
విశాఖపట్టణం జిల్లా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్తపల్లి భాగ్యలక్ష్మి తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వెళ్లేందుకు గుర్రాన్ని ఆశ్రయించడం చర్చనీయంగా మారింది. పూర్తిగా అటవీ ప్రాంతమైన ఈ నియోజకవర్గ పరిధిలో 300 వరకూ ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనాలపై వెళ్లేందుకు అవకాశం లేదు. దీంతో ఆమె గుర్రం పై గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!
లాక్‌డౌన్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు పయనమయ్యారు. డింగిరాయి నుంచి చిత్తమామిడి వరకు గుర్రంపైనే ప్రయాణించారు. స్థానికులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు పంపిస్తామని వారికి హామీ ఇచ్చారు.