Home Blog Page 8496

ఏపీ కొత్త జీవోపై తెలంగాణ బీజేపీ దీక్ష!

తెలుగురాష్ట్రాల మధ్య పోతురెడ్డిపాడు జీవో వివాదం రేపుతోంది. పోతురెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ ప్రభుత్వం కొత్త జీఓ( 203)ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ సర్కార్ ఆ జీవోను ఎందుకు ఖండించడంలేదని అసహనం వ్యక్తం చేస్తుంది. నీళ్లు-నిధులు-నియామకాలే లక్ష్యంగా కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల దోపిడిని అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. జీఓ నంబరు 203ను రద్దు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్, కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తే నేడు బీజేపీ నేతలు దీక్ష చేపట్టనున్నారు. హైదరాబాద్‌ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దీక్ష చేపట్టనున్నారు. ఈయనకు తోడుగా ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకుచెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లలోనే నిరసన దీక్షకు దిగనున్నారు. ఏపీ ప్రభుత్వ జీఓపై బీజీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. అపరభగీరథుడిగా తన వందిమాగధుల చేత పొగిడించుకున్న సీఎ కేసీఆర్ పోతురెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నా.. జగన్ ప్రభుత్వంపై ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

ఇదే విషయంపై ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణకి అన్యాయం చేయకుండా వరదల ద్వారా వచ్చి, సముద్రంలో కలిసిపోయె నీటిని మాత్రమే మా ప్రభుత్వం వాడుకోవలనుకుంటుదని ఆయన తెలిపారు. ఇదే విషయం పై ఏపీ బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతురెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలని సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్మోహన్ రెడ్డి కి అన్ని పార్టీలు సమర్థంచాలని ఇతర పార్టీలకు విజ్నప్తిని చేస్తున్నాను అన్నారు.

యావత్ ప్రపంచానికి ఇది గడ్డుకాలం:మోడీ


ప్రధాని నరేంద్రమోడి జాతీనుద్దేశించి ప్రసంగించారు. 4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని మోడి చెప్పారు. ప్రపంచం ఇంతకు ముందెన్నడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనలేదని మోడీ అన్నారు.

కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలి. కరోనాకు ముందు కరోనా తర్వాత అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌లో కూడా అనేకమంది అయినవారిని కోల్పోయారు.
ఒకే ఒక్క వైరస్ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తుందన్న ఆయన యావత్ ప్రపంచం ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతోందన్నారు. ఓడిపోవడం మానవాళి అంగీకరించదన్నారు. ఇది కీలక సమయం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.

కరోనాకు ముందు వరకూ దేశంలో పీపీఈ కిట్ల తయారీ లేదనీ, కానీ అవసరం మనను ముందుకు నడిపించిందన్నారు. ఇప్పుడు రోజుకు 2 లక్షల చొప్పున పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌ ల తయారీ మొదలైనట్లు ప్రధాని తెలిపారు. ప్రాణాలు కాపాడుకుంటూనే, కరోనాతో పోరాడుతూనే ముందుకు సాగాల్సిన తరుణమిదని మోడీ చెప్పారు.

దేశం కోసం రూ.20లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ!

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల వల్ల నష్టపోయిన వారికి, ఉపాధి కోల్పోయిన వారికి చేయూతనందించేందుకు ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా చేయూతనిస్తూ.. ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది. ఈ ప్యాకేజీ రూపకల్పన, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేస్తుంది. ఆర్థిక ప్యాకేజీపై కరోనా పోరాటంలో ప్రతిఒక్కరికీ చేయూతనిస్తుంది. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని తెలిపారు.

తెలుగు చానళ్ళ పై ప్రేక్షకుల స్పందన ఎలా వుందో చూడండి

తెలుగు చానళ్ళ పై  ప్రజల స్పందన  ఎలావుందో ఇంతకుముందు మన కాలమ్స్ లో ఇవ్వటం జరిగింది. ఆ రేటింగ్స్ హైదరాబాద్ నగరానికి సంబంధించినవి. బార్క్ వారం వారం ప్రేక్షకుల స్పందనపై దేశ వ్యాప్తంగా మరియు భాషాపరంగా ప్రాంతాలవారీగా ఈ సమాచారాన్ని అందచేస్తుంది. ఇది నాలుగైదు వర్గీకరణలుగా వుంటుంది. ఇందులో గ్రామీణ , పట్టణ, మెట్రోల వర్గీకరణ తో పాటు మొత్తం ప్రేక్షకుల స్పందన ఎలా వుందో ఇస్తారు. ఇది వారం వారం వారం మారుతూ వుంటుంది. అయితే వరుస వారాల్లో పెద్ద మార్పులేమీ రావు. కొన్ని నెలల్లో మాత్రం మార్పులు స్పష్టంగా వుంటాయి. మనం సేకరించినవి ఏప్రిల్ 18 నుంచి 24 వారానికి సంబంధించినవి. ఇవి హైదరాబాద్ నగరానికి మొత్తం ఆంధ్ర, తెలంగాణ కి స్పష్టమైన తేడా కనబడుతుంది.

ఆంధ్ర, తెలంగాణ మొత్తం మార్కెట్ ఎలావుందో చూస్తే ఈ కింది చానళ్ళు మొదటి పది స్థానాల్లో వరుసగా నిలిచాయి.

మొత్తం                         హైదరాబాద్

  1.  TV 9                           TV 9
  2. V 6                               V 6
  3. NTV                            T News
  4. TV 5                             NTV
  5. Sakshi                         TV 5
  6. T News                        HM TV
  7. 10 TV                           ETV Telangana
  8. I News                          Sakshi
  9. ETV AP                        10 TV
  10. ABN                              ABN

మిగతా పట్టణ , గ్రామీణ వర్గీకరణల్లో చెప్పుకోదగ్గ మార్పుల్లేవు.ఈ రేటింగ్స్ పై మరింత వివరణ చూద్దాం.

  • TV 9  అన్ని వర్గీకరణల్లో , అలాగే మొత్తం ప్రేక్షకుల్లో మొదటి స్థానం లో ఉండటమే కాకుండా మిగతా చానళ్ళకు అందనంత దూరం లో వుంది. ఒక్క హైదరాబాద్ లో మాత్రం రెండో స్థానం లో వున్న V 6 గౌరవప్రదమైన పోటీలో వుంది.
  • కొత్తగా పెట్టిన V 6 ఆశ్చర్యంగా హైదరాబాద్ తో పాటు మొత్తం రేటింగ్స్ లో కూడా రెండో స్థానం లో కొనసాగుతుంది.
  • 3 , 4 స్థానాలు వర్గీకరణ బట్టి మారుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో T News మూడో స్థానం లో వున్నా మొత్తం మీద చూస్తే ఆ స్థానం NTV భర్తీ చేసింది. అదే TV 5 మొత్తం మార్కెట్ లో నాలుగో స్థానం భర్తీ చేస్తే ఎక్కువమంది ప్రేక్షకులుండే హైదరాబాద్ లో ఐదో స్థానానికి పడిపోయింది. ఒక్క గ్రామీణ ప్రాంతంలోనే TV 5 రెండో స్థానం లో వుంది. కానీ గ్రామీణ విభాగం లో ప్రేక్షకుల సంఖ్య బాగా తక్కువ వుంటుంది.
  • సాక్షి మొత్తం మీద ఐదో స్థానం తో సరిపెట్టుకుంటే హైదరాబాద్ లో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
  • ABN ఆంధ్ర జ్యోతి ఎక్కడా గౌరవప్రద స్థానంలో లేదు. దాదాపు అన్ని వర్గీకరణల్లో 10 వ స్థానం, ఆ క్రింద నే వుంది. వేమూరి రాధాకృష్ణ ఛానల్ రంగం లో విఫలమైనట్లే చెప్పాలి.
  • ఇక ETV విషయానికొస్తే ఇదీ విఫలమైనట్లే చెప్పాల్సి వుంటుంది. దీనికి సంబంధించిన రెండు ( AP, తెలంగాణ ) చానళ్ళు మొదటి అయిదు స్థానాల్లో ఏ వర్గీకరణల్లో లేవు. పత్రికారంగం లో అద్భుతాలు సృష్టించిన రామోజీరావు తెలుగు TV చానళ్ళ విషయం లో వెనకబడి పోయాడు. మొత్తం మీద చూస్తే ETV AP 9 వ స్థానం లో వుంటే తెలంగాణ ఛానల్ 12 వ స్థానం లో వుంది. హైదరాబాద్ లో అయితే తెలంగాణ ఛానల్ 7 వ స్థానం లో, AP ఛానల్ 11 వ స్థానం లో వున్నాయి.
  • మొదటి 7 , 8  స్థానాల్లో నిలిచి 10 TV, I News  భవిష్యత్తుపై ఆశలు పెంచుకో గలిగాయి.

కొన్నాళ్ళు ఈ రేటింగ్స్ సరళి లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఈ రేటింగ్స్ బట్టే ప్రకటనలు కంపెనీలు ఇస్తుంటాయి. పై సమాచారం ఏ ఛానల్ కు ప్రజలు ఎంత విలువ ఇస్తున్నారో తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మీ ముందు ఉంచుతున్నాము.

 

 

లాక్ డౌన్ లోను బాల్య వివాహలు..!

కరోనా విపత్కర పరిస్ధితులలో సైతం రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసేందుకు కొందరు తల్లిదండ్రులు సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. 50 రోజుల 165 మందికి బాల్య వివాహాలు చేసేందుకు వధూవరుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. మైనర్లు ఈ పెళ్లిళ్ల నుంచి బయట పడేందుకు నానా తంటాలు పడ్డారు. కొందరు పోరిగు వారితో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్ చేయించితే మరికొందరు వారే స్యయంగా ఫోన్ చేసినట్టు సమాచారం.

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు చేరిన సమాచారంతో పాటు, పిల్లల సంరక్షణ టోల్ ఫ్రీ నెంబర్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ నెంబర్ 181కు వచ్చిన పిర్యాధుల అధారంగా ఈ బాల్య వివాహ నివారణ అధికారులు చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ కాలంలో మార్చి 25 నుండి మే 11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 165 బాల్య వివాహాలను నిరోధించ గలిగారు. బాల్యవివాహాలను అడ్డుకోవటమే కాక, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా సైతం తాము స్పష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, దిశ ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బాల్యవివాహాల నివారణ తదుపరి చర్యలలో భాగంగా అంగన్ వాడీ కార్యకర్తలు అయా గ్రామాలు, పట్టణాలలోని గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి సహాయంతో బాల్యవివాహాలు ప్రోత్సహిస్తున్న కుటుంబాల పట్ల ప్రత్యేక నిఘాను ఉంచుతున్నామన్నారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, సిడిపిఓలు మండల, బ్లాక్ స్థాయిలో బాల్య వివాహ నివారణ అధికారులుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆచిన్నారుల తల్లిదండ్రులకు అవసరమైన ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం 46, అత్యల్పంగా వైఎస్ ఆర్ కడపలో మూడు బాల్యవివాహాలు నియంత్రించారు. శ్రీకాకుళంలో 34, కృష్ణాలో 13, తూర్పు గోదావరిలో 12, నెల్లూరులో 11, విశాఖపట్నంలో 9, పశ్చిమ గోదావరిలో 8, కర్నూలులో 8, చిత్తూరులో 7, ప్రకాశంలో 5, విజయనగరంలో 5, గుంటూరులో నలుగురు చిన్నారులను బాల్యవివాహం నుండి కాపాడారు.

నాటి తెలంగాణ పంటలను చెడగొట్టిందెవరు?

అది మా తాతల కాలం.. 1950కి ముందు తెలంగాణ… రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు.. ఇలా పౌష్టికాహారం నిండుగా ఉండే ఆహార దినుసుల పంటలే పండేవట.. ఈ వరి పంట అక్కడో ఇక్కడో మాత్రమే విసిరేసినట్టు పండించేవారట.. అప్పటివాళ్లు అంతా గడుక(మొక్కజొన్న, జొన్నలతో చేసే కిచిడీ) తినేవారు. చుట్టాలు వస్తేనే బియ్యం వండి పెట్టేవారు. పౌష్టికాహార పంటలు వేసి అవే తింటూ ఆ గడుకతోనే వారు నూరేళ్లు బతికారు. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో మల్టీ గ్రెయిన్ పంటల సాగు ఎక్కువగా ఉండేది. ఇక్కడి నుంచి నిజాం నవాబులు ఏకంగా జపాన్ లాంటి దేశాలకు మన పప్పు ధాన్యాలను ఎగుమతి చేసేవారు. తెలంగాణ ధాన్యానికి నాడు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం.. ఆంధ్రాలో తెలంగాణ కలవడం.. ఆంధ్రుల వరి తెలంగాణపై రుద్దబడింది. క్రమక్రమంగా ఇక్కడ ప్రధాన పంటైంది.. అంతా వరి పంటనే వేస్తుండడంతో తెలంగాణలోనాటి మల్టీ గ్రెయిన్ పంటలు కనుమరగయ్యాయి. కేసీఆర్ సైతం కాళేశ్వరం నీరు ఇస్తూ వరిని ప్రోత్సహిస్తుండడంతో పౌష్టికాహార పంటలైన రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవల సాగు తెలంగాణలో కనుమరుగైంది.

