Homeజాతీయ వార్తలుఆర్టీసీ భవిష్యత్ ఏంటి? మూతపడడమేనా?

ఆర్టీసీ భవిష్యత్ ఏంటి? మూతపడడమేనా?


మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. మొన్ననే తమకు జీతాలు పెంచాలని.. సమస్యలు తీర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. కేసీఆర్ ను ఎదురించారు. రెండు నెలలు సమ్మె చేశారు. దీని దెబ్బకు ఆర్టీసీ సంస్థ జీతాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారింది. అయితే తర్వాత కేసీఆర్ అందరినీ తొలగించడం.. రచ్చ జరగడం.. చివరకు కాళ్లబేరంతో ఆర్టీసీ వివాదం పరిష్కారమైంది. కార్మికులను చేరదీసిన కేసీఆర్ వారి పోస్టులు వారికిచ్చి నడిపించుకోమ్మని పంపించారు. అంతలోనే కరోనా ఉపద్రవం తెలంగాణ ఆర్టీసీని మరింత కృంగదీస్తోంది.

లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్

*ఆర్టీసీ బతికి బట్ట కడుతుందా?
ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వమే జీతాలు సర్ది లేపింది. ఇలా పట్టాలెక్కగానే అలా కరోనాతో ప్రజారవాణా బంద్ అయిపోయింది. నెలన్నర రోజులుగా ఆర్టీసీ బంద్ అయిపోయి కార్మికులు ఇంట్లోనే ఉంటున్నారు. సగం జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదంట.. ఇక పీకల్లోతు అప్పులు.. ఆర్టీసీ నడవకపోవడంతో గుదిబండగా ఆర్టీసీ తయారవుతుందట..

*కరోనాతో జనాలు బస్సులెక్కడం కష్టమే..
కరోనా భయంతో ఆర్టీసీ మొదలుపెట్టినా జనాలు బస్సులు ఇప్పట్లో ఎక్కడం అనుమానమే.. కిక్కిరిసే బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. అందుకే సొంత వాహనాలను లేదంటే రైలులను చూస్ చేసుకుంటారు. ఈ పరిణామం ఆర్టీసికి చావుదెబ్బగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

* గూడ్స్ నమ్ముకుంటే బెటర్..
తెలంగాణలో సమ్మె చేసినా.. ఇప్పుడు నెలన్నరగా ఆర్టీసీ లేకున్నా వెళ్లదీసిన జనాలకు ఇప్పుడు ఆర్టీసీ లేని లోటు అంతగా కనిపించడం లేదు. అది లేకున్నా నడిచే పరిస్థితులున్నాయి. దీంతో కరోనా లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా జనాలు బస్సులు ఎక్కడం కష్టమే. కేసీఆర్ ప్రారంభించిన బస్సులతో సరుకు రవాణా గూడ్స్ కు మళ్లితే బెటర్ అన్న ఆలోచన ఉంది. తెలంగాణలో గూడ్స్ కు భారీ డిమాండ్ ఉంది. పాత ఆర్టీసీ బస్సులను ఇప్పటికే గూడ్స్ వాహనాలుగా మార్చారు. ఇప్పుడు ఆర్టీసీలో మరిన్ని గూడ్స్ బళ్లు పెరగొచ్చంటున్నారు.

*జీతాలు.. జీవితాలు కష్టమే..
తెలంగాణ ఆర్టీసీకి అప్పులు భారంగా ఉన్నాయి. నిర్వహణ కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో కరోనా మరింత దెబ్బతీసింది. నెలన్నరగా ఆదాయం లేదు. కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదట.. ఇప్పుడు బస్సులు ప్రారంభించినా ఎక్కే నాథుడే ఉండడు. సో ఆర్టీసీ మనుగడ కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇదే సంస్థను నమ్ముకొని ఉన్న 50వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డట్టే.. మరి కరోనా ఉపద్రవం తెలంగాణ ఆర్టీసీని మరింత కృంగదీసిందనే చెప్పవచ్చు..

*ఆదాయం కోసం ఏపీ ఆర్టీసీ మార్గాలు.. తెలంగాణలో అలాంటివేవి లేవు..
కరోనా-లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి మూతపడ్డ అన్ని వ్యవస్థల్లో కీలకమైన ప్రజా రవాణాను కూడా ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని సమాచారం. కేంద్రం నుంచి సంకేతాలు అందడంతో ఏపీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రధానంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుబోతోంది. కండక్లర్ల వ్యవస్థను పక్కనపెట్టి బస్టాండులు, బస్ స్టాపుల వద్దే వారిని కూర్చుండబెట్టి టికెట్ ఇప్పించాలని యోచిస్తోంది. తద్వారా బస్ కండక్టర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఇక కరోనా దెబ్బకు స్టాప్ ల సంఖ్యను కుదించేస్తోంది. 150కి.మీల దూరం పైన ప్రయాణించే బస్సుల్లో ఆన్ లైన్ ద్వారానే టికెట్లు తీసుకోవాలి. ఇక 150 కి.మీల లోపు బస్సు సర్వీసుల కోసం బస్టాపుల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడే తీసుకొని బస్సెక్కాలి. కండక్లర్లు ఇక బస్సుల్లో టికెట్లు అమ్మకుండా చర్చలు తీసుకుంటున్నారు. సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు ఉండరు. టికెట్ తీసుకునే వారు ఎక్కాలి. కొన్ని స్టాపుల్లో టికెట్లు తీసుకోవాలి. ఈ మేరకు ఈ మార్గదర్శకాలపై ఏర్పాట్లు చేయాలని అన్ని డిపోల మేనేజర్లకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 18 నుంచి ఆర్టీసీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

*తెలంగాణ ఆర్టీసీ మనుగడపై నీలినీడలు
ఇలా ఏపీ ఆర్టీసీని బతికించుకునేందుకు ఏపీ ప్రభుత్వం సవాలక్ష మార్గాలు వెతుకుంటే.. తెలంగాణ ఆర్టీసీలో ఇంకా అలాంటి ప్లాన్లు ఏవీ లేకపోవడం.. స్తబ్దుగా ఉండడంతో తెలంగాణ ఆర్టీసీ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular