
సినీనటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మనోజ్ రాజకీయ ఎంట్రీపై గతకొంతకాలంగా వార్తలు విన్పిస్తున్నాయి. మంచు మనోజ్ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నాడనే ప్రచారం జరుగుతున్న తరుణంలో మోహన్ బాబు స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందిస్తూ మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే అంశాన్ని అతడినే అడగాలన్నారు. ఒకవేళ మనోజ్ తనను అడిగితే మాత్రం రాజకీయాల్లోకి వెళ్లొద్దనే సలహా ఇస్తానని మోహన్ బాబు అన్నారు.
సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?
సినిమా నటులు రాజకీయాల్లో రావడం కొత్తమే కాదన్నారు. అయితే రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదని కామెంట్ చేశారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. అందుకే తనకు నచ్చిన రాజకీయ పార్టీలు, నాయకులకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన వివరించారు. తన కుమారులు విష్ణు, మనోజ్ బాబు ఇద్దరు కూడా సినిమాల్లో సక్సెస్ అయ్యారని తెలిపారు. అలాగే తన కూతురు మంచు లక్ష్మీ తనకు నచ్చిన పాత్రలను చేస్తూ ముందుకెళుతుందని తెలిపారు. భవిష్యత్లో ఏం జరుగుతుందో ముందే ఊహించడం కష్టమని మోహన్ బాబు కామెంట్ చేశారు.