*ఆంధ్రుల వరి.. తెలంగాణపై రుద్దబడింది..
సాధారణంగా పౌష్టికాహార పంటలైన రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు పంటలు మూడు నెలల్లోనే కాపుకొస్తాయి. కానీ అత్యంత దిగుబడి ఇవి ఇవ్వవు.. అదే వరి పంట వేస్తే బాగా దిగుబడి వస్తుంది. దీనికి మద్దతు ధర కూడా ఉంది. నాడు ఆంధ్రాలో ప్రధాన పంట అయిన వరికి నాటి ఆంధ్రా పాలకులు మద్దతు ధర కల్పించారు. తెలంగాణ రైతులు కూడా అదే సాగు చేయడం ప్రారంభించారు. పాలకులూ దాన్నే ప్రోత్సహించారు. దీనికే మద్దతు ధర ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు కూడా క్రమంగా వరి సాగుకు ఎగబడ్డారు. దీంతో ఒకప్పుడు నిజామాబాద్ లో ప్రాజెక్టుల కింద మాత్రమే పండే వరి పంట ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పంట అయ్యింది. ఏపీని మించి పండుతోంది.

*పాలకుల పాపం.. తెలంగాణకు శాపం..
నాటి ఆంధ్రా పాలకులే కాదు.. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిన కేసీఆర్ సైతం మొదటి ఐదేళ్లలో వరిపంటకే ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చారు. రేషన్ ద్వారా బియ్యంని పంచుతుండడంతో దాని సాగుకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఈ ఏడు బాగా సాగైంది. ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం తెలంగాణలో దిగుబడి వచ్చి దేశంలోనే రికార్డు కొట్టి దేశానికే ధాన్యాగారంగా మారింది. అదే ఏపీలో కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఏపీని సైతం దాటేసి తెలంగాణలో వరిపంట పండిందంటే అర్థం చేసుకోవచ్చు. దీనికంతంటికి నాడు ఆంధ్రా ముఖ్యమంత్రులు, నేడు కేసీఆర్ వరిపంటపై చూపిన ప్రేమే కారణం.. మద్దతు ధర ఇస్తుండడంతో రైతులంతా ఈ పంటనే పండిస్తున్నారు.

*వరి ఈజీ.. మిగతావి కష్టం.
నిజానికి వరిపంట పండించడం చాలా ఈజీ. నాటు వేసి వదిలేస్తే రోజు నీళ్లు పెడితే సరిపోతుంది. పైగా దీనికి అడవి జంతువులు, కోతుల బాధతక్కువ. అదే ఇతర పంటలు వేస్తే పక్షులు, కోతులు, అడవి జంతువుల నుంచి కాపాడుకోవాలి. పైగా రోజు ఆ పంటతో పని ఉంటుంది. అందుకే ఈజీ అయిన వరి సాగుకే రైతులు మొగ్గుచూపుతారు.

*వరి వేస్తే రైతుబంధ్ కట్ అంట..
వరి ఈ ఏడు రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయ్యింది. వర్షాలకు తోడు కాళేశ్వరం నీరు అందుబాటులోకి రావడంతో తెలంగాణ పంట పండింది. కానీ మొత్తం వరినే పండింది. అదే తెలంగాణకు శాపమైంది. ఒక్క వరి తప్పితే ఏదీ పండలేదు. పప్పుధాన్యాలు.. కందులు, రాగులు.. రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు.. ఏవీ రైతులు పండించలేదు. వరి, పత్తి మాత్రమే పండింది. నీళ్లు ఉంటే వరి.. లేకపోతే పత్తి అన్నట్టుగా తెలంగాణలో రైతుల పరిస్థితి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వచ్చిన వరిని ఏం చేసుకోవాలో కేసీఆర్ కు అర్థం కావడం లేదు. ఇప్పటికే మిల్లులు, ధాన్యాగారాలు నిండిపోయాయి. అందుకే ఈసారి వరి వద్దు సర్కార్ చెప్పిన పంటలే వేయాలని.. వేయకపోతే రైతుబంధ్ కట్ చేస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నారు. అయితే ఒక్కసారి అలవాటుపడ్డ రైతులు పంట మార్చడానికి ఇష్టపడడం లేదు. దీంతో అదే శాపమవుతోంది.

*అన్ని పంటలు వేస్తే గిట్టుబాటు ధర.. ఆరోగ్యం
కరోనాతో ప్రపంచం మారింది. కల్తీలేని పౌష్టికాహారంపై జనాల్లో మక్కువ పెరిగింది. ఇక అందరికీ రోగాలు పంచుతున్న వరికంటే ఇప్పుడు అంతా ‘సిరిధాన్యాల’ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. వెనుకటి ఆహార పంటలైన రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వీటికి బోలెడు డిమాండ్. విదేశాల్లో అయితే ఎగబడుతున్నారు. కానీ ఇంత డిమాండ్ ఉన్నా ఆయా పంటలు పండించడానికి మాత్రం రైతులు మొగ్గుచూపడం లేదు. ప్రభుత్వం చొరవతీసుకొని రైతులకు అవగాహన కల్పిస్తే పంట పండుతుంది. భారీగా మద్దతు ధర దక్కుతుంది.. ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ దిశగా తెలంగాణ సమాజం.. కేసీఆర్ సర్కార్ మొగ్గు చూపాల్సి ఉంది.

