు విష్ణు, మనోజ్ బాబు ఇద్దరు కూడా సినిమాల్లో సక్సెస్ అయ్యారని తెలిపారు. అలాగే తన కూతురు మంచు లక్ష్మీ తనకు నచ్చిన పాత్రలను చేస్తూ ముందుకెళుతుందని తెలిపారు. భవిష్యత్లో ఏం జరుగుతుందో ముందే ఊహించడం కష్టమని మోహన్ బాబు కామెంట్ చేశారు.
విజయ్ పై కేసు నమోదు

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపై అఖిల భారత హిందూసభ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ సేతుపతి గెస్ట్ గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో విజయ్ సేతుపతి హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఖిల భారత హిందూ మహాసభ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాయడంతోపాటు త్రిచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం
సొంత పబ్లిసిటీ కోసం హిందూ దేవుళ్లపై విజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని వారు హెచ్చరించారు. అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు విజయ్ దెబ్బతీశాడని ఆ లేఖలో పేర్కొంది. ఆయన ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో కారణం చెప్పాలని డిమాండ్ చేసింది. సొంత ప్రచారం చేసుకోవడానికే హిందూ మతమే దొరికిందా? అంటూ ఆయనపై మండిపడ్డారు. ఇదిలాఉంటే విజయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. మీమ్స్ తో నెటిజన్లు విజయ్ ను ట్రోలింగ్ చేస్తున్నారు. అఖిల భారత హిందూసభ సభ్యులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం విజయ్ సేతుపతి తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఉప్పెనలో విలన్ గా నటిస్తున్నాడు.
రైతుల్లో ఆరేళ్ళలో అద్భుతమైన మార్పు:కేటీఆర్

గడిచిన ఆరేళ్లలో తెలంగాణ రైతులల్లో అద్భుతమైన మార్పు వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. రబీలో ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలవడం.. తెలంగాణ రైతులు, ప్రజానీకం గర్వించదగ్గ సందర్భమని కేటీఆర్ అన్నారు. ఆరేళ్ల లోపే సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన మార్పు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా గోధుమలు, బియ్యం కొనుగోళ్లు చేసినట్లు ట్విట్టర్ లో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా 50 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. 50 లక్షల టన్నుల బియ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 44.36 లక్షల టన్నులు అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి 34.36 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేయగా, ఏపీ నుంచి 10 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు
మరో ఆర్థిక నేరగాడు విదేశాలకు పరారీ

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బ్యాంకు లు భారీగా రుణాలను ఎగ్గొట్టి అనేకమంది పేరొందిన ఆర్ధిక నేరస్థులు దేశం వదిలి పారిపోతున్నారు. తాజాగా మరో ఆర్థిక నేరగాడు విదేశాలకు పరారయ్యాడు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), ఇతర బ్యాంకుల నుండి తీసుకున్న రూ. 400 కోట్ల రుణాలను చెల్లించకుండా విదేశాలు పారిపోయాడు. విజయ్ మాల్యా, నీరవ్‌మోడీ, మోహుల్ చోక్సీ తరహాలోనే ఢిల్లీకి చెందిన రామ్‌దేవ్ అంతర్జాతీయ సంస్థ యజమానులు రుణాలు చెల్లించకుండా బ్యాంకులకు ఎగనామం పెట్టారు.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం
ఈ సంస్థ బాస్మతి బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఆ కంపెనీ డైరక్టర్లు నరేశ్ కుమార్, సురేశ్ కుమార్, సంగీత, ఇతరులపై సిబిఐ ఫోర్జరీ, చీటింగ్ కేసులను నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది. నాలుగేళ్ల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఎస్‌బిఐ ఫిర్యాదు మేరకు సిబిఐ దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఎస్‌బిఐతో పాటు ఆరు బ్యాంకుల నుండి మొత్తం రూ.414 కోట్లు రుణం తీసుకున్నారు. అనంతరం వారు కనిపించలేదని, విదేశాలకు పారిపోయారని సమాచారం. కాగా, వారు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో 2016లో మొండి బకాయిల జాబితాలో చేర్చారు. అనంతరం సిబిఐకి ఫిర్యాదు చేయడంతో పాటు ఏప్రిల్ 28న కేసు నమోదైంది.
లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్
నిందితులు చట్ట విరుద్ధంగా తప్పుడు ఖాతాలతో మోసం చేయడంతో పాటు లాభాలు పొందేందుకు ప్లాంట్, యంత్రాలను తొలగించినట్లు ఎస్‌బిఐ ఫిర్యాదులో పేర్కొంది. నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) కింద మార్చిన అనంతరం నిందితుల కోసం హర్యానా పోలీసులతో విచారణ చేపట్టామని, అయితే అప్పటికే వారు దేశం విడిచి పారిపోయారని తెలిపింది.
కరోనా పుణ్యమా అని సీన్ రివర్స్ అయింది

