
వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనాతో సహజీవనం తప్పదని గతంలో కేటీఆర్ చెప్పిన మాటనే ఈరోజు మంత్రి హరీష్ రావు కూడా అన్నారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే కొంత కాలం పాటు సహజీవనం తప్పేటట్టు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ. 1500 నగదు, 12 కిలోల బియ్యం ఇచ్చామని చెప్పారు. రెండవ దశలో మరో రూ. 1500 కూడా ఇస్తున్నామని తెలిపారు.
కరోనా వ్యాప్తి కారణంగా ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని హరీశ్ అన్నారు. సామాజిక దూరం పాటించకుండా గుమికూడవద్దని… మాంసం కోసం వెళ్లి రోగం తెచ్చుకోవద్దని హితవు పలికారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ. 1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. అందరం కలసికట్టుగా మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలునిచ్చారు.