–నరేశ్ ఎన్నం

ఖైరతాబాద్ గణేష్ ఎత్తును తగ్గించిన కరోనా?

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా ఖైరతాబాద్ గణేష్ ఎత్తుపై కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకు సంబంధించి ఎటు తేల్చుకోలేక పోతుంది. అయితే ఈ నెల 18వ తేదీన ఖైరతాబాద్ గణేష్ కు సంబంధించిన కర్ర పూజ చేస్తున్నట్టుగా కమిటీ అధికారికంగా ప్రకటించింది. అయితే దీనిపై అటు సోషల్ మీడియాలో పూర్తిగా వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ కర్ర పూజ ను రద్దు చేస్తున్నట్లుగా కమిటీ ప్రకటించింది. అయితే 18వ తేదీన ఖైరతాబాద్ గణేష్ ఏర్పాటు పైన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఆగస్టు లోగా కరోనా కట్టడి కాకపోతే ఖైరతాబాద్ గణేశుడు ఎత్తు తగ్గించే అవకాశం కనబడుతోంది.

కరోనా కట్టడి కాకపోతే తప్పనిసరిగా ఖైరతాబాద్ గణేశుడు ఎత్తు తగ్గే అవకాశముంది. మరొక ఆరు నెలల పాటు సోషల్ గ్యాదరింగ్ ను రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించే ప్రసక్తే లేదు .ఈ నేపథ్యంలో గణేష్ ని ఏర్పాటు చేసినట్లయితే ఎత్తున సోషల్ గ్యాదరింగ్ ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా దీనికి తప్పనిసరిగా అనుమతి ఇవ్వకపోవచ్చు. అని కొంత సమాచారం ఉంది. ఇప్పటికే కమిటీ సభ్యులు పోలీసులను సంప్రదించారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సోషల్ గ్యాదరింగ్ పై ఒక స్పష్టమైన ఆదేశం వచ్చిన తర్వాతనే తాము ఏదైనా తేలుస్తామని అటు పోలీస్ అధికారి చెప్పారు. కాబట్టి ఖైరతాబాద్ గణేష్ ని ఏర్పాటు పైన ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

కేసీఆర్, జగన్ తోడి దొంగలు… ప్రతిపక్షాలు ధ్వజం

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జలాలను అక్రమంగా పోతిరెడ్డిపాడుకు తరలించుకు పోతుంటే తనకు ఏమీ తెలియన్నట్లు న్యాయ పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ప్రకటించడం పట్ల ప్రతిపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్, జగన్ ఇద్దరు తోడి తొండాలని, ప్రతిరోజూ మాట్లాడుకొంటూనే అన్ని చేస్తుంటాయని చెబుతూ ఇద్దరు కలసి కాంట్రాక్టర్ల ద్వారా ముడుపుల కోసం అన్ని చేస్తున్నారని మండిపడ్డారు.

అపర భగీరథుడు గా తన వందిమాగధులు చేత పొగిడించు కుంటున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకుంటున్న జగన్ ప్రభుత్వం గురించి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

ఇటీవల కాలంలో జగన్ కు తానే మార్గదర్శకుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త లిఫ్ట్ గురించి తెలియకపోవడం తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడమే అని దుయ్యబట్టారు.

తెలంగాణ రాష్ట్రం పోతిరెడ్డిపాడు సామర్థ్యం తగ్గిస్తే-ఏపీ ప్రభుత్వం పెంచుతూ వెళ్తోందని, తెలంగాణ తగ్గించిన నెల రోజులకు ఏపీ పెంచినట్లు జివో విడుదల చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేసారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పోతిరెడ్డిపాడు అంశంలో మాట్లాడుకుని చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

“జ‌గ‌న్-కేసీఆర్ రోజు మాట్లాడుతున్నారు అంటున్నారు ఈ జీవో విడుద‌ల సీఎం కేసీఆర్ కి తెలియకుండా జరిగిందా?”అని భట్టి ప్ర‌శ్నించారు. ‌ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసేంత వరకు తెలంగాణ ఇంటలిజెన్స్ ఏం చేస్తోంద‌ని, పోతిరెడ్డిపాడు పై జగన్-కేసీఆర్ మాట్లాడు కోలేదనే గ్యారెంటీ ఏంటని ఆయ‌న అడిగారు. నదీజలాల పంపకాల విషయం అపెక్స్ కమిటీ-బోర్డ్ లో చర్చించకుండానే జీవో విడుదల చేసిందా? అని ప్ర‌శ్నించారు

కొన్ని విషయాల్లో సంప్రదింపులు జరుపుకునే కెసిఆర్ జగన్ మాట మాత్రం చర్చించకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏడు వేల కోట్లతో ఫస్ట్ ఫేస్ కింద పనులు జరపాలని నిర్ణయం తీసుకొంటారా అంటి లక్ష్మణ్ నిలదీశారు.