ఒకప్పుడు విదేశాల నుండి వస్తున్నారంటే.. వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎనలేని గౌరవం ఉండేది. కరోనా పుణ్యమా అని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అదే విధంగా ఒకప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియా లో ఉంది, మా వాళ్లు దుబ్బాయ్ లో ఉన్నారు అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా భావించే వాళ్ళు. కానీ, కరోనా పుణ్యమా అని సీన్ రివర్స్ అయింది. మా వాళ్ళు విదేశం నుంచి వస్తున్నారంటే చాలు వాళ్ళకి కరోనా ఉందేమో అని అనుమానంగా చూస్తున్నారు. మా వాళ్లు ఇతర దేశం నుంచి వచ్చారంటే.. వాళ్ళని ఊరి నుంచే వేలేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విధంగా ఈ కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రస్తుత సమాజంలో అనేక విషయాలు రివర్స్ లో ట్రెండ్ నడుస్తున్నాయి.
అసలు విషయం ఏమిటంటే లాక్ డైన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం ‘వందేభారత్ మిషన్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్ ద్వారా భారత్ కి వచ్చే ప్రతి వారిని 28 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచిన తర్వాతే వారి వారి ప్రాంతాలకు పంపిస్తారు. ఈ మిషన్ లో భాగంగా కువైట్ లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువస్తున్న విమానం హైదరాబాద్ బయల్దేరింది. 200మంది ప్రయాణికులతో బయల్దేరిన ఆ విమానం శనివారం రాత్రి 7 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనుంది. కువైట్ ఎయిర్‌పోర్టులో రెండు వందలమంది ప్రయాణికులు చెక్ ఇన్ చేసుకున్నారు. ప్రయాణికుల్లో కొందరు తెలంగాణకు చెందినవారు కాగా, మరికొందరు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. వీరంతా హైదరాబాద్ రాగానే క్వారంటైన్ లోకి వెళ్లనున్నారు.ఇందుకోసం హోటళ్లు, లాడ్జీలలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ. 5 వేల నుంచి రూ. 30 వేల మధ్య ప్యాకేజీలు ప్రకటించింది. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా వైరస్ కేసులను తక్కువ చేసి చూపిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తున్న వాటికన్నా చాల ఎక్కువగా కరోనా కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయమై కీలకమైన వైద్య నిపుణులే తనకు సమాచారం అందించినట్లు చెప్పుకొచ్చారు.
పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలసి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో టెలీకాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 96 కేసుల వరకూ ఉన్నాయని చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే ఉన్నాయని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు గుర్తు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా నెల్లూరు, చిత్తూర్ జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మందు ఓపెన్.. గుడులు, పనులు బంద్ న్యాయమా?
కరోనా ఎక్కువ కాలం ఉండే ఆరోగ్య సంబంధిత సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్న దృష్ట్యా ఈ విషయమై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. కరోనా వైరస్ తో దేశ స్వరూపమే మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కేవలం ఒకే వ్యాక్సిన్ తో ఈ సమస్య తీరకపోవచ్చని పేర్కొంటూ వైరస్ రూపానికి తగ్గ విధంగా వ్యాక్సిన్లు తీసుకురావాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నట్లు గుర్తు చేశారు.
వ్యాక్సిన్ వచ్చే వరకూ సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చేయాల్సిందే అని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం, లాక్ డౌన్ వల్ల పలు రంగాలు దెబ్బ తిని, నష్టపోయాయి. వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారు. వాటిపట్ల ప్రభుత్వం సానుభూతితో స్పందించి సహకారం అందించాలని పవన్ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా జనసేన నాయకులు అండగా నిలవాలని సూచించారు.
సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదైంది నెల్లూరు జిల్లాలోనే అని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. అధికార పక్షం ఈ విపత్కర సమయంలో వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తూ ఉన్నారని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధుల వ్యవహారం, ప్రజల ఇబ్బందులు, స్థానిక సమస్యలపై మన పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలని సూచించారు.
’13 బి’ చిత్రానికి సీక్వెల్.హీరోగా నాగచైతన్య

`మనం ; ఫేమ్ విక్రమ్ కుమార్ కి తొలి సక్సెస్ అందించిన ` 13B ‘ హారర్ చిత్రానికి త్వరలో సీక్వెల్ రాబోతుంది. గతంలో తమిళం లో రూపొందిన ఈ చిత్రం ఇపుడు తెలుగులో రాబోతుంది. అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వెళ్తున్న క్రమంలో విక్రమ్ కుమార్ చెప్పిన ఈ సీక్వెల్ కథ బాగా నచ్చిందట … ‘మజిలీ’ .. ‘వెంకీమామ’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న నాగ చైతన్య తాజాగా దర్శకుడు విక్రమ్ కుమార్ కధకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది ..
సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
గతంలో తమిళంలో ఘన విజయాన్ని సాధించిన ’13 B’ అనే హారర్ థ్రిల్లర్ 2009 లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా తెలుగులోను మంచి విజయాన్ని అందుకొంది. …. కథాకథనాల పరంగా ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. మాధవన్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా సీక్వెల్లోనే ఇప్పుడు నాగ చైతన్య చేయనున్నాడని తెలుస్తోంది .
