కృష్ణా గోదావరి ట్రిబ్యున ళ్ళ ను తానే పద్ధతి ప్రకారం తీర్చిదిద్దాడని చెప్పే కెసిఆర్ కు చెప్పకుండా దక్షిణ తెలంగాణలో మూడు జిల్లాలను ఎండబెట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని బిజెపి నేత స్పష్టం చేశారు. కేసీఆర్ మొదటి నుండి ఉత్తర తెలంగాణపై దృష్టి సారిస్తూ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.

“నువ్వు కొట్టినట్లు చెయ్ నేను ఏడ్చినట్లు చేస్తా “అన్న సామెత లాగా నడుస్తు ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలని లక్ష్మణ్ కోరారు. ఇప్పటికైనా ఈ ప్రాంత శాసనసభ్యులు ఎంపీలు మాట్లాడకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

నర్సులకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని!

నేడు (మే 12)అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా నర్సులందరికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో నర్సులు చేస్తున్న సేవలు ప్రశంశనీయమని అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో కూడా ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌ వార్డుల్లో నర్సులు చేస్తున్న సేవలు సర్వదా ప్రశంశనీయమని, భాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకీ నా తరపున, జనసేన తరుపున అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వృత్తి రిత్యా వారు నర్సులు అయినప్పటికి ఆసుపత్రులలో వారిని సిస్టర్‌ అని పిలుస్తాము. ఆ పిలుపుతోనే తమ కుటుంబ సభ్యులకు చేసే సేవగా భావించి సపర్యలు చేస్తారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్ధమైన నర్సులు మరింత మంది రావాలనే విషయాన్ని వైద్యనిపుణులు చెబుతున్నారని అన్నారు, నర్సు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భధ్రత కల్పిస్తూ, గౌరవప్రదమైన వేతనం అందించేలా ప్రభుత్వాలు దృష్టి సారించాలని అన్నారు.

తెలుగురాష్ట్రాల మధ్య పోతురెడ్డిపాడు పంచాయితీ!

కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య గొడవ ముదురుతొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వం ఏకపక్షంగా తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. అదేసమయంలో తెలంగాణకి అన్యాయం చేయకుండా వరదల ద్వారా వచ్చి, సముద్రంలో కలిసిపోయె నీటిని మాత్రమే మా ప్రభుత్వం వాడుకోవలనుకుంటుదని ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇదే విషయం పై బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కేసీఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనం అని ఆయన అన్నారు.

పోతురెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగునీరు తాగునీరు కాకుండాకేసీఆర్ కుట్రచేస్తున్నారు అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడిందని, రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సందే అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతురెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలని సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్మోహన్ రెడ్డి కి అన్ని పార్టీలు సమర్థంచాలని ఇతర పార్టీలకు విజ్నప్తిని చేస్తున్నాను అన్నారు.

కేసీఆర్ మరోసారి రాయలసీమ ద్రోహిగా మారిపోయారు. రాయసీమకు అన్యాయం చేయబోతున్న కేసీఆర్ అలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్ గారికి (అనంతపురం జిల్లా ఇన్చార్జి గా ) రాయలసీమలో కరువు గురించి తెలియదా అని అడుగుతున్నా అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

తెలంగాణకి అన్యాయం చేయం:అనిల్ యాదవ్

కృష్ణా జలాల వినియోగంపై ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల సమయంలో వచ్చే జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి తీసుకెళ్లాలనే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు నష్టం చేయాలనే ఆలోచన తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కు ఏ మాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

సముద్రంలో కలిసిపోయే నీటిని తాము వాడుకుంటే తప్పేముందని ఆయన అన్నారు. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి అనిల్ తెలిపారు. అయినా కృష్ణా వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ బోర్డు కేటాయించిన విధంగానే ఇరు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటాయని… ఈ విషయంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వం ఏకపక్షంగా తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని అంటూ దీనిపై రాజీలేని ధోరణి అవలంబిస్తామని, ప్రాజెక్టును అడ్డుకోవడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

హెలికాప్టర్ లో సీటు లేకే దిగిపోయా..!

ఎల్.జి దుర్ఘటన జరిగిన రోజు తాను సీఎం జగన్ తోపాటు విశాఖపట్నం వచ్చేందుకు హెలికాప్టర్ లో సీటు లేకపోవడమే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎల్.జి సంఘటన దృష్ట్యా ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడకు వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో తాను దిగి, మంత్రిని ఇక్కడకు పంపించడం జరిగిందని స్పష్టం చేశారు. దానిని అనవసరంగా రాధ్దాంతం చేస్తున్నారు. అది బహుశా ప్రతిపక్షాలకు, ఎల్లోమీడియాకే చెల్లుతుందని చెప్పుకొచ్చారు. విశాఖ
తాను అడాప్ట్ చేసుకున్న జిల్లా అని, ఇక్కడ క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా ఉంటానని, దీని అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడతానని చెప్పారు.
బాధిత గ్రామాల్లో ప్రజలు చాలా వరకూ వచ్చేశారని, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారు బహుశా ఈరోజు డిశ్చార్జ్ కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనవసరంగా ఆరోపణలు చేసేదానికన్నా ప్రత్యేకంగా పలానా వారు వెళ్లిపోయారని చెబితే బాగుంటుందని పేర్కొన్నారు. సాధారణంగా ఇక్కడనుంచి వేరే ఊర్లకు కొంతమంది వెళ్తుంటారు, వస్తుంటారని చెప్పారు. ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ తీసుకుని దానిని ఎక్స్ పోజ్ చేసి ఇక్కడనుంచి ప్రజలు వెళ్లిపోతున్నారనే భావన కల్పించడం మంచిది కాదని, ఎల్లోమీడియా దానిని అర్ధం చేసుకోవాలని కోరారు. గ్రామాలలో పశువులకు అవసరమైన పశుగ్రాసం కూడ సరఫరా చేస్తామన్నారు. ప్రమాదం బారిన పడిన గ్రామాలలో సాధారణ స్ధితి వచ్చిందని, ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.

నాయకత్వ లేమికి నిదర్శనం ఈ లాక్ డౌన్!

Owaisi

దేశంలో కోవిద్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌ డౌన్‌ విధించడం రాజ్యాంగ విరుద్ధం అని హైదరాబాద్ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రజలందరినీ ఇళ్ళకే పరిమితం చేసి కరోనాని కట్టడి చేయడం నాయకత్వ లేమికి నిదర్శనమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడం చట్ట విరుద్ధమే కాక సమాఖ్య విధానానికి కూడా వ్యతిరేకం అన్నారు.

లాక్‌ డౌన్‌ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. లాక్‌ డౌన్‌ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , కార్మికులు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలంతా ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరారు. క్వారంటైన్‌ మన మంచికే అని దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

‘జూమ్’లో మహానాడు..!

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే మహానాడు కార్యక్రమం అంటే వేలాదిగా నాయకులు, భారీ బహిరంగసభ, వందల కొద్దీ వంటకాల మెనుతో వేల మందికి భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల రాజకీయ చర్చలు, తీర్మానాలతో మూడు రోజుల పాటు ఆర్భాటంగా నిర్వహించుకునే కార్యక్రమం. ఈ ఏడాది ఏ హడావిడి లేకుండా జరగనుంది. ఇందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పట్లో భారీ సభలు, సమావేశాలకు అవకాశం కనిపించడం లేదు.
దీంతో ఓ వినూత్న ప్రయోగానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్‌ మీడియా వేదికగా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. లాక్‌డౌన్‌ దృష్ట్యా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 29న టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించగా ఇప్పుడు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మహానాడు అదే రీతిలో జరుగనుంది.
దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఈ స్థాయిలో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుండడం ఇదే తొలిసారని టీడీపీ ముఖ్యనేతలు తెలిపారు. సాధారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పదుల  సంఖ్యలో నేతలతో భేటీకి అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి 10వేల మందితో జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించడం సాధారణ విషయం కాదని వారు పేర్కొంటున్నారు.
ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఎన్నికల దృష్ట్యా మహానాడు నిర్వహణ సాధ్యం కాలేదు.
లాక్‌డౌన్‌ ఎప్పటివరకు ఉంటుందో స్పష్టత లేకపోవడం, కరోనా వైరస్ దృష్ట్యా  భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో, ప్రత్యామ్నాయాలపై పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. జూమ్‌ కాన్పరెన్స్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. దీంతో ఇందుకు అనుగుణంగా ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ వర్గాలు సిద్ధమవుతున్నాయి.

కరోనా హెయిర్ స్టైల్ వచ్చేసింది!

సహజంగా ఇష్టమైన హీరో హెయిర్ స్టైల్ ని అభిమానులు చేయించుకుంటూ వారి అభిమానాన్ని చాటుకుంటారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు కూడా ఏమి అర్థంకాక కరోనా మహమ్మారి హెయిర్ స్టైల్ చేయించుకుంటారు. ఇది పిచ్చో, పైత్యమో లేక కరోనా అంటే వికారమో.. తెలియదు గానీ కొందరు కోవిద్19 హెయిర్ స్టైల్ చేయించుకోవడం గమనార్హం.

ఈ విషయంలో ఆఫ్రికన్లకు ఎవరూ పోటీ ఇవ్వలేరు. వారు ఎప్పుడు తమ జుట్టును డిఫరెంట్ లుక్ తో చూపించాలనుకుంటారు. నేను ట్రెండ్ ను ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను అన్న ఓ సినిమా డైలాగ్ లా కొత్తరకం హెయిర్ స్టయిల్స్ ఎక్కువగా వారినుండే వస్తాయి. ప్రస్తుతం కరోనా ను చూసి ప్రపంచం వణికి పోతుంటే ఆఫ్రికన్లు మాత్రం దాన్ని హెయిర్ స్టైల్ గా మార్చి నెత్తి మీద పెట్టుకున్నారు. దానికోసం జుట్టును కొమ్ములు గా మలచి జుట్టు వేసుకున్నారు. అయితే  కరోనా హెయిర్ స్టైల్ వెనక ఓ బలమైన కారణం కూడా ఉందని ఆఫ్రికన్స్ చెబుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో హెయిర్ స్టైల్ తో కరోనా పై అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఈ వైరస్ ఎంత భయంకరమైనదో ప్రజలు సులువుగా అర్థం చేసుకుంటారని చెబుతున్నారు.

తనను క్షమించాలని కోరిన కేటీఆర్!

ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ జలుబుతో బాధపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయం పై కొందరు నెటిజన్లు ఆందోళన చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను కొన్నేళ్లుగా జలుబుతో కూడిన అలర్జీతో బాధపడుతున్నానని… ఇటీవల సిరిసిల్ల పర్యటన సందర్భంగా అలాంటి జలుబు కారణంగానే కొంత ఇబ్బందిపడ్డానని ఆయన వివరించారు. అయితే హఠాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుంటే… కొందరు ఇబ్బందిపడతారనే కారణంగానే జలుబుతోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కేటీఆర్ ట్విట్టర్‌ లో కామెంట్ చేశారు.

దీంతో కొందరు నెటిజన్లు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కోవిడ్ 19పై జరుగుతున్న పోరులో మీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని… మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ అనేక మంది ట్విట్ చేశారు. వారి ట్వీట్స్‌కు సంబంధించిన మంత్రి కేటీఆర్… దీనిపై వివరణ ఇచ్చారు.

హైదరాబాద్ లో అదుపు తప్పిన కరోనా.. ఆందోళనలో అధికారులు

హైదరాబాద్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించినా లెక్క చేయకుండా రాజకీయ వత్తిడిల కారణంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కరోనా కరోనా టెస్ట్ లను తగ్గించడమే కాకుండా, మద్యం షాపులను తీర్చుకోవడానికి అనుమతించడం, పలు సడలింపులు ఇవ్వడంతో తిరిగి హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తుంది.

ఇంతకాలం చేసిన కృషి వృధా అవుతున్నదా అనే అనుమానాలు అధికారులకు కలుగుతున్నాయి. కరోనా అదుపు తప్పుతున్నదా అని భయపడుతున్నారు. హైదరాబాద్‌ను కరోనా మహమ్మారి హడలెత్తిస్తోందిని ఇప్పుడు కేసీఆర్ కు సహితం కలవరం కలిగిస్తున్నట్లు కనిపిస్తున్నది.

ప్రధాని మోదీ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

తెలంగాణలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అవ్వన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడంతో అధికార వర్గాలు ఖంగారు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,275కు చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గుతున్నప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 21న తెలంగాణలో 56 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అత్యధికంగా సోమవారం 79 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. మొత్తం కేసుల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి.

ఏప్రిల్‌21 నుంచి మే 10 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 392 కేసులు నమోదయితే అందులో 312కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివే. అందులో 222 కేసులు గత పది రోజుల్లో (మే నెలలో) నమోదైనవే. శనివారం (మే 9న) నమోదైన 31 కేసుల్లో 30.. ఆదివారంనాటి 33 కేసుల్లో 26, సోమవారం నాటి మొత్తం 79 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

కార్వాన్‌ నియోజకవర్గంలోని జియాగూడ డివిజన్‌లో సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే ప్రాంతంలో ఒక్క మున్సిపల్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు 68 కేసులు నమోదు కాగా అందులో ఆరుగురు వైర్‌సతో మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలో 70 వరకు కేసులు నమోదవడంతో ఇక్కడ నివసిస్తున్న